CSE | సీఎస్ఈ.. డిగ్రీలో బీటెక్ తరహా కంప్యూటర్ సైన్స్ కోర్సు
CSE | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీటెక్‌తో తత్సమానమైన కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులోకి రానున్నది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరిట నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతం 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు. ఒక్కో కాలేజీలో 60 సీట్లతో ఈ కోర్సును నిర్వహిస్తామని చెప్పారు. ప్రైవేట్ కాలేజీలు ముందుకొస్తే వాటికి కూడా అనుమతులిస్తామని పేర్కొన్నారు.
కారణాలివే..
ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు పూర్తిచేసినా అత్యధికులు సాఫ్ట్వేర్ రంగం వైపే చూస్తున్నారు. ఈ రంగంలోనే ప్లేస్‌మెంట్స్ అధికంగా ఉండటంతో విద్యార్థుల ఆలోచనల్లో మార్పు వస్తున్నది. ఇటీవలికాలంలోస్టార్టప్ కల్చర్ వేగవంతమవుతుండటం కూడా ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు డిమాండ్ పెరుగుతున్నది. అయితే బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీట్లు పరిమితంగా ఉన్నాయి. దీంతో సీట్లు దొరక్క చాలా మంది విద్యార్థులు ఇతర కోర్సుల బాట పడుతున్నారు. మరికొందరు ఈ సీట్ల కోసం మేనేజ్మెంట్ కోటాలో లక్షలకు లక్షలు ధారపోస్తున్నారు. బీటెక్‌లో సీఈఎస్ సీట్లను దక్కించుకోలేని విద్యార్థులకు అవకాశం ఇవ్వడంలో భాగంగా డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్ కోర్సును ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
సెక్టార్ స్కిల్ కోర్సులు కూడా..
ఈ సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్ కోర్సుతో పాటు కొత్తగా పలు సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి కాగా ఆయా విద్యార్థులకు నెలకు కొంత పారితోషికం ఇస్తారు. బీబీఏ రిటైలింగ్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీబీఏ – ఈకామర్స్ ఆపరేషన్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీబీఏ లాజిస్టిక్స్ వంటి పూర్తిస్థాయి మూడేండ్ల డిగ్రీ కోర్సులను కూడా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సుల సీట్లను సైతం దోస్త్ ద్వారానే భర్తీచేస్తారు.
కోర్సు ప్రత్యేకతలు
- ప్రస్తుతమున్న బీఎస్సీ ఎంపీసీఎస్ (గణితం, ఫిజిక్స్, కంప్యూటర్) కోర్సులో కంప్యూటర్ సబ్జెక్టు ఒక్కటే. తాజా నిర్ణయంతో పూర్తిస్థాయి కంప్యూటర్ సైన్స్కోర్సు రానున్నది.
- ఈ కోర్సు సిలబస్, కరిక్యులం అంతా బీటెక్ సీఎస్ఈ కోర్సుతో సమానంగా ఉంటుంది. బీటెక్‌లో సీట్లు దక్కించుకోలేని వారు, ఎంసెట్‌కు హాజరు కానివారు దోస్త్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
- మూడేండ్ల తర్వాత కోర్సు నుంచి వైదొలిగితే విద్యార్థికి మూడేండ్ల డిగ్రీనిస్తారు. నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేస్తే అనర్స్ డిగ్రీ పట్టా జారీచేస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు