మన దేశంలో శిల్పం – కట్టడం (TET Special)
- భారత ఉపఖండంలో మొట్టమొదటి నగరాలు 5000 సంవత్సరాల క్రితం వాయవ్య ప్రాంతాలైన బెలుచిస్థాన్, సింధూ, పంజాబ్, గుజరాత్‌లలో ఏర్పడ్డాయి.
- భారత ఉపఖండంలో పేరుగాంచిన హరప్పా, మొహెంజోదారో, కాళీబంగన్, లోథాల్ ప్రాచీన నగరాలు.
- ఇవి సింధూ నది, దాని ఉపనదులతో ఏర్పడిన మైదాన ప్రాంతాల్లో ఉండటం వల్ల దీన్ని సింధూలోయ నాగరికత అని పిలిచారు.
- నగరాలు అంటే, జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట, ఆహార సేకరణలపై ఆధార పడకుండా జీవించే అధిక జనాభా కలిగిన నివాస ప్రాంతాలు.
- హరప్పా నాగరికత నగరాల్లోని భవనాలు బాగా కాల్చిన, నిర్ణీత ఆకారం, పరిమాణం గల ఇటుకలతో నిర్మించడం ఆ నగరాల విశిష్టత. ప్రణాళికాబద్ధమైన, చదరంగంలోని గడుల వలె ఒకదానికొకటి ఖండించుకుంటూ వంకరలు లేని రహదారులు., గృహాల నుంచి వచ్చే మురుగు నీటి పారుదలకు కాల్వలు, వర్షపు నీరు వెళ్ళడానికి కాల్వలు నిర్మించారు.
- హరప్పా ప్రజలు రాగి, వెండి, తగరం, మిశ్రమ లోహాలైన ఇత్తడి వస్తువులను ఉపయోగించేవారు. కానీ ఇనుము ఉపయోగించలేదు.
- పత్తి, ఉన్ని దుస్తులను తయారు చేసి, ఉపయోగించేవారు.
- నేటి ఇరాక్ వంటి సుదూర దేశాలకు ఓడలపై వర్తక, వాణిజ్యాలు నిర్వహించారు.
- పరిపాలనలో కేంద్రీకృత వ్యవస్థను రాజు, పూజారి లేదా కొంతమంది ఎన్నికైన నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
- ఈ ప్రాంతంలో ప్రవహించే నదులు ఎండిపోవడం వల్ల ప్రజలు తూర్పువైపునకు గంగానది వైపు తరలిపోయినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
- మౌర్యుల కాలంలో అశోకుడు పొడవైన ఏకశిలా నునుపైన స్తంభాలను పాతించి, వాటిపైన జంతువుల ఆకృతులు అమర్చి, సందేశాలను చెక్కించారు.
- సారనాథ్‌లో సింహశిఖరాన్ని నాలుగు తలలు, నాలుగు దిక్కుల ధర్మచక్రాన్ని చూపిస్తున్న స్తంభాన్ని అశోకుడు నిర్మించాడు.
- ఒకే వేదికపైన నిర్మించిన అర్ధగోళపు ఆకారమే స్థూపం. దీని మధ్యలో బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువు అవశేషాలు (దంతం, ఎముక, జుట్టు ఇతర శరీర భాగాలు) ఉంటాయి. అర్ధగోళం పూర్తిగా మూసి ఉన్నందున లోనికి ప్రవేశంలేదు. దీనిపైన ఒక స్తంభం, దాని చివర ఛత్రం ఉంటాయి.
- స్థూపాలను అశోకుడి కాలంలో మట్టి, ఇటుక, చెక్కతో నిర్మించగా, అనంతరం రాతితో నిర్మించారు.
స్థూపాన్ని బుద్ధుడికి ప్రతీకగా భావిస్తారు. స్థూపపు గుమ్మటాన్ని (అర్ధగోళం) విశ్వంగాను, స్తంభాన్ని, భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా భావిస్తారు, దీన్ని యాత్రికులు పుష్పాలతో పూజిస్తూ, చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. స్థూపం బయట ధ్యానం చేస్తారు. - ఆంధ్రపదేశ్‌లో అమరావతి, భట్టిప్రోలు, రామతీర్థం, శాలిహుండంలలో స్థూప శిథిలాలు వెలుగు చూశాయి.
- భట్టిప్రోలు దగ్గరున్న స్థూపం వద్ద బుద్ధుని అస్థిక కలిగిన స్పటిక పేటిక బయటపడింది.
అమరావతి స్థూపాన్ని శాతవాహనుల కాలంలో నిర్మించారు. ఇందులో శిల్పతోరణాలు, బుద్ధుడి బోధనలు, జీవిత విశేషాల శిల్పసంపద అమూల్యం. వీటిని మద్రాస్ మ్యూజియం, లండన్ మ్యూజియాలకు తరలించారు. - నాగర్జునకొండ వద్ద ఇక్షాకుల రాజధాని విజయపురిలో మరో ముఖ్యమైన స్థూపం, రాజ ప్రాసాదాలు, క్రీడా ప్రాంగణం, నదీస్నాన ఘట్టాలు వెలుగు చూశాయి.
- ప్రఖ్యాత బౌద్ధశిల్పాలు గాంధార నుంచి మధుర, సారనాథ్ వరకు వ్యాపించాయి.
- విహారాలు బౌద్ధ భిక్షువులు, సన్యాసులు నివసించిన ఆవాసాలు లేదా పీఠాలు.
- విహారాల్లో ఉండే పూజా మందిరాన్ని చైత్యం/బౌద్ధభిక్షువుల ప్రార్థన స్థలం అంటారు
- విహారాలలో నాసిక్, కార్లే విహారాలు అందమైన శిల్పాలతో చెక్కి ఉన్నాయి.
- తక్షశిల, నాగార్జునకొండ, నలంద విహారాలు రాతి ఇటుకలతో నిర్మించి గొప్ప విద్యా కేంద్రాలుగా భాసిల్లాయి.
- బౌద్ధ విద్యా కేంద్రాల్లో చైనా యాత్రికులైన ఫాహియాన్, ఇత్సింగ్, హ్యుయాన్‌త్సాంగ్ వంటి వారు వీటిని సందర్శించారు. నలంద విద్యాకేంద్రంలో హ్యుయన్‌త్సాంగ్ విద్యాభ్యాసం చేశారు.
- శాతవాహనుల కాలంలో కార్ల్, ఖాజా, కన్హేరి, నాసిక్‌లలో విహారాల నిర్మాణానికి వర్తకులు, వృత్తికళాకారులు విరాళాలిచ్చారు.
Previous article
Know the mulki issue (TSLPRB Special)
Next article
ఆర్థికం, అభివృద్ధి మిశ్రమమే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు