తెలంగాణ సాంస్కృతిక చరిత్ర
1. శాతవాహనులు ఏ చక్రవర్తి కాలం నుంచి వెండి నాణేలను ఉపయోగించారు?
1) పులోమావి 2) శాతకర్ణి-I
3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) హాలుడు
2. కింది శాసనాలు, శాసనకర్తల్లో సరికానిది ఏది?
1) కన్హేరి – కృష్ణ 2) నానాఘాట్ – నాగానిక
3) నాసిక్ – బాలశ్రీ
4) చినగంజాం – గౌతమీపుత్ర శాతకర్ణి
3. శాతవాహనుల జన్మస్థలం, వాదించినవారిలో సరైనవి?
1) బళ్లారి (కర్ణాటక) – వీఎస్ సుక్తాంకర్
2) విదర్భ (మహారాష్ట్ర) – వీవీ మిరాశి
3) తెలంగాణ (కోటిలింగాల) – అజయ్‌మిత్ర శాస్త్రి, దేమె రాజిరెడ్డి, పీవీ పరబ్రహ్మశాస్త్రి
4) పైవన్నీ సరైనవే
4. కిందివాటిని జతపర్చండి?
1) కోలికులు ఎ) వ్యవసాయదారులు
2) తిలపిసకులు బి) నూనెతీసేవారు
3) వధకులు సి) నేతకారులు
4) హాలికులు డి) వడ్రంగులు
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
5. ఇక్ష్వాకుల గురించి కింది వాటిలో సరైనవి?
1) సింహం వీరి రాజ చిహ్నం
2) రాజధాని విజయపురి
3) ఎహూవల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో రాయబడ్డాయి
4) పైవన్నీ సరైనవే
6. పురణాలు ఎవరిని శ్రీపర్వతీయులు, ఆంధ్రభృత్యులు, శ్రీపర్వతీయాంధ్రులు అని పేర్కొన్నాయి?
1) శాతవాహనులు 2) విష్ణుకుండినులు
3) కాకతీయులు 4) ఇక్ష్వాకులు
7. అనేక గోహలశత సహస్రపదయిశ అనే బిరుదు కలిగిన ఇక్ష్వాక రాజు?
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
2) వీరపురుషదత్తుడు 3) రుద్రపురుషదత్తుడు
4) ఎహూవల శాంతమూలుడు
8. శ్రీపర్వత స్వామి ఏ రాజవంశానికి కులదైవం?
1) ఇక్ష్వాక 2) విష్ణుకుండిన
3) కాకతీయ 4) వేములవాడ చాళుక్య
9. సోలదగండ (అపజయమెరుగని యోధుడు) అనే బిరుదు కలిగిన వేములవాడ చాళుక్య రాజు?
1) బద్దెగ-I 2) అరికేసరి-I
3) బద్దెగ-II 4) అరికేసరి-II
10. కింది వాటిలో సరైనవి?
1) మొదటి అరికేసరి ముగ్దశివాచార్యునికి బెల్మోగ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు
2) పంప మహాకవి కన్నడ సాహిత్యంలోనే మొదటి గొప్ప గ్రంథమైన విక్రమార్జున విజయంను రెండో అరికేసరి కాలంలో రచించాడు
3) రెండూ సరైనవే 4) 1 సరైనది, 2 కాదు
11. కింది వాటిని జతపర్చండి.
1) పండితారాధ్య చరిత్ర
ఎ) పాల్కురికి సోమనాథుడు
2) ప్రతాపరుద్ర యశోభూషణం బి) విద్యానాథుడు
3) శివయోగసారం సి) కొలను గణపతిదేవుడు
4) నృత్యరత్నావళి డి) జాయపసేనాని
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
12. కాకతీయుల కాలంలో స్థలం అంటే?
1) 12 గ్రామాల సమూహం
2) 18 గ్రామాల సమూహం
3) 24 గ్రామాల సమూహం
4) 22 గ్రామాల సమూహం
13. కాకతీయుల కాలంలో సమయములు అంటే?
1) కుల సంఘాలు 2) వర్తక సంఘాలు
3) రైతు సంఘాలు 4) సభలు
14. కింది వాటిలో సరికానిది?
1) మాగల్లు శాసనం – దానర్ణవుడు
2) చందుపట్ల శాసనం – పువ్వుల ముమ్మడి
3) సలకవీడు శాసనం – ప్రతాపరుద్రుడు-II
4) ద్రాక్షారామ శాసనం – అంబదేవుడు
15. శ్రీపర్వతంపైకి యాత్రికులు తేలికగా వెళ్లేందుకు అనపోతానాయుడు మెట్లు కట్టించాడని ఏ గ్రంథం తెలుపుతుంది?
1) రసార్ణవ సుధాకరం 2) రత్న పాంచాలిక
3) సంగీత సుధాకరం 4) చమత్కార చంద్రిక
16. కల్యాణ భూపతి అనే బిరుదు కలిగిన రేచర్ల వెలమ రాజు?
1) అనపోతానాయుడు
2) సింగమనాయుడు-II
3) అనపోతానాయుడు-II
4) సింగమనాయుడు
17. కింది వాటిలో పోతన రచన కానిది?
1) భోగినీ దండకం 2) ఆంధ్రమహా భాగవతం 3) వీరభద్ర విజయం 4) రసార్ణవ సుధాకరం
18. గోల్కొండ కోట మసీదులో హత్యకు గురైన కుతుబ్‌షాహీ రాజు?
1) సుల్తాన్ కులీకుతుబ్ ఉల్‌ముల్క్
2) జంషీద్ కులీకుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహ్మద్ కులీకుతుబ్‌షా
19. కింది వాటిలో ఇబ్రహీం కులీకుతుబ్‌షా గురించి సరైనవి?
1) హుస్సేన్‌సాగర్, ఇబ్రహీంపట్నం చెరువులను నిర్మించాడు
2) అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి, పొన్నగంటి తెలగనార్యుడు ఇతని ఆస్థానంలోనివారే 3) ఇతడిని మల్కీభరాముడు అని అంటారు
4) పైవన్నీ సరైనవే
20. కింది వాటిలో సరికానిది?
1) హెచ్‌కే షేర్వానీ తన రచన హిస్టరీ ఆఫ్ కుతుబ్‌షాహీ డైనాస్టిలో మహ్మద్ కులీకుతుబ్‌షా కాలాన్ని కల్చర్ ఆఫ్ లిఫ్ట్‌గా వర్ణించాడు
2) ఇదే రచనలో ఇబ్రహీం పరిపాలనాకాలాన్ని ది కింగ్డమ్ ఎట్ ఇట్స్ హైట్ అని వర్ణించాడు
3) హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను రూపొందించింది మీర్ మోమిన్ అస్రబాది
4) ఇబ్రహీం కులీకుతుబ్‌షా అక్బర్ చక్రవర్తి మైత్రిని పొందాడు
21. కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణ ప్రాంతంలో పండ్లు, పూలు పుష్కలంగా పండించేవారని తెలిపిన బాటసారి?
1) ట్రావెర్నియర్ 2) థేవ్‌నాట్
3) మెథోల్డ్ 4) థామస్ బేరి
22. కుతుబ్‌షాహీల కాలంలో హొన్ను అంటే?
1) బంగారు నాణెం 2) వెండి నాణెం
3) రాగి నాణెం 4) మిశ్రమ నాణెం
23. ప్రజల యోగక్షేమాలే ముఖ్యం వాటిని ముందు చూడాలని తన మరణ శాసనంలో రాసుకున్న అసఫ్‌జాహీ రాజు?
1) నిజాం ఉల్‌ముల్క్ 2) నిజాం అలీ
3) సికిందర్జా 4) నసీరుద్దౌలా
24. కింది వాటిని జతపర్చండి?
1) సిటీ హైస్కూల్ ఎ) 1870
2) చాదర్‌ఘాట్ హైస్కూల్ బి) 1872
3) నిజాం కాలేజీ సి) 1887
4) మదర్సా-ఇ-అలియా డి) 1873
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు