తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం
హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, ముల్కి-నాన్ ముల్కి అంశాలు, భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం తదనంతర పరిపాలన, ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు-సిఫారసులు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, పెద్దమనుషుల ఒప్పందం ముఖ్యాంశాలు, ఉల్లంఘనలు, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రాధాన్యత, ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం, ఆరుసూత్రాలు, 8 సూత్రాలు, ఐదు సూత్రాల పథకాలు, 371-డీ ఆర్టికల్, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీఓ, నక్సలైట్ ఉద్యమం-వ్యాప్తి ప్రభా వం, తెలంగాణ సమాజం-సంస్కృతిపై సినిమా, మీడియా, ఇతర పరిశ్రమల ఆధిపత్యం, భాషా సంస్కృతులపై దాడి, 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తదనంతర రాజకీయాలు, 2004, 2009 ఎన్నికలు-పరిణామాలు, తెలంగాణ సాధనలో కేసీఆర్/టీఆర్ఎస్ పాత్ర, ఇతర పార్టీలు, సమాజంలో వివిధ సంఘాలు, వ్యక్తులు, వ్యవస్థల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పార్లమెంటరీ ప్రక్రియల గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు.
తెలంగాణ భావన
-హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, తెలంగాణ భౌగోళికాంశాలు, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ ఆర్థిక లక్షణాలను లోతుగా అధ్యయనం చేయా లి. తెలంగాణ ప్రజలు, కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాలు, భాషలు, మాండలికాలు, జాతరలు, పండుగలు, తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలు మొదలైన వాటిపై సమాచారాన్ని సేకరించి చదవాలి.
-హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన, సాలార్జంగ్ సంస్కరణలు (పరిపాలనా, రవాణా, ఆర్థిక, రెవెన్యూ, కరెన్సీ, విద్యా, న్యాయ – ఇదే టాపిక్ రెండోపేపర్లోని రెండో సెక్షన్లో ఉంది. కాబట్టి అభ్యర్థులు దీని ప్రాముఖ్యతను గుర్తించాలి) ముల్కి- నాన్ ముల్కి అంశాల ఆవిర్భావం వివిధ కారణాల సాకుతో ఉన్నతోద్యోగాల్లో ఇతర ప్రాంతాల వారిని నిజాం కాలంలో నియమించారు. అందువల్ల ఈ నేపథ్యాన్ని (ముల్కి, నాన్ ము ల్కి రూల్స్) అభ్యర్థులు అర్థం చేసుకోవాలి.
-మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఉద్యోగ, సివిల్ సర్వీసెస్రూల్స్, 1919 ఫర్మానా ముల్కి నిర్వచనం ము ఖ్యాంశాలు, ముల్కిలీగ్-1935గా పేరొందిన నిజాం లీగ్ ఏర్పాటు-దాని ప్రాధాన్యత. భారత సమాఖ్యలో హైదరాబాద్ రాష్ట్రం 1948లో విలీనం కావడం, సైనిక పాలనలో ఉద్యోగాల విధానాలు, ఎంకే వెల్లోడి పాలన ముల్కి రూల్స్ ఉల్లంఘన-వాటి పర్యవసానాలు.
-స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం, బూ ర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం, 1952 ముల్కి ఆందోళన, స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్, సిటీ కాలేజీ సంఘటన-దాని ప్రాధాన్యత, 1953లో ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్లు, ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్ఆర్సీ) ఏర్పాటు చేయడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్ఆర్సీ ప్రధానాంశాలు, దాని సిఫారసులు, చిన్న రాష్ర్టాల ఏర్పాటుపై అంబేద్కర్ అభిప్రాయాలు చదవాలి.
1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం:
పెద్దమనుషుల ఒప్పందం-దాని ప్రధానాంశాలు, సిఫారసులు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు, విధులు, పనితీరు, తెలంగాణ రక్షణలు, ఉల్లంఘనలు, కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు వలసలు, 1970 తర్వాత వ్యవసాయ నీటిపారుదల, విద్యుత్, విద్య, వైద్యం, ఉద్యోగాలు, వైద్యం-ఆరోగ్య రంగాల్లో తెలంగాణలో అభివృద్ధి.
ఉద్యోగాలు, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన:
తెలంగాణ పోరా ట మూలాలు కొత్తగూడెం, ఇతర ప్రాంతాల్లో జరిగిన నిరసనలు, రవీంద్రనాథ్ ఆమరణ నిరాహారదీక్ష, 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర, తెలంగాణ రక్షణలు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రం కావాలని ఏర్పడిన వర్గాలు, ఈ అంశాలను క్షుణ్ణంగా అధ్యయ నం చేయాలి.
తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భావం :
ఉద్యమ విస్తరణ, మర్రిచెన్నారెడ్డి, మల్లిఖార్జున్, మదన్మోహన్, అచ్యుతరెడ్డిలపాత్ర, అఖిలపక్ష ఒప్పందం, జీఓ నెం. 36- తెలంగాణ ఉద్యమ అణచివేత. ఉద్యమం అణచివేత-దాని పరిణామాలు, 8 సూత్రాలు, 5 సూత్రాల పథకాలు, వాటి పర్యవసానాలపై సంపూర్ణ అవగాహన ఏర్పర్చుకోవాలి.
సమీకరణ దశ
– ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం-దాని పర్యవసానాలు, ఆరుసూత్రాల పథకం (1973) లోని అంశాలు, ఆర్టికల్ 371 (డి), రాష్ట్రపతి ఉత్తర్వులు, 1975 ఆఫీసర్స్ (జయభారత్‌రెడ్డి) కమిటీ నివేదిక, 610 జీఓ (1985)-వాటిపై జరిగిన ఉల్లంఘనలు మొదలైన వాటిని కూడా లోతుగా అధ్యయనం చేయాలి.
-నక్సలైట్ ఉద్యమం ఎదుగుదల, విస్తరణ-దాని కారణాలు, పర్యవసానాలు, జగిత్యాల, సిరిసిల్ల, ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అధ్యయనం చేయాలి. నక్సలైట్ ఉద్యమ ఫలితంగా సమాజంలో సంభవించిన మార్పులపై దృష్టి సారించాలి. జల్-జంగల్-జమీన్ విధానం నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంది.
-1980ల్లో ప్రాంతీయపార్టీల పుట్టుక-ప్రభావం, తెలుగు జాతి భావన పేరుతో తెలంగాణ అస్థిత్వాన్ని అణచివేసే కుట్రలు, రియల్ఎస్టేట్, ఫైనాన్స్ కంపెనీలు, ఫిల్మ్, మీడియా, వినోద పరిశ్రమలు, కార్పొరేట్ విద్య, ఆస్పత్రులు మొదలైనవి హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో రావడం, తెలంగాణ స్వాభిమానం, మాండలికం, భాషా సంస్కృతులపై సాంస్కృతిక ఆధిపత్యం ఏర్పర్చేప్రయత్నాలు-వాటి పర్యవసానాలను అధ్యయనం చేయాలి.
-తెలంగాణ అస్థిత్వం కోసం తెలంగాణ మేధావుల చర్చ లు, రాజకీయ, సైద్ధాంతిక ప్రయత్నాలు ప్రారంభం, ప్రాంతీయ అసమానతలు, వివక్షవల్ల, వెనుకబాటుతనంతో ప్రజల్లో పెరిగిన అశాం తి, అసంతృప్తులు మొదలైన విషయాలను అవలోకనం చేసుకోవాలి.
తెలంగాణ రాష్ర్టావిర్భావం దిశగా…
-తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం, మేధావుల స్పందనలు, పౌర సంఘాల ఆవిర్బావం, ప్రత్యేక తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్-తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు, భువనగిరి, వరంగల్ సభలు, ప్రకటనలు తీర్మానాలు (తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ), తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రయత్నాలు.
-2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటు, రాజకీయ పునరేకీకరణ, 2004 ఎన్నికల్లో పొత్తులు, యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రసమితి-గిర్గ్లాని కమిటీ-తెలంగాణ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2009 ఎన్నికల పొత్తులు, మ్యానిఫెస్టోల్లో తెలంగాణ అంశం, హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా వచ్చిన పోరాటం, కేసీ ఆర్ ఆమరణ నిరాహారదీక్ష, అరెస్టు, భగ్గుమన్న తెలంగాణ సమాజం మొదలైనవి అధ్యయనం చేయాలి.
-తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో టీఆర్ఎస్/కేసీఆర్ పాత్ర మీద ప్రశ్నలడిగే అవకాశం ఉంది. లేదా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో రాజకీయ జేఏసీ, స్టూడెంట్, ప్రజాసంఘాలు, ఉద్యోగ జేఏసీల పాత్ర, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, న్యాయవాదులు తదితరుల పాత్రపై, వారు చేసిన కృషి, అవలంభించిన విధానాలపై దృష్టిసారించాలి. (టీడీపీ, వామపక్ష పార్టీలు, ఎంఐఎం, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మొదలైనవి కూడా చదవాలి).
-తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణ ఉద్యమంలో సాహి త్యం, కళారూపాలు, కవులు, గాయకులు, మేధావులు, కళాకారు లు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, వైద్యులు, ప్రవాస భారతీయులు, మహిళలు, పౌరసంఘాలు, వివిధ కులాలు నిర్వహించిన పాత్ర, సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణోద్యమం, మిలియన్‌మార్చ్, మొదలైన అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి అధ్యయనం చేయాలి. ఈ అంశాలపై ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.
పార్లమెంటరీ ప్రక్రియ:
తెలంగాణ అంశంపై యూపీఏ ప్రభుత్వ విధానం, అఖిలపక్ష సమావేశం, ఆంటోనీ కమిటీ ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రి ప్రకటనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక దాని సిఫారసులు, తెలంగాణ అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014 ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రసమితి విజయం, తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు కావడం (2014, జూన్ 2) మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
భారతదేశ, తెలంగాణ భూగోళశాస్త్రం
భారతదేశ భూగోళశాస్త్రంలో భాగంగా దేశంలోని భౌతిక స్వరూపం, శీతోష్ణస్థితి, రుతుపవనాలు సంభవించే విధానం, భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలైన ఎల్‌నినో, లానినో. అధిక వర్షపాతంతో సంభవించే వరదలు, కరువుకు సంబంధించిన అంశాలు, దేశంలోని నదీవ్యవస్థపై లోతైన విశ్లేషణ.
-దేశంలోని నేలలు, అడవులు, వన్యమృగ సంరక్షణ, అటవీ సంరక్షణ కార్యక్రమాలు.
-భారత్‌లోని ముఖ్యమైన ఖనిజవనరులు, శక్తివనరులు, తరిగిపోని ఇంధన వనరులు. అంతరాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు, సముద్రవనరులు, జలవనరులు-వాటి ఆర్థిక ప్రాధాన్యత.అంశాలకు సంబంధించిన వాటిపై విశ్లేషణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
వ్యవసాయం, నీటిపారుదల అంశానికి సంబంధించి దేశంలోని ఆహార, ఆహారేతర పంటలు, ఆగ్రో ైక్లెమెట్ ప్రాంతాలు, హరిత విప్లవం, వ్యవసాయంలో నూతన మార్పులు.
-నీటిపారుదలకు సంబంధించి ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టులు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
-పరిశ్రమలు టాపిక్‌లో దేశంలో ముఖ్యమైన పరిశ్రమలైన ఇనుము ఉక్కు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, సిమెంట్, చక్కెర, ఆటోమొబైల్ పరిశ్రమ, పుడ్ ప్రాపెసింగ్ పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఆర్థిక అభివృద్ధి అం శాలపై ప్రశ్నలు వస్తాయి.
-రవాణా సౌకర్యాలు:
రవాణా అంటే ఏమిటి? ఆర్థిక అభివృద్ధిలో రోడ్డు, రైల్వేల పాత్ర, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు సంబంధించిన అంశాలు
-ప్రధాన ఓడరేవులు, భారతదేశ వాణిజ్యంలో మార్పులు, ప్ర పంచ వాణిజ్య సంస్థపాత్ర, హిందూ మహాసముద్రం.
-జనాభా: భారత్‌లో జనాభా సూచికలు, జనాభివృద్ధి, మానవాభివృద్ధి సూచిక, సమస్యలు, విధానాలు.
-మెగాసిటీలు, పట్టణ జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలు, జనాభా విధానాలు, స్మార్ట్ సిటీల భావన.
-హైదరాబాద్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం, తెలంగాణ రాష్ట్ర భౌతిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, నేలలు, అటవీ విస్తీర్ణం, వన్యమృగ సంరక్షణ.
-తెలంగాణలోని ఖనిజ వనరులు, శక్తి వనరులైన బొగ్గు, ఇనుము, సున్నపు రాయి లభించే ప్రాం తాలు. థర్మల్, జల విద్యుత్ ప్రాజెక్టులు-సమస్యలు, పరిష్కారాలు
వ్యవసాయం:
రాష్ట్రంలో వర్షపాతం సంభవించే ప్రాంతాలు, సంభవించని ప్రాంతాలు, కరువు నివారణ చర్యలు. నీటిపారుదల కాలువలు, చెరువు లు, బా వులు,భూగర్భ జలవనరుల పరిరక్షణ, మిషన్ కాకతీయ.
-తెలంగాణలోని పరిశ్రమలు సిమెంట్, చక్కెర, ఫార్మా, ఎలక్ట్రానిక్, టూరిజం,ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు.
-చేనేత, గృహ ఆధారిత పరిశ్రమలు-వా టి సమస్యలు
-తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, రైల్వేల పాత్ర.
-తెలంగాణ రాష్ట్ర జనాభా, జనాభా వృద్ధి, జనసాంద్రత, జనాభా సూచికలు (అక్షరాస్యత, స్త్రీ పురుష నిష్ప త్తి, వయస్సుల వారీగా జనాభా మొదలైనవి).
-తెలంగాణలో గిరిజన జనాభా విస్తీరణ, సమస్యలు, పరిష్కార విధానాలు, గిరిన ప్రాం తాల అభివృద్ధి
యూనిట్-5. రాష్ట్రంలో పట్టణీకరణ, ప్రాంతీయ మార్పు లు, పట్టణ జనాభా పెరుగుదల, వలసలు. తెలంగాణలో హైదరాబాద్ పట్టణ ప్రాముఖ్యత, పట్టణ నిర్మా ణం, పరిశ్రమలు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పట్టణ ప్రాం తాల్లో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు
-ఓఆర్ఆర్, మెట్రో సమస్యలు-ప్రణాళిక
-జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పాత్ర (మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రణాళిక-2031).
-పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






