Indian History | శివాజీ 1653లో ప్రవేశపెట్టిన నూతన శకం ఏది?
1. ఏ సంవత్సరంలో శివాజీ పట్టాభిషిక్తుడై“ఛత్రపతి” బిరుదును పొందాడు?
1) 1673 2) 1674
3) 1675 4) 1676
2. మరాఠా కూటమి ఆవిర్భవించడానికి ముఖ్యమైన కారణం?
1) మలి మొగల్ చక్రవర్తుల నిరంకుశ పాలన
2) మొగలు చక్రవర్తుల బలహీనత
3)మలి మొగలులు అనుసరించిన సావధాన, రాజీ విధానం
4) ఢిల్లీకి మరాఠాల పయనం
3. శివాజీ సాపేక్షికంగా శక్తిమంతమైన సైన్యాన్ని నిర్వహించాడు. నౌకాశక్తి ద్వారా శివాజీ సాధించిన ప్రయోజనాలు?
ఎ. జంజీరా దీవులకు చెందిన సిద్దీల సముద్రపు దొంగ కార్యకలాపాలను అరికట్టాడు
బి. పోర్చుగీసువారి కార్యకలాపాలను అరికట్టాడు
సి. అరేబియా వర్తకాన్ని అభివృద్ధిలోకి తెచ్చాడు
డి. ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను నివారించాడు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి
4) సి, డి
4. కింది వాటిలో మహారాష్ట్ర రాజ్య రాజధానిగా వర్ధిల్లిన ప్రాంతం ఏది?
1) రాయ్‌గఢ్ 2) డిండి, సతార
3) కొల్హాపూర్ 4) పైవన్నీ
6. శివాజీ, జైసింగ్ మధ్య కుదిరిన పురందర్ సంధి (1665), ఒడంబడికలో భాగం కానిది?
1) 35 దుర్గాల్లో 25 దుర్గాలను మొగలులకు అప్పగించడానికి శివాజీ అంగీకరించాడు
2) బీజాపూర్‌లోని కొంకణ్, బాల్ఘాట్ ప్రాంతాన్ని శివాజీకి ఇచ్చారు
3) శివాజీ మైనర్ కుమారుడైన శంభాజీకి మన్నబ్ 5000 మంజూరు చేశాడు
4) శివాజీని ఆగ్రా సందర్శించమని కోరారు
7. శివాజీ మొదట ఆక్రమించిన కోట?
1) తోరణ దుర్గం 2) కళ్యాణ్
3) భివాండి 4) మెహాలి
8. శివాజీ కంటే ముందే మహారాష్ట్ర ప్రాంతాన్ని సంస్కృతి పరంగా ఏకం చేసిందెవరు?
1) ఏక్నాథ్ 2) తుకారం
3) రామదాసు 4) పైవారందరూ
9. శివాజీ రాజకీయ వ్యవస్థలో అనేక ఆధునిక భావాలున్నాయి. కింది వాటిలో అవి గుర్తించండి?
ఎ. వితంతు వివాహాల ప్రోత్సాహం
బి. వెట్టిచాకిరీని నిషేధించడం
సి. వడ్డీ వ్యాపారాలకు ప్రోత్సాహం
డి. భౌగోళిక ప్రాతిపదిక మీద పౌరసత్వం ప్రదానం
1) ఎ. బి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
10. శివాజీ ఆక్రమించిన తొలి దుర్గం ఏది?
1) తోరణ 2) రాయ్‌గఢ్
3) పూనా 4) సింహగఢ్
11. శివాజీని ఓడించిన మొగల్ సేనాని ఎవరు?
1) దిలావర్ఖాన్ 2) బడేఖాన్
3) జైసింగ్ 4) రాజ్యసింగ్
12. ‘చౌత్’ అనేది కింది వాటిలో దేన్ని సూచిస్తుంది?
1) మరాఠా ప్రభుత్వం విధించిన పన్ను
2) మూడోశక్తి దాడి నుంచి రక్షణ కల్పించినందుకు ప్రతిగా చెల్లించే పన్ను.
3) స్వరాజ్య పౌరుల మీద విధించిన పన్ను
4) స్వరాజ్య ప్రజల మీద, మొగలు భూభాగం మీద విధించిన పన్ను.
13. అష్ట ప్రధానుల్లో ప్రధానమంత్రిని ఏమని వ్యవహరించారు?
1) అమాత్య 2) పీష్వా
3) సుర్నవిష్ 4) సుమంత్
14. అష్ట ప్రధానుల్లో యుద్ధ రంగానికి వెళ్లనిది ఎవరు?
1) పండితరావు 2) న్యాయాధీశ్
3) ఎ, బి 4) పైవేవీ కావు
15. శివాజీ 1653లో ప్రవేశపెట్టిన నూతన శకం ఏది?
1) శకయుగం 2) విజయ శకం
3) విక్రమశకం 4) జయశకం
16. ఏ మరాఠా పాలకుడి కాలం నుంచి మహారాష్ట్రలో పీష్వాల ప్రాబల్యం పెరిగింది?
1) రెండో శివాజీ 2) సాహు
3) మూడో శివాజీ
4) మూడో రాజారాం
17. కింది వాటిలో మరాఠాల పతనానికి కారణాలు ఏవి?
ఎ. మరాఠా సర్దారుల్లో ఐకమత్యం లేకపోవడం
బి. మారిన యుద్ధతంత్రాలు
సి. కుల ప్రాతిపదికన గల రాజకీయాలు
డి. బ్రిటిష్ వారి శక్తి వృద్ధి చెందడం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
18. శివాజీ ఏ యూరోపియన్ దేశస్థుల సాయంతో ‘మలావాన్’ ఓడరేవును నిర్మించాడు?
1) ఆంగ్లేయులు 2) ఫ్రెంచ్‌వారు
3) పోర్చుగీసువారు 4) డచ్‌వారు
19. శివాజీ ఆదేశంతో పరిపాలన కోసం ‘పండిట్ హనుమంత్’ రచించిన గ్రంథం ఏది?
1) రాజ్య వ్యవహార కోశం
2) విజ్ఞానేశ్వరీయం
3) నీతిశాస్త్రం 4) నీతిసారం
20) కింది వాటిలో సరైంది ఏది?
1) కథి – భూమిని కొలిచే సాధనం
2) ఫక్ – శివాజీ సైన్యంలో అశ్వికదళం
3) బర్గీల్ – గుర్రాలు, ఆయుధాలు సరఫరా చేసే ప్రభుత్వాధికారి 4) పైవన్నీ
21. శివాజీ కాలంలో ప్రధాన నౌకాదళ కేంద్రం ఏది?
1) కళ్యాణ్ 2) కొలబా
3) భివాండి 4) సతార
22. శివాజీ అనంతరం మహారాష్ట్ర రాజ్య పాలకుడైన శివాజీ వారసుడు ఎవరు?
1) శంభాజీ 2) సాహు
3) రాజారాం 4) రెండో శంభాజీ
23. శంభాజీని వధించి, అతడి కుమారుడిని బంధించిన మొగల్ పాలకుడెవరు?
1) బహదూర్షా 2) ఔరంగజేబు
3) ఫరూక్ సియర్ 4) షా ఆలం
24. జతపరచండి :
1) సచివుడు ఎ) ఉత్తర, ప్రత్యుత్తరాల మంత్రి
2) న్యాయాధీశుడు బి) న్యాయమంత్రి
3) సుమంతుడు సి) విదేశీ వ్యవహారాలు
4) అమాత్యుడు డి) ఆర్థిక మంత్రి
1) 1-ఎ 2-బి 3-డి 4-సి
2) 1-బి 2-ఎ 3-సి 4-డి
3) 1-ఎ 2-సి 3-బి 4-డి
4) 1-ఎ 2-బి 3-సి 4-డి
25. శివాజీ వధించిన బీజాపూర్ సేనాని
1) మహబత్‌ఖాన్ 2) అఫ్జల్ఖాన్
3) నూజ్ఖాన్ 4) బాజ్‌ఖాన్
26. శివాజీ ఆస్థానంలో “దబీర్” మంత్రిత్వశాఖ ఏది?
1) విదేశాంగ 2) ప్రధాని
3) రెవెన్యూ 4) అంతరంగిక
27. శంభాజీ ఎక్కడ ఉరితీయబడ్డాడు?
1) ఔరంగాబాద్ 2) సంగమేశ్వర్
3) రాయ్‌గఢ్ 4) పూనా
28. ‘మహారాష్ట్ర జాతిపిత’గా గుర్తింపు పొందింది ఎవరు?
1) శివాజీ 2) శంభాజీ
3) రాజారాం 4) సాహు
29. ఆంగ్లేయులకు ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని ఇచ్చింది ఎవరు?
1) రంజిత్‌సింగ్ 2) దిలీప్‌సింగ్
3) రాణి జిందాన్ 4) కరణ్‌సింగ్
30. శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు రచించిన గ్రంథం ఏది?
1) అమరచిత్ర 2) దాసబోధ
3) రత్నావళి 4) నీతిశాస్త్ర ముక్తావళి
31. శివాజీ తాను ఆక్రమించిన ఏ కోటకు ‘విజయపురి’గా నామకరణం చేశాడు?
1) పురందర్ 2) రాయ్‌గఢ్
3) సింహగఢ్ 4) కోండస్
32. శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయులు ఎవరు?
1) ఆక్సింగన్ 2) రాల్పిచ్
3) వాట్సన్ 4) థామస్ రో
33. శివాజీ జీవితంలో ప్రముఖ సంఘటనల – సంవత్సరాలను జతపరచండి.
జాబితా -1 జాబితా -2
1) శివాజీ జననం ఎ) 1627
2) మొదటిదాడి బి) 1646
3) పురందర్ సంధి సి) 1665
4) ఛత్రపతిగా పట్టాభిషేకం డి) 1674
4) మరణం ఇ) 1680
1) 1-ఎ 2-బి 3-సి 4-డి 5 -ఇ
2) 1-ఇ 2-డి 3-ఇ 4-బి 5- ఎ
3) 1-సి 2-ఎ 3-ఇ 4-బి 5 -డి
4) 1-డి 2-ఇ 3-బి 4-ఎ 5-సి
34. శివాజీని అత్యంత ప్రభావితం చేసిన అతడి తల్లి జిజియాబాయి ఏ వంశానికి చెందిన వారు?
1) పాండ్య 2) యాదవ
3) చేర 4) రాష్ట్రకూట
35. మొగలులను ఎదిరించిన మహారాష్ట్ర వీర వనిత ఎవరు?
1) జిజియాబాయి 2) వసూబాయి
3) తారాబాయి 4) రాజసబాయి
36. శంభాజీని బంధించినదెవరు?
1) అసఫ్ఖాన్ 2) షేర్‌ఖాన్
3) జిలాని 4) ముష్బ్ఖ్రాన్
37. రజియా సుల్తానా తన భర్తతో యుద్ధంలో మరణించింది. ఆమె భర్త పేరు?
1) యుకుట్ 2) కబీర్‌ఖాన్
3) అల్తునియా
4) పైవారు ఎవరూ కాదు
38. మహారాష్ట్ర కూటమిని ఏర్పాటు చేసిన పీష్వా ఎవరు?
1) మొదటి బాజీరావు
2) బాలాజీ విశ్వనాథ్
3) రెండో నారాయణరావు
4) నానా సాహెబ్
39. ‘హిందూ పద్ పద్ షాహీ’ ఆశయం కోసం కృషి చేసిన వ్యక్తి ఎవరు?
1) మొదటి బాజీరావు
2) రెండో బాజీరావు
3) నారాయణరావు
4) బాలాజీ బాజీరావు
40. పీష్వా పదవిని ఎప్పుడు రద్దు చేశారు?
1) 1772 2) 1818
3) 1880 4) 1795
41. కింది వాటిలో సరైంది ఏది?
1) మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం : 1775-82
2) రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం : 1803 – 05
3) మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం : 1817 -18
4) పైవన్నీ
42. జతపరచండి.
జాబితా – 1 జాబితా -2
1) చివరి పీష్వాల్లో గొప్పవారు ఎ) మాధవరావు
2) మొదటి పీష్వా బి) బాలాజీ విశ్వనాథ్
3) పీష్వాల్లో అగ్రగణ్యుడు సి) మొదటి బాజీరావు
4) చివరి పీష్వా డి) రెండో బాజీరావు
5) మూడో పానిపట్ ఇ) సదాశివరావు యుద్ధ మరాఠా నాయకుడు
1) 1-ఎ 2-బి 3-సి 4-డి 5-ఇ
2) 1-ఇ 2-డి 3-సి 4-బి 5-ఎ
3) 1-సి 2-బి 3-ఎ 4-ఇ 5-డి
4)1-డి 2 -ఎ 3-ఇ 4-సి 5 -బి
44. బాలాజీ విశ్వనాథ్ బిరుదు ఏమిటి?
1) సేవాకార 2) హింద్షాహీ
3) షేఫ్కార్ 4) దివాన్
45. పీష్వాలలో చివరి వాడెవరు?
1) మాధవరావు 2) నారాయణరావు
3) రఘునాధరావు 4) రెండో బాజీరావు
46. తత్వబోధిని సభను స్థాపించినదెవరు?
1) దేవేంద్రనాథ్ ఠాగూర్
2) కేశవచంద్రసేన్ 3) రనడే
4) ఆత్మరాంపాండురంగ
47. పరమహంస మండలి స్థాపకుడెవరు?
1) రాంబాజ్పేయి 2) దదొబ
3) శివనారాయణ 4) తులసీరాం
48. రమాబాయి రనడే స్థాపించిన సంస్థ ఏది?
1) సేవాసమితి 2) శిశుసంక్షేమసదన్
3) పూనసేవాసదన్ 4) స్త్రీసంక్షేమసమితి
49. శివాజీ విధించిన పన్నులకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
1) చౌత్ (1/4) – శివాజీ దాడులు చేయకుండా ఉండటానికి
2) సర్దేశ్ముఖి (1/10) – ఇతరుల దాడుల నుంచి శివాజీ రక్షించడానికి
3) ఎ, బి
4) పైవేవీ కాదు
50. పాలవంశం, గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు ఏ నగరం కోసం తలపడినారు?
1) ఉజ్జయిని 2) బెనారస్
3) కనోజ్ 4) ఏదీ కాదు
51. అజ్మీర్‌లో స్థిరపడిన సూఫీ సన్యాసి ఎవరు?
1) షహబుద్దీన్ సుహ్రావర్ది
2) పైవుద్దీన్ బహరజీ
3) షేక్ అహ్మద్ సరింది
4) మొయినొద్దీన్ చిస్తీ
52. బౌద్ధమతంలోని తాంత్రిక మతం/ వజ్రయానం (మంత్ర, త్రంతాలను విశ్వసించుట)
1) తక్షశిల 2) విక్రమశిల
3) నలంద 4) ఉద్దంపుర
5. జరపరచండి
జాబితా -1 జాబితా -2
1. శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎ. సమర్థ రామదాసు
2) శివాజీ సంరక్షకుడు బి. దాదాజీ కొండదేవ్
3) శివాజీ తండ్రి సి. షాజీ బోన్సలే
4) శివాజీని బంధించడానికి వచ్చిన వ్యక్తి డి. షయిస్తాఖాన్
5) శివాజీతో పురందర్ సంధి ఇ. ఔరంగజేబు
చేసుకున్న పాలకుడు
1) 1-ఎ 2-బి 3-సి 4-డి 5-ఇ 2) 1-ఇ 2-డి 3-సి 4-బి 5-ఎ
3) 1-సి 2-డి 3-ఎ 4-బి 5-ఇ 4) 1-డి 2-ఇ 3-సి 4-ఎ 5-బి
జవాబులు
1-2 2-1 3-3 4-4
5-1 6-4 7-1 8-4
9-1 10-1 11-3 12-2
13-2 14-3 15-2 16-2
17-3 18-3 19-1 20-4 21-2 22-1 23-2 24-4 25-2 26-4 27-2 28-1 29-2 30-2 31-3 32-1 33-1 34-2 35-3 36-4 37-3 38-2 39-1 40-2 41-4 42-1 43-1 44-1 45-4 46-1 47-2 48-3 49-3 50-3 51-4 52-2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు