గుర్రపు తోక అని పిలిచే మొక్క ఏది?
జంతువుల మనుగడకు మూలం మొక్కలు. ఇవి జీవులకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ను అందించే ఉత్పత్తిదారులు. మొక్కల ఆవాస ప్రాంతాన్ని బట్టి వాటి లక్షణాలు ఉంటాయి. ప్రతి పోటీ పరీక్షలో మొక్కలు రకాలు, వాటి ప్రాముఖ్యత, అడవుల రకాలు, విస్తీర్ణం వంటి అంశాలపై తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈనేపథ్యంలో మొక్కల రకాలు, వాటి ఉత్పత్తులు, ఉపయోగాలపై ఉద్యోగార్థుల కోసం నిపుణ ప్రాక్టీస్ బిట్స్ అందిస్తుంది.
1. మొక్కలు పెరగడానికి ఏవి అవసరం?
1) కాంతి, వెలుతురు, నేల, నీరు
2) నేల, నీరు
3)కాంతి, నేల నీరు
4) నేల మాత్రమే
2. ఒరైజా సటైవా శాస్త్రీయ నామం గల వరిని పండించే ప్రదేశం?
1) ఆసియా 2) అమెరికా
3) యూరప్ 4) ఆఫ్రికా
3. ఒరైజా సటైవా ఇండికా రకం వరి ఎక్కడ ప్రజాదరణ పొందింది?
1) జపాన్ 2) వియత్నాం
3) ఇండియా 4) చైనా
4. కలుపు మొక్కలు సాగు మొక్కలతో కింది అంశాల్లో పోటీపడతాయి?
1) నేల 2) నీరు
3) పోషక పదార్థాలు 4) పైవన్నీ
5. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
1) కటక్ 2) మనీలా
3) థాయ్లాండ్ 4) వియత్నాం
6. కింది వాటిలో వన్యజాతి మొక్కను గుర్తించండి.
1) సుబాబుల్, తుమ్మ 2) తామర
3) ఉమ్మెత్త 4) పైవన్నీ
7. వరి పంటలో మెరుగుపరిచిన లక్షణం?
ఎ) పంట దిగుబడి కాలంలో తగ్గుదల
బి) అధిక దిగుబడి
సి) పోషక పదార్థాల పెరుగుదల
డి) వ్యాధి నిరోధక శక్తి
1) ఎ, బి, సి 2) సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
8. ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ప్రస్తుతం విస్తరించి ఉన్న వన్యజాతి వరి రకాల సంఖ్య ఎంత?
1) 15 2) 18 3) 21 4) 25
9. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న వరి వంగడాల సంఖ్య సుమారుగా ఎంత?
1) 1000 2) 1100
3) 1300 4) 1500
10. ఒరైజా సటైవా కింది ఏ దేశంలో వన్యజాతి మొక్కగా ఉంది?
1) ఇండియా, చైనా 2) బర్మా
3) థాయ్లాండ్, వియత్నాం
4) పైవన్నీ
11. వన్యజాతి మొక్కలకు ప్రత్యేకంగా ఉండే లక్షణం?
1) ఆమ్ల నేలలు, పొడి వాతావరణంలో పెరుగుతాయి
2) జలమయ నేలల్లో కూడా పెరుగుతాయి
3) రక్షణకు ముళ్లను, విషమయమైన తినశక్యంగాని పదార్థాలను ఏర్పరుస్తాయి
4) పైవన్నీ
12. పాసీఫ్లోరా, బిల్బెర్జియా అనేవి ఏ రకాలు?
1) కీటకాలు 2) పండ్లు
3) పూలు 4) పక్షులు
13. చెట్లకు చెదలు పట్టకుండా ఏమి పూస్తారు?
1) అంబర్ 2) డాంబర్
3) రంగు 4) కిరోసిన్
14. పర్యావరణ పరిరక్షణలో తోడ్పడిన విద్యార్థులకు ఇచ్చే అవార్డు
1) పర్యావరణ మిత్ర
2) పర్యావరణ ప్రేమి
3) వన మిత్ర
4) వన ప్రేమి
15. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన శతాబ్ద వృక్షం ఏది?
1) చింత 2) ఆలివ్
3) మామిడి 4) వేప
16. మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం ఉండాలి?
1) 32 శాతం 2) 33 శాతం
3) 34 శాతం 4) 35 శాతం
17. మన దేశంలో ప్రస్తుతం ఉన్న అడవుల శాతం?
1) 33 శాతం 2) 23 శాతం
3) 21 శాతం 4) 22 శాతం
18. మొక్కల సంరక్షణ, అడవుల పెంపకంపై అవగాహన కల్పిస్తూ ప్రకృతి పరిరక్షణకు తోడ్పడుతున్న సంస్థ.
1) కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్
2) కౌన్సిల్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్
3) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
4) పైవేవీ కావు
19. విత్తనాలను నేలపై వెదజల్లే పద్ధతిని ఏమంటారు?
1) బ్రాడ్ కాస్టింగ్ 2) మల్చింగ్
3) స్ప్రింక్లింగ్ 4) ప్లవింగ్
20. పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
1) ఆర్నిథాలజీ 2) ఆంథాలజీ
3) ఆంకాలజీ 4) బయాలజీ
21. పుష్పాలనిచ్చే మొక్కల పెంపకం.
1) సెరీ కల్చర్ 2) ఆక్వా కల్చర్
3) క్లోరీ కల్చర్ 4) ఫ్లోరీ కల్చర్
22. పూలు గుత్తులు గుత్తులుగా పూయడాన్ని ఏమంటారు?
1) సమూహం 2) బాటిల్ బ్రష్
3) గుంపు 4) పైవన్నీ
23. కింది వాటిలో పెంకు కలిగిన విత్తనాలు ఏవి?
1) కంది 2) వేరుసెనగ
3) దానిమ్మ 4) బాదం
24.ప్రపంచంలో అతిపెద్ద పుష్పం
1) తామర 2) మందార
3) రఫ్లీషియా 4) గులాబి
25. ఎడారి మొక్కల్లో కిరణజన్యసంయోగ క్రియ జరిపే భాగం?
1) కాండం 2) వేరు
3) పుష్పం 4) పైవన్నీ
26. కింది వాటిలో తృణకాండం కలిగిన మొక్కలు?
1) నారింజ 2) జామ
3) వెదురు 4) ఉసిరి
27. మిధ్యాకాండం ఏ మొక్కల్లో ఉంటుంది?
1) మామిడి 2) వేప
3) చింత 4) అరటి
28. కింది వాటిలో నీటిలో మాత్రమే పెరిగే మొక్కలు?
1) కలబంద 2) గులాబి
3) తామర 4) నాగజెముడు
29. ఏ మొక్కల వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తాయి?
1) యూట్రిక్యులేరియా 2) పార్థీనియం
3) ఆర్టాబోట్రిస్ 4) బ్రాసికా
30. శైవలాలు, శిలీంధ్రాల సహజీవనం ఫలితంగా ఏర్పడేవి?
1) లైకెన్లు 2) శైవలాలు
3) శిలీంధ్రాలు 4) బ్యాక్టీరియా
31. లైకెన్లలో జరిగే పోషణ విధానం.
1) పూతికాహారం 2) సహజీవనం
3) స్వయం పోషణ 4) పరాన్నజీవనం
32. మాస్ ఏ రకపు మొక్కకు ఉదాహరణ?
1) విత్తనాలు బయటకు కనబడే పుష్పించే మొక్క
2) నిజమైన వేర్లు, పత్రాలు కలిగి ఉండే పుష్పించని మొక్క
3) నిజమైన వేర్లు, పత్రాలు లేని పుష్పించని మొక్క
4) విత్తనాలు, ఫలం లోపల ఉండే పుష్పించే మొక్క
33. కిందివాటిలో ఆదిమమైన మొక్క అని దేన్ని పిలుస్తారు?
1) రిక్సియా 2) మార్కాన్షియా
3) ఆంథోసిరాస్ 4) ఫ్యునేరియా
34. వాటిలో లివర్వర్ట్ అని పిలిచే మొక్క?
1) రిక్సియా 2) మార్కాన్షియా
3) ఆంథోసిరాస్ 4) ఫ్యునేరియా
35. ప్రథమ నిజమైన నేల మొక్కలు ఏవి?
1) బ్రయోఫైటా 2) థాలోఫైటా
3) టెరిడోఫైటా 4) ఏదీ కాదు
36. వరిపొలాల్లో జీవ ఎరువుగా ఉపయోగించే మొక్క.
1) రైనియా 2) లైకోపోడియం
3) మార్సీలియా 4) అజొల్లా పిన్నేటా
37. గుర్రపు తోక, బంగారు మొక్క అని పిలిచే మొక్క ఏది?
1) అడియాంటమ్ 2) ఈక్విజిటమ్
3) మారీలియా 4) రైనియా
38. కిందివాటిలో ఉభయచర మొక్క?
1) రైనియా 2) లైకోపోడియం
3) మార్సీలియా 4) ఈక్విజిటమ్
39. వివృత బీజ మొక్కల్లో ఎక్కువగా కనిపించే ప్రత్యేక లక్షణం.
1) రెసిన్ నాళాలు కలిగి ఉండటం
2) టానిన్లు స్రవించడం
3) జిగుర్లను స్రవించడం
4) లేటెక్స్ నాళాలు కలిగి ఉండటం
40. విత్తనాలపై ఫలకవచం ఉండకపోవడం వల్ల నగ్నంగా కనిపించేవి?
1) ఆవృత బీజాలు 2) వివృత బీజాలు
3) ఏకదళ బీజాలు 4) ద్విదళ బీజాలు
41. ప్రపంచంలో అతిపొడవైన వృక్షం.
1) గింకోబైలోబా 2) పైనస్
3) సెడ్రస్ (దేవదారు)
4) సిక్వోయియా డెండ్రాన్ జైగాంటియమ్ (రెడ్వుడ్ ట్రీ)
42. ఏ వృక్షం కలపను క్రికెట్ బ్యాట్ల తయారీలో వాడుతారు?
1) సాలిక్స్/విల్లో 2) నీటమ్
3) టాక్సస్ ఒక్కేటా 4) జిన్సెంగ్
43. వృక్షరాజ్యంలో అతిపెద్ద కణం (అండకణం 6X4సెంటీమీటర్లు) ను కలిగిఉన్న మొక్క.
1) నీటమ్ 2) సైకస్
3) చికెల్ 4) సెడ్రస్
44. ఏ మొక్క నుంచి లభించే ‘టాక్సాల్’ను క్యాన్సర్ నిరోధక ఔషధంగా వాడుతారు?
1) పైనస్ 2) సైకస్
3) టాక్సస్ ఒక్కేటా 4) చికెల్
45. చూయింగ్ గమ్ల తయారీలో ఉపయోగించే పదార్థం ఏ మొక్క నుంచి ఉత్పత్తి అవుతుంది?
1) జిన్సెంగ్ 2) సైకస్
3) పైనస్ 4) చికెల్/Neseberry
46. రైల్వే స్వీపర్ల తీయారీలో ఉపయోగించే వృక్షాలు.
1) సైకస్ 2) పైనస్
3) సెడ్రస్ (దేవదారు) 4) సాలిక్స్
47. భారతదేశ శిలీంధ్ర శాస్త్ర పితామహుడు ఎవరు?
1) ఈ.జే. బట్లర్
2) ఆంటోనియో మైఖేలి
3) ఎడ్వర్డ్ జెన్నర్
4) లూయీ మార్క్
48. భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు ఎవరు?
1) ఫ్రిట్జ్
2) ఎం.ఓ.పి. అయ్యంగార్
3) ఈ.జే. బట్లర్
4) ఆంటోనియో మైఖేలి
49. బ్రయోఫైటా అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు?
1) ఫ్రిట్జ్
2) ఎం.ఓ.పి. అయ్యంగార్
3) ఆంటోనియో మైఖేలి
4) ఆర్.బ్రౌన్
50. నడిచే ఫెర్న్(walking fern) అని ఏ మొక్కను పిలుస్తారు?
1) అడియాంటమ్ 2) ఈక్విజిటమ్
3) అజొల్లా 4) లైకోపోడియం
జవాబులు
1. 1 2. 1 3. 3 4. 4 5. 2 6. 4 7. 1 8. 2 9. 3 10. 4 11. 4 12. 3 13. 2 14. 4 15. 4 16.2 17.3 18.1 19. 1 20. 2 21. 4 22. 2 23. 4 24. 3 25. 1 26. 3 27. 4 28. 3 29. 2 30. 1 31. 2 32. 3 33. 1 34. 2 35. 3 36. 4 37. 2 38. 3 39. 1 40. 2 41. 4 42. 1 43. 2 44. 3 45. 4 46. 3 47. 1 48. 2 49. 4 50. 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు