హరిత బాండ్లను విడుదల చేసిన తొలి నగరం ఏది?
1. యునెస్కో నుంచి త్వరలో వారసత్వ గుర్తింపును పొందనున్న విశ్వవిద్యాలయం ఏది? (3)
1) ఐఐటీ (ఖరగ్‌పూర్)
2) ఐఐఎస్సీ బాంబే
3) విశ్వభారతి యూనివర్సిటీ
4) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వివరణ: సాంస్కృతిక సంపదగా త్వరలో విశ్వభారతి యూనివర్సిటీ గుర్తింపు పొందనుంది. ఈ ఘనతను దక్కించుకోనున్న తొలి విశ్వవిద్యాలయం కానుంది. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో ఇది ఉంది. దృశ్యకళకు సంబంధించిన పరిశోధన విశ్వవిద్యాలయంగా దీనికి పేరు ఉంది. 1921లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దీని వ్యవస్థాపకులు. కేంద్ర విశ్వవిద్యాలయ స్థాయిని దీనికి 1951లో ఒక చట్టం ద్వారా ఇచ్చారు. దీనికి తొలి చాన్స్‌లర్‌గా రతీంద్రనాథ్ ఠాగూర్ వ్యవహరించారు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ కుమారుడు.
2. ఫేమ్-2లో భాగంగా వాహనాల అమ్మకాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం? (2)
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) తమిళనాడు 4) గుజరాత్
వివరణ: ఫేమ్-2 రాయితీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్‌లో భాగంగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కొనాలనుకునేవాళ్లకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో పథకాన్ని 2019 వరకు అమలు చేశారు. రెండో దశలో ప్రజా రవాణా వాహనాలను కూడా విద్యుదీకరించే విధానాన్ని తీసుకొచ్చారు. 7000 ఈ-బస్సులు, ఐదు లక్షల ఈ-త్రి చక్ర వాహనాలను తీసుకు రానున్నారు.
3. యయత్సో సరస్సు ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? (3)
1) జమ్ము కశ్మీర్ 2) హిమాచల్ ప్రదేశ్
3) లఢక్ 4) హర్యానా
వివరణ: యయ త్సో సరస్సు లఢక్‌లో ఉంది. ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ సరస్సును ఇటీవల జీవ వైవిధ్య సాంస్కృతిక ప్రదేశంగా గుర్తించారు. ఆ రాష్ట్రంలో ఇదే మొదటి తరహా తొలి ప్రదేశం. సెక్యూర్ హిమాలయ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యయ త్సో సరస్సును పక్షులకు స్వర్గధామంగా భావిస్తారు. 4820 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంటుంది. జీవ వైవిధ్య సాంస్కృతిక ప్రదేశాల గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వం 2002లో చట్టం చేసింది. స్థానిక ప్రభుత్వాలను సంప్రదించి ఆయా ప్రదేశాలను గుర్తిస్తుంది.
4. పీఎంకేయూఎస్యూఎం అనే పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించారు? (4)
1) 2024 2) 2025
3) 2027 4) 2026
వివరణ: ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఎవమ్ ఉత్తమ్ మహాభియాన్ (పీఎం కుసుమ్) పథకాన్ని 2026 వరకు పొడిగించారు. గ్రామీణ ప్రాంతాల్లో 30,800 మెగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని 2022 వరకు అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. ఇప్పుడు దీన్ని 2026 వరకు సాధించనున్నారు. ఇందులో మూడు వేర్వేరు విభాగాలు ఉంటాయి. అవి- 1) కేవలం రెండు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న చిన్న చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సాధించడం. 2) 20 లక్షల సామర్థ్యం ఉన్న సౌర వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయడం. 3) 15 లక్షల గ్రిడ్ అనుసంధాన వ్యవసాయ పంపులను అందుబాటులోకి తేవడం.
5. ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్కు ఓఈసీడీతో ఒప్పందం కుదుర్చుకున్న భారత దేశపు తొలి రాష్ట్రం ఏది? (4)
1) మహారాష్ట్ర 2) అసోం
3) మణిపూర్ 4) గుజరాత్
వివరణ: ఓఈసీడీ అనేది సంక్షిప్తమైంది. దీని విస్తరణ రూపం- ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఇటీవల గుజరాత్ రాష్ట్రంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (పీఐఎస్ఏ) అని దీన్ని పిలుస్తారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే పరీక్ష ఇది. ఈ తరహా ఒప్పందం ఓఈసీడీతో కుదుర్చుకున్న భారతదేశ మొదటి రాష్ట్రం గుజరాత్. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు ఉద్దేశించింది ఇది. భిన్న సమస్యలకు పరిష్కారం కనుగొనే సామర్థ్యంతో పాటు కమ్యూనికేషన్ కూడా విద్యార్థుల్లో పెరుగుతుంది. పీఐఎస్ఏ కార్యక్రమాన్ని 2000లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 85 దేశాలు ఇందులో పాల్గొన్నాయి.
6. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఆడిటర్ వ్యవస్థల సమావేశాన్ని భారత్‌లోని ఏ నగరంలో నిర్వహించారు? (3)
1) న్యూఢిల్లీ 2) ముంబై
3) లక్నో 4) గాంధీనగర్
వివరణ: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఆడిటర్ల విభాగాలు ఫిబ్రవరి 6న
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సమావేశమయ్యాయి. దీనికి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నేతృత్వం వహించారు. ప్రస్తుతం భారతదేశ కాగ్‌గా గిరీష్ చంద్ర ముర్ము వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగంలోని 148వ అధికరణం ప్రకారం కాగ్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. ఆడిట్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని చొప్పించాలని సమావేశం సందర్భంగా తీర్మానించారు. మెషిన్ ఇంటెలిజెన్స్, సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను కూడా చర్చించారు.
7. ఆసియాలోనే అతిపెద్ద హెలికాఫ్టర్ ఫెసిలిటీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (2)
1) కేరళ 2) కర్ణాటక
3) పంజాబ్ 4) ఉత్తరాఖండ్
వివరణ: ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ సౌకర్యాన్ని కర్ణటకలోని తుముకూరులో ప్రారంభించారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ప్రధాని నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. దేశీయంగా హెలికాప్టర్లను తయారు చేసేందుకు భారత్‌కు ఈ కేంద్రం ద్వారా అవకాశం దక్కుతుంది. ఇందులో స్వయం సమృద్ధిని సాధించేందుకు అవకాశం దక్కుతుంది.
8. తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక ప్రకారం అడవుల విస్తీర్ణంలో తెలంగాణ స్థానం? (1)
1) 1 2) 2 3) 3 4) 4
వివరణ: అడవుల విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక ఈ అంశాన్ని పేర్కొంది. ఇందుకు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021ను ఇది ఉటంకించింది. 2015లో తెలంగాణ రాష్ట్రంలో 19,854 చదరపు కిలోమీటర్లలో ఉన్న అడవుల విస్తీర్ణం, 2019 నాటికి 20,582 చదరపు కిలోమీటర్లు, 2021లో 21,214 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. 2019-21 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల 632 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇదే సమయంలో దేశంలో పెరుగుదల 1540 చదరపు అడుగులు మాత్రమే.
9. తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది? (3)
1) ములుగు 2) నాగర్ కర్నూలు
3) భద్రాద్రి కొత్తగూడెం 4) ఆసిఫాబాద్
వివరణ: తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఈ జిల్లాలో 4,311.38 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. రెండు, మూడు స్థానాల్లో ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలు ఉన్నాయి. జిల్లా భూభాగంలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతం ఉన్న జిల్లాగా ములుగు నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి
10. తెలంగాణలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏది? (2)
1) సేవల రంగం 2) వ్యవసాయం
3) పారిశ్రామిక రంగం 4) పైవేవీ కాదు
వివరణ: తెలంగాణలో ఎక్కువగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. ఉపాధి కల్పనలో ఆ రంగం వాటా 46%. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 65 లక్షల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతుండేవారు. క్రమంగా వీరి సంఖ్య 1.5 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. పారిశ్రామిక రంగం రెండో స్థానంలో ఉంది. ఔషధ, ఇంధన, రసాయన తదితర వ్యవస్థల్లో 11% మంది కొలువు తీరారు. నిర్మాణ, రవాణా రంగాల్లో 9% మంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి. మొత్తం పెట్టుబడుల్లో ఆ జిల్లా వాటా 32.15%. అలాగే ఉపాధి కల్పనలో కూడా రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది.
11. మొబిలిటీ వ్యాలీ దేనికి సంబంధించింది? (1)
వివరణ: రాష్ట్రంలో వాహన రంగం అభివృద్ధి కోసం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పేరుతో ప్రత్యేకంగా విద్యుత్ వాహన క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ఈ తరహా మొదటి వ్యవస్థ ఇదే. రూ.50 వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నారు. నాలుగు లక్షల మందికి ఉపాధి లభించనుంది. మొత్తం నాలుగు మెగా క్లస్టర్లు రానున్నాయి. జహీరాబాద్, సీతారాంపూర్లలో విద్యుత్ వాహనాల తయారీ క్లస్టర్లు, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, వికారాబాద్ ఎంకతలలో ఇన్నోవేషన్ క్లస్టర్ రానుంది.
12. హరిత బాండ్లను విడుదల చేసిన తొలి నగరం ఏది? (3)
1) వడోదర 2) పుణె
3) ఇండోర్ 4) అహ్మదాబాద్
వివరణ: హరిత బాండ్లను విడుదల చేసి భారతదేశ తొలి పురపాలికగా ఇండోర్ నిలిచింది. రూ.244 కోట్లు దీని నుంచి సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీని ద్వారా 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతుంది. ఇటీవల ఇండోర్ పలు అంశాల రీత్యా వార్తల్లో ఉంది. ఈ ఏడాది నిర్వహించిన 17వ ప్రవాస భారతీయ దివస్ ఇండోర్‌లోనే నిర్వహించారు. భారత దేశ తొలి స్మార్ట్ అడ్రస్ సిటీగా ఈ నగరం నిలిచింది. దేశంలో తొలి ఇన్ఫాంట్రి మ్యూజియమ్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు.
13. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత వాటా ఎంత? (4)
1) 12% 2) 15%
3) 18% 4) 24%
వివరణ: ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 24% పాల ఉత్పత్తి ఉంది. ఈ మేరకు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ గణాంకాలను విడుదల చేసింది. 2014-15తో పోలిస్తే 2021-22 నాటికి దేశంలో పాల ఉత్పత్తి 51 శాతం పెరిగింది. పాల ఉత్పత్తిలో దేశంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 14.9% పాల ఉత్పత్తిని ఆ రాష్ట్రం కలిగి ఉంది. రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా… రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
14. ఏ రోజున చిత్తడి నేలల రోజుగా నిర్వహిస్తారు? (2)
1) ఫిబ్రవరి 21 2) ఫిబ్రవరి 2
3) ఫిబ్రవరి 28 4) ఏదీకాదు
వివరణ: ఏటా ఫిబ్రవరి 2న చిత్తడి నేలల రోజుగా నిర్వహిస్తారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా చిత్తడి నేలల రక్షణకు రామ్సర్ అనే ఒప్పందం కుదిరింది. భారతదేశంలో ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే చిత్తడి నేలలు మొత్తం 75 ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో ఉన్నాయి. అలాగే ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతారు.
15. ప్రస్తుతం రెపోరేట్ ఎంత? (3)
1) 6.75% 2) 4.50%
3) 6.50% 4) 18%
వివరణ: తాజా ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ ఫిబ్రవరి 8న ప్రకటించింది. రెపోరేట్‌ను 0.25 బేసిస్ పాయింట్లు పెంచింది. అలాగే 2022-23 సంవత్సరంలో వృద్ధి రేటు 6.8 నుంచి 7% ఉంటుందని పేర్కొంది. తాజా పెంపుతో రెపో రేట్ 6.50 శాతంగా ఉంది. బ్యాంక్ రేటు, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ కూడా 6.75%గా ఉండగా, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగా నమోదయ్యింది. నగదు నిల్వల నిష్పత్తి 4.50 శాతంగా, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి 18 శాతంగా ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు