TSPSC Groups Special | జాతీయ మహిళా సాధికారత సంవత్సరం ఏది?
1. కింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి.
ఎ. 2022 లింగ వ్యత్యాస సూచీలో భారతదేశ స్థానం 135
బి. 2023 లింగ అసమానత్వ సూచీలో భారతదేశ స్థానం 122
సి. 2022 లింగ అభివృద్ధి సూచీలో భారతదేశ స్థానం 135
పై వాటిలో సరైన వాటిని గుర్తించండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
2. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో మహిళల సంక్షేమం నుంచి అభివృద్ధి వైపు ప్రభుత్వం దృష్టి సారించింది?
1) 4 2) 5 3) 6 4) 7
3. దేశంలో ఏ సంవత్సరాన్ని జాతీయ మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించారు?
1) 2001 2) 2002
3) 2003 4) 2004
4. గ్రీకు భాషకు చెందిన ఎథ్నో (జాతి) అనే పదం అర్థం?
1) ప్రాంతం 2) దేశం
3) సమూహం 4) సముదాయం
5. జాతి లక్షణం కానిది?
1) నిర్దిష్ట భౌగోళిక సరిహద్దు
2) ప్రత్యేకమైన భాష
3) బహిర్‌వివాహం
4) ఉమ్మడి పూర్వీకులపై నమ్మకాన్ని కలిగి ఉండటం
6. దేశంలో జాతికి సంబంధించి సామాజిక శాస్త్రవేత్త పునేకర్ పేర్కొన్న అంశం?
1) భౌగోళిక 2) భాష
3) కులం, మతం 4) పైవన్నీ
7. జాతి గుర్తించడానికి దోహదపడని కారకం?
1) జాతీయత 2) భాష, మతం, కులం
3) ఆర్థిక సంపద 4) నేను అనే భావన
8. దేశంలో దళితులు ఏ రకమైన దోపిడీకి గురయ్యారు?
1) ఆర్థిక 2) సామాజిక
3) మతపరమైన 4) సాంస్కృతికపరమైన
9. కుటుంబానికి మూలం పురుషుడు కావడం వల్ల పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉండవచ్చని పేర్కొన్న శాస్త్రవేత్తలు?
1) అరిస్టాటిల్, ప్లేటో 2) మోర్గాన్, ముల్లర్
3) హెన్రీ మెయిన్, మలినోవ్స్కీ
4) కారల్ మార్క్స్, లెవిస్ట్రాస్
10. సంస్కృతీకరణం చెందిన కులానికి ఉదాహరణ?
1) నాయీబ్రాహ్మణ 2) విశ్వబ్రాహ్మణ
3) గంగపుత్ర 4) పైవన్నీ
11. ట్రిపుల్ తలాఖ్ పద్ధతిని రద్దుచేసిన చట్టం?
1) ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం- 2022
2) ముస్లిం మహిళల (వివాహ హక్కుల చట్టం)- 2019
3) ముస్లిం మహిళల రక్షణ చట్టం- 2019
4) ముస్లిం మహిళల వైవాహిక సంబంధం, విడాకుల చట్టం- 2020
12. దేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న తెగలు వరుసగా?
1) భిల్, సంతాల్, గోండ్
2) సంతాల్, భిల్, గోండ్
3) గోండ్, సంతాల్, భిల్
4) భిల్, గోండ్, సంతాల్
13. దేశంలో మహిళలకు సంబంధించిన సామాజిక దురాచారాలు కనపడని కాలం?
1) తొలి వేదకాలం 2) మలి వేదకాలం
3) మధ్యయుగం 4) ఆధునిక యుగం
14. జతపర్చండి.
ఎ. భారత ఫ్యాక్టరీల చట్టం 1. 2009
బి. వెట్టి నిషేధ చట్టం 2. 2005
సి. బాలల హక్కుల పరిరక్షణ చట్టం 3. 1948
డి. బాలలకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 4. 1976
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
15. స్టేట్మెంట్స్
ఎ. బాలకార్మిక (సవరణ) చట్టాన్ని 2006లో రూపొందించారు
బి. బాలకార్మిక (సవరణ) నూతన చట్టాన్ని 2016లో రూపొందించారు
సి. బాలల జాతీయ చార్టర్‌ను 2003లో రూపొందించారు
డి. బాలకార్మికుల పట్ల జాతీయ విధానాన్ని 1997లో రూపొందించారు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
16. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జాతీయ సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1992 2) 1993
3) 1994 4) 1995
17. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరు?
1) PENCEL 2) PENCL
3) PEN 4) PEN INK
18. బచ్పన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థకు సంబంధించి సరికాని అంశం?
1) ఈ సంస్థను కైలాస్ సత్యార్థి నెలకొల్పాడు
2) కైలాస్ సత్యార్థికి 2020లో నోబెల్ శాంతి బహుమతి లభించింది
3) కైలాస్ సత్యార్థి ప్రపంచంలోనే అతిపెద్ద పౌర అవగాహన సదస్సును 1998లో నిర్వహించారు
4) ఈ సంస్థ కృషి వల్ల బాలకార్మికులు లేని పరిశ్రమలు తయారు చేస్తున్న కార్పెట్స్, రగ్గుల కోసం 1994లో రగ్ మార్క్ అనే ముద్రను రూపొందించారు
19. ప్రపంచంలో బానిస వ్యాపారాన్ని నిషేధించిన మొదటి దేశం డెన్మార్క్ కాగా రెండో దేశం ఏది?
1) స్వీడన్ 2) నార్వే
3) ఐస్లాండ్ 4) ఫిన్లాండ్
20. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం?
1) జూలై 30 2) ఆగస్ట్ 30
3) సెప్టెంబర్ 30 4) అక్టోబర్ 30
21. తప్పుగా పేర్కొన్న అంశాన్ని గుర్తించండి?
1) మానవ అక్రమ రవాణా (నిరోధక) చట్టం- 1956
2) అక్రమ రవాణాకు గురైన వారికి పునరావాస, కౌన్సిలింగ్, న్యాయ సహాయం అందించడం కోసం 2002లో స్వధార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు
3) ఉజ్వల పథకం (2007) లక్ష్యం అక్రమ రవాణాకు గురైన మహిళలను, బాలలను రక్షించి వారికి పునరావాసాన్ని కల్పించడం
4) ఆపరేషన్ ముస్కాన్ (2015) లక్ష్యం అక్రమ రవాణాకు గురైన మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలను, నివాస సదుపాయాలను కల్పించడం
22. స్టేట్మెంట్స్
ఎ. వికలాంగుల హక్కుల రక్షణ చట్టాన్ని 1995లో రూపొందించారు
బి. దీన్‌దయాళ్ వికలాంగుల పునరావాస పథకాన్ని 1997లో ప్రారంభించారు
సి. జాతీయ వికలాంగుల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్‌ను 1997లో ఏర్పాటు చేశారు
డి. సుగమ్య భారత్ అభియాన్‌ను 2015లో ప్రారంభించారు
ఇ. వికలాంగుల జాతీయ విధానాన్ని 2016లో ప్రారంభించారు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి, ఇ
3) ఎ, సి, డి, ఇ 4) ఎ, బి, డి, ఇ
23. సరికాని అంశాన్ని గుర్తించండి.
1) తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల గుర్తింపునకు సంబంధించిన సాఫ్ట్వేర్ SADAREM
2) తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న పెన్షన్ నెలకు రూ.4016
3) వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను అందించడం కోసం 2017లో దివ్యాంగ్ సారథి యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
4) దేశంలో వికలాంగుల హక్కుల కోసం 1993లో క్రాస్ డిజేబిలిటీస్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది
24. తెలంగాణలో ఆసరా పథకంలో భాగంగా వృద్ధులకు ఏ పేరుతో నెలకు రూ.2016 అందిస్తున్నారు?
1) జీవనాధారం 2) రక్షణ
3) చేయూత 4) ఆలంబన
25. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ట్రాన్స్‌జెండర్స్ జనాభా?
1) 4.88 లక్షలు 2) 5.88 లక్షలు
3) 6.88 లక్షలు 4) 7.88 లక్షలు
26. నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్‌జెండర్‌లో సభ్యత్వం లేని మంత్రిత్వ శాఖ?
1) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ
3) మానవ వనరుల మంత్రిత్వ శాఖ
4) సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
27. స్టేట్మెంట్స్
ఎ. మద్రాస్‌లో అంటరానితనానికి వ్యతిరేకంగా గోపాల్ ప్రభ వాలంగేకర్ 1894లో మహర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు
బి. అంబేద్కర్ మహర్ ఉద్యమాన్ని మహోన్నత స్థాయికి చేర్చాడు. 1917లో సౌత్‌బరో కమిటీ ముందు హాజరై దేశ రాజకీయాల్లో దళితులకు సముచిత స్థానం ఉండాలని వాదించాడు
సి. అస్పృశ్యులకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేసిందేమిటి అనే గ్రంథాన్ని అంబేద్కర్ 1945లో రచించాడు
పై వాటిలో సరైనవి గుర్తించండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) బి 4) సి
28. 1978లో బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌ను స్థాపించింది ఎవరు?
1) కాన్షీరాం 2) మాయావతి
3) ప్రఫుల్లకుమార్ 4) మాణిక్ చంద్ సిద్దిఖీ
29. మైసూర్లో సీఆర్ రెడ్డి 1917లో స్థాపించిన మొదటి బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయ సంస్థ?
1) అఖిల భారత హరిజన్ సేవక్ సంఘ్
2) ప్రజామిత్ర మండలి
3) భారత జాతీయ సాంఘిక సభ
4) దళిత్ శోషిత్ సమాజ్
30. జతపర్చండి.
ఎ. జగన్ మిత్ర మండలి 1. 1915 బి. ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ 2. 1912
సి. స్వస్తిక్ వాలంటీర్ల సంఘం 3. 1906
డి. సంఘ సంస్కార నాటక మండలి 4. 1911
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
31. షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1992 2) 1993
3) 1994 4) 1995
32. ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణ కలిగించిన డిక్లరేషన్?
1) రోమ్ డిక్లరేషన్ 1972
2) స్టాక్‌హోం డిక్లరేషన్ 1972
3) బెర్లిన్ డిక్లరేషన్ 1972
4) మాంట్రియల్ ప్రొటోకాల్ 1997
33. చిప్కో ఉద్యమం స్ఫూర్తితో ఉత్తర కర్ణాటకలో ప్రారంభమైన పర్యావరణ ఉద్యమం?
1) కోయల్‌కరో ఉద్యమం
2) తెహ్రీబంద్ ఉద్యమం
3) అప్పికో ఉద్యమం
4) నర్మదా బచావో ఆందోళన్
34. జార్ఖండ్‌లోని సింగ్భం జిల్లాలో సహజంగా ఉన్న సాల్ వృక్షాల స్థానంలో వాణిజ్యపరమైన టేకు వృక్షాల పెంపుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం?
1) జంగిల్ బచావో ఉద్యమం
2) నవధాన్య ఉద్యమం
3) జంగిల్ హమారా ఉద్యమం
4) పైవన్నీ
35. మహిళల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం 1972లో ఈలాభట్ స్థాపించిన సంస్థ?
1) వర్కింగ్ ఉమెన్ ఫోరం
2) సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉమెన్ అసోసియేషన్
3) ఇండియన్ ఉమెన్ ఫోరం
4) స్త్రీ శక్తి సంఘటన్
36. స్టేట్మెంట్స్.
ఎ. ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది నవంబర్ 25న మహిళలపై హింసకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించింది
బి. ప్రతి సంవత్సరం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు మహిళల రక్షణ పక్షంగా జరుపుకోవాలని, ఈ 15 రోజుల్లో అందరూ నీలి రంగు దుస్తులను ధరించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది
పై వాటిలో సరైనవి?
1) ఎ సరైనది బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
37. సతీ సహగమన నిషేధ చట్టాన్ని 1829లో రూపొందించింది?
1) లార్డ్ డౌల్హౌసీ 2) కారన్ వాలీస్
3) లార్డ్ వెల్లస్లీ
4) లార్డ్ విలియం బెంటింక్
38. చట్టం, సంవత్సరాలను జతపర్చండి.
ఎ. వితంతు పునర్ వివాహ చట్టం 1. 1929
బి. శిశు హత్య నిషేధ చట్టం 2. 1934
సి. శారదా చట్టం 3. 1856
డి. వ్యభిచార నిషేధ చట్టం 4. 1870
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-4
39. ప్రత్యేక దేశం కోసం జరిగిన వేర్పాటు వాద ఉద్యమం?
1) ఖలిస్థాన్ ఉద్యమం, మిజో ఉద్యమం
2) ఖలిస్థాన్ ఉద్యమం, జార్ఖండ్ ఉద్యమం
3) మహానాగాల్యాండ్ ఉద్యమం, ద్రవిడ ఉద్యమం
4) ద్రవిడ ఉద్యమం, బోడోల్యాండ్ ఉద్యమం
40. ఆపరేషన్ బ్లూ స్టార్‌తో సంబంధం గల ఉద్యమం?
1) మహానాగాల్యాండ్ ఉద్యమం (1981)
2) ఖలిస్థాన్ ఉద్యమం (1984)
3) ద్రవిడ ఉద్యమం (1985)
4) గోండ్ ఉద్యమం (1940)
సమాధానాలు
1-4, 2-2, 3-1, 4-2, 5-3, 6-4, 7-3, 8-2, 9-1, 10-4, 11-2, 12-1, 13-1, 14-4, 15-2, 16-3, 17-2, 18-2, 19-2, 20-1, 21-4, 22-3, 23-3, 24-2, 25-1, 26-4, 27-3, 28-1, 29-2, 30-3, 31-3, 32-2, 33-3, 34-1, 35-2, 36-1, 37-4, 38-2, 39-3, 40-2
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు