తెలంగాణలో గ్రంథాలయోద్యమం
తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైన గ్రంథాలయోద్యమం మహోన్నతమైనది. తెలంగాణ ప్రజల్లో ఉన్న సామాజిక చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసింది గ్రంథాలయ ఉద్యమం.
అసఫ్‌జాహీల కాలంలో ప్రజలకు వాక్, పత్రికా స్వాతంత్య్రాలు, రాజకీయ హక్కులు లేవు. రాజ్యంలో వెట్టిచాకిరీ వ్యవస్థ, జాగీర్దారీ వ్యవస్థ, బాల్య వివాహాలు, అధిక పన్నులు మొదలైన పద్ధతులుండేవి. నాటి పాలకులు ప్రజల భాష పట్ల ఎంతమాత్రం సానుభూతి చూపలేదు. ప్రజల భాషతో అభివృద్ధిని వ్యతిరేకించారు. నాటి పాలకులు తెలుగు భాషను నిర్లక్ష్యం చేశారు.
8 తెలంగాణ చరిత్రలో మహోజ్వలమైన, చారిత్రాత్మకమైన ఘట్టం గ్రంథాలయోద్యమం. హైదరాబాద్ రాజ్యంలోని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యమమే గ్రంథాలయ ఉద్యమం. తెలంగాణ ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసింది ఈ ఉద్యమం. తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవానికి మార్గాన్ని సుగమం చేసింది గ్రంథాలయోద్యమం. ఫలితంగా అనేక గ్రంథాలయాల స్థాపన జరిగింది. ఈ గ్రంథాలయాలు పత్రికలు, పుస్తకాలను పాఠకులకు అందించడమేకాకుండా సభలు, సమావేశాలకు, కవితా గోష్టులకు, వివిధ సంస్థల వార్షిక ఉత్సవాలకు వేదికను కల్పించి ప్రజలను మేల్కొల్పడంలో ప్రముఖ పాత్ర పోషించాయి.
ఉర్దూభాష ప్రభావం
నాడు హైదరాబాద్ నగరం అంటేనే ఉర్దూమయం. మాట్లాడేది, చదివేది ఉర్దూలోనే. ఉర్దూ భాషయే రాజభాష, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశ వరకు ఉర్దూ బోధనా భాష కావడంతో తెలుగు భాష అజ్ఞాతవాసాన్ని అనుభవించింది. ఫలితంగా విద్యాధికుల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
1. సంస్కృతం, తెలుగు భాషావర్గం
2. ఉర్దూ, పారశీక భాషావర్గం
# ఉర్దూ, ఆంగ్ల భాషా ప్రయోజనాలు పూర్తిగా భిన్నమైనవని చెప్పవచ్చు. ఉర్దూ పరిమితమైంది. కాగా ఆంగ్ల వాజ్ఞయం అపరిమతమైంది. ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో ప్రపంచ సాహిత్యం, విజ్ఞానం తెలుసుకొనే వెసులుబాటు ఉండేది.
# హైదరాబాద్ రాజ్యంలోని ఉర్దూభాష తెలంగాణ, మహరాష్ట్ర, కన్నడ ప్రాంతాల్లో మాట్లాడే వివిధ భాషా వాజ్ఞయాల్లో ఎక్కువ పరిణామాల్ని కలుగజేయలేకపోయింది.
# బ్రిటీష్ ఇండియాలోని ప్రాంతాల్లో ఆంగ్లభాష ప్రజల విజ్ఞానానికి కారణమై వారిలో నూతనోత్సాహాన్ని కలిగించింది.
తెలుగు వాజ్మయ వికాసం
తెలుగు వాజ్ఞయం వికాసం చెందడానికి నాలుగు కారణాలు దోహదపడినట్లు తెలుస్తున్నది.
1) చరిత్ర పరిశోధన
2) విజ్ఞాన వాజ్ఞయాన్ని నిర్మించుకోవడం
3) కథానికల రచన
4) ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడే సంఘర్షణ వల్ల ప్రేరేపితమైన కవితల రచనా సంప్రదాయం.
#అదేవిధంగా తెలంగాణలో తెలుగు వికాసానికి సంస్థానాధీశులు తోడ్పడ్డారు. గద్వాల, వనపర్తి, అమరచింత మొదలైన సంస్థానాధీశులు తెలుగు కవులను ఆదరించి, పోషించారు.
గణపతి, శివాజీ ఉత్సవాలు
# క్రీ.శ. 1893లో మహారాష్ట్ర ప్రాంతంలో గణపతి ఉత్సవాల్ని ప్రారంభించాడు బాలగంగాధర్ తిలక్. ప్రజలందరినీ ఒకే దగ్గరకు చేర్చి, వారిలో ఐక్యతను పెంపొందించి, బ్రిటీష్‌వారి పరిపాలనలో జరుగుతున్న వివిధ రకాల దోపిడీని వివరించి, వారిని స్వాతంత్య్రోన్ము ఖులను చేయడానికి కృషి చేశాడు.
# క్రీ.శ. 1895లో శివాజీ ఉత్సవాలు మహారాష్ట్రలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర జాతి నిర్మాత, క్షత్రియ కులవసంత, సింహాసనాధీశ్వర, ఛత్రపతి బిరుదాంకితుడైన శివాజీ పేరు మీదుగా ఉత్సవాల్ని ప్రారంభించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి, వారిలో చైతన్యం పెంపొందించడానికి ప్రయత్నాలు జరిగాయి.
వందేమాతర ఉద్యమం
క్రీ.శ. 1905లో నాటి బ్రిటీష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ కర్జన్ విభజించు, పాలించు (డివైడ్ అండ్ రూల్) పాలసీలో భాగంగా బెంగాల్ విభజనకు పూనుకున్నాడు. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ‘వందేమాతర ఉద్యమం’ జరిగింది.
తెలంగాణలో భిన్నమైన పరిస్థితి
మహారాష్ట్ర, బెంగాల్, ఆంధ్ర, మద్రాస్, పంజాబ్ మొదలైన అనేక ప్రాంతాల్లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే, హైదరాబాద్ రాజ్యంలో నిజాం పరిపాలనలో విభిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం హరించింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో నిజాంపాలనలో మగ్గుతున్న యువత ముఖ్యంగా విద్యాధికులైన మేధావులు విద్యావ్యాప్తి చేసి ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని పోగొట్టి, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడటానికి వారిని సమాయత్తం చేయడానికి పఠనాలయాలు, గ్రంథాలయాలు స్థాపించారు. ఫలితంగా వారిలో చైతన్యం అధికమైంది. ఈ విధంగా తెలంగాణలో అనేక గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి.
# కొమర్రాజువెంకట లక్ష్మణరావు
# హైదరాబాద్ రాజ్యంలో తెలుగు, భాష సాంస్కృతిక పునర్వికాసానికి కృషి చేసిన వారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
#ఆయన తెలుగు, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం గడించారు. అంతేకాకుండా గుజరాతీ, ప్రాకృతం, సంస్కృతం, బెంగాలీ నేర్చుకున్నారు. ఆయన నాగ్‌పూర్‌లో విధ్యాభ్యాసం చేశారు.
# ఆ రోజుల్లో బి.జి.తిలక్, అగార్కర్, గోఖలే, రనడే మొదలైన జాతీయ నాయకుల ప్రభావం కొమరాజుపై పడింది.
# కేసరి అనే పత్రికలో వ్యాసాలు రాసేవారు.
#తెలంగాణలో సాంస్కృతిక చైతన్యానికి దోహదపడిన ప్రముఖ వ్యక్తి కొమర్రాజు.
# తెలుగు సాహిత్యం వికాసానికి గ్రంథాలయోద్యమం చేపట్టాలని పేర్కొనడమే కాకుండా, దానికనుగుణంగా కృషి చేశారు.
# ఊరూరా గ్రంథాలయాల్ని స్థాపించి, నిరక్షరాస్యత, అజ్ఞానంతో ఉన్న ప్రజలకు విజ్ఞానాన్ని ప్రసాదించాలని తెలుగు సాహిత్య రుచి గొప్పతనాన్ని వారికి తెలియజేయాలని చెప్పి గ్రంథాలయ ఉద్యమానికి గట్టి పునాదులు వేసిన మహానుభావుడు లక్ష్మణరావు.
# కొమరాజు చేసిన కృషితో తెలంగాణ ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం ద్విగుణీకృతమైంది.
# కొమరాజు మునగాల సంస్థానంలో రాజా నాయిని వెంకటరంగారావు వద్ద దివాన్‌గా చేరారు.

61_big
శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
# ప్రాధాన్యం: 20వ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణలో స్థాపించిన తొలి గ్రంథాలయం.
# ఆశయం: సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, తద్వారా భాషాభివృద్ధికి సాంస్కృతిక వికాసానికి కృషి చేయడం
# స్థాపకులు: మునగాల రాజా నాయిని వెంటకరంగారావు, కొమరాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు. క్రీ.శ. 1901లో హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు పేరుతో నెలకొల్పారు.
# క్రీ.శ. 1901 సెప్టెంబర్ 1వ తేన (ఆదివా రం) రాంకోఠిలోని రావిచెట్టు రంగారావు బంగళాలో తెలుగు భాషాభిమానులు సమావేశమై భాషా నిలయానికి ప్రారంభోత్సవం చేశారు. పాల్వంచ సంస్థానం రాజా పార్థసారథి అప్పారావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మునగాల రాజా నాయిని వెంకటరంగరావు, రఘుపతి వెంకటరత్నంనాయుడు, ఆదిపూడి సోమనాథరావు, డాక్టర్ గోవిందరాజులు నాయుడు, శ్రీనివాసాచారి మొదలైనవారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
# మాడపాటి హన్మంతరావు క్రీ.శ 1912లో ఈ గ్రంథాలయంలో సభ్యుడిగా చేరారు. క్రీ.శ-1914-15లో కార్యదర్శిగా ఎన్నికై శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాభివృద్ధి కోసం కృషి చేశాడు.
# భాషా నిలయం అధ్యక్షుడిగా రాజా నాయిని క్రీ.శ. 1901 నుంచి 1939 వరకు, మొదటి కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు 1906 వరకు కొనసాగారు.
# మొదట్లో రావిచెట్టురంగారావు ఇంట్లో స్థాపించిన గ్రంథాలయం, ఆ తర్వాత సొంత భవనం సమకూర్చుకున్నది. రావిచెట్టురంగారావు, పార్థసారథి అప్పారావు రూ. 750 విరాళాలు ఇచ్చారు.
సంస్థ / గ్రంథాలయం సంవత్సరం ప్రదేశం
శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం 1901 హైదరాబాద్
రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం 1904 హనుమకొండ
ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయం 1905 సికింద్రాబాద్
బాల భారతి నిలయం
ఆంధ్ర భాషాభివర్తక సంఘం 1905 శంషాబాద్
విజ్ఞాన చంద్రిక మండలి 1906 హైదరాబాద్
శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం 1908 మట్టేవాడ, వరంగల్
ఆంధ్రభాషా నిలయం 1910 ఖమ్మం
సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం 1913 సికింద్రాబాద్
సిద్ది మల్లేశ్వర గ్రంథాలయం 1913 రేమిడిచర్ల, మధిర తాలూకా
ఆంధ్ర సరస్వతీ గ్రంథనిలయం 1918 నల్లగొండ
ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం 1918 సూర్యాపేట
రెడ్డిహాస్టల్ గ్రంథాలయం 1918 హైదరాబాద్
విజ్ఞాన ప్రచురిణి ముద్రణాలయం 1919 ఇనుగుర్తి
దేశోద్ధారాక గ్రంథమాల స్థాపకుడు వట్టికోట ఆళ్వారుస్వామి
భాషా కల్పవల్లి 1920
శ్రీ బాల భారతి నిలయం 1921 నల్లగొండ
ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం 1921 ఖమ్మం
శ్రీ వెంకటేశ్వర గ్రంథాలయం 1922 గార్ల, ఖమ్మం
ఉమామహేశ్వర ఆంధ్రభాషా నిలయం 1922 సిద్దిపేట, మెదక్
బాల సరస్వతి గ్రంథాలయం 1922 అఫ్జల్‌గంజ్, హైదరాబాద్
విజ్ఞాన ప్రచారిణి గ్రంథాలయం 1923 మంథని
వైదిక గ్రంథాలయం 1923 మంథని
బాలసరస్వతీ గ్రంథాలయం 1923 మంథని
శ్రీ యువజన సంఘ గ్రంథాలయం 1924 జనగామ
ప్రతాపరుద్రాంధ్ర భాషా నిలయం 1924
ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం 1925
ఆది హిందు లైబ్రరీ 1926
వైశ్య సంఘం గ్రంథాలయం 1926
జోగిపేట గ్రంథాలయం 1930 జోగిపేట, మెదక్
సీతరామాంజనేయ హిందు వర్తక గ్రంథాలయం 1930 సింగరేణి
విద్యాభివర్ధిని గ్రంథాలయం 1939 తోటపల్లి, కరీంనగర్
బాపూజీ గ్రంథాలయం 1939 మహబూబాబాద్
గాంధీ గ్రంథాలయం 1940 హన్మకొండ
రైతు గ్రంథాలయం 1941 చిలుకూరు, నల్లగొండ
శ్రీ హనుమదాంధ్ర గ్రంథాలయం 1943 ములకపల్లి, ఖమ్మం
వివేక వికాసిని సూర్యాపేట, నల్లగొండ
చెన్నకేశవాంధ్ర భాషా నిలయం 1946 పరకాల
మధుసూదన్. బి
సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ హిస్టరీ
హైదరాబాద్
9440082663
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






