Indian History | బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు?
1. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) స్థానిక సంస్థల ప్రధాన ఉద్దేశం ప్రజాస్వామ్య వికేంద్రీకరణ లేదా భాగస్వామ్య ప్రజాస్వామ్యం
2) స్థానిక సంస్థలను చార్లెస్ మెట్కాఫ్ లిటిల్ రిపబ్లిక్స్ అని అభివర్ణించారు
3) భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు
4) స్థానిక స్వపరిపాలనకు పితామహుడిగా మెట్కాఫ్ను పేర్కొంటారు
2. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) చోళులు స్థానిక స్వపరిపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు
2) 1687లో మద్రాస్‌లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు
3) 1861లో ఆంధ్రప్రదేశ్‌లో భీముని పట్నం లో మొదటి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు
4) 10 గ్రామాల అధిపతిని అష్టగ్రామిణి అని అంటారు
3. స్థానిక సంస్థలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) 1870లో లార్డ్ మేయో తీర్మానం స్థానిక సంస్థల ఏర్పాటుకు అతి ముఖ్యమైనది
2) 1882లో లార్డ్ రిప్పన్ జారీ చేసిన తీర్మానాన్ని స్థానిక సంస్థలకు మాగ్నకార్టాగా అభివర్ణించారు
3) లార్డ్ రిప్పన్‌ను స్థానిక సంస్థల పితామహుడు అని అంటారు
4) 1885 మద్రాస్ రాష్ట్ర స్థానిక సంస్థల బోర్డును ఏర్పాటు చేశారు
4. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 40వ అధికరణంలో స్థానిక స్వపరిపాలన గురించి పేర్కొన్నారు
2) గుర్గావ్ ప్రయోగం చేసిన సంవత్సరం 1921
3) శ్రీనికేతన్ ప్రయోగం చేసిన సంవత్సరం 1920
4) మార్తాండం ప్రయోగం చేసిన సంవత్సరం 1921
5. కింది ప్రయోగాల్లో సరికానిది ఏది?
1) శ్రీ నికేతన్ ప్రయోగాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1920లో కలకత్తాలోని శాంతి నికేతన్‌లో ప్రారంభించారు
2) మార్తాండం ప్రయోగాన్ని అమెరికాకు చెందిన స్పెన్సర్ హాచ్ ఏర్పాటు చేశారు
3) బరోడా ప్రయోగాన్ని జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించారు
4) సేవాగ్రామ్ ప్రయోగాన్ని జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించారు
6. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు ఫిర్కా ప్రయోగాన్ని ప్రారంభించారు
2) ఇటోవా ప్రయోగాన్ని 1948లో ఆల్బర్ట్ మేయర్ ప్రారంభించారు
3) నిలోకెరి ప్రయోగాన్ని 1938లో హర్యానాలో ఏర్పాటు చేశారు
4) మద్రాస్ ప్రభుత్వ చట్టం 1950లో చేశారు
7. బల్వంతరాయ్ మెహతాకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) బల్వంతరాయ్ మెహతా కమిటీని 1957 జనవరిలో ఏర్పాటు చేశారు
2) 1952లో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకం, 1953లో ప్రారంభించిన సమాజ విస్తరణ పథకాలను అధ్యయనం చేయడానికి ప్రవేశ పెట్టారు
3) బల్వంతరాయ్ మెహతకమిటీ తన నివేదికను 1957 నవంబర్ 24న సమర్పించింది
4) ఈ నివేదికను 1960లో ఆమోదించారు.
8. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన కమిటీ?
1) బల్వంతరాయ్ మెహతా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) తుంగన్ కమిటీ
4) దంత్వాలా కమిటీ
9. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) మొదటిసారి రాజస్థాన్ రాష్ట్రంలో నాగోర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు
2) 1959 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించింది
3) రెండంచెల పంచాయతీరాజ్ విధానాన్ని తమిళనాడు ఏర్పాటు చేసింది
4) పశ్చిమ బెంగాల్ మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది
10. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) పశ్చిమబెంగాల్ నాలుగంచెల పంచాయతీ విధానాన్ని ఏర్పాటు చేసింది
2) భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది
3) రాజస్థాన్‌లో పంచాయతీరాజ్‌కు ప్రత్యేక సర్వీసు ఉన్నది
4) బల్వంతరాయ్ మెహతా రెండంచెల విధానాన్ని సూచించారు
11. బల్వంతరాయ్ మెహతా కమిటీకి సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి.
1) దీన్ని 1977 డిసెంబర్ 12న జనతా ప్రభుత్వం నియమించింది
2) అశోక్‌మెహతా కమిటీని 1977 డిసెంబర్ 12న జనతా ప్రభుత్వం నియమించింది
3) అశోక్‌మెహతా కమిటీ 1978లో 132 సిఫారసులతో నివేదికను సమర్పించింది
4) అశోక్‌మెహతా కమిటీ 15,000-20,000 జనాభాకు ఒక మండలాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది
12. అశోక్ మెహతా కమిటీకి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) దీన్ని 1977 డిసెంబర్ 12న జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది
2) ఇది రెండంచెల పంచాయతీరాజ్ విధానాన్ని/ వ్యవస్థను సూచించింది
3) ఇది 1978లో 132 సిఫారసుల నివేదికను సమర్పించింది
4) ఈ నివేదికను మొదట అమలు చేసిన రాష్ట్రం రాజస్థాన్
13. అశోక్ మెహతా కమిటీకి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి.
1) అశోక్‌మెహతా కమిటీ 15,000-20,000 జనాభాకు ఒక మండలాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది
2) ఇది పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలని చెప్పింది
3) ఇది గ్రామ పంచాయతీలను రద్దు చేయమనలేదు
4) పంచాయతీ రాజ్ వ్యవస్థకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలి అన్నారు
14. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) దంత్వాలా కమిటీని బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణపై ఒక నివేదికను సమర్పించడానికి 1978లో నియమించారు
2) దంత్వాలా కమిటీ జిల్లాస్థాయిలో కలెక్టర్ పాత్ర చాలా ముఖ్యమైనది
3) హనుమంతరావ్ కమిటీని 1984లో నియమించారు
4) జి.వి.కె. కమిటీని 1980లో నియమించారు
15. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) 1985లో ప్లానింగ్ కమిషన్ గ్రామీణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన ఏర్పాట్లపై అధ్యయనం చేయడానికి దంత్వాలా కమిటీని ఏర్పాటు చేశారు.
2) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీని 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నియమించింది
3) తుంగన్ కమిటీని 1987లో ఎల్.ఎమ్. సింఘ్వి కమిటీపై రివ్యూ కమిటీగా నియమించారు
4) దంత్వాలా కమిటీ 1980లో నియమించారు
16. సమాజ అభివృద్ధి పథకానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) ఈపథకాన్ని వి.టి. కృష్ణమాచారి సలహామేరకు 1952 అక్టోబర్ 2న ప్రవేశపెట్టారు
2) ఈ పథకాన్ని ఎంపిక చేసిన 50 జిల్లాల్లో 58 సమితుల్లో ప్రవేశ పెట్టారు
3) ఈ పథకానికి సహకారాన్ని అందించింది సురేంద్ర కుమార్ డే(ఎస్.కె.డే)
4) గ్రామీణాభివృద్ధి లక్ష్యం అయితే పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక సాధనం అన్నది ఎస్.ఎ.డే
17. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) సమాజ అభివృద్ధి పథకానికి అనుగుణంగా జాతీయ వికాస పథకాన్ని ప్రవేశ పెట్టారు
2) జాతీయ వికాస పథకం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచడం
3) ఈ పథకం ‘నిశ్శబ్ద విప్లవం’గా పనిచేసిందని అన్నవారు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ
4) ఈ పథక రూపకర్త, అడ్మినిస్ట్రేటర్ జవహర్లాల్ నెహ్రూ
18. బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన సిఫారసుల్లో లేనిది గుర్తించండి?
1) జిల్లా పరిషత్‌కు జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు
2) అన్ని అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా పరిషత్‌లకు బదలాయించాలి
3) ఎన్నికలు పార్టీ ప్రమేయం లేకుండా జరగాలి
4) వార్షిక బడ్జెట్‌ను జిల్లా పరిషత్ ఆమోదించాలి
19. బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన ముఖ్య సిఫారసుల్లో లేని దాన్ని గుర్తించండి?
1) గ్రామ స్థాయిలో ప్రత్యక్షంగా, సమితి, జిల్లా పరిషత్‌లకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలి
2) పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలి
3) ప్రణాళిక, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను స్థానిక సంస్థలకు బదలాయించాలి
4) పంచాయతీ సమితిని స్థానిక పాలనకు ప్రాథమిక యూనిట్ సమితిని తీసుకోవాలి
20. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఆంధ్రప్రదేశ్ విలేజ్ పంచాయతీ చట్టం 1956
2) రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ తమిళనాడు
3) మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ- రాజస్థాన్
4) నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ- పశ్చిమబెంగాల్
21. అశోక్ మెహతా కమిటీ సూచించిన ముఖ్య సిఫారసుల్లో లేని దాన్ని గుర్తించండి.
1) 15,000-20,000 జనాభా గల గ్రామాలను మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలి
2) జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని అధికార వికేంద్రీకరణ చేయాలి
3)ప్రణాళికా, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను స్థానిక సంస్థలకు బదలాయించాలి
4) చిన్న న్యాయపంచాయతీలను ఏర్పాటు చేయాలి
22. దంత్వాలా కమిటీకి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) గ్రామ పంచాయతీలకు ఎక్కువ ఆర్థిక వనరులు కల్పించాలి
2) జిల్లాస్థాయిలో ప్రణాళికా వికేంద్రీకరణ జరగాలి
3) జిల్లాస్థాయిలో ప్రణాళికా వికేంద్రీకరణ జిల్లా కలెక్టర్ ప్రధానపాత్ర పోషించాలి
4) గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి
23. 1987లో వచ్చిన తుంగన్ కమిటీకి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ సిఫారసు మేరకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989లో ప్రవేశ పెట్టింది
2) బిల్లును లోక్‌సభ ఆమోదించిన రాజ్యసభ తిరస్కరించింది
3) 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం రద్దు కావడంతో ఈ బిల్లు ఆగింది.
4) తుంగన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు
24. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) 1992లో పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
2) ఈ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్ 24 తేదీన అమల్లోకి వచ్చింది
3) 64, 65 రాజ్యాంగ సవరణలను పి.వి. నరసింహారావు అమలు చేశారు
4) 64, 65 రాజ్యాంగ సవరణలు అమల్లోనికి రాలేదు
25. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది
2) 9వ భాగంలో 243(A)-243(O) వరకు పంచాయతీల నిర్మాణం గురించి పేర్కొన్నారు
3) ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు
4) జమ్ము-కశ్మీర్ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది
26. కింది నిబంధనల్లో సరికానిది గుర్తించండి?
1) 243 గ్రామ పంచాయతీల నిర్వచనం
2) 243(A) గ్రామ సభల ఏర్పాటు
3) 243(B) గ్రామ సభల రద్దు
4) 243 (D) పంచాయతీల రిజర్వేషన్లు
27. కింది నిబంధనల్లో సరికాని వాక్యం ఏది?
1) 243(E) గ్రామ పంచాయతీల పదవీ కాలం
2) 243(F) గ్రామ పంచాయతీ సభ్యుల అర్హతలు
3) 243(G) గ్రామ పంచాయతీ విధులు
4) 243 (H) పంచాయతీల ఆదాయ వనరులు
28. కింది నిబంధనల్లో సరికాని వాక్యం ఏది?
1) 243 (I) రాష్ట్ర ఆర్థిక సంఘం
2) 243(J) రాష్ట్ర ఎన్నికల సంఘం
3) 243(K) రాష్ట్ర ఎన్నికల సంఘం
4) 243 (L) కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రామీణ పాలన వర్తింపు
29. కింది నిబంధనల్లో సరికాని వాక్యం?
1) 243 (M) మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ర్టాలకు గ్రామీణ పాలన వర్తించదు.
2) 243 (N) పాత చట్టాల వర్తింపు
3) 243 (O) ఎన్నికల అంశాలకు న్యాయ స్థానాల నుంచి మినహాయింపు
4) 1/2 వ వంతు మహిళలకు రిజర్వేషన్లు వర్తించాలి
30. కింది వాటిలో సరికాని వాక్యాన్ని రాయండి.
1) 300 జనాభా వరకు 5 వార్డులు
2) 300-500 జనాభా వరకు 10 వార్డులు
3) 500-1500 జనాభా వరకు 9 వార్డులు
4) 1300-3000 జనాభా వరకు 11 వార్డులు
31. కింది వార్డులకు సంబంధించి సరికాని వార్డులను గుర్తించండి.
1) 3000-5000 జనాభా వరకు 13 వార్డులు
2) 5000-10,000 జనాభా వరకు 15 వార్డులు
3) 10,000-15,000 జనాభా వరకు 17 వార్డులు
4) 15,000 పై జనాభాకు 20 వార్డులు
సమాధానాలు
1-4 2-4 3-4 4-2
5-3 6-3 7-4 8-1
9-4 10-4 11-1 12-4
13-3 14-4 15-4 16-2
17-4 18-2 19-2 20-1
21-3 22-1 23-4 24-3
25-4 26-3 27-2 28-2
29-4 30-2 31-4
ఆంజి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు