Telangana History | గ్లోబ్ నౌక ఏ రేవుకు చేరుకుంది?
మార్చి 29వ తేదీ 6వ పేజీ తరువాయి..
84. తెలుగు భాషలో చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్ర్తాలకు సంబంధించి విశేష కృషి చేసి, పుస్తకాలు ప్రచురించిన సంస్థ ఏది?
a) అణా గ్రంథమాల
b) విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి
c) దేశోద్ధారక గ్రంథమాల
d) సాహితీ మేఖల జవాబు: (b)
వివరణ: దీన్ని కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు తదితరులు 1906లో స్థాపించారు. గ్రంథమండలి చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర, ఆచంట లక్ష్మీపతి జీవశాస్త్రం, కట్టమంచి రామలింగారెడ్డి అర్థశాస్త్రం మొదలైన పుస్తకాలను ప్రచురించింది. కొమర్రాజు లక్ష్మణరావు తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం (ఎన్సైక్లోపీడియా) నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే హైదరాబాద్ రాజ్యంలో అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల గ్రంథమండలి 1908లో మద్రాసుకు తరలిపోయింది.
85. తెలంగాణలో గ్రంథాలయోద్యమ వ్యాప్తికి అణా గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
a) కేసీ గుప్తా
b) కొమర్రాజు లక్ష్మణరావు
c) పింగళి వెంకట్రామారెడ్డి
d) ఆదిరాజు వీరభద్రరావు జవాబు: (a)
వివరణ: కేసీ గుప్తా ‘అణా గ్రంథమాల’ను 1937 లో స్థాపించాడు. ఈ సంస్థ ప్రచురించిన రచనలకు వెల్దుర్తి మాణిక్య రావు సంపాదకులుగా వ్యవహరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ప్రచురించినందుకు నిజాం ప్రభుత్వం ఆగ్రహించింది. ప్రచురణకర్త కేసీ గుప్తాకు కారాగార శిక్ష విధించారు.
86. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
a) వట్టికోట ఆళ్వారు స్వామి
b) అరిగె రామస్వామి
c) టీకే బాలయ్య d) బీఎస్ వెంకట్రావు
జవాబు: (c)
వివరణ: టీకే బాలయ్య ఆర్మూరు తాలూకాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి. సంచార గ్రంథాలయం రూపంలో ఎడ్లబండిపై మారుమూల గ్రామాలకు పుస్తకాలను చేరవేశాడు.
87. సూర్యాపేటలో ఆళ్వారుస్వామి, ధర్మభిక్షం, కన్నయ్య ఏర్పాటు చేసిన రహస్య గ్రంథాలయం పేరు?
a) దేశోద్ధారక గ్రంథాలయం
b) అర్జున పుస్తక భాండాగారం
c) ప్రగతి పుస్తక నిధి
d) లక్ష్మణరాయ పుస్తక భాండాగారం
జవాబు: (b)
88. చనిపోయిన వారి దేహాలను మట్టి శవపేటికలో, రాతిగూళ్లలో ఉంచి పూడ్చిపెట్టి చుట్టూ పెద్దపెద్ద బండలు వలయాకారంలో నిలిపిన నిర్మాణాలను ఏమంటారు?
a) రాక్షసగూళ్లు b) వీరగల్లులు
c) మెగాలిథ్స్ d) పాట్ బరియల్స్
జవాబు: (a)
వివరణ: రాక్షసగూళ్లు ఇనుప యుగానికి చెందినవి. పెద్ద పెద్ద బండలు ఉంచేవారు. కాబట్టి వీటిని మెగాలిథిక్ బరియల్స్ అంటారు. స్థానికంగా పాండవుల గుళ్లు అని పిలుస్తారు.
89. చరిత్ర పూర్వ యుగానికి సంబంధించి ‘డాల్మెన్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) గుంత సమాధి b) గూడు సమాధి
c) గుహ సమాధి d) గది సమాధి
జవాబు: (d)
వివరణ: గుంత సమాధులు, గూడు సమాధులు కృష్ణా నది ఎడమ తీరంలో, గుహ సమాధులు, గది సమాధులు గోదావరి కుడి తీరంలో ఎక్కువగా కనిపిస్తాయి.
90. చరిత్ర పూర్వ యుగానికి సంబంధించి చేపలు పట్టే గాలాలు కింది ప్రదేశాల్లో ఎక్కడ దొరికాయి?
a) వీరాపురం b) పోచంపాడు
c) చిన్నమర్రూరు d) కదంబాపూర్
జవాబు: (c)
91. కుతుబ్‌షాహీ పాలకులకు సంబంధించి అష్టభుజాకారంలో ఉన్న సమాధి ఎవరిది?
a) కులీ కుతుబ్‌షా
b) జంషీద్ కుతుబ్ షా
c) ఇబ్రహీం కుతుబ్‌షా
d) అబ్దుల్లా కుతుబ్ షా జవాబు: (b)
92. నిజాం అలీఖాన్ కాలంలో ఉత్తర సర్కారు జిల్లాలను బ్రిటిష్ వాళ్లకు స్వాధీనం చేయడంలో మధ్యవర్తిగా వ్యవహరించిన దుబాసీ ఎవరు?
a) పూర్ణయ్య పంతులు b) వామన్ పండిత్
c) కాండ్రేగుల జోగిపంతులు
d) రంగయ్య చౌదరి జవాబు: (c)
93. కుతుబ్‌షాహీల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ‘ముస్తజీర్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) అమ్మకపు పన్ను
b) సముద్ర వ్యాపారం చేసే వ్యక్తి
c) భూమి శిస్తు వేలం పాడిన వారు
d) రహదారి పన్ను వసూలు చేసేవారు
జవాబు: (c)
వివరణ: కుతుబ్‌షాహీల ఖజానాకు ముఖ్య ఆదాయ వనరు భూమిశిస్తు. శిస్తు వసూలు వేలం ద్వారా జరిగేది. వేలం పాడిన వారిని ‘ముస్తజీర్లు’ అంటారు.
94. కుతుబ్‌షాహీల ‘మంత్రిపరిషత్తు’ను ఏమని పిలిచేవాళ్లు?
a) మజ్లిస్ ఎ కింఘాష్
b) దివాన్ ఎ విజారత్
c) దివాన్ ఎ బందగాన్
d) మజ్లిస్ ఎ దివాన్ దరి జవాబు: (d)
95. కుతుబ్‌షాహీ పరిపాలనకు సంబంధించిన వివరాలను పరిశీలించండి.
1. పీష్వా: ప్రధానమంత్రి
2. మీర్ జుమ్లా: ఆర్థిక రెవెన్యూ వ్యవహారాలు
3. మజుందార్: శాంతిభద్రతలు
4. దబీర్: రాజాజ్ఞలు జారీ చేసేవాడు
పై జతల్లో సరికానిది ఏది?
a) 1 b) 1, 2, 3 c) 3, 4 d) 3
జవాబు: (d)
వివరణ: మజుందార్ (ఆడిటర్) రాజ్య ఆదాయ వ్యయాలను పర్యవేక్షించే మంత్రి. శాంతిభద్రతల పరిరక్షణ కొత్వాల్ చేతిలో ఉండేది.
96. కింది వారిలో ఎవరికి ‘సూర్యప్రకాశ రావు’ అనే మారుపేరు ఉంది?
a) మాదన్న b) అక్కన్న
c) లింగన్న d) భక్త రామదాసు
జవాబు: (a)
వివరణ: మీర్ జుమ్లాగా ఉన్న సయ్యద్ ముజఫర్ అహంకార ధోరణి తానీషాకు నచ్చలేదు. దాంతో ఆయనను పదవి నుంచి తొలగించి మాదన్నను మీర్ జుమ్లాగా నియమించాడు. సూర్యప్రకాశ రావు అనే బిరుదును కూడా ఇచ్చాడు.
97. కింది వాక్యాలను పరిశీలించండి.
1. కాకతీయుల కాలంలో రాజ భాష తెలుగు
2. కుతుబ్‌షాహీల కాలంలో అధికార భాష ఉర్దూ
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2
c) 1, 2 d) ఏదీ కాదు
జవాబు: (d)
వివరణ: కాకతీయుల కాలంలో రాజ భాష సంస్కృతం. కుతుబ్‌షాహీల కాలంలో అధికార భాష పర్షియన్ (పారశీకం).
98. కుతుబ్‌షాహీ పాలకుల్లో ‘బడేమాలిక్’ (పెద్ద యజమాని)గా పేరుగాంచింది ఎవరు?
a) ఇబ్రహీం కులీ b) జంషీద్ కులీ
c) సుల్తాన్ కులీ d) మహ్మద్ కులీ
జవాబు: (c)
99. కింది వివరాలను పరిశీలించండి.
1. శాతవాహనులు: ఆహార
2. కాకతీయులు: స్థల
3. కుతుబ్‌షాహీలు: సుబా
4. నిజాం రాజులు: తరఫ్
పై జతల్లో సరైనవి ఏవి?
a) 1 b) 1, 2, 3
c) 1, 2, 3, 4 d) ఏదీ కాదు
జవాబు: (a)
వివరణ: ఇచ్చిన ప్రశ్న ఆయా రాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ర్టాల విభజనకు సంబంధించింది. శాతవాహనుల కాలంలో రాష్ర్టాలను ఆహారాలని, కాకతీయుల కాలం లో నాడులని, కుతుబ్‌షాహీల కాలంలో తరఫ్‌లు, నిజాంల కాలంలో సుబాలని పిలిచేవాళ్లు. కాబట్టి ఒక్క జత మాత్రమే సరైంది.
100. కింది ఎవరిని ‘నవలక్షధనుర్ధరాధీశ్వరులు’ అని పేర్కొన్నారు?
a) మౌర్యులు b) శాతవాహనులు
c) కాకతీయులు d) విష్ణుకుండినులు
జవాబు: (c)
101. ఆంగ్లేయుల వ్యాపార విస్తరణలో భాగంగా 1611లో కుతుబ్‌షాహీ సామ్రాజ్యంలోని మచిలీపట్నం రేవుకు చేరుకున్న నౌక ఏది?
a) బీగిల్ b) గ్లోబ్
c) నేవిగేటర్ d) హిప్పన్
జవాబు: (b)
జవాబు: వ్యాపార విస్తరణలో భాగంగా కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ నౌక 1611లో మచిలీపట్నం రేవుకు చేరుకుంది. మహమ్మద్ కులీ కుతుబ్షాతో చర్చలు జరిపి, మచిలీపట్నంలో వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందారు.
102. కుతుబ్‌షాహీల సామాజిక, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ‘ఛనేట్’ పదం దేన్ని సూచిస్తుంది?
a) ఒక రకం గ్రానైట్ రాయి
b) అగ్గిపుల్లను మండించే రసాయనం
c) వివిధ రంగులు అద్దిన సన్నని వస్ర్తాలు
d) ఫిరంగుల్లో ఉపయోగించే మందుగుండు
జవాబు: (c)
103. ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల’ను స్థాపించింది ఎవరు?
a) ఒద్దిరాజు సోదరులు
b) షబ్నవీసు నరసింహారావు
c) వట్టికోట ఆళ్వారుస్వామి d) కేసీ గుప్తా
జవాబు: (a)
వివరణ: ఒద్దిరాజు సోదరులు ‘తెనుగు’ పత్రికకు ముందే 1918లో ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల’ను స్థాపించారు.
104. 19వ శతాబ్దం తొలినాళ్లలో అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి నిజాం ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయేందుకు కారణమైన బ్యాంకింగ్ సంస్థ ఏది?
a) ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ లండన్
b) పామర్ అండ్ కంపెనీ
c) థామస్ కుక్ కంపెనీ
d) ఈస్ట్ ఇండియా కంపెనీ జవాబు: (b)
వివరణ: పామర్ అండ్ కంపెనీని నిజాం సైన్యంలో పనిచేసి విరమణ పొందిన విలియం పామర్ స్థాపించాడు. దీనికి హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ రసెల్ సహకరించాడు. నిజాం రాజ్యంలో కంపెనీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి అప్పటి పేష్కార్ చందూలాల్ ముఖ్యపాత్ర పోషించాడు. పామర్ కంపెనీ దగ్గర అధిక వడ్డీకి ప్రభుత్వం అప్పులు తీసుకోవడంతో ఆర్థికంగా గడ్డుకాలం దాపురించింది. రసెల్ తర్వాత రెసిడెంట్‌గా వచ్చిన చార్లెస్ మెట్కాఫ్ పామర్ కంపెనీ కబంధ హస్తాల నుంచి నిజాంను బయట పడేశాడు.
105. వహాబీ ఉద్యమంలో పాల్గొన్న నాలుగో నిజాం నాసిరుద్దౌలా సోదరుడు ఎవరు?
a) అఫ్జలుద్దౌలా b) గులాం రసూల్
c) ముబారిజుద్దౌలా d) సలాబత్ జంగ్
జవాబు: (c)
వివరణ: వహాబీ ఉద్యమం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తలెత్తింది. దీంతో హైదరాబాద్ రాజ్యంలో వహాబీ ఉద్యమ వ్యాప్తిని నివారించడానికి ముబారిజుద్దౌలాను 1815లో అరెస్ట్ చేశారు. 1820లో విడుదల చేసినా, ఆయన బ్రిటిష్ వ్యతిరేకతను అలానే కొనసాగించాడు. దీంతో ఆయనను గోల్కొండ కోటలో నిర్బంధంలో ఉంచారు. 1854లో మరణించారు.
106. వహాబీ ఉద్యమంలో పాల్గొన్న కర్నూలు నవాబు ఎవరు?
a) అమీర్ ఖాన్ b) అన్వరుద్దీన్
c) చందా సాహెబ్ d) గులాం రసూల్ ఖాన్
జవాబు: (d)
107. 1811లో హైదరాబాద్‌లో ఏర్పాటైన కొత్త సైనిక పటాలం ఏది?
a) హైదరాబాద్ బ్రిగేడ్
b) రసెల్ బ్రిగేడ్
c) నిజాం కంటింజెంట్
d) సబ్సిడరీ అలయన్స్ జవాబు: (b)
వివరణ: దీన్ని అప్పటి హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్న హెన్రీ రసెల్ ప్రారంభించాడు. అందుకే ‘రసెల్ బ్రిగేడ్’ అనే పేరు వచ్చింది. దీన్నే హైదరాబాద్ కంటింజెంట్ అని కూడా అంటారు. కొత్త సైన్యం ఆంగ్ల మరాఠా యుద్ధాల్లో బ్రిటిష్ తరఫున ముఖ్యపాత్ర పోషించింది.
108. మూడో నిజాం సికిందర్ జా కాలంలో పేష్కార్గా రాజ్య వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించింది ఎవరు?
a) మహరాజా కిషన్ ప్రసాద్
b) రాజా దీన్‌దయాళ్
c) సాలార్ జంగ్ 1
d) దివాన్ చందూలాల్ జవాబు: (d)
109. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన నిజాం రాజు ఎవరు?
a) నిజాం ఉల్ ముల్క్
b) ముజఫర్ జంగ్
c) నిజాం అలీ d) సికిందర్ జా
జవాబు: (c)
వివరణ: 1798లో నిజాం అలీ సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించాడు. ఒప్పందానికి అంగీకరించిన మొదటి భారతీయ పాలకుడు కూడా నిజాం అలీనే. హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్ సైన్య పోషణ ఖర్చును భరించడానికి అంగీకరించాడు. ఈ ఖర్చులకు బదులుగా 1800లో కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. వీటినే సీడెడ్ జిల్లాలు లేదా దత్తమండలం అంటారు.
110. కింది వాక్యాలను పరిశీలించండి.
1. నిజాం రాజ్యానికి తొలినుంచీ హైదరాబాద్ రాజధానిగా ఉండేది.
2. మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ రెండో రాజధానిగా ఉంది.
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2
c) 1, 2 సరైనవి కాదు d) 1, 2 సరైనవే
జవాబు: (c)
వివరణ: హైదరాబాద్ రాజ్యానికి మొదట్లో ఔరంగాబాద్ రాజధానిగా ఉండేది. 1770లో మూడో నిజాం అలీఖాన్ రాజధానిని హైదరాబాద్‌కు మార్చాడు. హైదరాబాద్ రాజ్యానికి రెండో రాజధాని అనే ప్రసక్తే లేదు. కాబట్టి ఇచ్చిన రెండు వాక్యాలూ సరైనవి కాదు.
111. క్షేత్రయ్య ఏ కుతుబ్‌షాహీ పాలకుడి సమకాలీనుడు?
a) ఇబ్రహీం కుతుబ్‌షా
b) అబ్దుల్లా కుతుబ్‌షా
c) అబుల్ హసన్ తానీషా
d) మహమ్మద్ కుతుబ్‌షా జవాబు: (b)
112. నిజాం ఉల్ ముల్క్ ఏ యుద్ధంలో దక్కన్ గవర్నర్ ముబారిజ్ ఖాన్‌ను ఓడించాడు?
a) షక్కర్ ఖేడ్ b) అష్తి
c) బురాన్‌పూర్ d) ముత్తుకూరు
జవాబు: (a)
వివరణ: 1724లో జరిగిన ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాతే నిజాం ఉల్ ముల్క్ దక్కన్లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
113. నిజాం ఉల్ ముల్క్ వారసత్వానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి
1. నిజాం రెండో కుమారుడు నాసిర్ జంగ్ తాను రాజు కావడానికి బ్రిటిష్ వారి మద్దతు తీసుకున్నాడు
2. నిజాం మనుమడు ముజఫర్ జంగ్ డచ్ వారి సహకారం కోరాడు
పై వాటిల్లో సరైనవి?
a) 1 b) 2
c) 1, 2 సరైనవే d) 1, 2 సరైనవి కాదు
జవాబు: (a)
వివరణ: ముజఫర్ జంగ్ ఫ్రెంచి వారి సహకారం తీసుకున్నాడు. వారి సాయంతోనే దక్కన్ పాలకుడిగా నియమితులయ్యాడు. అయితే పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గంమధ్యలో ముజఫర్ జంగ్ హత్యకు గురయ్యాడు.
గమనిక: గతవారం 62, 68 ప్రశ్నల వివరణలో… కాకతీయులకు సంబంధించి వేర్వేరు ఆధారాల నుంచి సమాచారం సేకరించాను. అందువల్ల సంవత్సరాల్లో తేడా వచ్చింది. కాబట్టి, స్థూలంగా కాకతీయుల కాలంగా పరిగణించగలరు. 59వ ప్రశ్నలో… 1857 తిరుగుబాటు ‘ప్రారంభం’ స్థానంలో తిరుగుబాటు ‘సమయం’లో అని చదువుకోగలరు. తిరుగుబాటు 1857 మే 10న ప్రారంభమైంది. నాసిరుద్దౌలా మే 16న మరణించడంతో, ఆయన కొడుకు అఫ్జలుద్దౌలా నిజాం అయ్యాడు. అంటే తిరుగుబాటు ప్రారంభమైన సమయంలో నాసిరుద్దౌలా హైదరాబాద్ పాలకుడిగా ఉన్నాడు.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు