Telangana History | ‘వెట్టిచాకిరీ విధానమో రైతన్నా..’ అనే పాట రాసిందెవరు?
ఏప్రిల్ 5వ తేదీ తరువాయి..
114. ముజఫర్ జంగ్ అనంతరం నిజాం కుమారుడు సలాబత్ జంగ్‌ను నిజాంగా ప్రకటించింది ఎవరు?
a) రాబర్ట్ ైక్లెవ్ b) వెల్లస్లీ
c) బుస్సీ d) డూప్లే
జవాబు: (c)
వివరణ: బుస్సీ ఫ్రెంచి సేనాని. తనను నిజాంగా ప్రకటించినందుకు ప్రతిఫలంగా సలాబత్ జంగ్ ఉత్తర సర్కారు జిల్లాలను ఫ్రెంచి వారికి ఇచ్చాడు. 1762లో సలాబత్ జంగ్‌ను గద్దెదించి ఆయన తమ్ముడు నిజాం అలీఖాన్ దక్కన్ పాలకుడయ్యాడు.
115. 1857 తిరుగుబాటు సందర్భంగా ‘నిజాం రాజు మన చేతుల్లోంచి జారిపోయినట్లయితే, అన్నీ పోతాయి’ అని అన్నది ఎవరు?
a) గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్
b) హైదరాబాద్ రెసిడెంట్ కిర్క్ పాట్రిక్
c) హైదరాబాద్ కంటింజెంట్ సృష్టికర్త హెన్రీ రస్సెల్
d) బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్స్టన్
జవాబు: (d)
వివరణ: గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్‌కు రాసిన లేఖలో ఎల్ఫిన్స్టన్ ఇలా పేర్కొన్నాడు.
116. సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు?
a) దివాన్ చందూలాల్
b) రాజా మహీపత్ రాయ్
c) సాలార్జంగ్ 1
d) సిరాజ్ ఉల్ ముల్క్ జవాబు: (c)
117. సిపాయిల తిరుగుబాటు అణచివేతకు సహకరించినందుకు బ్రిటిష్ రాణి విక్టోరియా మోస్ట్ ఎగ్జాల్టెడ్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతో ఏ నిజాం రాజును సత్కరించింది?
a) నాసిరుద్దౌలా b) అఫ్జలుద్దౌలా
c) మీర్ మహబూబ్ అలీఖాన్
d) మీర్ ఉస్మాన్ అలీఖాన్
జవాబు: (b)
వివరణ: బిరుదుతోపాటు నిజాం నుంచి తీసుకున్న ఉస్మానాబాద్, రాయచూర్ జిల్లాలను తిరిగి అప్పగించారు. బ్రిటిష్ వారికి నిజాం రాజు చెల్లించాల్సిన 50 లక్షల రూపాయల అప్పును మాఫీ చేశారు.
118. అనేక కోట్ల బంగారు నాణేలు, లక్షల కొద్ది ఆవులు, నాగళ్లు, భూమిని దానం చేసిన ఇక్షాకు వంశపు రాజు ఎవరు?
a) మొదటి క్షాంతమూలుడు
b) వీరపురుషదత్తుడు
c) ఎహువల శాంతమూలుడు
d) రుద్రపురుషదత్తుడు జవాబు: (a)
119. కింది ఇక్షాకు వంశ రాజుల క్రమంలో కాలాన్ని అనుసరించి సరైన క్రమం ఏది?
a) వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, ఎహువల శాంతమూలుడు, క్షాంతమూలుడు
b) ఎహువల శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, క్షాంతమూలుడు
c) క్షాంతమూలుడు, వీరపురుషదత్తుడు, ఎహువల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు
d) క్షాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, ఎహువల శాంతమూలుడు
జవాబు: (c)
120. పురాణాల్లో శ్రీపర్వతీయులని ఎవరి గురించి పేర్కొన్నారు?
a) శాతవాహనులు b) ప్రతీహారులు
c) విష్ణుకుండినులు d) ఇక్ష్వాకులు
జవాబు: (d)
121. కింది రచనలు, రచయితలతో జతపరచండి.
(యూపీఎస్సీ సివిల్స్ (ఆప్షనల్ చరిత్ర) 2003)
A. తపతీ సంవరణోపాఖ్యానం 1. గంగాధర కవి
B. యయాతి చరితం 2. పొన్నగంటి తెలగనార్య
C. వైజయంతీ విలాసం 3. సారంగు తమ్మయ్య
D. శివధర్మోత్తరం 4. మల్లారెడ్డి
a) A-1, B-2, C-3, D-4
b) A-3, B-4, C-1, D-2
c) A-1, B-4, C-3, D-2
d) A-3, B-2, C-1, D-4
జవాబు: (a)
వివరణ: ఇచ్చిన రచనలు, రచయితలు కుతుబ్‌షాహీ కాలానికి సంబంధించినవి.
122. 1927లో మజ్లిస్ ఇత్తెహాదుల్ జైనుల్ ముస్లిమీన్ వ్యవస్థాపన సమయంలో తోహాద్ మంజిల్‌లో జరిగిన సమావేశానికి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు?
a) నవాబ్ తురాబ్ అలీ
b) నవాబ్ సదర్ యార్ జంగ్
c) నవాబ్ బహదూర్ యార్ జంగ్
d) ఖాసీం రజ్వీ జవాబు: (b)
వివరణ: ఇదే 1929లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌గా మారింది. ఇస్లాం సంరక్షణ, ముస్లింల ఐక్యత, ముస్లింల ప్రయోజనాల్ని కాపాడటం, నిజాం నవాబు పట్ల విధేయత, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం ఈ సంస్థ ఆశయాలు.
123. నవాబ్ బహదూర్ యార్ జంగ్ మజ్లిస్‌కు ఏ సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా వ్యవహరించారు?
a) 1938 b) 1935
c) 1940 d) 1941
జవాబు: (a)
124. ఖాసీం రజ్వీ మజ్లిస్‌కు ఏ సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు?
a) 1944 b) 1945
c) 1946 d) 1947
జవాబు: (c)
125. ఏ సంవత్సరంలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కు అనుబంధంగా ‘రజాకార్ల’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు?
a) 1942 b) 1946
c) 1943 d) 1940
జవాబు: (d)
126. హైదరాబాద్‌లో ‘ఆంధ్ర జనసంఘం’ ఆవిర్భావానికి దారితీసిన సమావేశం ఏది?
a) నిజాం రాజ్య తెలుగు మహాసభలు
b) నిజాం రాజ్య సంఘ సంస్కరణ సమావేశం
c) నిజాం రాజ్య ఆర్య విద్యా మహాసభలు
d) తెలంగాణ తెలుగు సారస్వత సమావేశం
జవాబు: (b)
127. నిజాం రాజ్య సంఘ సంస్కరణ సమావేశంలో తెలుగులో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని ఎవరు అనుకున్నారు?
a) మాడపాటి హనుమంతరావు
b) సురవరం ప్రతాపరెడ్డి
c) ఆలంపల్లి వెంకట రామారావు
d) మందుముల నరసింగరావు
జవాబు: (c)
128. 1922, ఫిబ్రవరి 14న జరిగిన మొదటి ఆంధ్ర జనసంఘం సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
a) ఆలంపల్లి వెంకట రామారావు
b) సురవరం ప్రతాప రెడ్డి
c) మందుముల నరసింగరావు
d) కొండా వెంకట రంగారెడ్డి
జవాబు: (d)
129. ఏ సమావేశంలో ఆంధ్ర జనసంఘం పేరు ఆంధ్ర మహాసభగా మారిపోయింది?
a) 1930 జోగిపేట b) 1932 ఖమ్మం
c) 1936 షాద్‌నగర్
d) 1937 నిజామాబాద్ జవాబు: (a)
130. కింది వివరాలను పరిశీలించండి.
1. 1930 జోగిపేట ‘ఆంధ్ర మహాసభ’ తొలి సమావేశానికి అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి
2. 1936 షాద్‌నగర్ ఆంధ్ర మహాసభ సమావేశంలో తొలి ఆంధ్ర మహిళా మహాసభలు జరిగాయి
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2 సరైనవే
d) 1, 2 సరైనవి కావు
జవాబు: (a)
వివరణ: ఆంధ్ర మహిళా సభలు కూడా 1930 జోగిపేట సమావేశంలోనే సమాంతరంగా ప్రారంభమయ్యాయి.
131. తెలంగాణ తొలి ఆంధ్ర మహిళా సభలకు ఎవరు అధ్యక్షత వహించారు?
a) దుర్గాబాయి దేశ్‌ముఖ్
b) బూర్గుల అనంతలక్ష్మి
c) ఇల్లిందల సరస్వతీదేవి
d) నడింపల్లి సుందరమ్మ జవాబు: (d)
132. తన రాజ్యంలో ప్రజలకు అన్ని పౌర హక్కులు ఉన్నాయని వార్తా పత్రికల్లో రాసేందుకు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరిని ప్రచారకర్తగా నియమించుకున్నాడు?
a) సిడ్నీ కాటన్ b) వెబ్ మిల్లర్
c) రష్‌బ్రూక్ విలియమ్స్
d) సర్ రోనాల్డ్ రాస్ జవాబు: (c)
వివరణ: ప్రొఫెసర్ రష్‌బ్రూక్ విలియమ్స్ ప్రసిద్ధ ఆంగ్ల వార్తా సంస్థ బి.బి.సి. ప్రతినిధి.
133. నాసిరుద్దౌలా పాలనా కాలానికి సంబంధించి సరికానిది ఏది?
a) బేరార్ ఒప్పందం
b) కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్
c) సెయింట్ జార్జి గ్రామర్ హైస్కూల్
d) హైదరాబాద్ కంటింజెంట్ ఏర్పాటు
జవాబు: (d)
వివరణ: హైదరాబాద్ కంటింజెంట్ లేదా రసెల్ బ్రిగేడ్ సికిందర్ జా కాలంలో ఏర్పాటైంది. కాబట్టి d తప్పు. బేరార్ ఒప్పందం 1853 మే 21న ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగింది. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (తర్వాతి కాలంలో గాంధీ హాస్పిటల్) 1854లో నిర్మాణం పూర్తయింది. సెయింట్ జార్జి గ్రామర్ హై స్కూల్ 1834లో ప్రారంభమైంది. ఇది హైదరాబాద్‌లో మొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల. a, b, c మూడు వివరాలు నాసిరుద్దౌలా పాలనాకాలం 1829-57 మధ్య కాలంలో జరిగాయి.
134. హైదరాబాద్‌ను సందర్శించిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
a) లార్డ్ ఇర్విన్ b) లార్డ్ రిప్పన్
c) లార్డ్ వెల్లింగ్టన్ d) లార్డ్ కర్జన్
జవాబు: (b)
వివరణ: 1884 ఫిబ్రవరిలో అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హైదరాబాద్‌ను సందర్శించాడు. ఆ సంవత్సరం మైనారిటీ తీరిపోయిన నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు పదవీ బాధ్యతలు లాంఛనంగా అప్పగించాడు.
135. హైదరాబాద్ సమస్యను ఐక్యరాజ్య సమితికి విన్నవించడానికి నిజాం రాజు ఎవరి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందాన్ని పంపించాడు?
a) నవాబ్ సదర్ యార్ జంగ్
b) నవాబ్ మొయిన్ నవాజ్ జంగ్
c) పింగళి వెంకటరామారెడ్డి
d) మీర్ లాయక్ అలీ జవాబు: (b)
136. సిడ్నీ కాటన్ ఆయుధ సరఫరా విషయాన్ని హైదరాబాద్‌లో భారత ప్రభుత్వ రెసిడెంట్ కె.ఎం. మున్షీకి చేరవేసింది ఎవరు?
a) కాళోజీ నారాయణరావు
b) బూర్గుల రామకృష్ణారావు
c) నారాయణ రావు పవార్
d) వందేమాతరం రామచంద్రరావు జవాబు: (d)
137. మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
a) చాందా రైల్వే పథకం
b) పర్షియన్ స్థానంలో అధికార భాషగా ఉర్దూ
c) చౌమహల్లా రాజభవనం నిర్మాణం పూర్తి
d) లార్డ్ రిప్పన్ హైదరాబాద్ సందర్శన
జవాబు: (c)
వివరణ: చౌమహల్లా రాజభవనం నిర్మాణం నాసిరుద్దౌలా కాలంలో ప్రారంభమైంది. అఫ్జలుద్దౌలా కాలంలో పూర్తయింది. మిగిలిన సంఘటనలు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జరిగినవే.
138. లాయర్ కిషన్‌రావు నాయకత్వంలో హైదరాబాద్ రాజ్యంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ముల్కీ ఉద్యమం ఎవరి కాలంలో జరిగింది?
a) మీర్ మహబూబ్ అలీఖాన్
b) నాసిరుద్దౌలా
c) మీర్ ఉస్మాన్ అలీఖాన్
d) అఫ్జలుద్దౌలా జవాబు: (a)
139. ఆదివాసీ పోరాటాలకు సంబంధించి ‘మేకపట్టి, దుంపపట్టి, అరకుపట్టి’ అనే పదాలు వేటిని సూచిస్తాయి?
a) ఆదివాసీ వ్యవసాయ పరికరాలు
b) అధికారులు వసూలు చేసిన అక్రమ పన్నులు
c) ఆదివాసీ పండుగల్లో చేయాల్సిన కార్యక్రమాలు
d) ఆదివాసీ కుదుళ్లు జవాబు: (b)
140. గోండుల జీవిత విధానం, సంస్కృతి, నిజాం ప్రభుత్వ వ్యవస్థలో వారు ఎదుర్కొన్న బాధల గురించి అధ్యయనం చేసిన ఆంథ్రపాలజిస్టు ఎవరు?
a) ఫాదర్ వెరియర్ ఎల్విన్
b) ఎం.ఎన్.శ్రీనివాస్
c) హైమన్ డార్ఫ్
d) అరవముత్తు అయ్యంగార్
జవాబు: (c)
141. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా అవసరమైతే యుద్ధం చేయడానికి నిజాంకు ఆయుధాలు సరఫరా చేసిన ఆస్ట్రేలియా దేశస్థుడు ఎవరు?
a) ఎల్.ఎడ్రూస్ b) సిడ్నీ కాటన్
c) రష్‌బ్రూక్ విలియమ్స్
d) ఆర్థర్ కాటన్ జవాబు: (b)
142. ఆస్తి తగాదాలో కోర్టు కేసు గెలిచి, 1940లో విసునూరు దేశ్‌ముఖ్ గూండాల చేతిలో హత్యకు గురైన కామారెడ్డి గూడెం నివాసి ఎవరు?
a) దొడ్డి కొమురయ్య
b) గొట్టం కొమురయ్య
c) షేక్ బందగీ d) షేక్ అన్వర్
జవాబు: (c)
143. తెలంగాణలో నిజాం కాలంలో వెట్టి చాకిరీ విధానానికి సంబంధించి ‘వెట్టిచాకిరీ విధానమో రైతన్నా/ ఎంతజెప్పినా తీరదో కూలన్నా..’ అనే పాట రాసింది ఎవరు?
a) సుద్దాల హనుమంతు
b) రావెళ్ల వెంకటరామారావు
c) బండి యాదగిరి
d) దాశరథి కృష్ణమాచార్య జవాబు: (a)
144. 1941లో చిలుకూరు ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
a) బూర్గుల రామకృష్ణారావు
b) రావి నారాయణ రెడ్డి
c) బద్దం ఎల్లారెడ్డి
d) దేవులపల్లి వెంకటేశ్వరరావు
జవాబు: (b)
వివరణ: ఇక్కడి నుంచి ఆంధ్ర మహాసభపై కమ్యూనిస్టుల ఆధిపత్యం పెరిగింది.
145. ఆధునిక తెలంగాణ చరిత్రకు సంబంధించి ‘గల్లా’, ‘ఖుషీ గల్లా’ పదాలు దేన్ని సూచిస్తాయి?
a) నిజాం రాజుల ఆస్థాన వేడుకలు
b) నిజాం రాజుల ధన, ధాన్యాగారాలు
c) జమీందార్లు వసూలు చేసే భూమిశిస్తు
d) నిజాం ప్రభుత్వం వసూలు చేసిన
లెవీ ధాన్యం జవాబు: (d)
వివరణ: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నిజాం ప్రభుత్వం రైతుల నుంచి లెవీ ధాన్యం వసూలు చేసింది. గల్లా కింద ప్రతి రైతు 20 సేర్ల ధాన్యాన్ని చెల్లించాలి. ఇక ఖుషీ గల్లా కింద రైతు తనకు ఇష్టం వచ్చినంత చెల్లించవచ్చు. దీన్ని సాధారణంగా గ్రామాధికారులు నిర్ణయిస్తారు. అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. లెవీ చెల్లించకపోతే హైదరాబాద్ రక్షణ నియమాల ప్రకారం నిర్బంధించేవారు.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు