తెలంగాణ చారిత్రక పూర్వయుగం
భారత ద్వీపకల్పంలో తెలంగాణ 150 551నుంచి 190 -551 ఉత్తర అక్షాంశాల మధ్య 770 22. 351 నుంచి 810 2.231 తూర్పు రేఖాంశాలమధ్య విస్తరించి ఉంది.
ఉత్తరాన గోదావరి, ప్రాణహిత, దక్షిణాన కృష్ణ, తుంగభద్ర నదులు, తూర్పున తీరాంధ్ర ప్రాంతాన్ని వేరుచేస్తూ నల్లగొండ (నీలగిరి), ఖమ్మం జిల్లా (నల్లగొండ జిల్లాలోని డిండి నది నుంచి ఖమ్మం జిల్లాలోని కందికల్ గుట్టల వరకు) నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఉన్న పర్వతాలు దాదాపు తెలంగాణ ప్రాంత సరిహద్దులు, తెలంగాణ రాజకీయ చరిత్రను, తద్వారా పరిపాలనా విభాగాల ఏర్పాటును, తెలంగాణ ప్రత్యేక ఉనికిని నిర్దేశించినవి.
ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా, పెద్దజిల్లా మహబూబ్నగర్(పాలమూర్), చిన్నజిల్లా హైదరాబాద్. తెలంగాణ అధికారిక భాష తెలుగు. రెండో భాష ఉర్దూ. తెలంగాణలో తొలి విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీని 1918లో స్థాపించారు. 1976లో కాకతీయ (వరంగల్)ను నెలకొల్పారు. అనంతరం మహాత్మాగాంధీ(నల్లగొండ),శాతవాహన(కరీంనగర్) తెలంగాణ (నిజామాబాద్), పాలమూర్ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
ప్లిస్టోసిన్ యుగం
మానవుడు భూమి మీద ఎప్పుడు అవతరించాడో స్పష్టంగా తెలియదు. భారతీయ శాసా్త్రల ప్రకారం భూమ్మీద సృష్టి జరిగి 195కోట్ల 58 లక్షల 54 వేల ఏండ్లు అయ్యింది. ఇప్పుటికి ఆరుగురు మనువుల కాలం గడిచి ఏడో మనువైన వైవస్వత కాలం నడుస్తున్నది. ఒక్కొక్క మనువు కాలం 4,32,0000 ఏండ్లుగా లెక్కించారు. ఇప్పటి వరకు గతించిన ఆరుగురు మనువులు 1. స్వాయంభు 2. స్వారోషిచిష 3. ఉత్తమ, 4. తామన, 5. బైనత, 6. చాక్షుష 7వ మహాయుగంలో ‘కలి’యుగం నడుస్తున్నదని పండితుల వాదన. తొలి మానవుడు ఆఫ్రికాలో జన్మించాడని ఒక సిద్ధాంతం. భారతదేశానికి సంబంధించినంత వరకు ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశమే అతి ప్రాచీనమైనదని, దక్కన్లోనే తొలి మానవుడు జన్మించాడని భూగర్భ శాస్త్రజ్ఞులు భావించారు. (ప్లిస్టోసిన్ యుగంలోనే తొలి మానవుడు ఆవిర్భవించాడని, టెర్షరీయుగంలో హిమాలయాలు ఏర్పడ్డాయని భావించారు)
మానవుని చరిత్రను చరిత్రకారులు చారిత్రక పూర్వయుగం, చారిత్రక యుగం అని రెండు భాగాలుగా విభజించారు. మానవుడు చదువును నేర్చుకోక మందున్నయు గాన్ని చారిత్రక పూర్వయుగమని, చదువు నేర్చుకున్న తర్వా త యుగాన్ని చారిత్రక యుగమని వివరించారు. చరిత్ర రచనకు లిఖిత పూర్వకమైన ఆధారాలు లభించిన దగ్గర నుంచి చారిత్రక యుగం అని చెప్పవచ్చు.
తెలంగాణ చరిత్రకు కూడా చారిత్రక ఆధారాలు తెలుసుకోవడానికి చారిత్రక పూర్వయుగం, వాటి విశేషాలు తెలుసుకోవడానికి పురావస్తు పరిశోధనా అవశేషాల మీద ఆధార పడవలిసిందే. భారతదేశంలో పురావస్తు పరిశోధన 1801 లో ప్రారంభమయింది. ఎందరో ప్రముఖులైన బ్రిటీష్, భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు అనేక ప్రదేశాల్లో అన్వేషణలు చేసి తవ్వకాలు జరిపి అనేక ప్రాచీన జనావాసాలను బయటకు తెచ్చారు. దీంతో చరిత్ర వెలుగులోకి వచ్చింది. వారు బయల్పరచిన అవశేషాలు, పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా ప్రాచీన నాగరికతా సంస్కృతులను తెలుసుకోవలసి ఉంటుంది.
తెలంగాణ పరిశోధకుడు ఎడ్వర్డ్ బ్రూస్పుట్
తెలంగాణకు సంబంధిచినంత వరకు ‘ఎడ్వర్డ్ బ్రూస్పుట్’ ఫ్రాంక్ పి.మాన్లే, ప్రొఫెసర్ హైమన్డార్పు, కాగ్లిస్బ్రేన్, మోడోస్ టేలర్, ఎఫ్ఆర్ ఆల్చిన్ మొదలైన శాస్త్రవేత్తలు పీటీ శ్రీనివాస్ అయ్యంగార్, డా.బీఆర్ సుబ్రహ్మణ్యం, డా. పి.శ్రీనివాసాచారి, తెలంగాణ ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు వారు ఎన్నో పరిశోధనలు చేసి కొన్ని వందల ప్రాచీ న స్థావరాలను బయల్పరచారు. వీరిలోఅగ్రతాంబూలం ఎడ్వర్డ్ బ్రూస్పుట్కు దక్కుతుంది. ఆయన శ్రమ విలువ కట్టలేనిది. ఆయన ఎంతోకష్టపడి ఎన్నో
ప్రదేశాల్లో పరిశోధనలు జరిపి ఆదిమానవుని నాగరికతా అవశేషాలు బయల్పరచారు. ఆతరువాత ఆయన అడుగుజాడల్లో నడచి మిగిలిన శాస్త్రజ్ఞులు మరింత సమాచారం బయల్పరచగలిగారు.
మహబూబ్నగర్ జిల్లాలో పరిశోధన చేసిన ఎఫ్ఆర్వీ ఆల్చిన్ అనే పండితుడు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో మెడోస్ టేల ర్ అనే శాస్త్రవేత్త చేసిన కృషి కూడా అద్భుతమైందే. ఫ్రాంకి పిమాన్లే, ప్రొ. హైమండ్ , శ్రీనివాస్ అయ్యంగారు. కాగ్లిన్ ప్రొఫెసర్, డాక్టర్ సంకాలియా కూడా శ్లాఘనీయమైన కృషిచేశారు. నేడు చారిత్రక పూర్వయుగం నాటి తెలంగాణ చరిత్ర కూడా తెలుస్తున్నది.
ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి 40 మైళ్ల విస్తీర్ణంలో, ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ తాలూకా ఏలేశ్వరంలోను, ఇటీవల బయల్పడిన అతిప్రాచీన రాతియుగపు జనావాస శిథిలాల వారు వాడిన పనిముట్లు లభించినవి. ఈ స్థావరాలన్నీ తెలంగాణలోని నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకే పరిమితం. కానీ గోదావరి ప్రాంతంలో ఎలాంటి స్థావరాలూ కన్పించలేదు.
ఈ ప్రదేశాలన్నింటిలో నల్లగొండ జిల్లాలోని నాగార్జునకొండ (ప్రస్తుతం నాగార్జునసాగర్), దేవరకొండ తాలూకాలోని ఏలేశ్వరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రెండు ప్రదేశాల్లో మానవ జనావాసం అతిప్రాచీనమైన పాతరాతియుగపు తొలిదశ నుంచి చారిత్రక యుగం వరకు అవిచ్ఛిన్నంగా వర్థిల్లింది. శాతవాహనులు, ఇక్షాకుల కాలం వరకు నాగార్జునకొండ అద్భుతంగా వెలిగింది. క్రీ.శ.4వ శతాబ్దంలో పతనమైంది. కానీ ఏలేశ్వరం కాకతీయుల కాలం వరకు చెక్కుచెదరకుండా అద్భుతంగా వెలిగింది. లక్షలాది ఏండ్లు ఒకే ప్రదేశంలో జనావాసాలు, నాగరికతలు అవిచ్ఛిన్నంగా వర్థిల్లడం అమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రెండు ప్రాంతాలు కృష్ణానది ఒడ్డున ఉన్నవే.కృష్ణకు కుడివైపున నాగార్జునకొండ, ఎడమవైపున నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం ఉన్నాయి.
ఈ కృష్ణానది తీరాన వెలిసిన నాగార్జునకొండ, ఏలేశ్వరాల నాగరికత ఇలా ప్రాచీనంగా ఉండటమే కాకుండా సింధూనది నాగరికత పతనం తర్వాత ఇవి కొనసాగాయి. సింధూ నదీ నాగరికత స్థావరాలు హ ఠాత్తుగా నశించగా ఒక గుజరాత్లోని రంగపూర్ కంటే కూడా కృష్ణా నాగరికత స్థావరాలు ఇంకా ఎక్కువ కాలం నిలిచినవి. ఏ విధంగా చూసినా ఈ నాగార్జునకొండ ఏలేశ్వరం ఉనికి తెలంగాణకు ప్రపంచ ఖ్యాతి తెచ్చేవిగా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్త్తు ఈ రెండూ నాగార్జునసాగర్ రిజర్వాయర్లో మునిగిపోయాయి. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మించడం వరప్రసాదమే అయినా ఈ రెండు స్థావరాలు అందులో మునిగిపోవడం తెలంగాణకు దురదృష్టంగా చెప్పాలి. అలాగే పరిశోధకులు జరిపిన మహబూబ్నగర్ జిల్లాలోని కూడలి సంగమేశ్వరంలోనూ అనేక ప్రాచీన శిథిలాలు బయటపడ్డాయి.
ఇక నవీన శిలాయుగపు స్థావరాలు అవశేషాలను మహబూబ్నగర్ జిల్లాలోని ఉట్నూరు, నల్లగొండ జిల్లాలోని సలేశ్వరం, మౌలాలి, భువనగిరి, ఖమ్మం జిల్లాలోని ఐదు చోట్ల నవీన శిలాయుగపు అవశేషాలు లభించాయి.
ఇనుపయుగం: ఇనుపయుగం నాగరికత స్థావరాలు నల్లగొండ జిల్లాలోని నాగార్జునకొండ, ఏలేశ్వరం, దేవరకొండ, నిజామాబాద్, నార్కట్పల్లి, వరంగల్ జిల్లాలోని డోర్నకల్, హైదరాబాద్లోని బాలానగర్, బేగంపేట, కరీంనగర్లోని పెద్ద బంకూర్ మొదలగువాటిలో ఇనుపయుగ స్థావరాలు బయటపడ్డాయి.
ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, చర్ల, వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, గోదావరిఖని, మెట్పల్లి, లక్సెట్టిపేట, బుడిసెపల్లి మొదలగు ప్రాంతాల్లో ఈ కాలంనాటి పనిముట్లు దొరికినవి. మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందిన యుగంలో పెచ్చుల మీద చేసిన గీకుడు రాళ్లు, చేదకాలు, చిత్రకాలు, బరములు వాడారు. ఈ పనిముట్లు ఆదిలాబాద్ జిల్లాలోని మార్లవాయి, జముల్దార్, కీతంపూర్లలో లభించాయి.
తామ్ర కంచుయుగం
ఈ యుగంలో లోహం వాడారు. మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి. తర్వాత బంగారం, కంచు, వెండిలను వాడారు. ఈ దశలో మానవుడు గొప్ప నాగరికుడు అయ్యాడు. ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం, ఆదిలాబాద్ జిల్లాలోని జముల్దార్లలో వాటి ఆనవాలు లభించాయి.
ఇనుపయుగం
దీన్నే ఆయోయుగం, బృహత్ శిలాయుగం, బృహత్ సమాధుల సంస్కృతి, రాక్షస-గుళ్ల యుగమని అంటారు. ఏనుగు ఆకారంలో కలిగిన శవపేటిక నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరంలో బయల్పడ్డాయి. ఇక్కడ ఒక సమాధిలో స్త్రీ మీద పడుకుండబెట్టిన పురుష కళేబరం లభించాయి. ఇలాంటి సమాధి ప్రపంచంలో ఎక్కడా బయల్పడలేదు. అలా ఎలా ఖననం చేశారో ఎవరికీ అర్థం కాలేదు. ఇది తాంత్రిక విద్యకు సంబంధించినదని, మరికొందరు వారు శిక్షింపబడి పూడ్చిపెట్టబడ్డారని ఊహించుకొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఉట్కూరు వద్ద F.R ఆల్చిన్ జరిపిన తవ్వకాల్లో రెండు నిర్దిష్ట సాంస్కృతిక దశలు కన్పించినవి. ఖమ్మం జిల్లాలోని ఐదు చోట్ల, భువనగిరి తాలూకాలో ఒకచోట ఆనాటి జనావాసం కనబడింది.
ఇనుపయుగం కాలం నాటి స్థావరాలు
. నాగార్జునకొండ 2. ఏలేశ్వరం 3. నిజామాబాద్ 4. నార్కట్పల్లి 5. డోర్నకల్ 6.బాలానగర్(హైద్రాబాద్) 7. కరీంనగర్ (పెద్దబంకూర్) 8. దేవరకొండ (నల్లగొండ) 9. బేగంపేట
శిలాయుగం కాలం నాటి స్థావరాలు
1.పాల్వంచ (ఖమ్మం) 2. గోదావరిఖని 3. లక్సెట్టిపేట
తెలంగాణ శబ్ద ఆవిర్భావం
8 స్కంద పురాణాల్లో త్రిలింగ దేశమని పేర్కొనబడింది. తెన్+కళింగ శబ్దం నుంచి త్రిలింగ దేశం అనే శబ్దం పుట్టిందని కొందరు భాషా శాస్త్రవేత్తలు భావించారు. తెలుంగు, తెలంగ్, త్రిలింగ్ అనే శబ్దాన్ని అంగునీయం అనే తమిళ వ్యాకరణ గ్రంథంలో పేర్కొన్నారు.
8 హేమాద్రి రచించిన వ్రత ఖండంలో కాకతీయ రుద్రున్ని త్రిలింగ అధిపతిగాను, ఆంధ్రమహారాజ్ఞిగాను, ఓరుగల్లును ఆంధ్ర నగరిగాను వర్ణించారు. అనగా ఆనాటికి త్రిలింగ దేశం అని, ఆంధ్రదేశం అని, తెలుగు జాతి అని , ఆంధ్ర జాతి అన్న పేర్లు స్థిరపడ్డాయన్నమాట.
8 త్రిలింగ పదాన్ని మూడు లింగములకు అన్వయించినవాడు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ‘అగస్త్యవిధ్యానాథుడు’ కాలేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామాల మధ్య దేశాన్ని త్రిలింగ దేశంగా వర్ణించాడు. కానీ అప్పటికే త్రిలింగదేశం అని పేరు ఉన్నది. కాకపోతే ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందిన మూడు శైవక్షేత్రాలకు ఈ పేరును అన్వయించాడు.14వ శతాబ్దపు కావ్యాలంకర చూడామణి గ్రంథకర్త విన్నకోట పెద్దన 17వ శతాబ్దపు అప్పకవి కూడా అవే సరిహద్దులు చెప్పినారు.
8 14వ శతాబ్దంలో శ్రీరంగం తామ్ర శాసనం త్రిలింగదేశ సరిహద్దులను తెల్పింది. తూర్పున కళింగ, పడమర మహారాష్ట్ర, దక్షిణాన పాండ్యదేశం, ఉత్తరాన కన్యాకుబ్జం అని చెప్పింది. అనగా 14వ శతాబ్దానికి నేటి ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటిగా గుర్తింపబడిందని భావిచంవచ్చు.
8 మహమ్మద్బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యాన్ని జయించిన తర్వాత ముస్లింలు త్రిలింగ దేశాన్ని తెలంగాణ అని వ్యవహరించారు. తుగ్లక్ సేనాని అనూర్వలి ఓరుగల్లు ఆక్రమణ ఆగిపోయిన తర్వాత కోస్తాపై దండెత్తాడు. అప్పుడు అతడు తన శాసనాల్లోనూ పరిపాలన కైపీయతుల్లోనూ తెలంగాణ అని రాయించారు. అప్పటి నుంచి ముస్లింలు ఆంధ్రదేశం మొత్తాన్ని తెలింగి అని వ్యవహరించసాగారు. కోస్తా ప్రాంతం నిజాం కాలంలో బ్రిటీష్వారికి వచ్చింది. అప్పుడు ఈ ప్రాంతాన్ని తిరిగి ఆంధ్ర అని వ్యవహరించారు. నిజాం పాలనలోని ప్రాంతానికి తెలంగాణ అనే పేరు
డా౹౹ మురళి,
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు