పంచాయతీల ఏర్పాటును నిర్దేశిస్తున్న ఆర్టికల్ ఏది?
- పాలిటీ
1. సిగరెట్లు ప్రజల ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావం వల్ల బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలని సుప్రీంకోర్టు ఎప్పుడు కీలకమైన తీర్పునిచ్చింది?
1) 2 నవంబర్ 2001
2) 1 నవంబర్ 2002
3) 3 అక్టోబర్ 2001
4) 1 అక్టోబర్ 2002
2. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ బిల్లు-2002లోని అంశం కానిది ఏది?
1) బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం
2) ప్రభుత్వ కార్యాలయాల్లో ధూమపానం నిషేధం
3) ప్రభుత్వ రంగ సంస్థల్లో ధూమపానం అనుమతించడం
4) ప్రభుత్వ వాహనాల్లో ధూమపానం నిషేధం
3. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ బిల్లుకు ప్రతిపక్ష శాసనసభ్యులు చేసిన సూచనలు గుర్తించండి.
1) విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు దూరంలో సిగరెట్ల అమ్మకం నిషేధించాలి
2) 18 సంవత్సరాల లోపు వారికి సిగరెట్లు అమ్మడాన్ని నిషేధించాలి
3) సిగరెట్ల అమ్మకాల ప్రకటనపై నిషేధం విధించాలి 4) పైవన్నీ
4. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ చట్టం-2002 ప్రకారం ‘పొగ తాగకూడదు’అనే బోర్డులను ఉంచడానికి సంబంధించిన సెక్షన్లలో లేనిది ఏది?
1) సెక్షన్ 5 2) సెక్షన్ 6
3) సెక్షన్ 7 4) సెక్షన్ 10
5. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ చట్టం-2002 ప్రకారం పొగతాగకూడదు అనే బోర్డులను ఉంచడానికి సంబంధించిన సెక్షన్లను ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా ఎంత?
1) మొదటి తప్పునకు రూ.100, రెండో తప్పునకు రూ.200 నుంచి రూ.500
2) మొదటి తప్పునకు రూ.50, రెండో తప్పునకు రూ.100 నుంచి రూ.200
3) మొదటి తప్పునకు రూ. 100, రెండో తప్పునకు రూ.300 నుంచి రూ.500
4) మొదటి తప్పునకు రూ.100, రెండో తపునకు రూ.200 నుంచి రూ.1000
6. రాజ్యాంగం ప్రకారం శాసనసభ అంటే?
1) గవర్నర్ 2) విధానసభ
3) విధాన పరిషత్ 4) పైవన్నీ సరైనవే
7. విధాన సభకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) దీని పదవీకాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు
2) దీని పదవీకాలం అనిశ్చితం
3) దీన్ని శాసనసభ అనికూడా అంటారు
4) దీన్ని దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ అంటారు
8. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధానసభ సభ్యులకు సంబంధించి సరికానిది ఏది?
1) శాసనసభ్యుల మొత్తం సంఖ్య-119
2) ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసినవి-12
3) ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేసినవి- 19
4) ముస్లిం వర్గాలకు రిజర్వ్ చేసినవి-6
9. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) రాజ్యాంగం ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు సమావేశం కావాలి
2) రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలలు మించరాదు
3) సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం సంవత్సరానికి మూడు సార్లు జరుగుతుంది
4) సమావేశాల సంఖ్యను గవర్నర్ నిర్ణయిస్తారు
10. ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని పార్లమెంటు ఎంతకాలం పొడిగించవచ్చు?
1) 3 నెలలు 2) 6 నెలలు
3) 1 సంవత్సరం 4) 9 నెలలు
11. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర విధానసభలో కనీస, గరిష్ఠ సభ్యుల సంఖ్యను గుర్తించండి.
1) కనీస సభ్యులు-60, గరిష్ఠ సభ్యులు-500
2) కనీస సభ్యులు-40, గరిష్ఠ సభ్యులు-500
3) కనీస సభ్యులు-30, గరిష్ఠ సభ్యులు-403
4) కనీస సభ్యులు-50, గరిష్ఠ సభ్యులు-500
12. ప్రస్తుతం మనదేశంలోగల శాసన సభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు?
1) 1961 2) 1971
3) 1991 4) 2001
13. ప్రస్తుతం మనదేశంలోగల శాసనసభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్పు చేయరాదని 84వ రాజ్యాంగ సవరణ చట్టం-2001 ద్వారా వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించింది?
1) 2026 2) 2021
3) 2020 4) 2019
14. తెలంగాణలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో సుమారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు?
1) 1,10,000 2) 1,30,000
3) 1,50,000 4) 1,70,000
15. రాష్ట్ర శాసన సభకు పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) కనీస వయస్సు 18 సంవత్సరాలు
2) కనీస వయస్సు 25 సంవత్సరాలు
3) భారత పౌరులై ఉండాలి
4) కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో లాభదాయక పదవిలో ఉండరాదు
16. వివిధ రాజకీయ పార్టీలు తాము ఎన్నికైతే ఏఏ కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతారో ప్రజలకు ఇచ్చే వాగ్ధానాలను కింది ఏ విధంగా తెలియజేస్తారు?
1) ఎలక్షన్ ప్రాసెస్
2) ఎలక్షన్ మేనిఫెస్టో
3) ఎలక్షన్ ప్రామిసెస్
4) ఎలక్షన్ ఎండార్స్మెంట్
17. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
1) పోలింగ్ బూత్ అధికారి ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు
2) ఓటర్లందరికీ ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులను జారీ చేస్తారు
3) ఓటును రహస్యంగా వినియోగించుకోవాలి
4) ఓటును బహిరంగంగా వినియోగించుకోవచ్చు
18. కింది వాటిలో స్పీకర్ అధికారాల్లో లేని దాన్ని గుర్తించండి.
1) విధాన సభ/శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తారు
2) సభలో ప్రవేశపెట్టిన ఒక బిల్లును ఆర్థిక బిల్లా? కాదా? అని ధ్రువీకరిస్తారు
3) పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు
4) నిర్ణాయకపు ఓటు/కాస్టింగ్ ఓటు/కొసరు ఓటును కలిగి ఉంటారు
19. రాష్ట్ర విధానసభకు గవర్నర్ ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు?
1) 4 2) 3 3) 1 4) 1/6వ వంతు
20. విధాన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను 14 రోజుల ముందస్తు నోటీసుతో ఎవరు తొలగించగలరు?
1) పార్లమెంటు
2) విధానసభ సభ్యులు
3) ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్
4) కేంద్ర ఎన్నికల సంఘం
21. రాష్ట్ర విధానసభకు జరిగిన ఎన్నికల అనంతరం మొత్తం స్థానాల్లో సగం కన్నా ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను ఎవరు నియమిస్తారు?
1) గవర్నర్ 2) రాష్ట్రపతి
3) శాసనసభ స్పీకర్ 4) పార్లమెంటు
22. రాష్ట్ర విధానసభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సగానికన్నా ఎక్కువ స్థానాలు లభించని పక్షంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని ఏమంటారు?
1) సంయుక్త ప్రభుత్వం
2) మిశ్రమ ప్రభుత్వం
3) సంకీర్ణ ప్రభుత్వం
4) హంగ్ ప్రభుత్వం
23. సభాధ్యక్షుడి అనుమతి లేకుండా చట్టసభల సభ్యులు వరుసగా ఎన్ని రోజులు సమావేశాలకు గైర్హాజరైతే పదవిని కోల్పోతారు?
1) 30 రోజులు 2) 60 రోజులు
3) 90 రోజులు 4) 120 రోజులు
24. కింది వాటిలో ముఖ్యమంత్రి అధికార విధుల్లో లేని దాన్ని గుర్తించండి.
1) రాష్ట్ర కేబినెట్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు
2) గవర్నర్‌కు, మంత్రి మండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు
3) శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తారు
4) రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తారు
25. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
1) ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహించాలి
2) ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి సమష్టిగా విధానసభకు బాధ్యత వహించాలి
3) ముఖ్యమంత్రి తన రాజీనామాను ప్రధా నమంత్రికి సమర్పించాలి
4) ముఖ్యమంత్రి మరణించినా, రాజీనామా చేసినా మొత్తం మంత్రి మండలి రద్దు అవుతుంది
26. పంచాయతీ రాజ్ కు రాజ్యాంగ భద్రతను కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
1) 1993 ఏప్రిల్ 1
2) 1992 ఏప్రిట్ 24
3) 1993 జూన్ 1
4) 1993 అక్టోబర్ 2
27. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం మనదేశంలో ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
1) అక్టోబర్ 2 2) ఏప్రిల్ 14
3) ఏప్రిల్ 24 4) జూన్ 1
28. గ్రామ పంచాయతీల ఏర్పాటును నిర్దేశిస్తున్న ఆర్టికల్ ఏది?
1) ఆర్టికల్ 40 2) ఆర్టికల్ 41
3) ఆర్టికల్ 42 4) ఆర్టికల్ 43
29. స్థానిక సంస్థల ప్రాధాన్యాన్ని గుర్తించండి.
1) ప్రజల్లో రాజకీయ చైతన్యం
2) పరిపాలనా వికేంద్రీకరణ
3) ప్రజాస్వామ్యం బలోపేతం
4) పైవన్నీ
30. గ్రామసభలో సభ్యులుగా ఎవరుంటారు?
1) గ్రామంలోని మొత్తం జనాభా
2) సర్పంచ్, ఉపసర్పంచ్
3) గ్రామ పంచాయతీలో గల ఓటర్లు
4) గ్రామ పంచాయతీలో గల వార్డు సభ్యులందరూ
31. గ్రామ సభ, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షుడిగా ఎవరుంటారు?
1) గ్రామంలోని సీనియర్ సిటిజన్
2) గ్రామ పంచాయతీ సర్పంచ్
3) జిల్లా పంచాయతీ అధికారి
4) డివిజనల్ పంచాయతీ అధికారి
32. గ్రామ సభ అధికారాల్లో లేనిది ఏది?
1) గ్రామ పంచాయతీ పనులను పర్యవేక్షిస్తుంది
2) గ్రామస్థాయిలో శాసనసభలాగా వ్యవహరిస్తుంది
3) ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక
4) పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపకల్పన
33. 73వ సవరణ చట్టం (1992) ప్రకారం సర్పంచ్ గ్రామ సభ సమావేశాలను సంవత్సరానికి తప్పనిసరిగా ఎన్నిసార్లు నిర్వహించాలి?
1) 2 2) 3 3) 4 4) 6
34. ప్రస్తుతం మన రాష్ట్రంలో గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. వీటిలో లేని తేదీని గుర్తించండి.
1) ఏప్రిల్ 14 2) అక్టోబర్ 3
3) జనవరి 2 4) డిసెంబర్ 3
35. మూడంచెల పంచాయతీరాజ్ విధానంలో గ్రామ పంచాయతీ అధ్యక్ష ఎన్నిక విధానం ఏది?
1) ప్రత్యక్షం 2) పరోక్షం
3) 1 లేదా 2 4) ఏదీకాదు
36. మన రాష్ట్రంలో గ్రామపంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక విధానం?
1) ప్రత్యక్షం 2) పరోక్షం
3) 1 లేదా 2 4) ఏదీకాదు
37. 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం, ఆర్టికల్ 243 (డి) ప్రకారం పంచాయతీరాజ్‌లోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు ఎంతశాతం సీట్లు రిజర్వ్ చేయాలి?
1) 1/4 2) 2/3
3) 1/3 4) 1/2
38. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లను రిజర్వ్ చేసిన తొలి రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) రాజస్థాన్ 4) బీహార్
39. ప్రస్తుతం మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఎన్నో వంతు సీట్లు రిజర్వ్ చేశారు?
1) 1/2 2) 1/3
3) 2/3 4) 1/4
40. స్థానిక సంస్థల్లోని అన్ని స్థాయిల్లోని సభ్యులు, అధ్యక్షుల పదవీ కాలం ఎంత?
1) నాలుగు సంవత్సరాలు
2) 5 సంవత్సరాలు
3) అనిశ్చితం
4) ఎంతకాలమైనా ఉండొచ్చు
41. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు ఎంత?
1) 18 సంవత్సరాలు
2) 21 సంవత్సరాలు
3) 25 సంవత్సరాలు
4) 30 సంవత్సరాలు
42. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ ఏర్పాటు చేస్తారు?
1) 243(సి) 2) 243(జె)
3) 243(కె) 4) 243(జడ్)
43. ఏ తేదీ తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు?
1) 1994 మే 30 2) 1995 మే 30
3) 1996 మే 30 4) 1997 మే 30
44. మన రాష్ట్రంలో స్థానిక సంస్థల(పంచాయతీ) ఎన్నికల వివాదాలను విచారించే వ్యవస్థ ఏది?
1) మున్సిఫ్ కోర్టు 2) సెషన్స్ కోర్టు
3) హై కోర్టు 4) రిటర్నింగ్ కోర్టు
45. గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని ఎవరు పేర్కొన్నారు?
1) జ్యోతిబాఫూలే 2) డి.కె. కార్వే
3) గాంధీజీ 4) నెహ్రూ
46. గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఎవరిని పేర్కొంటారు.
1) గ్రామ పెద్ద 2) సీనియర్ సిటిజన్
3) సెక్రటరీ 4) సర్పంచ్
47. గ్రామ సభ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు ఎవరు?
1) ఎంపీటీసీ 2) జడ్పీటీసీ
3) డీపీవో 4) ఎంపీడీవో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు