మొదటగా చెరువులను తవ్వించిన కాకతీయ రాజు?
1. కిందివాటిలో వరంగల్‌కు గల మరోపేరు ఏది?
ఎ) ఏకశిలానగరం బి) ఓరుగల్లు
సి) సుల్తాన్పూర్ డి) పైవన్నీ
2. విద్యాభూషణుడు అనే బిరుదుగల రాజు
ఎ) రుద్రదేవుడు బి) రెండోప్రోలరాజు
సి) గణపతివదేవుడు డి) మహాదేవుడు
3. బుద్ధదేవుని ఆలయం హనుమకొండలో ఎక్కడ గలదు?
ఎ) వేయిస్తంభాల దేవాలయం ఆవరణలో
బి) ద్రాక్షారామం మండపంలో
సి) ఓరుగల్లు కోటలో
డి) బౌద్ధదేవాలయంలో
4. కాకతి అనే పదానికి అర్థం?
ఎ) గుమ్మడి లేదా కూష్మాండం
బి) వరాహం
సి) వృక్షం డి) నంది
5. కాకతీయ శిల్పకళలో ప్రధాన ఆకర్షణ
ఎ) తోరణస్తంభాలు బి) శిల్పాలు
సి) వాస్తు డి) ధ్వనిస్తంభాలు
6. గణపతిదేవుని కాలంలో నిర్మించిన దేవాలయాలు ఏవి?
ఎ) పిల్లలమర్రి
బి) పాలంపేట, కొండపల్లి
సి) నాగులపాడు డి) పైవన్నీ
7. చేబ్రోలు శాసనం ప్రకారం కాకతీయులు ఏ వంశానికి చెందినవారు?
ఎ) సూర్యవంశం బి) చంద్రవంశం
సి) కాకతీవంశం డి) ఏదీకాదు
8. రామప్ప చెరువు తవ్వించినది?
ఎ) గణపతిదేవుడు బి) రేచర్ల రుద్రుడు
సి) రుద్రదేవుడు డి) ప్రతాపరుద్రుడు
9. కాకతీయుల కాలంనాటి వస్ర్తాలను వాటి రకాలను పేర్కొన్న గ్రంథం?
ఎ) పండితారాథ్యచరిత్ర
బి) పురుషార్థసారము
సి) సకలనీతి సమ్మతము
డి) ఏదీకాదు
10. కింది వాటిలో సరిగా జతపరిచినది ఏది?
ఎ) నీతిసార ముక్తావళి-బద్దెన
బి) పురుషార్థ సారం-శివదేవయ్య
సి) సకలనీతి సమ్మతం-మడికి సింగన
డి) పైవన్నీ
11. కాకతీయుల కాలంలో చీని, మహాచీని వస్ర్తాలు ఎక్కడ నుంచి దిగుమతి అయ్యేవి?
ఎ) పర్షియా బి) గ్రీకు
సి) చైనా డి) సింహళం
12. వర్తక సుంకాలను ఇష్టం వచ్చినట్లుగా పెంచరాదని, విదేశీ వర్తకుల పట్ల ఉదారంగా ఉండాలని తెలుపుతున్న గ్రంథం ఏది?
ఎ) రుద్రదేవుని నీతిసారం
బి) గణపతిదేవుని మోటుపల్లి
సి) బద్దెన నీతిసార ముక్తావళి
డి) పండితారాధ్య చరిత్ర
13. కిందివాటిలో కాకతీయుల నాణేలు ఏవి?
ఎ) గద్వాణం, నిష్కం, మాడ
బి) రూక, అడ్డుగ, పాదిక, వాన
సి) చిన్నము డి) పైవన్నీ
14. మోటుపల్లి నుంచి ఎగుమతి అయ్యే వస్ర్తాలు సాలెపురుగు దారం కంటే మిక్కిలి సన్ననైన నూలుతో చేసినవని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు?
ఎ) న్యూనిజ్ బి) మార్కోపోలో
సి) హుయాన్‌త్సాంగ్ డి) పై అందరూ
15. మోటుపల్లి దేశీయక్కొండ పట్టణం అని ఏ శాసనంలో పేర్కొనబడింది?
ఎ) మోటుపల్లి అభయశాసనం
బి) విప్పర్ల శాసనం
సి) బెండపూడి శాసనం
డి) ఓరుగల్లు శాసనం
16. కాకతీయుల కాలంనాటి దేవాలయ తోరణాల్లో, విమానాల్లో ఏ రాజుల కాలం నాటి ప్రభావం కనిపిస్తుంది?
ఎ) చాళుక్య రీతులు
బి) శాతవాహన రీతులు
సి) బౌద్ధరీతులు డి) చైనీయులు
17. శివ కవులు తెలుగు కవిత్వంలో కాకతీయుల కాలంలో ప్రవేశ పెట్టిన కొత్తవరవడి?
ఎ) తెలుగులో పూర్తిస్థాయి రచనలు
బి) ద్విపదలో తెలుగు కవిత్వ రచన
సి) శిల్పకళల గురించి అద్భుత వర్ణనలు
డి) పైవన్నీ
18. క్రీడాభిరామంలో ఉన్న మాచలదేవి ఎవరు?
ఎ) ఒక దేవత
బి) ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తె
సి) ఒక సైనిక తిరుగుబాటుదారు
డి) నర్తకి
19. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమనేవారు?
ఎ) సమయములు బి) మహాజనులు
సి) నాని మున్నూరు డి) పైవేవీకాదు
20. కాకతీయుల కాలంలో గల దురాచారం?
ఎ) బాల్యవివాహం
బి) వరకట్నం, కన్యాశుల్కం
సి) నిర్బంధ వైధవ్యం, మద్యపానం
డి) పైవన్నీ
21. మైలారభటుల సాహసకృత్యాలను వర్ణించిన గ్రంథం?
ఎ) క్రీడాభిరామం
బి) పండితారాథ్య చరిత్ర
సి) సంగీత రత్నాకరం
డి) నృత్యారత్నాకరం
22. తిక్కన తన భారతాన్ని ఎవరికి అంకితం చేశాడు?
ఎ) హరిహరనాథుడు
బి) గణపతిదేవుడు
సి) రుద్రమదేవి
డి) మొదటి ప్రతాపరుద్రుడు
23. కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులు కిందివారిలో ఎవరికి ఉన్నాయి?
ఎ) నన్నయ బి) తిక్కన
సి) ఎర్రన డి) రుద్రదేవుడు
24. దశకుమార చరిత్రను కేతన ఎవరికి అంకితం ఇచ్చాడు?
ఎ) రుద్రదేవుడు బి) తిక్కన
సి) దండి డి) గణపతిదేవుడు
25. అభినవ దండి అనే బిరుదు గలవారు?
ఎ) తిక్కన బి) గోన బుద్ధారెడ్డి
సి) నన్నయ డి) కేతన
26. దేశ్య శబ్దాలకు కావ్య గౌరవాన్ని కల్పించి కావ్యభాషను విస్తృతం చేసిన మహానీయుడు ఎవరు?
ఎ) నన్నయ బి) తిక్కన
సి) దండి డి) కేతన
27. రామప్ప దేవాలయం ఎవరి కాలంలో నిర్మించారు?
ఎ) గణపతిదేవుడు బి) రుద్రమదేవి
సి) ప్రతాపరుద్రుడు డి) రుద్రదేవుడు
28. ప్రేక్షకులు ఏ వైపు నుంచి చూసినా ప్రేక్షకులవైపే చూస్తున్నట్లుగా కనిపించే నంది ఎక్కడ ఉంది?
ఎ) రామప్ప దేవాలయం
బి) వేయిస్తంభాల గుడి
సి) ఓరుగల్లు కోట డి) పానగల్లు
29. కాకతీయ ఆలయాలు త్రికూట పద్ధతిలో ఎక్కడ కనిపిస్తాయి?
ఎ) పాలంపేట బి) పిల్లలమర్రి
సి) హన్మకొండ డి) పైవన్నీ
30. మోటుపల్లిలో ఏ వస్తువులు వ్యాపారం జరిగేది?
ఎ) బంగారం, ఏనుగు దంతం, రాగి
బి) ఏనుగులు, గుర్రాలు
సి) పాదరసం డి) పైవన్నీ
31. కుట్రపువారు అంటే
ఎ) రాజులపై కుట్రలు చేసేవారు
బి) రాజు అంతరంగిక సైనికులు
సి) సైనిక దుస్తులు కుట్టేవారు
డి) యుద్ధవిద్యలు నేర్పేవారు
32. కిందివారిలో రెండో బేతరాజు తవ్వించిన చెరువు ఏది?
ఎ) సెట్టి సముద్రం బి) కెరె సముద్రం
సి) కేసరి సముద్రం డి) పైవన్నీ
33. లెంకలు అంటే?
ఎ) శత్రు రాజులు
బి) రాజులకు ఇతర నాయకులకు అంగరక్షకులు
సి) నేత పనివారు
డి) విదేశీ యాత్రికులు
34. ప్రాడ్వివాకులు అంటే?
ఎ) వాద ప్రతివాదులు
బి) ప్రత్యేక న్యాయాధికారులు
సి) ఒక రాజవంశం
డి) కోటలు నిర్మించేవారు
35. పుల్లరి అంటే?
ఎ) గడ్డిపై వేసేపన్ను
బి) గొర్రెలపై వేసేపన్ను
సి) ఉప్పుపై పన్ను
డి) పరిశ్రమలపై పన్ను
36. వేయిస్తంభాల గుడి నిర్మాణానికి
సంబంధించిన అంశం?
ఎ) ఏకశిల
బి) త్రికూఠ శైలి నిర్మాణం
సి) నక్షత్ర ఆకారం
డి) నల్లని రాతి పనితనం
37. కాకతీయుల కాలంనాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది?
ఎ) క్రీడాభిరామం
బి) సకల నీతి సమ్మతం
సి) భోగినీ దండకం డి) సుమతీ శతకం
38. రుద్రమదేవి ‘మరణ శాసనం’ ఏది?
ఎ) చందుపట్ల శాసనం
బి) కందుకూరు శాసనం
సి) మోటుపల్లి శాసనం డి) పైవన్నీ
39. కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు, ప్రతాపరుద్రుడి కాలంలోని నర్తకి-మాచల్దేవి గురించి వివరాలు అందించే గ్రంథం ఏది?
ఎ) ప్రతాపరుద్ర యశోభూషణం
బి) ప్రేమాభిరామం
సి) ప్రియాభిరామం
డి) క్రీడాభిరామం
40. ఓరుగల్లు కోట నిర్మాణానికి పునాదులు వేసిన వారు?
ఎ) మొదటి ప్రోలరాజు
బి) రెండో ప్రోలరాజు
సి) రుద్రదేవుడు డి) గణపతిదేవుడు
41. నతవాడి దుర్గరాజు సోదరి ముప్పమాంబ ఎవరి భార్య?
ఎ) మొదటి ప్రోలరాజు
బి) గణపతిదేవుడు
సి) మొదటి బేతరాజు
డి) రెండో ప్రోలరాజు
42. తొలి కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు?
ఎ) శాతవాహనులు
బి) రాష్ట్రకూటులు
సి) బాదామి చాళుక్యులు
డి) ఇక్షాకులు
43. మలి కాకతీయులు ఎవరి సామంతులు?
ఎ) రాష్ట్రకూటులు
బి) కళ్యాణి చాళుక్యులు
సి) బాదామి చాళుక్యులు
డి) కందూరి చాళుక్యులు
44. రుద్రదేవుడు ఏ సంవత్సరం నాటికి తీరాంధ్రను జయించాడు?
ఎ) క్రీ.శ.1186 బి) క్రీ.శ.1180
సి) క్రీ.శ.1176 డి) క్రీ.శ.1190
45. మైలాంబ వేయించిన బయ్యారం శాసన రచయిత ఎవరు?
ఎ) ఈశ్వర భట్టోపాధ్యాయ
బి) బాలభారతి
సి) రామదేవుడు డి) మయూరసూరి
46. రుద్రదేవుడు యుద్ధాల్లో తనకు సహాయం చేసిన ఏ రాజును ఆమనగల్లు సామంతునిగా నియమించాడు?
ఎ) రేచర్ల నామిరెడ్డి బి) రేచర్ల చెవిరెడ్డి
సి) రేచర్ల లోకిరెడ్డి డి) రేచర్ల బేతిరెడ్డి
47. కాకతీయుల కాలంలో ప్రధానంగా వేటిని ఎగుమతి చేసేవారు?
ఎ) సుగంధ ద్రవ్యాలు బి) వస్ర్తాలు
సి) అలంకార వస్తువులు డి) గుర్రాలు
48. కాకతీయులు మొదట ఏ ప్రాంతాన్ని పాలించారు?
ఎ) కురవి బి) ఓరుగల్లు
సి) ముదిగొండ డి) హనుమకొండ
49. తూర్పు చాళుక్య రాజైన దానర్ణవుడికి సహాయం చేసిన కాకతీయ సేనాని?
ఎ) బేతరాజు బి) ప్రోలరాజు
సి) కాకర్త్యగుండన డి) రుద్ర దేవుడు
50. పల్నాటి యుద్ధంలో జోక్యం చేసుకున్న కాకతీయ పాలకుడెవరు?
ఎ) రుద్రదేవుడు బి) గణపతిదేవుడు
సి) మహాదేవుడు డి) ప్రతాపరుద్రుడు
51. చలమర్తి గండ అనే బిరుదు ఎవరిది?
ఎ) కారక్త్య గువడన బి) దుర్గరాజు
సి) మొదటి బేతరాజు
డి) మొదటి ప్రోలరాజు
52. కాకతీయుల మొదటి రాజధాని ఏది?
ఎ) హనుమకొండ బి) ఓరుగల్లు
సి) కురవి డి) కోటిలింగాల
53. కాకతీయుల పాలనా కాలం?
ఎ) క్రీ.శ. 950 నుంచి 1300 వరకు
బి) క్రీ.శ.1000 నుంచి 1368 వరకు
సి) క్రీ.శ. 1000 నుంచి 1323 వరకు
డి) క్రీ.శ. 950 నుంచి 1342 వరకు
54. రుద్రమ దేవి మూడో కుమార్తె గురించి ప్రస్తావించిన శాసనం?
ఎ) అలపాడు తామ్ర శాసనం
బి) బెక్కల్లు శాసనం
సి) చందుపట్ల శాసనం
డి) పానగల్లు శాసనం
55. హన్మకొండపై పూర్తి వంశపారంపర్య హక్కులను మొదటి ప్రోలరాజు ఎవరి ద్వారా పొందాడు?
ఎ) చాళుక్య దానర్ణవుడు
బి) కాలచూరి బిజ్జలుడు
సి) చాళుక్య రెండో తైలపుడు
డి) చాళుక్య మొదటి సోమేశ్వరుడు
56. కిందివారిలో కాకతీయ రాజ్య పునఃస్థాపనకు సహాయపడిన వారెవరు?
ఎ) రుద్రమదేవి బి) మైలాంబ
సి) కామసాని డి) అనితల్లి
57. కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంలో ఉండేది?
ఎ) శైవం బి) వైష్ణవం
సి) బౌద్ధం డి) జైనం
58. మొదటగా చెరువులను తవ్వించిన కాకతీయ రాజు?
ఎ) మొదటి బేతరాజు
బి) మొదటి ప్రోలరాజు
సి) రుద్రదేవుడు డి) రుద్రమదేవి
59. కరీంనగర్ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో ఏ పేరుతో పిలిచేవారు?
ఎ) ముల్కినాడు బి) సబ్బినాడు
సి) రేనాడు డి) పాకనాడు
60. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలనను పర్యవేక్షించే వారిని ఏమని పిలిచేవారు?
ఎ) ఆయగారు బి) ఇనామ్దార్
సి) గ్రామణి డి) గోమేయక
61. కాకతీయుల శిల్పకళకు సంబంధించి ప్రత్యేక మైన నిర్మాణాలేవి?
ఎ) కోటగుళ్లు
బి) తోరణ స్తంభాలు
సి) త్రికూటాలయాలు
డి) ఆలయప్రాకారాలు
62. పాకాల చెరువును తవ్వించిన వారెవరు?
ఎ) బయ్యన నాయకుడు
బి) రేచర్ల రుద్రుడు
సి) మల్యాల గౌండప్ప
డి) జగదల ముమ్మడి నాయకుడు
63. కాకతీయుల కాలంలో గోల్కొండను ఏమని పిలిచేవారు?
ఎ) మంగళవరం బి) రుద్రారం
సి) చాలప బండ
డి) గొల్ల (గోవుల) కొండ
సమాధానాలు
1-డి 2-ఎ 3-ఎ 4-ఎ
5-ఎ 6-డి 7-ఎ 8-బి
9-ఎ 10-డి 11-సి 12-ఎ
13-డి 14-బి 15-ఎ 16-ఎ
17-బి 18-బి 19-ఎ 20-డి
21-ఎ 22-ఎ 23-బి 24-బి
25-డి 26-బి 27-ఎ 28-ఎ
29-డి 30-డి 31-సి 32-డి
33-బి 34-బి 35-ఎ 36-ఎ
37-బి 38-ఎ 39-డి 40-బి
41-డి 42-బి 43-బి 44-ఎ
45-సి 46-డి 47-బి 48-ఎ
49-సి 50-ఎ 51-బి 52-ఎ
53-సి 54-ఎ 55-డి 56-సి
57-ఎ 58-బి 59-బి 60-ఎ
61-బి 62-డి 63-డి
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు