PHYSICS | చలనంలో ఉన్న బస్సు నుంచి ఏ విధంగా దిగాలి?
గతిశాస్త్రం (Kinetics)
1. భూమి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం నియంత్రణ కోల్పోయినప్పుడు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?
1) వృత్తాకార మార్గానికి కోణీయంగా అవతలి వైపు
2) వృత్తాకార మార్గానికి లంబంగా
3) వృత్తాకార మార్గానికి సమాంతరంగా
4) వృత్తాకార మార్గానికి 60 డిగ్రీల కోణం అవతలి వైపు
2. చంద్రుడి ఉపరితలంపై 6 కిలోల ద్రవ్యరాశి గల వస్తువు బరువు (భూమి g=m/s2)?
1) 6 N 2) 60 N
3) 10 N 4) 30 N
3. ఒక బుల్లెట్‌ను చెక్క దిమ్మెలోకి పేల్చినప్పుడు కింది వాటిలో ఏది నిత్యత్వం?
1) రేఖీయ ద్రవ్యవేగం 2) వేగం
3) స్థితిజ శక్తి 4) గతిజ శక్తి
4. చర్య-ప్రతిచర్య సమానం, వ్యతిరేకం అని చెప్పేది?
1) న్యూటన్ మొదటి గమన నియమం
2) న్యూటన్ రెండో గమన నియమం
3) న్యూటన్ మూడో గమన నియమం
4) న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం
5. కింది వాటిని జతపరచండి.
సూత్రం అనువర్తనం
ఎ. ప్రచోదన బలం 1. చేతిపంపు పనిచేయడం
బి. బల భ్రామకం 2. గ్రహాల గమనం
సి. యాంత్రిక శక్తి 3. బంతిని బ్యాట్‌తో కొట్టడం
డి. కోణీయ ద్రవ్యవేగం 4. ఎగిరే పక్షి నిత్యత్వ నియమం
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-1, డి-2
6. జిమ్నాస్టిక్స్‌లో గాలిలో గిరగిరా తిరగడం వంటి విన్యాసాలు ఏ ఆధారంగా చేస్తారు?
1) శక్తినిత్యత్వ నియమం
2) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
3) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
4) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
7. మజ్జిగను కవ్వంతో చిలికినప్పుడు జరిగే ప్రక్రియకు కింది వాటిలో సరైన వివరణ ఏది?
1) చిలకడం వల్ల వేడిపుట్టి వెన్న, మజ్జిగలు వేరుపడతాయి
2) తేలికగా ఉన్న వెన్న అపకేంద్ర బలం వల్ల పాత్ర అంచుల వద్దకు చేరుతుంది
3) తేలికగా ఉన్న మజ్జిగ అపకేంద్ర బలం వల్ల పాత్ర అంచుల వద్దకు చేరుతుంది
4) బరువుగా ఉన్న మజ్జిగ అపకేంద్ర బలం వల్ల పాత్ర అంచుల వద్దకు చేరుతుంది
8. న్యూటన్ చలన సూత్రాల్లో ఉండేది?
1) లా ఆఫ్ ఇనర్షియా
2) లా ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఫోర్స్
3) లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్
4) పైవన్నీ
9. కిందివాటిలో సరైనది ఏది?
ఎ. ఫలిత బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉంటుంది- న్యూటన్ రెండో నియమం
బి. గమన స్థితిలో మార్పును వ్యతిరేకించే ధర్మమే జడత్వం
1) ఎ 2) బి 3) ఎ, బి
4) పైవేవీకాదు
10. లాంగ్‌జంప్ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొంతదూరం నుంచి పరుగెత్తుతూ వస్తాడు. ఎందుకు?
1) గమన జడత్వాన్ని పొందడానికి
2) బలాన్ని పెంచుకోవడానికి
3) శక్తిని పెంచుకోవడానికి
4) కండరాలను అనుకూలంగా మలచుకోవడానికి
11. న్యూటన్ మూడో గమన నియమంలో చెప్పిన చర్య-ప్రతిచర్య బలాలకు సంబంధించి సరైన వివరణ ఏది?
1) చర్య, ప్రతిచర్య ఒకే వస్తువుపై పనిచేస్తాయి
2) చర్య, ప్రతిచర్య వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి
3) చర్య, ప్రతిచర్యలు సమానంగా ఉంటాయి
4) 1, 2
12. ప్రతిపాదన (ఎ): క్రికెట్ ఆటగాడు అతివేగంగా తన వైపునకు వచ్చే బంతిని పట్టుకోవడానికి తన చేతులను వెనుకకు లాగుతాడు
కారణం (ఆర్): బంతిని తప్పిపోకుండా పట్టుకోవడానికి
1) ఎ, ఆర్ లు రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ లు రెండూ నిజం కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ నిజం కానీ ఆర్ తప్పు
4) ఎ తప్పు కానీ ఆర్ నిజం
13. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణం అభికేంద్ర త్వరణం
బి. సమ వృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై పనిచేసే ఫలిత బలం అభికేంద్ర బలం
1) ఎ, బి 2) ఎ
3) బి 4) పైవేవీ కాదు
14. కిందివాటిలో సరైనది?
ఎ. వస్తువుపై పనిచేసే భౌమ్యాకర్షణ బలాన్ని భారం అంటారు
బి. ద్రవంలో ఉన్న వస్తువులపై ఊర్ధ దిశలో కలుగజేసే బలాన్ని ఉత్ప్లవనం అంటారు
1) ఎ 2) ఎ, బి
3) బి 4) పైవేవీ కాదు
15. బాహ్యబల ప్రమేయం లేనంతవరకు వస్తువు స్థితిలో మార్పు ఉండదు. అని చెప్పేది?
1) న్యూటన్ మొదటి గమన నియమం
2) న్యూటన్ రెండో గమన నియమం
3) న్యూటన్ మూడో గమన నియమం
4) న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం
16. కదులుతున్న బస్సుకు అకస్మాత్తుగా బ్రేకు వేసినప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తులు ముందుకు కదులుతారు. దీనికి కారణం ఏది?
1) ప్రచోదనం 2) ప్రత్యవస్థానం
3) స్థితిస్థాపకత 4) జడత్వం
17. కింద పేర్కొన్న ఏ సూత్రంపై ఆధారపడి రాకెట్ పనిచేస్తుంది?
1) శక్తి నిత్యత్వ నియమం
2) బెర్నౌలీ నియమం
3) అవగాడ్రో సిద్ధాంతం
4) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
18. ప్రతిపాదన (ఎ): ఒక వృత్తాకార మార్గంలో తిరిగే వస్తువు స్థిరవడి కలిగి ఉంటే దానిపై బలం పనిచేయదు
కారణం (ఆర్): ఒక వృత్తాకార మార్గంలో చలించే వస్తువు వేగ సదిశ మారుతుంది
1) ఎ తప్పు, ఆర్ సరైనది
2) ఎ, ఆర్ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
3) ఎ, ఆర్ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
4) ఎ, ఆర్ రెండూ తప్పు
19. రేఖీయ చలనంలో ఒక వస్తువుకు సంబంధించిన ఏ భౌతికరాశిని జడత్వానికి కొలతగా తీసుకోవచ్చు?
1) ఘనపరిమాణం 2) ఆకారం
3) ద్రవ్యరాశి 4) పైవన్నీ
20. కింది వాటిని జతపరచండి.
ఎ. డాల్టన్ 1. గమన నియమాలు
బి. న్యూటన్ 2. పరమాణు సిద్ధాంతం
సి. ఫారడే 3. సాపేక్ష సిద్ధాంతం
డి. ఐన్‌స్టీన్ 4. విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రాలు
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
21. చలనంలో ఉన్న బస్సు నుంచి దిగేటప్పుడు ఏవిధంగా దిగాలి?
1) ముందుకు పరిగెడుతూ
2) వెనుకకు పరిగెడుతూ
3) దిగిన చోట కదలకుండా నిలబడాలి
4) 1 లేదా 2
22. తుపాకీని పేల్చినప్పుడు బుల్లెట్ ముందుకు పోతుంది. అయితే తుపాకీ కూడా కొంత వెనుకకు రావడంలో ఇమిడి ఉన్న నియమం?
1) న్యూటన్ మొదటి గమన నియమం
2) న్యూటన్ రెండో గమన నియమం
3) ద్రవ్యవేగ నిత్యత్వం
4) శక్తి నిత్యత్వం
23. ఒకే వేగంతో ప్రయాణిస్తున్న లారీ, కారుకు ఒకే బలం కలిగిన బ్రేకు వేసినప్పుడు?
1) రెండూ ఒకే దూరంలో ఆగుతాయి
2) రెండూ ఒకేసారి ఆగుతాయి
3) కారు.. లారీ కంటే తక్కువ దూరంలో ఆగుతుంది
4) లారీ.. కారు కంటే తక్కువ దూరంలో ఆగుతుంది
24. ప్రతిపాదన (ఎ): ఒక కంబళి (తివాచీ)ని కర్రతో కొట్టినప్పుడు దుమ్ము బయటకు వస్తుంది
కారణం (ఆర్): గమన స్థితిలో గాని, నిశ్చల స్థితిలో గాని ఉన్న వస్తువు తన స్థితిలో మార్పును వ్యతిరేకించే ధర్మాన్ని జడత్వం అంటారు.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కాని ఆర్ కాదు
4) ఎ తప్పు కాని ఆర్ సరైనది
25. కేంద్రకంలోని రెండు న్యూట్రాన్ల మధ్య పని చేసే బలం ఏది?
1) గురుత్వాకర్షణ
2) విద్యుదయస్కాంత బలం
3) బలమైన కేంద్రక బలం
4) దుర్బల అన్యోన్య చర్యాబలం
26. గుర్రపు స్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణాలేంటి?
1) జడత్వ భ్రామకం
2) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
3) నిశ్చల జడత్వం
4) న్యూటన్ మూడో గమన నియమం
27. రహదారులను మలుపు వద్ద ఏవిధంగా నిర్మిస్తారు?
1) మలుపు తిరిగే వైపు కంటే బయటి వైపు తక్కువ ఎత్తులో
2) మలుపు తిరిగే వైపు కంటే బయటి వైపు ఎక్కువ ఎత్తులో
3) మలుపు తిరిగే వైపు, బయటి వైపు సమాన ఎత్తులో
4) రహదారి రూపకల్పన ఎలాంటి
ప్రభావాన్ని చూపించదు
28. పై నుంచి కిందికి పడుతున్న వస్తువులో శక్తి మార్పు ఏవిధంగా ఉంటుంది?
1) స్థితిజశక్తి-గతిజశక్తిగా
2) గతిజశక్తి-స్థితిజశక్తిగా
3) గతిజశక్తి-పీనశక్తిగా
4) స్థితిజశక్తి- పీడనశక్తిగా
29. ఒక చేత్తో నీటి బకెట్‌ను తీసుకుని వెళ్తున్న వ్యక్తి ఒకవైపు వంగడానికి కారణం?
1) నీళ్లు పడిపోకుండా
2) ద్రవ్యరాశి కేంద్రాన్ని రెండు కాళ్ల మధ్య ఉంచుకోవడానికి
3) గరిమనాభిని రెండు కాళ్ల మధ్యు ఉంచుకోవడానికి
4) గరిమనాభిని రెండు కాళ్ల బయట ఉంచుకోవడానికి
30. తడిగా ఉన్న టవల్‌ను దులిపినప్పుడు దానిలోని నీటి బిందువులు బయటకు రావడానికి కారణం?
1) జడత్వం 2) ప్రచోదనం
3) టార్క్ 4) ఏవీకాదు
31. ఈత కొలనులోకి డైవింగ్ చేసే వ్యక్తి గాల్లో భ్రమణాలు చేయడానికి ఏమి చేస్తాడు?
1) కాళ్లు చేతులను దగ్గరికి ముడుచుకుంటాడు
2) కాళ్లు చేతులను దూరంగా ముడుచుకుంటాడు
3) కాళ్లు దూరంగా చాపి, చేతులను దగ్గరకు ముడుచుకుంటాడు
4) చేతులను దూరంగా చాపి కాళ్లను దగ్గరకు ముడుచుకుంటాడు
32. బాంబు విస్ఫోటనం, తుపాకీ పనిచేయడంలో ఏ నిత్యత్వ నియమం ఇమిడి ఉంది?
1) న్యూటన్ మూడో గమన నియమం
2) రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
3) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
4) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
33. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు తిరగడానికి కారణం?
1) స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంత విద్యుత్ ప్రవాహం ఉంటుంది
2) భ్రమణ జడత్వం వల్ల మరికొంత సేపు తిరుగుతుంది
3) ఫ్యాన్ తీగచుట్టలో ఉండే
అయస్కాంత శక్తి
4) గదిలోని గాలి
34. కింది వాటిలో సరైనది?
ఎ. ఒక వస్తువు యాంత్రిక శక్తి అనేది స్థితి, గతిశక్తులపై ఆధారపడుతుంది
బి. శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారడాన్ని శక్తినిత్యత్వ నియమం అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కాదు
35. వస్తువు చలనం వల్ల కలిగే శక్తిని ఏమని అంటారు?
1) స్థితిజ శక్తి 2) గతిజ శక్తి
3) ఆకర్షణ శక్తి 4) గురుత్వాకర్షణ శక్తి
36. నీటిలో నిశ్చల స్థితిలో ఉన్న పడవపై ఒక వ్యక్తి ఒక చివర నుంచి మరొక చివరకు నడిచినప్పుడు ఏం జరుగుతుంది?
1) వ్యక్తి ముందుకు నడిస్తే పడవ వెనుకకు కదులుతుంది
2) వ్యక్తితో పాటు పడవ కూడా ముందుకు కదులుతుంది
3) వ్యక్తి నడిచినప్పటికీ పడవ ముందుకు కానీ వెనుకకు కానీ కదలదు
4) పడవ అటూ ఇటూ ఊగుతుంది, స్థానం మారదు
37. పడవపై నుంచి ఒక వ్యక్తి ఒడ్డుపైకి దూకినప్పుడు పడవ వెనక్కి జరుగుతుంది. దీన్ని ఏ సూత్రం ఆధారంగా వివరించవచ్చు?
1) న్యూటన్ మొదటి గమన నియమం
2) న్యూటన్ రెండో గమన నియమం
3) న్యూటన్ మూడో గమన నియమం
4) న్యూటన్ గురత్వాకర్షణ నియమం
38. వస్తువు భారం మొత్తాన్ని ప్రతిబింబించే బిందువును ఏమంటారు?
1) గరిమనాభి 2) ద్రవ్యరాశి కేంద్రం
3) బల కేంద్రం
4) జ్యామితీయ కేంద్రం
39. న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాల్లో దేనికి అధిక ప్రాధాన్యం ఉంది?
1) మొదటి నియమం
2) రెండో నియమం
3) మూడో నియమం
4) అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఉంది
40. గరిమనాభి, ద్రవ్యరాశి కేంద్రాలకు సంబంధించి సరైన ప్రవచనం ఏది?
1) అన్ని వస్తువులకు గరిమనాభి, ద్రవ్యరాశి కేంద్రంతో ఏకీభవిస్తుంది
2) ఏ వస్తువు గరిమనాభి కూడా దాని ద్రవ్యరాశి కేంద్రంతో ఏకీభవించదు
3) కొన్ని వస్తువులతో గరిమనాభి, ద్రవ్యరాశి కేంద్రంతో ఏకీభవిస్తుంది
4) గరిమనాభి, ద్రవ్యరాశి కేంద్రం రెండూ ఒకే అర్థాన్నిస్తాయి
సమాధానాలు
1. 1 2. 3 3. 1 4.3
5. 2 6. 3 7.4 8.4
9.2 10.1 11.4 12.3
13.1 14.2 15.1 16.4
17.4 18.1 19.3 20.1
21.1 22.3 23.3 24.1
25.3 26.3 27.2 28.1
29.3 30.1 31.1 32.2
33.2 34.3 35.2 36.1
37.3 38.1 39.2 40.3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు