371(డి)ని రాజ్యాంగంలో చేర్చిన సవరణ?
1. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో 1993 ఆగస్టులో చిన్న రాష్ర్టాల ఏర్పాటుపై జాతీయ సెమినార్లో పాల్గొన్న రాజకీయ మేధావులెవరు ? (4)
1) జార్జి ఫెర్నాండెజ్ 2) జస్టిస్ మాధవరెడ్డి
3) సురేంద్రమోహన్ 4) పైఅందరూ
2. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా విద్యార్థి జేఏసీ ఎప్పుడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది ? (2)
1) 2008 2) 2009 3) 2010 4) 2011
3. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె ఏ జేఏసీ నేతృత్వంలో జరిగాయి ? (1)
1) పొలిటికల్ జేఏసీ 2) ఓయూ జేఏసీ
3) ఉద్యోగ సంఘాల జేఏసీ 4) కులసంఘాల జేఏసీ
4. కింది వాటిలో సరైన వాటిని సూచించండి ? (4)
1) 2011, మార్చి 10న మిలియన్ మార్చ్
2) 2011, సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సకలజనుల సమ్మె
3) 2011, సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సడక్‌బంద్
4) 2012, సెప్టెంబర్ 30న సాగరహారం
1) 1,3 2) 1, 4 3) 1,3,4 4) 1,2,3,4
5. తెలంగాణ ప్రాంత నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉన్న సమయంలో ఏ తేదీన అన్ని రాజకీయ పార్టీల నేతలంతా కలిసి రాజకీయ ఐక్యవేదిక (జేఏసీ) ను ఏర్పాటు చేశారు ? (3)
1) 2009, డిసెంబర్ 9 2) 2009, డిసెంబర్ 22
3) 2009, డిసెంబర్ 24 4) 2009, డిసెంబర్ 26
6.గిర్గ్లానీ కమిషన్‌కు సంబంధించిన సరైన అంశాలను సూచించండి ? (4)
1) మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత స్థానిక రిజర్వేషన్లపై చర్చల్లో భాగంగా గిర్గానీ కమిటీ ఏర్పాటు
2) ఈ కమిటీ 18 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చింది
3) జిల్లాస్థాయి పోస్టులను జోనల్‌గా మార్చడం, పోస్టుల స్థాయి మార్చి తెలంగాణకు వచ్చే వాటాను తగ్గించడం, ఓపెన్ పోస్టులను స్థానికేతరులకు రిజర్వ్ చేసి భర్తీ చేశారని గిర్గ్లానీ కమిటీ పేర్కొంది
4) ఈ కమిటీ నివేదికను, సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయలేదు
1) 1,3 2) 1,2,4 3) 1,3,4 4) 1,2,3,4
7.ఆరుసూత్రాల పథకం అమలు కోసం ఎన్నో రాజ్యాంగాన్ని సవరించి 371(డి)ని అమల్లోకి తీసుకొచ్చారు ? (2)
1) 31వ రాజ్యాంగ సవరణ 2) 32వ రాజ్యాంగ సవరణ 3) 42వ రాజ్యాంగ సవరణ 4) 44వ రాజ్యాంగ సవరణ
8. 1985లో తెలంగాణ ఎన్జీవో ఆందోళనతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేరేమిటి ? (1)
1) జయభారత్‌రెడ్డి కమిటీ 2) గిర్గ్లానీ కమిటీ
3) ఫజల్అలీ కమిటీ 4) ఏదీకాదు
9. సడక్‌బంద్‌కు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి ? (4)
1)మొదటగా హైదరాబాద్, విజయవాడ హైవే ఎన్‌హెచ్-9ను దిగ్బంధనం చేద్దామనుకున్నారు. కానీ సూర్యాపేట దగ్గర లింగమంతుల జాతర వల్ల వాయిదా వేసి పాలమూరు హైవే రోడ్డుపైన 2013, ఫిబ్రవరి 24 నాడు చేసేందుకు జేఏసీ నిర్ణయించింది ?
2) 2013, ఫిబ్రవరి 24న జరగాల్సిన కార్యక్రమం దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల వల్ల వాయిదా వేసి మార్చి 21న నిర్వహించారు
3) మార్చి 21న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జేఏసీ విస్త్రృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసింది
4) 10వ తరగతి పిల్లల పరీక్షలు దృష్టిలో పెట్టుకొని సడక్‌బంద్ సమయాన్ని 12 గంటలకు కుదించింది?
1) 4 2) 2,3,4 3) 1,3,4 4) 1,2,3,4
10.పెద్దరాష్ర్టాల వల్ల కొన్ని ఆధిపత్య కులాలు లబ్ధిపొంది బలపడే అవకాశం ఉన్నందున చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేయాలని అన్నవారు ? (3)
1) నెహ్రూ 2) వల్లభాయ్ పటేల్
3) అంబేద్కర్ 4) బి.ఎన్ రావు
11.సడక్‌బంద్ కార్యక్రమంలో జైలుకు వెళ్లిన జేఏసీ నేతలు ఎవరు? (4)
1) ప్రొ. కోదండరాం 2) శ్రీనివాస్‌గౌడ్
3) జూపల్లి కృష్ణారావు 4) ఈటెల రాజేందర్
5) జితేందర్ రెడ్డి
1)1,2,4 2) 1,2,3, 3) 1,2, 5 4) 1,2,3,4,5
12. ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది ? (4)
1) 2013 తెలంగాణ పునర్విభజన చట్టం
2) 2014 తెలంగాణ పునర్విభజన చట్టం
3) 2015 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం
4) 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం
13.తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది ? (4)
1) మోదుగుపువ్వు 2) తామరపువ్వు
3) బంతిపువ్వు 4) తంగేడుపువ్వు
14.1999లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కన్వీనర్‌గా ఎన్నికైన వారెవరు ? (1)
1) చిన్నారెడ్డి 2) జానారెడ్డి
3) దామోదరం రాజనర్సింహ 4) పొన్నాల లక్ష్మయ్య
15.రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ఢిల్లీ మీద ఒత్తిడి పెంచడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ గర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించిన రోజు ? (1)
1) 2010, జనవరి 3 2) 2010, జనవరి 4
3) 2010, జనవరి 5 4) 2010, జనవరి 6
16.తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షం సమావేశానికి సంబంధించిన సరైన అంశాలను సూచించండి ? (4)
1) రాష్ట్రంలో ఎనిమిది రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది
2) కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్ 30న ఆహ్వానాలు పంపింది
3) 2010 జనవరి 5న అఖిల పక్ష సమావేశం నిర్వహించింది
4) కేంద్ర హోంమంత్రి చిదంబరం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు చొప్పున 16 మంది హాజరయ్యారు
1) 2,3 2) 1,3 3) 2,3,4 4) 1, 2,3, 4
17. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే తెలంగాణ సాధ్యమని, ఎన్నికల్లో పాల్గొనాల్సిందేనని ప్రకటించి 2010, అక్టోబర్ 21న ఐక్య కమిటీని ఏర్పాటు చేసిన నాయకురాలు ? (1)
1) విమల 2) విజయశాంతి 3) సంధ్య 4) కాత్యాయని
18.శ్రీకృష్ణ కమిటీ వెంటనే తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని ఓరుగల్లు గర్జన పేరుతో వరంగల్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏ రోజున నిర్వహించింది ? (2)
1) 2010, నవంబర్ 29 2) 2010, డిసెంబర్ 16 3) 2010, డిసెంబర్ 26 4) 2010, డిసెంబర్ 30
19.తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి ? (4)
1) తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు స్వామిగౌడ్, కార్యదర్శిగా దేవీప్రసాద్‌లు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది
2) 2011, ఫిబ్రవరి 21న ఉద్యోగ సంఘాల జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది
3) ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమం 16 రోజులు కొనసాగింది
4) 2011, సెప్టెంబర్ 13 నుంచి సకల జనుల సమ్మె మొదలయింది. తెలంగాణ ఉద్యోగుల విధులను విడిచిపెట్టి రోడ్లపైకి వచ్చారు.
5) సచివాలయ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ బ్రాంచి చైర్మన్ నరేందర్ రావు నాయకత్వంలో సెక్రటేరియట్లో సమ్మె విజయవంతం అయింది
1) 1,2,4 2) 1,2,3,5
3) 1,2,3,4 4) 1,2,3,4,5
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు