Telangana History | తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేసిన సంవత్సరం?
తెలంగాణ చరిత్ర ( మార్చి 19 తరువాయి )
57. 1950లో రాజ్యాంగం అమలు నాటికి మన దేశంలోని భూభాగాన్ని నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేశారు. కింది వాటిలో సరైంది?
ఎ. పార్ట్-ఎ రాష్ర్టాలు: బ్రిటిష్ పాలిత ప్రాంతాలను గతంలో ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు
బి. పార్ట్-బి రాష్ర్టాలు: ప్రత్యేకమైన శాసనసభలను కలిగి ఉన్న స్వదేశీ సంస్థానాల్ని ఈ విభాగంలో చేర్చారు
సి. పార్ట్-సి రాష్ర్టాలు: అండమాన్ నికోబార్ దీవులను ఈ భాగంలో చేర్చారు
డి. పార్ట్-డి రాష్ర్టాలు: కొన్ని స్వదేశీ సంస్థానాలు, గతంలో ఉన్న చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు
1) పార్ట్-ఎ, పార్ట్-బి
2) పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-డి
3) పార్ట్-బి, పార్ట్-సి
4) ఏదీకాదు
58. సరైన వాక్యం?
ఎ. 1950 జనవరి 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలోని రాష్ర్టాల ‘బి’ కేటగిరీ జాబితాలో హైదరాబాద్ రాష్ర్టాన్ని చేర్చారు
బి. వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952 మార్చి 10న ఎన్నికల ద్వారా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
59. పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైనవి?
ఎ. మిగులు నిధులను రెండు ప్రాంతాల అభివృద్ధికి సమానంగా ఖర్చు చేయాలి
బి. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాంతీయ మండలి ఏర్పాటు
సి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించాలి
డి. ఉద్యోగ నియామకాల్లో ముల్కీ నిబంధనలు పాటించాలి
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
60. పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనలకు సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. మిగులు నిధులను తెలంగాణకు ఖర్చు చేయలేదు
బి. 1973లో ముల్కీ నియమాల రద్దు
సి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రద్దు
డి. తెలంగాణ ప్రాంతీయ మండలిని 1973 లో రద్దు చేయడం
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
61. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరికానిది?
ఎ. తెలంగాణలో ఉద్యోగాల కోసం ముల్కీ నిబంధనను అనుసరించాలి
బి. తెలంగాణలో భూములు అమ్మడం, కొనడం రాష్ట్ర హోంమత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగాలి
సి. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి పర్యవేక్షణకు తెలంగాణ ప్రాంతీయ కమిటీని నియమించాలి
డి. మంత్రుల్లో 60 శాతం ఆంధ్రా నుంచి, 40 శాతం తెలంగాణ నుంచి ఉండాలి
1) ఎ, బి, సి 2) ఎ
3) బి 4) పైవన్నీ సరైనవే
62. సరైనది ఏది?
ఎ. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే నియామకాలన్నీ జనాభా ప్రాతిపదికనే జరుగుతాయి
బి. రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్ది, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నివారించే నిమిత్తం జీవో నెం. 610ను విడుదల చేసింది
సి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర కేబినెట్లో ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల వారికి మంత్రి పదవులు 50:50 నిష్పత్తిలో ఉండాలి
డి. 1953లో భారత ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను నియమించింది
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
63. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కింది శాఖల్లో రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి. అవి?
1) హోమ్, ఆర్థిక, రెవెన్యూ, విద్య, వాణిజ్యం, పరిశ్రమలు
2) హోమ్, రెవెన్యూ, పరిశ్రమలు, విద్య, ప్లానింగ్
3) హోమ్, ఆర్థిక, రెవెన్యూ, ప్లానింగ్, అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు
4) ఆర్థిక, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, విద్య, రూరల్ డెవలప్మెంట్
64. నిశ్చితం A: పులిచింతల ప్రాజెక్టు కోస్తాంధ్ర ప్రయోజనాల కోసం నిర్మించారు
కారణం R: దీనివల్ల నల్లగొండ జిల్లాలో విలువైన ఖనిజ సంపద ముంపునకు గురవుతుంది
1) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
65. కింది వాటిలో సరైనది?
ఎ. మొదటి విశాలాంధ్ర మహాసభ సమావేశం 1950 ఫిబ్రవరిలో టీ హయగ్రీవ చారి అధ్యక్షతన వరంగల్‌లో జరిగింది
బి. ఈ సభలో టంగుటూరి ప్రకాశం పంతులు ‘విశాలాంధ్ర నిర్మాణం యావదాంధ్రుల జన్మహక్కు’ అనే నినాదం ఇచ్చారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
66. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో ఆంధ్రప్రాంత నాయకుల మధ్య జరిగింది
బి. ఈ ఒడంబడికపై సంతకం పెట్టిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ నాయకులు కావడం విశేషం. ఇతర పార్టీ నాయకులకు అవకాశం లేకపోయింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
67. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉండే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు పుచ్చుకున్నట్లే కొంతకాలం తర్వాత రెండు ప్రాంతాలు మళ్లీ విడిపోవచ్చని, ‘తెలంగాణ అమాయక పిల్లను, ఆంధ్ర తుంటరి పిల్లగానితో పెళ్లి చేస్తున్నాం’ అని ప్రకటించినవారు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) నీలం సంజీవరెడ్డి
3) డా.బీఆర్. అంబేద్కర్
4) జవహర్లాల్ నెహ్రూ
68. ప్రాంతీయ కమిటీ పనితీరుకు సంబంధించి సరైనది?
ఎ. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉత్తర్వుల్లో పేర్కొన్న అధికారాల మేరకు తెలంగాణకు సంబంధించిన ఏ శాసనమైనా దాన్ని ప్రాంతీయ బిల్లు అంటారు. అయితే ద్రవ్య సంబంధమైతే శాసనానికి మినహాయింపు ఉంటుంది
బి. ఆంధ్రా ప్రాంతానికి వర్తించేటట్లు చేసే హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ బిల్లు ఏదైనా సరే ప్రాంతీయ కమిటీకి నివేదించాల్సిన అవసరం లేదు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
69. నిశ్చితం A: పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణకు కల్పించిన రక్షణలు పూర్తిగా ఉల్లంఘన జరిగిన ఫలితంగా 1969లో తెలంగాణ ఉద్యమం మహోజ్వలంగా జరిగింది
కారణం R: ఈ సందర్భంగా 1969, ఏప్రిల్ 11న నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం అష్టసూత్ర పథకాన్ని ప్రకటించింది
1) A, R రెండూ సత్యం,
A కు R సరైన వివరణ
2) A, R రెండూ సత్యం,
A కు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
70. నిశ్చితం A : 1920లో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), 1926లో హిమాయత్‌సాగర్ నిర్మాణాలు చేశారు
కారణం R: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిర్మాణం: 1908లో మూసీనది వరదలు సంభవించిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ అలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటం కోసం మైసూరు రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో నిర్మించారు
1) A, R రెండూ సత్యం, Aకు R సరైన వివరణ
2) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
71. 1955 సెప్టెంబర్ 30న సమర్పించిన SRC నివేదికకు సంబంధించి సరైనవి?
ఎ. 14 రాష్ర్టాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలి
బి. హైదరాబాద్ రాష్ర్టాన్ని భాష ఆధారంగా విభజించాలి
సి. మరాఠా ప్రాంతాలను బొంబాయిలో, కన్నడ ప్రాంతాలను మైసూరులో విలీనం చేయాలి
డి. ఆంధ్ర అసెంబ్లీ సాధారణ మెజారిటీతో విశాలాంధ్రపై నిర్ణయం తీసుకోవచ్చు
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
72. సరైనవి గుర్తించండి.
ఎ. శ్రీబాగ్ ఒప్పందం (1936 నవంబర్ 16): శ్రీబాగ్ అంటే మద్రాస్‌లో కాశీనాథుని నాగేశ్వరరావు (అమృతాంజన్ కంపెనీ వ్యవస్థాపకుడు) గృహం పేరు. ఇది తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంత నాయకులకు మధ్య జరిగిన ఒప్పందం
బి. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని కర్నూల్లో, హైకోర్టును గుంటూరులో ఏర్పరచాలని ఏకాభిప్రాయం కుదిరింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
73. సరైనవి గుర్తించండి.
ఎ. ఎస్.కె. థార్ కమిషన్ (1948 నవంబర్ 17)ను రాజ్యాంగ పరిషత్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ ప్రకటించారు
బి. ఎస్.కె. థార్ నేతృత్వంలోని పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్‌లతో కూడిన కమిటీ భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటును వ్యతిరేకించింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
74. కింది వాటిలో సరైనవి?
ఎ. 1948 డిసెంబర్లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణపై నెహ్రూ, పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన కమిటీ ఏర్పరిచింది
బి. గొల్లపూడి సీతారామశాస్త్రి నిరాహార దీక్ష: ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేపట్టిన మొదటి వ్యక్తి. 1951 ఆగస్టు 15న దీక్ష ప్రారంభించారు. 35 రోజుల అనంతరం ఆచార్య వినోబాభావే మధ్యవర్తిత్వం ద్వారా విరమించారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
75. నిశ్చితం A: బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంపై జి.రాజారాం అనే శాసనసభ్యుడు 1952 డిసెంబర్ 17న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు
కారణం R : ఈ అవిశ్వాస తీర్మానాన్ని సేల్స్ టాక్స్, సిర్పూర్ పరిశ్రమ, సిల్క్ పరిశ్రమల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వంటి కారణాల మూలంగా ప్రవేశపెట్టారు
1) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సత్యం, A కు R సరైన వివరణ కాదు
3) A సత్యం, R అసత్యం
4) A అసత్యం, R సత్యం
76. 1955, సెప్టెంబర్ 30న సమర్పించిన SRC నివేదికకు సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. 14 రాష్ర్టాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలి
బి. హైదరాబాద్ రాష్ర్టాన్ని భాష ఆధారంగా విభజించాలి
సి. మరాఠా ప్రాంతాలను బొంబాయిలో, కన్నడ ప్రాంతాలను మైసూరులో విలీనం చేయాలి
డి. ఆంధ్ర అసెంబ్లీ సాధారణ మెజారిటీతో విశాలాంధ్రపై నిర్ణయం తీసుకోవచ్చు.
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
77. కిందివాటిలో అష్టసూత్ర పథకంలో లేని అంశాన్ని గుర్తించండి.
ఎ. రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన ఒక ప్లానింగ్ కమిటీ ఏర్పాటు
బి. మిగులు నిధులు లెక్కించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ
సి. తెలంగాణ ప్రాంతీయ మండలికి సంపూర్ణ అధికారాలు కల్పించడం
డి. తెలంగాణ మిగులు నిధులు వెంటనే తెలంగాణపై ఖర్చు చేయడం
1) ఎ, బి, సి 2) బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
78. ఇందిరాగాంధీ ప్రకటించిన పంచసూత్ర ఫార్ములా ప్రకారం సరైనవి ఏవి?
ఎ. ముల్కీ నియమాలు తహసీల్దార్ స్థాయి ఉద్యోగుల వరకు వర్తిస్తాయి
బి. జంటనగరాల పోలీసు నియామకాల్లో కేవలం తెలంగాణ వారికే అవకాశం
సి. పదోన్నతుల్లో స్థానిక నియమాలు అమలు చేయాలి
డి. ఉన్నత విద్యాసంస్థల్లో అదనపు సీట్లలో అందరికీ అవకాశం
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
జవాబులు
57. 1 58. 1 59. 3 60. 4
61. 3 62. 1 63. 3 64. 1
65. 3 66. 2 67. 4 68. 3
69. 1 70. 1 71. 4 72. 2
73. 2 74. 3 75. 1
76.4 77. 4 78. 2
బి.పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ, ఏమర్స్ విల్
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు