నీతి సారాన్ని రుద్రదేవుడు ఏ భాషలో రాశాడు

కాకతీయుల కాలంలో ‘తెలుగు భాషా’ ఉచ్ఛదశను అందుకుంది. తొలిసారిగా సంస్కృత భాషతో సమానంగా తెలుగు భాషకు గౌరవస్థానం ఇచ్చారు. వీరి కాలంలో రాజభాష సంస్కృతమే అయినప్పటికీ, తెలుగు భాష జనసాహిత్యంగా అభివృద్ధి చెందింది.
సంస్కృతంలో ముఖ్య గ్రంథాలు
– ఈశ్వర పూరి- ‘బోద్ పూర్ ’ శాసనం
– కవిచక్రవర్తి – పాకాలశాసనం, కలువకొలను శాసనకర్త (అసలు పేరు తెలియదు)
– ఈశ్వరభట్టోపాధ్యాయుడు : బూదపుర శాసనకర్త
– రామదేవుడు: బయ్యారం శాసన కర్త (మైలాంబిక వేయించింది అనికూడా పేర్కొన్నారు) మైలాంబిక కాలంలో రామదేవుడు చెక్కించాడు.
– మయూరసూరి : బాలభారతి, కుందవర శాసనకర్త
– కొలను రుద్రుడు : రాజరుద్రీయం వ్యాఖ్యానం రచన.
ముఖ్యంగా చెప్పుకోదగిన సాహిత్యంలో ‘శతకాలు’ మొదటిస్థానం ఆక్రమించాయి. వీటిలో బద్దెన రాసిన ‘సుమతీ శతకం’లోని ఒక పద్యం గమనిస్తే అది నేటి సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో….
‘ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’
భావం: తనకు మేలు చేసిన వారికి తిరిగి చేయడం సామాన్యమైన విషయమే, కానీ తనకు అపకారం చేసినా సరే వారి తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.
పై పద్యాన్నిబట్టి కాకతీయుల కాలంలో ప్రజల నైతిక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
కాకతీయుల ఇతర రచనలు
రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు తెలుగులో ‘నీతిసారం’ రచించాడు.
వివరణ : మానవల్లి రామకృష్ణ సంస్కృతంలో నీతిసారం రచించాడు. నీతిసారంలోని 111 పద్యాలను మడికి సింగన సకలనీతి సమ్మతంలో ఉదహరించాడు. నీతిసారంపై కింది నాలుగు గ్రంథాలు కాకతీయుల కాలంలో వచ్చాయి.
1. నీతిసారం : ప్రతాపరుద్రుడు (తెలుగు)
2. నీతిసారం : మానవల్లి రామకృష్ణ (సంస్కృతం)
3. సకలనీతి సమ్మతం : మడికి సింగన
4. నీతిశాస్త్ర ముక్తావళి : బద్దెన
అచితేంద్రుడు
వేయిస్తంభాల గుడి (హన్మకొండ) శాసన నిర్మాత భరద్వాజ గోత్రికుడు రామేశ్వర దీక్షితుల కుమారుడు. ఇతని గురువు అద్వయతాంవృతయాతి.
వివరణ: క్రీ.శ. 1163లో మొదటి ప్రతాపరుద్రుడు హన్మకొండలో వేయిస్తంభాల గుడి నిర్మించి ‘రుద్రేశ్వరాలయంగా పిలిచెను. దీనిలో త్రికూట శైలి ప్రవేశపెట్టాడు. 2013లో 850 ఏండ్లు పూర్తిచేసుకున్నది.
జాయపసేనాని (1199-1259)
1. నృత్యరత్నావళి
2. గీత రత్నావళి
3. నాట్య రత్నావళి (గంథ్రాలను సంస్కృతంలో రచించాడు)
వివరణ : నృత్యానికి సంబంధించిన లక్షణ గ్రంథం రాసిన తెలుగువారిలో మొదటివాడు. చక్రవర్తి బావమరిది జాయపసేనాని. గజసైన్యాధ్యక్షుడు కూడా. గణపతిదేవుడు ఇతని సోదరిని వివాహం చేసుకొని, చిన్నప్పుడే ఇతన్ని తీసుకొచ్చి గుండామాత్యుని దగ్గర చేర్పించి, గొప్ప సాహితి, సంగీత విద్వాంసునిగా చేసినాడు. నాట్య, నృత్య, గీత రత్నావళి గ్రంథాల్లో భరతుని నాట్యశాస్త్రం మొదలుకొని తన కాలందాకా వచ్చిన అనేక నాట్య, నృత్య, శాస్త్రగ్రంథాలను కూలంకషంగా పరిశీలించి స్వతంత్ర ప్రతిపత్తితో రాసిన ప్రామాణిక గ్రంథం (పై గ్రంథంలో ‘పేరణి’ నాట్యశాస్త్రం గురించి వివరించాడు). కవిచక్రవర్తిగా ప్రసిద్ధి చెందాడు.
-విశ్వేశ్వరదేశికుడు / విశ్వేశ్వర శింబు / శివదేవుడు (1200-1290)- శివతతసాయనం రచించాడు.
వివరణ : కేరళ దేశంలో పుట్టిన కీర్తిశంబుని శిష్యుడు తెలంగాణకు వచ్చి అనేక మఠాలు (కాళేశ్వరం, ఏలేశ్వరం), దేవాలయాలు (మంథెన, వెల్లాల, గోళగి) కట్టించి, ఇక్కడే స్థిరపడ్డాడు. కాకతీయ గణపతిదేవుని దీక్షా గురువు. రుద్రమదేవి పాలనను, ప్రతాపరుద్రుని యువరాజత్వాన్ని తిలకించి ప్రశంసించాడు. గణపతిదేవుని నుంచి మందరం అనే గ్రామాన్ని, రుద్రమదేవి నుంచి వెలగపూడి అనే గ్రామాన్ని పొంది ఆ రెండింటిని కలిపి ‘గోళగి’ అనే అగ్రహారంగా మార్చి అక్కడ శివాలయం, ‘ప్రసూతి వైద్యశాల నిర్మించాడు.
గోనబుద్ధారెడ్డి (1210-1240)- రంగనాథ రామాయణం
వివరణ : ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులో కొన్ని అవాత్మక కథలు కూడా ఉన్నాయి. ఇంద్రుడు కోడైకూయడం. లక్ష్మణుడు ఏడుగీతలు గీయడం, ఉర్మిళ నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు అందుకు నిదర్శనం. ద్విపదకావ్యంలో రచించాడు.
శివదేవయ్య : పురుషార్థ్ధసారం
వివరణ : శివదేవయ్య గణపతిదేవునికి, రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి మంత్రిగా ఉండి మన్ననలు పొందాడు. సంస్కృతాంధ్ర కవితాపితామడు.
ఈశ్వర భట్టోపాధ్యాయుడు (1262)- ‘బూదపుర శాసనం’ నిర్మాత.
వివరణ : ఇతడు మయూర సూరిపుత్రుడు. తన తల్లిపేర, భార్యపేర బూదపురంలో రెండు చెరువులు తవ్వించి, దేవాలయాలు కట్టించాడు. ఈ శాసనంలో ‘చిత్రకవిత’ కన్పిస్తుంది. (ఈ శాసనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది)
కుప్పాంబిక (1230-1300)
తొలి తెలుగు/తెలంగాణ కవయిత్రి, మొల్లకంటే ముందే ఎన్నో కవిత్వాలు రచించింది.
చక్రపాణి రంగనాథుడు
1. శివభక్తి దీపిక
2. గిరిజాది నాయక శతకం
3. చంద్రాభరణ శతకం
4. శ్రీగిరి నాథ విక్రయం
5. వీరభద్ర విజయం (సంస్కృతం).. దీన్ని తెలుగులో పోతన రచించాడు
కపర్ది (1300 ప్రాంతం)
1. భరధ్వాజ శ్రేతసూత్రభాష్యం
2. భరధ్వాజ గృహ్యసూత్రభాష్యం
3. అపస్తంభ గృహ్యసూత్ర పరిశిష్ట భాష్యం
4. శ్రేత కల్పకావృత్తి
5. దివ్వ పూర్ణభాష్యం ఇతని ప్రసిద్ధ రచనలు.
బ్రహ్మశివకవి
1.త్రైలోక్యచూడామణి
2. సమయ పరీక్ష
3. ఛత్తీస్ రత్నమాల అనే గ్రంథాలు రచించాడు.
వివరణ : మొదక్ జిల్లాలోని పటాన్ చెరుగా పిలువబడె (పొట్టంగెరె, పొటన్ =పట్టణం, కెరె=చెరువు)గ్రామ వాసి
పాల్కురికి సోమనాథుడు (1160-1240)- పండితారాధ్య చరిత్ర
వివరణ : తెలంగాణకు చెందిన పాల్కురికి తెలుగు సాహిత్యంలో ఆదికవి. ఆయన ఏ సంస్కృత పురాణంలో లేని స్వతంత్ర ఇతివృత్తాన్ని తీసుకొని, పూర్తిగా దీశీయమైన భాషను ఉపయోగించాడు. ఇంకనూ కింది గ్రంథాలు రచించాడు.
1. అనుభవసారం
2. చతుర్వేదసారసూక్తులు
3. సోమనాథ భాష్యం
4. రుద్రభాష్యం,
5. బసవరగడ
6. గంగోత్పత్తిరగడ
7. శ్రీ బసవాడ్యరగడ
8. సద్గురు రగడ
9. చెన్నమల్లు సీసములు
10. మల్లమ్మదేవి పురాణం (అలభ్యం)
11. శీలసంపద (కన్నడ)
12. బసవపురాణం: తొలి సాంఘిక కావ్యం (తెలుగులో తొలి ద్విపద కావ్యం ఇదే. ఏడు అశ్వాసాల ద్విపదం. సీపీ బ్రౌన్ ప్రకారం ఇందులో 6288 ద్విపదలు ఉన్నాయి.)
13. కుమ్మరి గుండయ్య కథ
14. బెజ్జమహాదేవి కథ
15. మాడ్వేలు మాచెయ్య కథ
6. మాదరి చెన్నయ్య కథ
17. కన్నడ బ్రహ్మయ్య కథ
18. పిట్టవ్వ కథ
మొదలైన కథల్లో పాల్కురికి సోమనాథుడు ఆనాటి తెలంగాణ సాంఘిక జీవితాన్ని, శూద్ర కులాలకు చెందిన వారి ఆచార వ్యవహారాలను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి కంటే ముందే తెలంగాణ ఆదికవి తన సాహిత్యంలో దళితుల గురించి వివరించాడు.
ఇతర రచనలు
తిక్కన : 1. నిర్వచనోత్తర రామాయణం 2. మహాభారతంలోని 15 పర్వాలు రాశాడు.
కేతన : 1. ఆంధ్రాభాషా భూషణం (తొలి తెలుగు గ్రామర్ ) 2. దశకుమార చరిత్ర (అభినవ దండి) 3. విజ్ఞానేశ్వరీయం (తొలి న్యాయ గ్రంథం).
మారన : మార్కండేయ పురాణం
వినుకొండ వల్లభాచార్యుడు : క్రీడాభిరామం (తెలుగులో)
వివరణ : ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథసూరి తండ్రి ఆయన. మెదక్ జిల్లా కొలిచెలిమి నివాసి. ఈయన గొప్ప భాష్యకారుడు. ఇతని కుమారుడు ప్రసిద్ధ కవి పెద్దిభట్టు.
గండయభట్టు : ‘శ్రీహర్షుని ఖండ పద్యానికి’ వ్యాఖ్యనం రాశాడు.
గంగాధర కవి : మహాభారతాన్ని నాటకరూపంలో రచించాడు.
అప్పయార్యుడు : జీనేంద్రకల్యాణాభ్యుదయం
మంచన : కేయూరబాహూ చరిత్ర
శేషాద్రిరమణ కవులు :
1. యయాతి చరిత్ర (సంస్కృతంలో). దీన్ని తెలుగులో పొన్నెగంటి తెనగాన చార్యుడు గోల్కొండ రాజు ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో రచించాడు.
2. ఉషా రాగోదయం : నాటకం (సంస్కృతంలో)
మారన (1289-1323) : 1. మార్కండేయ పురాణం (తెలుగులో తొలి పురాణం)
కేతన : విజ్ఞానేశ్వరీయం (తెలుగులో వచ్చిన తొలి యాజ్ఞవల్కుని స్మృతికి శిక్షాస్మృతి అనువాదం)
విద్యానాథుడు (1289-1323) :
1. ప్రతాపరుద్ర యశోభూషణం
2. ప్రతాపరుద్ర కల్యాణం
వివరణ : దీనిలో ప్రతాపరుద్రుని యశోగానం కన్పిస్తుంది. కావ్యశాస్త్రగ్రంథం ఇది. దక్షిణ భారతదేశంలో ‘పఠనపాఠనాల్లో ’ మిక్కిలి ప్రచారం పొందిన రచన. దీనిలో ‘మాచల్దేవి’ నాట్యం, తను నిర్మించిన చిత్రశాలను కూడా వివరించాడు.
కుమారస్వామి : సోమపధి రత్నాపణ
చిలకలమరి తిరుమలాచార్యులు : రత్నశాణ (భట్టుమూర్తి ‘నరభూపతీయము, దీని అనువాదమే)
అగస్త్యుడు (1289-1323) : 1. బాలభారతం 2. కృష్ణచరిత్ర (గద్యకావ్యం) 3. నలకీర్తి కౌముది (పద్యకావ్యం) 4. మణిపరీక్ష లక్ష్మీస్తోత్రం 5. లలిత సహస్రనామం 6. శివసంహిత 7. శివ స్తవము మొదలైన 74 గ్రంథాలు రచించాడు.
గంగాదేవి : అగస్త్యుని శిష్యురాలు మధుర విజయం రచించెను. తనభర్త కుమార కంపరాయల విజయాలు వర్ణించింది. దక్షిణ భారతదేశంపై తురుష్కుల దాడుల వలన జరిగిన ఫలితాలు వివరించింది. విజయనగరంలో స్థిరపడిన తొలి చరిత్రకారిణి కాకతీయుల కాలంనాటి ముఖ్యమైన సాహిత్యం (తెలుగు)
శాసనాలు
రెండోబేతరాజు-కూడూరు శాసనం
రెండో ప్రోలరాజు-మాటేడు శాసనం
గంగాధరుని-నాగునూర్ శాసనం (కరీంనగర్ )
కాటమరాజు-ఉప్పరిపల్లి శాసనం
జగపతిదేవుడు-తాళ్లపొద్టుటూరి శాసనం
ఓపిలసిద్ది-కొణిదేస శాసనం
మల్లరెడ్డి-బిక్కలు శాసనం మొదలైనవి తెలుగులో రాశారు.
వచనకావ్యం
కృష్ణమాచార్యుడు : (ప్రతాపరుద్రుని ఆస్థానం) సింహగిరి నరహరి అనే వచనకావ్యం రచించాడు. ఇది ప్రప్రథమ తెలుగువచన కావ్యం. అందువల్ల అతడు ప్రథమ వచన కావ్యరచయిత అని కీర్తించాడు.
శృంగార కావ్యాలు
కేతన– కాదంబరి
రావిపాటి త్రిపురాంతకుడు (తిప్పన్న)– మదన విజయం, ప్రేమాభిరామం (వీధినాటకం), (అంబికా శతక కర్తకుడు)
వైద్యగ్రంథాలు
1. రేవనసిద్ధుడు (కొలనుపాక)- వీరభట్టాయం గ్రంథకర్త.
2. మరళ సిద్ధుడు (ఉజ్జయిని)
3. ఏకోరామ (హిమావత్ కంద) రససిద్ధ వైద్యం ద్వారా ప్రజలకు చేరువైనారు. సిద్ధత్రయంగా ప్రసిద్ధులైనారు. రేవణ వీరభట్టీయం అనే వైద్యగ్రంథం రచించాడు.
4. భట్టాచార్యుడు- అష్టాంగ నిఘంటువు, బాహాట గ్రంథం అను వైద్య గ్రంథాలు రచించాడు. ఇతడు ప్రతాపరుద్రునికి సమకాలికుడు.
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం