మౌర్య వంశ యోధుడు.. అశోకుడు
(మౌర్య సామ్రాజ్యం)
-కొన్ని స్థావరాలను కలుపుకొని ఒక రాజు తన ఆధీనంలో పాలించే వాటిని రాజ్యాలు అంటారు.
– పెద్ద రాజ్యాలను ‘సామ్రాజ్యాలు’ అని, వాటిని పాలించే రాజులను ‘చక్రవర్తులు’ అని అంటారు.
– ‘మగధ’ భారతదేశానికి చెందిన పదహారు మహాజనపదాల్లో ఒకటి.
-ప్రారంభంలో మగధ దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైనా క్రమంగా ఆనాటి అన్ని మహాజనపదాలను కలుపుకొని విస్తరించింది.
మగధ రాజ్యంలోని భాగాలు
-హిందూ కుష్ పర్వతాలు, భారతదేశపు గొప్ప ఎడారి (థార్), గంగా సింధూ నదీ లోయలు, మాళ్వా పీఠ భూమి, విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణా, తుంగభద్ర లోయ, గోదావరి లోయ.
-గంగాలోయ, కృష్ణానదీ లోయ, మాళ్వా, గుజరాత్, పంజాబ్ అత్యధిక జనసాంద్రత గ్రామ ప్రాంతాలు.
-ఇవి వ్యాపారాలకు, చేతి వృత్తులకు ఎంతో ప్రసిద్ధి.
మౌర్యులు
-మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు తన మంత్రి కౌటిల్యుడి (చాణక్యుడి) సహాయంతో ప్రసిద్ధ అభ్యాస కేంద్రమైన తక్షశిల వద్ద స్థాపించారు.
-మొదటి మౌర్య రాజవంశరాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు.
-మౌర్య సామ్రాజ్యం నేటి అఫ్గ్గానిస్థాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది.
-మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి చంద్రగుప్తమౌర్యుడి మంత్రి కౌటిల్యుడు
(చాణక్యుడు) రచించిన ‘అర్థశాస్త్రం’, గ్రీకు రాయబారి మెగస్తనీస్ రచించిన ‘ఇండికా’, ఆశోకుని శాసనాలు సహాయపడతాయి.
# చాణక్యుడి అర్థశాస్త్రంలోని ప్రధానాంశాలు
1. రాజులు రాజ్యాలను ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలిపాడు.
2. రాజ్యాన్ని కుట్ర, కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి.
3. వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు వసూలు చేయడం.
4. భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులను వివరించారు.
మౌర్య చంద్రగుప్త
-ఒక కుటుంబ వ్యక్తులు వారసత్వంగా రాజులైతే దాన్ని ‘వంశపాలన’ అంటారు.
-మహాపద్మనందుని తరువాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధ రాజు అయ్యాడు. ఆ తరువాత మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
-భారత ఉపఖండంలో తొలి చక్రవర్తుల్లో చంద్రగుప్త మౌర్యుడిని ఒకరిగా పేర్కొంటారు.
అశోకుడు
– చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు ‘బిందుసారుడు’.
– చంద్రగుప్తమౌర్యుడి మనుమడు, బిందుసారుడి తనయుడు అశోకుడు.
-మౌర్యుల్లో అశోకుడు ప్రసిద్ధి చెందాడు.
-తన వర్తమానాన్ని ప్రజలకు శాసనాల ద్వారా చేరవేసిన మొదటి రాజు అశోకుడు
-ఈ శాసనాలు చాలావరకు ‘ప్రాకృత’,
‘బ్రాహ్మీలిపి’లో ఉన్నాయి.
అశోకుడు ప్రజలకు ఇచ్చిన సందేశం
-జబ్బుపడినప్పుడు, పెళ్లిళ్లు జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు పాటించే ఆచారాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.
-వాటికి బదులు ఆచరించాల్సినవి :
1. బానిసలు, సేవకులతో సౌమ్యంగా వ్యవహరించాలి.
2. పెద్దలను గౌరవించడం, అన్ని జీవులతో దయతో మెలగాలి.
3. బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలివ్వాలి.
4. తమ మతాన్ని పొగడటం, ఇతరుల మతాన్ని విమర్శించడం రెండూ తప్పే.
5. తమ మతాన్ని పొగిడి ఇతర మతాల వారిని విమర్శించేవారు తమ మతానికి తీవ్రహాని చేసినట్లు.
మౌర్యుల పరిపాలన
– మౌర్యులు ప్రజల నుంచి వనరులు, పన్నులు పొందేవారు.
-అశోకుని సామ్రాజ్యంలో రాజధానులు (నేటికి సుమారు 2250 సంవత్సరాల మందు) పరిపాలన
పశ్చిమాన – తక్షశిల
తూర్పున – వైశాలి
దక్షిణాన – సువర్ణగిరి
మధ్య భారతదేశాన – ఉజ్జయిని
– ప్రాదేశిక రాజధానులైన తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి ప్రాంతాల్లో పాలన
-రాజకుమారులు పరిపాలన చేసేవారు. వీరిని పాలకులు లేదా గవర్నర్లు అని పిలిచేవారు.
-వీరికి ప్రదేశాలకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకునే అధికారం ఉంది.
-వీరికి సొంత సైన్యం, అధికారులు ఉంటారు. వీరికి చక్రవర్తి తన సూచనలను దూతలతో పంపేవారు.
-ఆ ప్రదేశంలో ఆచారాలు, సంప్రదాయాలు తెలిసిన ముఖ్యమైన కుటుంబాల నుంచి పాలకులు సహాయం పొందేవారు.
-వ్యాపారస్థులు, సైన్యం, దూతలు ప్రయణించే ముఖ్యమైన రహదారులు ఈ ప్రాంతంలో ఉండేవి.
అశోకుడు – కళింగయుద్ధం
-‘కళింగ’ నేటి తీర రాష్ట్రమైన ఒడిశా పాత పేరు.
-కళింగ రాజ్యంపై దండెత్తి, యుద్ధంలో జరిగిన హింస, రక్తపాతానికి దుఃఖించాడు.
– ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృతంలో సమానార్థం దమ్మం (ధర్మం = దమ్మం).
రహదారులు – చేరు కునే ప్రముఖ ప్రాంతాలు
సువ ర్ణ గిరి – బంగారు గనులు ఉన్న ప్రాంతం
తక్ష శిల – విదేశీ వస్తు వులు దొరికే ప్రాంతం
అశోక ధర్మం
#అశోక ధర్మంలో దేవతలకు పూజలు, బలులు ఇవ్వటం లేవు.
#అశోకుడు బుద్ధుని బోధనలతో ప్రభావితమయ్యాడు.
# అశోకుడు వివిధ మతాల మధ్య సామరస్యానికి, ప్రజల సత్ప్రవర్తనకు ‘ధర్మ మహామాత్రులు’ను నియమించాడు.
# వీరు వివిధ ప్రదేశాలకు వెళ్లి ధర్మప్రచారం చేసేవారు.
# అశోకుడు తన సందేశాలను విద్యరాని వారికి వాటి అర్థాన్ని తెలియజేయాలని అధికారులను ఆదేశించాడు.
# ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి సిరియా, ఈజిప్ట్, శ్రీలంక దేశాలకు రాయబారులను పంపించాడు.
# అశోకుడు రోడ్లును నిర్మించాడు, బావులను తవ్వించాడు, సత్రాలను ఏర్పాటు చేశాడు.
# జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాడు,.
#కర్ణాటకలోని కనగనహళ్లిలో అశోకచక్రవర్తి ప్రతిరూపం తవ్వకాల్లో లభించింది.
కళింగ యుద్ధం గురించి తెలిపే శాసనంలో
అశోకుడు చక్రవరి ్త ఎనిమిది సంవత్సరాలకు కళింగను జయించాడు.
ఈ యుద్ధంలో లక్షా యాభైవేల మంది బందీలయ్యారు. లక్షకు పైగా సైనికులు మరణించారు.
ఇవన్నీ అశోకునికి దుఃఖాన్ని కలిగించాయి. నాటి నుంచి ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు.
బలం ద్వారా గెలవటం కంటే ధర్మం ద్వారా గెలవడం మేలని అశోకుడు నమ్మి, భవిష్యత్తులో తన కొడుకులు, మనవళ్లు యుద్ధం గురించి ఆలోచించకుండా ఉండాలని ధర్మాన్ని ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నాడు.
అశోకుడు తన సందేశాన్ని రాతి మీద చెక్కించి అందరికి తెలియజేయాలని నిర్ణయించాడు.
తెలుసుకుందాం
1. మౌర్య వంశానికి ఆ పేరు ఎలా వచ్చింది?
#మహాపద్మనంద మనుమడు చంద్ర గుప్తమౌర్య. నంద రాజుకు, అడవి జాతికి చెందిన ‘ముర’ అనే స్త్రీకి జన్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.
#ముర అంటే అడవిలో నెమళ్లను సంరక్షించే జాతికి చెందినది. ఈ విధంగా తన తల్లి పేరును ‘మౌర్య’గా మార్చుకొని చంద్రగుప్తుడు రాజ్యాన్ని స్థాపించాడు.
2. నంద వంశ నాశనానికి, మౌర్య వంశ స్థాపనకు కౌటిల్యుడు కారణమా?
#మగధ రాజ్యంలో అధిక సైనిక శక్తి ఉన్నవాడు నందవంశ రాజు ధననంద. ఈయన వద్దకు వెళ్లిన కౌటిల్యుడిని ఘోరంగా అవమానించాడు. దీంతో నంద సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతీకారంతో ప్రతిజ్ఞ చేశాడు. చంద్రగుప్తుడు అధికారంలో ఉన్న సంగతి తెలుసుకొని అతని వద్ద మంత్రిగా/సలహాదారుగా చేరి గ్రీకు గవర్నర్లను తరిమికొట్టేలా చేశాడు. అదేవిధంగా మగధ సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలని చంద్రగుప్తుడిని, ఆయన సైన్యాన్ని ప్రోత్సహించాడు. నంద వంశంపై యుద్ధాన్ని ప్రకటించి, ఆ రాజ్యంలోని సైనికులకు లంచం ఇచ్చి అంతర్యుద్ధాన్ని ఆరంభించాడు. ఫలితంగా నందవంశ సింహాసన వారసుడి మరణంతో నందవంశం నాశనమయ్యింది. ఆ తరువాత చంద్రగుప్త మౌర్యుడి ముఖ్యసలహాదారుగా, రాజ నీతిజ్ఞుడిగా బాధ్యతలు స్వీకరించి మౌర్య సామ్రాజ్య స్థాపనకు కారకుడయ్యాడు.
3. అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడా? హైందవంలో ఉన్నప్పుడు ఏ దేవతను ఎక్కువ ఆరాధించేవాడు?
#అశోకుడి యుద్ధపటిమను చూసిన వారు అతనిని చండశాసనుడు అనేవారు. ఒకనాడు కళింగ యుద్ధంలో లక్షలమంది శత్రుసైన్యాన్ని హతమార్చి మిగిలిన వారిని ఖైదీలుగా చేసిన అనంతరం ఆ యుద్ధభూమిని పరిశీలించిన అశోకుడు ఆ భీకరదృశ్యాలను, హింసను చూసి హింసతో సాధించవల్సింది ఏదీలేదని. హింసను త్యజించాలని భావించాడు. ఉపగుప్తుని సహాయంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించక ముందు శివుడిని అతను ఇష్టదైవంగా ఆరాధించేవాడు. అని కల్హణుడు తన ‘రాజతరంగిణి’లో పేర్కొన్నాడు. అదేవిధంగా అశోకుడు తరువాత తనదైన ధర్మాన్ని (అశోక ధర్మాన్ని) ప్రకటించాడు. ఈ ధర్మంలోని సిద్ధాంతాలను హిందూ, బౌద్ధ, జైన మతాల నుంచి తీసుకున్నాడు.
4. మౌర్య వంశం ఎలా అంతరించింది? మౌర్య వంశ పతనానికి ఎవరు కారణం?
#అశోకుని మరణం తరువాత సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది.
1. తూర్పు
2. పశ్చిమ
-తూర్పు ప్రాంతాన్ని దశరథుడు, పశ్చిమ ప్రాంతాన్ని కునలుడు పాలించాడు. సాంప్రాతి మళ్లీ మౌర్యసామ్రాజ్యాన్ని విలీనం చేశాడు. మౌర్యుల చివరి రాజు బృహద్రధను అతని మంత్రి పుష్యమిత్రశుంగుడు హత్య చేశాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం అంతమై మగథపై శుంగల వంశం స్థాపించారు.
ప్రాక్టీస్ బిట్స్
1. మగధను పరిపాలించిన వారిలో మొదటివాడు?(3)
1) అశోకుడు 2) చంద్రగుప్త మౌర్యుడు
3) నందుడు 4) బిందుసారుడు
2. మౌర్య రాజ్య స్థాపకుడు?(2)
1) అశోకుడు 2) చంద్రగుప్తమౌర్యుడు
3) బిందుసారుడు 4) బింబిసారుడు
3. చక్రవర్తి సందేశాలను అధికారులకు
చేరవేసేవారు?(3)
1) వేగులు 2) సైనికులు
3) దూతలు 4) గూఢచారులు
4. ఇండికా గ్రంథ రచయిత?(2)
1) కౌటిల్యుడు 2) మెగస్తనీస్
3) స్ట్రాబో 4) హెరిడోటస్
5. కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లోచర్చించిన అంశం?(1)
1) రాజ్యపాలన
2) ఆర్థిక విషయాలు
3) సాహిత్యం 4) శిల్పాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు