Telangana movement | అష్ట సూత్రాలు.. అమలు కాని ఒప్పందాలు
తెలంగాణ ఉద్యమం – రాష్త్ర ఆవిర్భవం
1969 తెలంగాణ ఉద్యమం
- పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ముల్కీల స్థానంలో నియమితులైన నాన్ ముల్కీ (ఆంధ్ర) ఉద్యోగులను తొలగించడంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం విజయం సాధించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డులో గల ఉద్యోగాలు తెలంగాణ రక్షణల కిందకు, ముల్కీ నిబంధనల కిందకు రావని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 1968 జూలై 10ని ‘తెలంగాణ పరిరక్షణ దినం’గా పాటించారు.
విద్యార్థుల పాత్ర : ఖమ్మం జిల్లా గాంధీచౌక్ వద్ద రవీంద్రనాథ్ నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఓయూలో విద్యార్థులు 2 వర్గాలుగా చీలారు.
1. తెలంగాణ పరిరక్షణల సమితి: ఇది కాసుబ్రహ్మానందరెడ్డి వర్గం. దీనికి మదన్ మోహన్ అనే విద్యార్థి నాయకుడు అధ్యక్షత వహించాడు.
2. తెలంగాణ కార్యాచరణ సమితి: ఇది మర్రి చెన్నారెడ్డి వర్గం. దీనికి విద్యార్థి నాయకుడైన మల్లికార్జునరావు అధ్యక్షత వహించాడు.
ఎన్జీవోల పాత్ర : 1969లో కాసుబ్రహ్మానంద రెడ్డి తెలంగాణ వారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రసంగించారు. ఇందుకు ఎన్జీవో సంఘ నాయకుడిగా ఉన్న కె.ఆర్. ఆమోస్‌ను తొలగించారు.
తెలంగాణ ప్రజా సమితి : 1969లో తెలంగాణ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పడింది. దీనికి మదన్మోహన్ అధ్యక్షుడు. మల్లికార్జున్, మదన్మోహన్ వంటి విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. వీరి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అచ్చుతరెడ్డి, అంజయ్య, మానిక్రావ్, హషిమ్ సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. తెలంగాణవాదుల అసంతృప్తిని తొలగించటానికి ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకాన్ని ఏప్రిల్ 11న ప్రకటించింది.
- కేవీ రంగారెడ్డి బానిస బతుకు కంటే మరణమే మేలు అని తెలంగాణవాదుల్లో ఉద్యమకాంక్షను రగిలించాడు. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ వరకు (1969 మే 1న) ఊరేగింపు జరిగే సమయంలో పోలీసు కాల్పుల్లో విద్యార్థి నాయకుడు ఉపేందర్‌రావు మరణించాడు.
- ప్రత్యేక తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రిపదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని 1969లో ఏర్పాటు చేశారు.
మర్రి చెన్నారెడ్డి పాత్ర
- 1967 అసెంబ్లీ ఎన్నికల్లో వందేమాతరం రామచంద్రరావుపై గెలిచాడు. తెలంగాణ ఉద్యమంలోకి అడుగు పెట్టినప్పటికి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడిగా మదన్మోహన్ ఉన్నాడు. ఇందిరాగాంధీ 1969 సెప్టెంబర్‌లో తెలంగాణకు సానుకూలంగా స్పందించడం వల్ల విద్యార్థులు తరగతులకు హాజరు కావాలనే ప్రకటనలపై మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకాలు చేశారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వల్ల ప్రజలల్లో వచ్చిన అసంతృప్తికి పంచసూత్ర పథకం ప్రకటించారు.
జై ఆంధ్ర ఉద్యమం
- తెలంగాణ నుంచి పీవీ నరసింహరావు 1971లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ముల్కీ నిబంధనలు కచ్చితంగా అమలు చేశాడు. ఆంధ్రా ఉద్యోగులు ముల్కీ నిబంధనలపై హైకోర్టులో కేసు వేశారు.
- హైకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించగా పీవీ నరసింహరావు సుప్రీంకోర్టు పునఃపరిశీలనకు పంపాడు. దీంతో ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం కాదని 1972లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిబంధనల గురించి నర్సింగరావు అనే న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ తీర్పు అనంతరం ఆంధ్రాలో జైఆంధ్ర ఉద్యమం ప్రారంభించారు. దీనికి మొదటగా కాకాని వెంకటరత్నం నాయకత్వం వహించారు. ఇతడు 1972 డిసెంబర్ 25న మరణించాడు. ఇతని మరణం తర్వాత బి.వి.సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు ఉద్యమానికి నాయకత్వం వహించారు.
- 1972 డిసెంబర్ 31న ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల తిరుపతి సమావేశానికి బి.వి.సుబ్బారెడ్డి అధ్యక్షత వహించాడు. జై ఆంధ్ర ఉద్యమ ప్రభావంతో 1973 జనవరి 17న తన సీఎం పదవికి పీవీ నరసింహారావు రాజీనామా చేశారు. జనవరి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ సమయంలో ఖండూభాయ్ దేశాయ్ గవర్నర్‌గా ఉన్నారు. సలహాదారులుగా హెచ్‌సీ శరీన్, వి.కె.రావ్ ఉన్నారు. హెచ్‌సీ శరీన్ తన పరిపాలన అనుభవంతో జై ఆంధ్ర ఉద్యమ తీవ్రతను తగ్గించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకం ప్రకటించింది. 1973 అక్టోబర్1న 6 సూత్రాల పథకాన్ని ఆంధ్రా కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ ఆమోదించింది.
- 1973 డిసెంబర్ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. 1973 డిసెంబర్లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 6 సూత్రాలు చేర్చారు. చట్టప్రకారం 371(డి), 371(ఇ) చేర్చబడ్డాయి. రాష్ట్రపతి ఉత్తర్వును 1975 అక్టోబర్ 18న జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 20న జీవో 674ను జారీ చేసింది. ఈ జీవో 674 ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన అంశాలను తెలుపుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టాన్ని 6 జోన్లుగా విభజించారు.
1973-2001 మధ్య తెలంగాణ కోసం ఏర్పడ్డ సంస్థలు
తెలంగాణ జనసభ : ఇది 1985 ఫిబ్రవరి 27న ఏర్పడింది. దీనికి సత్యనారాయణ అధ్యక్షుడు. 1987 భూపతి కృష్ణమూర్తి అధ్యక్షతన తెలంగాణ ప్రజాసమితి మరలా ఆవిర్భవించింది.
తెలంగాణ ఫోరం- జానారెడ్డి: జానారెడ్డి కన్వీనర్‌గా తెలంగాణ ఫోరం 1990లో ఏర్పాటు చేశారు.
- తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఎస్వో)
- ఇది విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఏర్పాటైంది. 6 సూత్రాల పథకం అమల్లో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. 6 సూత్రాల ప్రకారం విద్యాసంస్థల్లో స్థానికులకు 85 శాతం సీట్లు, ఓపెన్ కాంపిటీషన్ కోటా కింద 15 శాతం సీట్లు కేటాయించాలి.
జై తెలంగాణ పార్టీ : 1997లో ఇంద్రారెడ్డి దీన్ని స్థాపించారు. ఈ పార్టీని రాజశేఖర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లోవిలీనం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం: చిన్నారెడ్డి కన్వీనర్‌గా తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పాటు చేశాడు.
తెలంగాణ- వివిధ కమిటీలు
కుమార్ లలిత్ కమిటీ: ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలు, తెలంగాణ మిగులు నిధులపై ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి వేశారు.
జస్టిస్ భార్గవ కమిటీ: తెలంగాణ మిగులు నిధులపై 1969 ఏప్రిల్ 22న నియమించారు.
వాంఛూ కమిటీ: ఈ కమిటీ 1969లో ఏర్పడింది. ముల్కీ నిబంధనలు కొనసాగించటానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు ఇవ్వటానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
జయభారత్‌రెడ్డి, సుందరేషన్ కమిటీ: ఈ కమిటీల ఆధారంగా 1985 డిసెంబర్ 30న 610 జీవో వెలువడింది. 610 జీవో 1986 మార్చి 31లోపు అమలు కావాలని ఆ జీవోలో ఉంది. 1976 అక్టోబర్ నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులందరిని 1986 మార్చి 31 నాటికి వెనుకకు పంపాలి.
జీఎం గిర్గ్లాని కమిటీ: 2001 జూన్‌లో ఏర్పాటు చేశారు. 610 జీవో అమలును పరిశీలించటానికి గిర్గ్లానీ కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రణబ్ ముఖర్జి కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రణబ్ ముఖర్జి అధ్యక్షుడు. రఘువంశ ప్రసాద్, దయానిధి మారన్ సభ్యులుగా ఉన్నారు.
శ్రీకృష్ణ కమిటీ: 2010 ఫిబ్రవరి 3న కేంద్రం ప్రకటించింది. జస్టిస్ శ్రీకృష్ణ దీనికి అధ్యక్షుడుగా, వి.కె. దుగ్గల్ కార్యదర్శిగా, రవిందర్కౌర్ (ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్), రణబీర్ సింగ్ (నల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్), అబూసలే షరీఫ్ (ఆర్థికవేత్త) సభ్యులుగా ఉన్నారు. 2010 డిసెంబర్ 30న కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పించింది. నివేదికలో 9 చాప్టర్లు, 505 పేజీలు ఉన్నాయి. ముఖ్యంగా 6 ప్రతిపాదనలు చేసింది.
1. ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించి కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవడం.
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం
3. హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ
4. ప్రత్యేక తెలంగాణ, గుంటూరు, కర్నూలు, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని మండలాలను కలిపి హైదరాబాద్‌ను పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం
5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
6. ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించడం రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచడం.
- 8వ అధ్యాయం బహిర్గతమై నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణరెడ్డి కోర్టులో కేసు వేశారు. 2011 మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి 8వ అధ్యాయంలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శల్లో బహిర్గతం చేయమని తీర్పు ఇచ్చారు.
తెలంగాణ రాష్త్ర సాకర ప్రక్రియ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన
- 2013 జూలై 30న హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది.
- 2013 ఆగస్టు 5న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనట్లు పార్లమెంట్లో చిదంబరం ప్రకటించారు.
- 2013 ఆగస్టు 26న విభజన కమిటీ ఏర్పాటు చేశారు. ఎ.కె.ఆంటోని అధ్యక్షుడిగా, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలి, అహ్మద్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించింది.
జీవోఎం ఏర్పాటు - 2013 అక్టోబర్ 8న రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోని చైర్మన్‌గా కేంద్ర మంత్రులతో జీవోఎం ఏర్పాటైంది. సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వీరప్పమొయిలి, జైరాం రమేష్, గులాంనబీ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు.
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు
- 2013 డిసెంబర్ 5న తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
- 2013 డిసెంబర్ 12న బిల్లు రాష్ర్టానికి చేరింది. బిల్లుపై అభిప్రాయం తెలపటానికి రాష్ట్రపతి 6 వారాల సమయం ఇవ్వగా దానిపై డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చర్చ ప్రారంభించారు. కాని ముఖ్యమంత్రి బిల్లుపై చర్చ మొదలు కాలేదని పేర్కొన్నారు.
- అక్బరుద్దీన్ (ఎంఐఎం నేత) అడిగిన ప్రశ్నకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ 2014 జనవరి 6న చర్చ ప్రారంభమైనట్లు ప్రకటించారు.
- 2014 జనవరి 8న బిల్లుపై రాష్ట్ర శాసనసభలో తొలి ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి నిబంధన 77 కింద బిల్లును వెనక్కి పంపాలని స్పీకర్‌కు తీర్మాన నోటీసు ఇచ్చారు.
- రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలు మాత్రమే తెలపాలి. కాని బిల్లును తిరస్కరించే, వెనక్కి పంపే అధికారం అసెంబ్లీకి లేదు.
- 2014 జనవరి 30న సభలో 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. మిగిలినవాళ్లు వాళ్ల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చారు. దీంతో సభ్యుల అభిప్రాయం రికార్డు అయ్యింది. బిల్లుపై చర్చ ముగిసిందని ప్రకటించారు.
- రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపటానికి ముఖ్యమంత్రి ఇచ్చిన 77 తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు.
- 2014 ఫిబ్రవరి 4న రాష్ట్ర అసెంబ్లీ పంపిన అభిప్రాయాలకు జీవోఎం ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 7న తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది.
- 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే రాష్ట్ర పునర్ విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18న ఆమోదించారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు.
సకల జనుల ఉద్యమం.. స్వరాష్త్ర నినాదం

1969 తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు
- కె.ఆర్. అమోస్ ఆధ్వర్యంలోని టీఎన్జీవో యూనియన్ 1968 జూలై 10న తెలంగాణ హామీల దినం నిర్వహించింది.
- 1968 వేసవి కాలంలో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ అనే పేరుతో సుమారు 20 మంది ఇల్లెందు యువకులతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. రామదాసు అధ్యక్షుడిగా, ముత్యం వెంకన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
- ఖమ్మంలోని గాంధీచౌక్‌లో 1969 జనవరి 8న తెలంగాణ రక్షణల అమలు కోసం దీక్ష ప్రారంభించారు.
- కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని నాన్ ముల్కీలను తొలగించాలనే డిమాండ్‌తో పోటు కృష్ణమూర్తి 1969 జనవరి 10న పాల్వంచలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
- తెలంగాణ రక్షణల అమలు కోసం చర్చించడానికి 1969 జనవరి 19న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
- తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ పిలుపు మేరకు 1969 మార్చి 17న తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్ జరిగింది.
- తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్‌ను 1969 మార్చి 25న తెలంగాణ ప్రజా సమితిగా మార్చారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి కూడా మదన్మోహన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మేడ్చల్ పంచాయతీ సమితి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు ఎస్.వెంకట్రామ్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 17 మందితో అడ్‌హక్ కమిటీ ఏర్పడింది.
- ప్రధాని ఇందిరాగాంధీ ఏప్రిల్ 11న లోక్‌సభలో తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు.
- 1969 ఏప్రిల్ 22న తెలంగాణ వంచన దినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రుల దిష్టిబొమ్మల దహనం, నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛందంగా ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. దాదాపు అన్ని జిల్లాల్లో అరెస్టులు, లాఠీఛార్జీలు జరిగాయి. వరంగల్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
- 1969 మే 1న కోర్కెల దినంగా నిర్వహించాలని తెలంగాణ ప్రజా సమితి పిలుపునిచ్చింది.
- 1969 మే 22న తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలను డా.చెన్నారెడ్డి స్వీకరించారు. 1969 జూన్ 17న తెలంగాణ మహిళా దినం నిర్వహించారు.
- తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ కోర్కెలను బుట్టదాఖలు చేస్తున్నందుకు నిరసనగా ఉపాధ్యాయ దినమైన సెప్టెంబర్ 5ను ‘ఉపాధ్యాయుల దుర్దశ దినం’గా జరుపుకోవాలని తెలంగాణ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల గిల్డ్ వారు నిర్ణయించారు.
- ఆర్టికల్ 371-క్లాజ్-డి ద్వారా లభించిన అధికారం ప్రకారం భారత రాష్ట్రపతి 1975 అక్టోబర్ 18న ‘ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్
రిక్రూట్మెంట్) ఆర్డర్ 1975ను భారత ప్రభుత్వ నోటిఫికేషన్ నంబర్ జీఎస్ఆర్ 524(ఇ) రాష్ట్రపతి జారీ చేశారు. దీన్నే ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 674ను 1975 అక్టోబర్ 20న జారీ చేసింది. - 1985 డిసెంబర్ 30న జీవో 610 జారీ అయ్యి 1986 మార్చి 31 నాటికి అమలు కావాలని ఆదేశించారు.
2009 తుది దశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు
- 2009 అక్టోబర్ 9: రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ద్వారా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ నిబంధనను అనుసరించి పోలీస్ అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్ నగరాన్ని 6వ జోన్లో భాగంగా పరిగణించకుండా ఫ్రీ జోన్‌గా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు.
- 2009 అక్టోబర్ 21: సిద్దిపేటలో తెలంగాణ ఉద్యోగ గర్జన, 14 ఎఫ్ తొలగింపు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్, ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని మొదటిసారి కేసీఆర్ ఈ సభలోనే అన్నారు.
- 2009 నవంబర్ 29: సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి రంగధాంపల్లి (సిద్దిపేట) నిరాహార దీక్ష స్థలికి వస్తుండగా అలుగునూరు దగ్గర పోలీసులు కారును అడ్డుకుని ప్రొ.జయశంకర్‌ను కారులో నుంచి దింపి కేసీఆర్, నాయిని నరసింహారెడ్డి, డా.జి. విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజయ్య యాదవ్‌లను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అప్పుడు కేసు పెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఆయనను ఖమ్మం జైలుకు తీసుకెళ్లారు. జైల్లోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
- 2009 డిసెంబర్ 7: నాటి ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ దీక్షపై అఖిలపక్ష సమావేశంలో ఎంఐఎం మినహా కాంగ్రెస్, బీజేపీ, పీఆర్పీ, సీపీఐ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించాయి.
- 2009 డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించగా కేసీఆర్ దీక్ష విరమించారు.
- 2009 డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తూ అన్ని రాజకీయ పార్టీలతో, గ్రూపులతో తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటుందని చిదంబరం ప్రకటించారు. ప్రకటన అనంతరం ప్రొ.జయశంకర్‌ను వెంటబెట్టుకుని జానారెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి సారథ్యం వహించాల్సిందిగా కేసీఆర్, జానారెడ్డి ప్రొ.జయశంకర్‌ను కోరారు. ఆ ప్రతిపాదనను సున్నితంగా నిరాకరిస్తూ ప్రొ.కోదండరాం పేరును సూచించారు.
- డిసెంబర్ 24: బంజారాహిల్స్‌లోని కళింగ ఫంక్షన్‌హాలులో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుపై సమావేశమయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ. ప్రజారాజ్యం, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు, శాసన సభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు
హాజరయ్యారు. - 2010 ఫిబ్రవరి 3: సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి.ఎన్. శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- 2010 డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై నివేదికను సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ, సీల్డు కవరులో నివేదికలోని 8వ అధ్యాయాన్ని చిదంబరానికి అందించారు.
- 2011 జనవరి 6: అఖిలపక్ష సమావేశాన్ని చిదంబరం నిర్వహించారు. ఈ సమావేశాన్ని టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ పార్టీలు బహిష్కరించాయి. హాజరైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, పీఆర్పీ, మజ్లిస్ పార్టీలకు శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందజేశారు. ఇందిరాపార్క్ వద్ద ఐకాస ధర్నాకు కేసీఆర్ హాజరయ్యారు.
- 2011 జనవరి 17: తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, తెలంగాణవ్యాప్తంగా అన్ని రహదారులపై జిల్లా కేంద్రాల్లో ఐకాస రాస్తారోకోల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.
- 2011-మార్చి 1: తెలంగాణలో ‘పల్లె పల్లె పట్టాలపైకి’ కార్యక్రమం నిర్వహించగా ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్‌రోకో కార్యక్రమం విజయవంతమైంది.
- 2011 మార్చి 10: ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ విజయవంతమైంది. ఆంధ్రపెద్దల విగ్రహాలను తెలంగాణ ఉద్యమకారులు కూల్చివేశారు. పోతన విగ్రహం వద్ద కేసీఆర్, కోదండరామ్ ప్రసంగాలు, నాయకులు వెళ్లిపోగానే కార్యకర్తలపై, కళాకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. తెలంగాణ గాయకుడు నేర్నాల కిశోర్‌తో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్, కోదండరాం, హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు వందలాది మందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి.
- 2011 జూన్ 19: వంటావార్పు కార్యక్రమంలో భాగంగా ‘పట్నం రోడ్లపై పొయ్యి పెడదాం’, ‘రాజధానిలో వంట.. ఢిల్లీలో మంట’ అనే నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
- 2011 సెప్టెంబర్ 13: సకలం బంద్, సమ్మె ఆరంభం
- 2011 సెప్టెంబర్ 18: సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పాల్గొనడంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్.
- 2012 జనవరి 19: అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యలో ‘తెలంగాణ పోరు యాత్ర’ ప్రారంభం.
- 2012 ఫిబ్రవరి 9: 22 రోజుల పాటు సాగిన కిషన్‌రెడ్డి తెలంగాణ పోరు యాత్ర 8 జిల్లాల గుండా 88 నియోజకవర్గాల మీదుగా సాగి భద్రాచలంలో ముగిసింది.
- 2013 జనవరి 27: ఇందిరాపార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం 36 గంటల సమర దీక్ష కార్యక్రమాన్ని భారీ నిరసనలతో నిర్వహించారు.
- 2013 మార్చి 21: టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు జాతీయ రహదారి (44)పై భారీ నిరసన కార్యక్రమం ద్వారా బంద్‌ను నిర్వహించి, వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రవాణా స్తంభించిపోయింది.
- 2013 ఏప్రిల్ 29: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల పాటు నిర్వహించే సత్యాగ్రహ దీక్ష జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
- దీక్ష ముగింపు సమయంలో తెలంగాణ వాదులు కొందరు పార్లమెంట్ వైపు దూసుకెళ్లగా మరికొందరు కాంగ్రెస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు.
- 2013 జూన్ 14: టీజేఏసీ పిలుపు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, బాష్పవాయువు గోళాలు ప్రయోగించడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా రణరంగమైంది. ఈ కార్యక్రమంలో 47 మంది ఎమ్మెల్యేలను, 14 మంది ఎమ్మెల్సీలను, ఓ ఎంపీని అరెస్ట్ చేయగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, విద్యాసాగర్‌రావు అసెంబ్లీపైకి ఎక్కి నల్లజెండాలతో నిరసన తెలిపారు.
- 2013 జూలై 30: తెలంగాణ ఏర్పాటు కోసం యూపీఏ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
- 2013 సెప్టెంబర్ 29: నిజాం కళాశాలలో టీజేఏసీ ఆధ్వర్యంలో లక్షల మందితో
నిర్వహించిన సకల జనభేరి భారీ బహిరంగ సభ విజయవంతమైంది.
తెలంగాణ బిల్లు ఆమోదం
లోక్‌సభ ఆమోదం 2014 ఫిబ్రవరి 18
రాజ్యసభ ఆమోదం 2014 ఫిబ్రవరి 20
రాష్ట్రపతి సంతకం 2014 మార్చి 1
కేంద్ర ప్రభుత్వం గెజిట్ 2014 మార్చి 2
తెలంగాణ ఆవిర్భావ దినం 2014 జూన్ 2
2014 మార్చి 5న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు గెలుచుకుంది.
తెలంగాణ ప్రథములు
తొలి గవర్నర్ – ఈఎస్ఎల్ నరసింహన్
తొలి ముఖ్యమంత్రి – కె.చంద్రశేఖర్‌రావు
తొలి శాసనసభ స్పీకర్ -సి.మధుసూదనాచారి
తొలి డిప్యూటీ స్పీకర్ -పద్మాదేవేందర్‌రెడ్డి
శాససన మండలి తొలి చైర్మన్- కె.స్వామిగౌడ్
శాససనసభలో తొలి ప్రతిపక్ష నేత- కె.జానారెడ్డి
రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి- రాజీవ్‌శర్మ
రాష్ట్ర తొలి డీజీపీ – అనురాగ్‌శర్మ
ప్రెస్ అకాడమీ చైర్మన్- అల్లం నారాయణ
జీవీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
RELATED ARTICLES
Latest Updates
Website publishing check 1cf3602aa119
MyStake casino: bezpečnost účtu a kontrola identity
Cryptomonnaies sur Onlyspins casino : paiements, bonus et retraits
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions






