Telangana History | ‘సహిపా’ ఉర్దూ పత్రిక సంపాదకుడు ఎవరు?
31. ‘తెలంగాణలో లక్షా యాభై వేల మంది కమ్యూనిస్టులు చేయలేని పని ఒక బక్కచిక్కిన వ్యక్తి చేశారు’ అని ఎవరిని ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు?
1) మహాత్మాగాంధీ
2) సర్దార్ వల్లభాయ్ పటేల్
3) బూర్గుల రామకృష్ణారావు
4) వినోబాభావే
32. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమించిన సర్ సయ్యిద్ ఇమామ్ అలీని విచారణ చేయడానికి ఫర్మానాలో పేర్కొన్న అంశాలకు సరైంది?
ఎ. ప్రత్యేక ఎన్నికల పద్ధతి ప్రవేశపెట్టడం
బి. కొన్ని ప్రత్యేక తెగలకు ప్రాతినిధ్యం ఇవ్వటం
సి. అల్ప సంఖ్యాక ప్రజల హక్కులను సంరక్షించుట
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
33. ‘WHITHER HYDERABAD’
గ్రంథ రచయిత ఎవరు?
1) సయ్యద్ అలీ ఇమామ్
2) సయ్యద్ అహ్మద్ ఖాన్
3) సయ్యద్ అబిద్ హసన్
4) ఎవరూ కాదు
34. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం (జోగిపేట)లో చేసిన తీర్మానాలు?
ఎ. గస్తి నిషాన్ 53 ఎత్తేయాలి
బి. బాల్య వివాహాలను నిరోధిస్తూ వితంతు పునర్వివాహాలకు ప్రోత్సహం అందించాలి
సి. అస్పృశ్యత నివారణకు చర్యలు చేపట్టాలి
1) ఎ, బి 2) బి
3) సి 4) పైవన్నీ సరైనవి
35. సహిపా అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు ఎవరు?
1) మహ్మద్ ముర్తాజా
2) సదర్ యార్ జంగ్
3) మీర్ అక్బర్ అలీ
4) ఎవరూ కాదు
36. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం విధించిన ప్రధాని?
1) మీర్ లాయక్ అలీఖాన్
2) బహదూర్ మీర్ఆంగ్
3) కిషన్ ప్రసాద్
4) అక్బర్ హైదరీ
37. కింది వాక్యాల్లో సరైనది.
ఎ. తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు సురవరం ప్రతాపరెడ్డి
బి. దాస్ కాపిటల్ రచయిత కార్ల్‌మార్క్స్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
38. కింది వాక్యాల్లో సరైనది.
ఎ. తొలి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి
బి. నిజాం ప్రభుత్వం అనుమతితో తొలి ఆంధ్ర మహాసభ ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో 1930లో జరిగింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
39. సిటీ కాలేజీ గురించి సరికాని వాక్యం.
ఎ. సిటీ కాలేజీ ఒక్క బిల్డింగ్ వాస్తుశిల్పి Vincent Esch
బి. సిటీ కాలేజీని ఇండో అరబిక్ నిర్మాణశైలిలో తూర్పు పడమర దిక్కుల్లో ఒకే రీతిలో కనిపించేలా నిర్మించారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
40. పెంబర్తి లోహకళకు సంబంధించి సరికాని వాక్యం?
ఎ. ఇత్తడి, రాగి, వెండి లోహాలను రేకులుగా మలచడం ప్రత్యేకత
బి. మహారాష్ట్రలోని తుల్జాభవానీ మాతా దేవాలయంలో పెంబర్తి హస్తకళారీతులు కనబడతాయి
సి. కుతుబ్‌షాహీల కాలంలో ఈ కళ ఉచ్ఛ దశకు చేరుకుంది
డి. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ పెంబర్తిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుగా గుర్తించింది
1) ఎ, బి 2) బి, సి
3) సి 4) పైవన్నీ
41. హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన తర్వాత జరిగిన భారీ హత్యాకాండకు సంబంధించి ఆరోపణలు, విచారణల కోసం నెహ్రూ ఎవరి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు?
1) అబ్దుల్ గఫార్
2) పండిత్ సుందర్‌లాల్
3) పండిట్ కృష్ణస్వామి
4) బల్దేవ్ సింగ్
42. ఎం.కె. వెల్లోడి మంత్రిమండలికి సంబంధించి సరికాని జత?
ఎ. బూర్గుల రామకృష్ణ-ఆర్థిక వాణిజ్యం పరిశ్రమలు
బి. జీవీఎస్ రావు- విద్యా ఎక్సేంజ్ రెవెన్యూ
సి. ఎం.శేషాద్రి- హోం సమాచారం, న్యాయ ఎన్నికలు
డి. పూల్‌చంద్ గాంధీ- వైద్య ఆరోగ్యం, స్థానిక సంస్థలు
1) ఎ, బి 2) బి, సి
3) సి 4) పైవన్నీ
43. కింది వాక్యాల్లో సరికానిది?
ఎ. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థ రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ
బి. ఆపరేషన్ పోలో సమయంలో లండన్‌లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ఆఫ్ పోలీస్ మీర్ నవాబ్ జంగ్
సి. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థ సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఈ ఎల్ ఎడ్రుస్
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఏదీకాదు
44. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. పాకిస్థాన్ గవర్నర్ జనరల్ అయిన మహ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబర్ 12న మరణించాడు
బి. సర్దార్ వల్లభాయ్ సూచన మేరకు హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్యను భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించింది
సి. ఆపరేషన్ పోలో సమయంలో భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి బల్దేవ్సింగ్
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
45. సరైన వాక్యాలు గుర్తించండి.
ఎ. ఆపరేషన్ పోలో సమయంలో భారత సైన్యాధిపతి రాయ్ భూచనర్
బి. ఆపరేషన్ పోలో సందర్భంగా భారతదేశంలో కడుపులో ఏర్పడ్డ క్యాన్సర్ పుండును తొలగించినట్లు అయిందని వ్యాఖ్యానించింది జవహర్లాల్ నెహ్రూ
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
46. సరైన వాక్యాలు ఏవి?
ఎ. 1951 సెప్టెంబర్ 13న జనగామ ఎమ్మెల్యే అవాయ్ ఉర్దూ పత్రిక సంపాదకుడు అయిన సయ్యద్ అక్తర్ హుస్సేన్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేశారు
బి. 1951 సెప్టెంబర్ 26న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్ పర్యటన సమయంలో ప్రసంగిస్తూ ప్రస్తుతం సమస్య న్యాయ విచారణలో ఉన్నందున తాను ఏమీ వ్యాఖ్యానించనని పేర్కొన్నాడు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
47. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ గురించి సరైన వాక్యం?
ఎ. 1952 సెప్టెంబర్ 9న, రాష్ట్ర హోంశాఖ సిటీ కాలేజీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద జరిగిన పోలీసు కాల్పులపై విచారించటానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస పింగళి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
బి. 1952 డిసెంబర్ 18న కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
48. 1952 సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల అమలు, పరిశీలన కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సంఘం లో సభ్యులు కానివారు?
ఎ. కొండా వెంకట రంగారెడ్డి (ఎక్సైజ్ శాఖ మంత్రి)
బి. పూల్‌చంద్ గాంధీ (విద్యాశాఖ మంత్రి)
సి. మొహదీ నవాజ్ జంగ్ (పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి)
డి. డా.జీఎస్. మెల్కోటే (ఆర్థిక శాఖ మంత్రి)
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఏదీకాదు
49. సిటీ కాలేజీ గురించి సరైన వాక్యం?
ఎ. 1952 సెప్టెంబర్ 1న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ప్రభుత్వ ఆదేశానుసారం ఒక ప్రకటన చేస్తూ ముల్కీ ఉద్యమంలో విధ్వంసకర చర్యలు జరుగుతున్నాయి. ఈ విధ్వంసకర చర్యల్లో పాల్గొనేవారిపై పోలీసు కఠిన చర్యలు తీసుకుంటారని, విద్యార్థులెవరూ కూడా ఉద్యమంలో పాల్గొనకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులకు, స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు
బి. 1952 సెప్టెంబర 2న పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్-25 ప్రకారం ఊరేగింపులు, సభలు, సమావేశాలపై నిషుధం విధించాడు. సిటీ కాలేజీ విద్యార్థులు ఈ నిషేధాజ్ఞలు పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తూ ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
50. వరంగల్ ముల్కీ ఉద్యమం ప్రారంభం
నిశ్చితం A: హనుమకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఉన్న రషీద్-ఆల్-హసన్‌ను పార్థసారధి వేధింపులకు గురిచేయగా అతడు మరణించడం మొదలైన సంఘటనల ఫలితంగా వరంగల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు 1952లో ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు
కారణం R: ఈ విషయం తెలుసుకున్న సుమారు నాలుగువేల మంది విద్యార్థులు హనుమకొండ చౌరస్తా నుంచి ‘నాన్ ముల్కీ గో బ్యాక్’, ‘ఇడ్లీ-సాంబార్ గోబ్యాక్’ అనే నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన చేశారు
1) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సత్యం, కాని A కు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
51. పరిపాలనా సంస్కరణలు
నిశ్చితం A : 1953 అక్టోబర్ 1న వరంగల్ జిల్లా నుంచి కొన్ని భాగాలను వేరుచేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు
కారణం R : 1955 డిసెంబర్ 10న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వయంగా నాగార్జునసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి పర్చాడు
1) A, R రెండూ సత్యం, Aకు R సరైన విరణ
2) A, R రెండూ సత్యం, Aకు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
52. కింది వాక్యాల్లో సరైనది?
ఎ. విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రతి 500 జనాభా గల గ్రామానికి విద్యా సంస్థ-పాఠశాల ఏర్పాటు చేయబడింది
బి. మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం హైదరాబాద్ కాగా, మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు
సి. అసఫియా స్టేట్ లైబ్రరీ పేరును హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా మార్చారు
డి. హైదరాబాద్ రాష్ట్రంలో మల్టీ పర్పస్ హైస్కూళ్లను స్థాపించాలని జగన్మోహన్రెడ్డి కమిటీ సూచించింది
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఏదీకాదు
53. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం- 1950కి సంబంధించి సరైంది?
ఎ. ఈ చట్టం ప్రకారం వరుసగా 5 సంవత్సరాల పాటు కౌలుదారుడు భూమిని సాగు చేసినట్లయితే వారిని రక్షిత కౌలుదారుడిగా పేర్కొంటారు
బి. ఈ చట్టం కౌలుదారుడు సాగు చేసుకుంటున్న భూములను 9 సంవత్సరాల వరకు సాగు చేసుకునే విధంగా రక్షణలు కల్పిస్తుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
54. భూ సంస్కరణలు హైదరాబాద్ రాష్ట్రంలో 1949-54 మధ్య కాలంలో భూ సంస్కరణలకు సంబంధించి కింది చట్టాలను వరుస క్రమంలో అమర్చండి?
ఎ. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం
బి. జాగీర్దార్ల చట్టం
సి. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం
1) సి, బి, ఎ 2) సి, ఎ, బి
3) బి, ఎ, సి 4) ఎ, బి, సి
55. నిశ్చితం A: 1952 ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణరావు మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. పూర్వపు వెల్లోడి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేశాడు.
కారణం R : 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పార్టీకి చెందిన నాయకుల చేతిలో ఓడిపోయిన తెలంగాణ ప్రముఖులు 1. సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు
1) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
56. కింది వాటిలో సరైనది?
ఎ. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభుక స్పీకర్- వి.డి. దేశ్‌పాండే
బి. హైదరాబాద్ డిప్యూటీ స్పీకర్- పంపన గౌడ సక్రిప్ప (స్వతంత్ర అభ్యర్థి)
సి. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ప్రతిపక్ష హోదా పొందిన పార్టీ – పీడీఎఫ్
డి. ప్రతిపక్ష నాయకుడు- కాశీనాథరావు వైద్య
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి 4) ఏదీకాదు
సమాధానాలు
31. 4 32. 4 33. 3 34. 1
35. 3 36. 4 37. 2 38. 3
39. 4 40. 3 41. 2 42. 1
43. 4 44. 4 45. 1 46. 4
47. 1 48. 4 49. 1 50. 1
51. 2 52. 1 53. 4 54. 3
55. 2 56. 3
బి.పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ, ఏమర్స్ విల్
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు