మధ్యయుగ భారత్‌పైకి భక్తి ఉద్యమ ప్రభావం
సంత్ రవిదాస్
- ఇతను ‘బెనారస్’ లో జీవించారు. చెప్పులు కుట్టుకొని బతికేవారు.
- నిరాడంబర జీవితాన్ని గడిపారు.
- అందరూ కూడా భగవంతునికి తమను సంపూర్ణంగా సమర్పించుకోవాలని బోధించారు.
- ‘హరిలో అందరూ అందరిలోనూ హరి’ అనేది వీరి బోధనల సారాంశం.
- అస్సాం ప్రాంత సాధువు.
- ఇతను కవి. నాటకకర్త, సంఘసంస్కర్త.
- సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అయ్యేందుకు సత్రాలు లేదా మఠాలు, నామ్ఘర్ని ప్రారంభించారు.
- శంకరదేవుడు గిరిజనులతో సహా అందరికి వైష్ణవ మతాన్ని ప్రబోధించటంలో విజయం సాధించారు.
- 15వ శతాబ్దం చివరి కాలానికి చెందినవారు.
- ‘తులసీదాస్’కి సమకాలికుడు.
గురునానక్
- సిక్కు మత స్థాపకులు.
- కబీర్ బోధనలను గురునానక్ విశేషంగా అభిమానించారు.
- క్రీ.శ 1469లో లాహోర్ సమీపంలోని ‘తల్వండి’ గ్రామంలో జన్మించారు.
- చిన్ననాటి నుంచే మతగురువులు, సాధువులతో మతపరమైన చర్చలు జరిపేవారు.
- సత్యం, సోదరభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువలు, పనిపట్ల గౌరవం, దాతృత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండేవారు.
- దేవుడు ఒక్కడే అని, సోదరభావం కలిగి ఉండాలని విశ్వసించాడు.
- సాధారణ ప్రజల భాషలో బోధనలు చేశాడు.
- గురునానక్ శిష్యుల్లో హిందూ, ముస్లిం మతాలకు చెందిన వారు ఉన్నారు.
గురునానక్ బోధనలు - దేవుడు ఒక్కడే.
- మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు.
- కులం, లింగ భేదం లేకుండా అందరూ సమానమే అని బోధించడం.
సిక్కు మత గురువులు
గురునానక్ గురు అంగద్
అమర్దాస్ గురు రామ్‌దాస్
అర్జున్దేవ్ గురు హర్గోవింద్
గురు హరరాయ్ గురు హరికిషన్
గురు తేజ్ బహుదూర్
గురు గోవింద్‌సింగ్
గ్రంథం-గురుగ్రంథ్ సాహెబ్/ ఆదిగ్రంథ్
నామ్‌దేవ్
- దర్జీ కుటుంబంలో జన్మించాడు.
- ఇతను పండరీ పురానికి చెందిన విఠోభా భక్తుడు
- సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో భజనలు నిర్వహించేవాడు.
- ఇతని ప్రకారం దేవున్ని ప్రార్థించడానికి క్రతువులు విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు.
- ఏకాగ్రతతో మనస్సును దైవానికి సమర్పించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు.
జ్ఞానేశ్వర్
- మరాఠీ భాషలో బోధనలు చేశారు.
- ‘భగవత్ దీపిక’ పేరుతో భగవద్గీతకు ఇతను వాక్యానాన్ని రచించాడు. దీన్ని ‘జ్ఞానేశ్వరి’ అని కూడా అంటారు.
- భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని బోధనలు చేశాడు.
తెలుగు భక్తి ఉద్యమకారులు
మొల్ల
- ఈమెను మొల్లమాంబ అని కూడా అంటారు.
- ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించిన తెలుగు కవయిత్రి.
- రామాయణాన్ని తెలుగులో రాసిన మొల్ల.. శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికురాలని చరిత్రకారుల అభిప్రాయం.
- మొల్ల శైలి సరళంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
అన్నమయ్య
- తాళ్లపాక అన్నమాచార్యగా ప్రసిద్ధిచెందిన ఇతను కడప జిల్లా ‘తాళ్లపాక’లో జన్మించాడు.
- బిరుదు- పద కవితా పితామహుడు.
- శ్రీవేంకటేశ్వరుని కీర్తిస్తూ 32వేల సంకీర్తనలు రచించారు.
- సమాజంలోని అసమానతలను తన పద్యాలతో నిరసించారు.
- మధ్యయుగ భారత్‌పై భక్తి ఉద్యమ ప్రభావం
- భక్తి ఉద్యమకారులు కుల వివక్షతను వ్యతిరేకించుట అనేది భక్తి ఉద్యమం వల్ల కలిగిన ముఖ్యమైన సామాజిక ప్రభావం.
- ఈ ఉద్యమం మతసహనాన్ని ప్రోత్సహించింది.
- సేవాభావాన్ని పెంపొందించింది.
- కష్టపడి నిజాయితీగా సంపాదించడాన్ని వివరించింది.
- సమాజంలో విభిన్న వర్గాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించింది.
- మానవతా దృక్పథాన్ని పెంపొందించింది.
భక్త సాధువులు
ఏకనాథుడు
సక్కుబాయి
చోళామేలుని కుటుంబం (మహర్ కులస్థులు) (శివ భక్తులు)
సూఫీ ఉద్యమం
ఇస్లాం మతంలోని సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాన్ని ‘సూఫీ ఉద్యమం’ అంటారు.
సూఫీ తత్వం విశ్వమానవ ప్రేమ, సమతావాదాన్ని ప్రచారం చేసింది.
సూఫీ అనే పదం ‘సాఫ్’ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది.
సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత.
సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంతో గడుపుతూ ఉన్ని దుస్తులు ధరిస్తూ సాధారణ జీవనాన్ని గడిపారు.
సూఫీయిజం లక్షణాలు
దేవుడు ఒక్కడే. అందరూ దేవుని సంతానమే.
సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతున్ని ప్రేమించడమే.
‘భక్తితో కూడిన సంగీతం’ దేవుని సన్నిధికి చేరేందుకు ఉన్న మార్గాల్లో ఒకటి.
‘వహదాత్-ఉల్-హుజూద్’ అంటే ‘ఏకేశ్వరోపాసన’ని సూఫీతత్వం విశ్వసిస్తుంది.
సూఫీ సంస్కర్తలు
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ- అజ్మీర్
ఫరీదుద్దీన్-గంజ్-ఇ-షకర్ – పంజాబ్
నిజాముద్దీన్ జౌలియ- ఢిల్లీ
షేక్ నిజ్మతుల్లా
ఖ్వాజా పీర్ మహ్మద్
బందనవాజ్ గిసుధరాజ్- గుల్బర్గా
కుతుబుద్దీన్ భక్తియార్ కాక్..
సూఫీ పదం- అబూ హషీం (ఇరాక్)
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ
- భారత్‌లో ‘చిస్తీ పద్ధతి’ ఇతను ద్వారానే స్థాపితం అయ్యింది.
- ఇతను క్రీ.శ 1143లో పర్షియాలోని ‘సీయిస్థాన్’లో జన్మించారు.
- క్రీ.శ 1192లో భారత్‌ను సందర్శించారు.
- ప్రేమ, విశ్వమానవ సౌభ్రాతృత్వం అంశాలను ప్రచారం చేశారు.
- ఇతని దర్గా ‘అజ్మీర’ (రాజస్థాన్)లో కలదు.
- ఈ దర్గాలోనే ఇతని సమాధి ఉంది.
ఫరదుద్దీన్-గంజ్-ఇ-షకర్
- ఇతన్ని బాబా ఫరీద్ అని కూడా అంటారు.
- ఒకే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండటం,
- ధ్యానాన్ని ప్రముఖంగా చెప్పారు.
- దైవాన్ని ఎప్పుడూ స్మరించాలని, దైవాజ్ఞను స్వీకరించాలని, ప్రార్థనలు చేయని వారికి జీవించే హక్కు లేదని ఇతను భావించారు.
సూఫీ ఉద్యమం ప్రభావం
- సూఫీలు దేశవ్యాప్తంగా పర్యటించి నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల వారికి తమ బోధనలు చేర్చారు.
- స్థానిక భాషల్లో బోధనలు చేశారు.
- అతి సాధారణ, నిరాడంబర జీవనాన్ని గడిపారు.
- మధ్య ఆసియా ప్రాంత సూఫీలు- ఘజిలీ, రూమీ, సాదీ
- సమావేశాలు జరిగే ప్రాంతం- ఖాన్ఖాహ్/ధర్మశాలలు
- గురువుల పరంపర- సిల్సలాలు
- జిక్ (నామం జపించుట), సామ- పాడుట
- రక్స (నృత్యం చేయడం)ల ద్వారా శిక్షణ
భక్తి, సూఫీ ఉద్యమానికి చెందిన సాహిత్యంలో అంశాలు
- భక్తి ఉద్యమాలు ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రభావితం చేశాయి.
- సమాజంలో ఉన్న మత,కుల, అసమానతలను భక్తి ఉద్యమం సాధువులు వ్యతిరేకించారు.
- వ్యవసాయం, చేనేత, హస్తకళల్లో శ్రమ విలువకు గౌరవం పెరిగింది.
- భక్తి ఉద్యమ స్ఫూర్తితో నూతన సామ్రాజ్యాలు వెలిశాయి.
- విజయనగర సామ్రాజ్యం (విద్యారణ్యస్వామి ప్రేరణ)
- మరాఠీ సామ్రాజ్యం ( సమర్థ రామదాసు ప్రేరణ)
- ప్రాంతీయ భాషల్లో సాహిత్యాన్ని వికసించజేసేలా చేశాయి.
- ఉదా: అక్క మహాదేవి రచనలు
- మీరాబాయి భజనలు
- గోదాదేవి రచించిన తిరుప్పావై
- సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసన, నిరాండంబర పూజా విధానాన్ని ప్రచారం చేశారు.
- దైవాన్ని స్తుతించడంలో సంగీతానికి విశేష ప్రాధాన్యత ఉండేది.
ప్రాక్టీస్ బిట్స్
1. అస్సాంలో వైష్ణవ భక్తిని ప్రచారం చేసింది ఎవరు?
1) శంకరదాసు 2) తులసీదాసు
3) చైతన్యుడు 4) మీరాబాయి
2. చిస్తీ శాఖను స్థాపించినది?
1) కుతుబుద్దీన్ 2) అమీర్ ఖుస్రూ
3) మొయినుద్దీన్ 4) బాబా ఫరీద్
3. శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికురాలైన భక్తి ఉద్యమ కవయిత్రి?
1) సక్కుబాయి 2) మీరాబాయి
3) గోదాదేవి 4) మొల్ల
4. దర్జీ కుటుంబంలో జన్మించిన భక్తి ఉద్యమ కారుడు ఎవరు?
1) నామ్‌దేవ్ 2) జ్జానేశ్వర్
3) దాదు దయాళ్ 4) శంకరదాసు
5. భగవద్గీతపై ‘జ్ఞానేశ్వరి’ పేరుతో మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాసింది ఎవరు?
1) నామదేవుడు 2) తులసీదాసు
3) చైతన్యుడు 4) జ్జానదేవ్
6. శ్రీకృష్ణున్ని‘శ్రీనాథ్జీ’ పేరుతో పూజించినది?
1) వల్లభాచార్యులు 2) మీరాబాయి
3) దాదు దయాళ్ 4) మధ్వాచార్యులు
7. కబీర్ మరణానంతరం ఆయన ముస్లిం శిష్యులు ఏ శాఖగా ఏర్పడ్డారు?
1) బిజక 2) దోహాలు
3) మఘర్ 4) దాదు
8. దాదూ దయాళ్ ఎవరి శిష్యుడు?
1) గురునానక్ 2) సూరదాసు
3) కబీర్ 4) వల్లభాచార్యులు
9. సూఫీ ఉద్యమ ప్రచారంలో ముఖ్యపాత్ర పోషించిన మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడ ఉంది?
1) లాహోర్ 2) ఢిల్లీ
3) గుల్బర్గా 4) అజ్మీర్
10. ఘజియాపూర్ కేంద్రంగా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేసింది?
1) నిజాముద్దీన్ ఔలియా
2) షేక్ ఫరీద్
3) ఖ్వాజా బాకీఖిల్లా
4) బహరుద్దీన్ ఆరీఫ్
11. కబీర్ బోధనలను విశేషంగా ఆదరించింది ఎవరు?
1) గురునానక్ 2) దాదు దయాళ్
3) గురు హరేరామ్ 4) శంకరదేవుడు
12. ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది ఎవరు?
1) రామానంద
2) నింబార్కాచార్యులు
3) వల్లభాచార్యుడు
4) మధ్వాచార్యులు
13. పండరీపూల్లో విరోభా దేవాలయం కేంద్రంగా భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది?
1) శంకరాచార్యుడు
2) రామానుజాచార్యుడు
3) చైతన్యుడు 4) తులసీదాసు
14. భక్తి ఉద్యమంలో భజనలు చేసే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
1) మీరాబాయి 2) తులసీదాసు
3) చైతన్యుడు 4) సూరదాసు
15. దాదుదయాళ్ ఎక్కడ జన్మించాడు?
1) కాలండీ 2) శ్రీపెరంబూర్
3) కెనరా 4) అహ్మదాబాద్
16. మధ్యయుగంలో భక్తి ఉద్యమం ఎన్ని వర్గాలుగా చీలింది?
1) 3 2) 5 3) 4 4) 2
17. ‘శ్రీ భాష్యం’ పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించింది ఎవరు?
1) రామానుజాచార్యులు
2) మధ్వాచార్యులు
3) వల్లభాచార్య
4) బసవేశ్వరుడు
18. చైతన్యుడు ఎవరి సమకాలికుడు?
1) మధ్వాచార్యులు
2) వల్లభాచార్యులు
3) తుకారాం
4) తులసీదాసు
19. సూఫీల్లో రెండో శాఖ నాయకుడు ఎవరు?
1) ఫిరదౌసి
2) అమీర్ ఖుస్రూ
3) మొయినుద్దీన్ చిస్తీ
4) షేక్ షహబుద్దీన్ సుహ్రావర్ధి
20. ఛత్రపతి శివాజీని ఎంతో ఆకర్షించిన పద్యాలు భక్తి ఉద్యమ కారుల్లో ఎవరి రచనలు?
1) నామదేవుడు 2) తులసీదాసు
3) తుకారాం 4) వేమన
సమాధానాలు
1-1 2-3 3-4 4-1 5-4 6-1 7-3 8-3 9-4 10-1 11-1 12-4 13-2 14-1 15-4 16-2 17-1 18-2 19-4 20-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు