సమాచార్ దర్పన్ పత్రిక సంపాదకుడు ఎవరు?
1. వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా ఎప్పుడు నియమితుడయ్యాడు?
1) 1772, ఏప్రిల్ 2) 1772, మే
3) 1772, జూన్ 4) 1772 జూలై
2. బెంగాల్ రాష్ర్టానికి కలకత్తాను రాజధానిగా చేసి, ఖజానాను ముర్షిదాబాద్ నుంచి కలకత్తాకు మార్చిన గవర్నర్ జనరల్?
1) కారన్ వాలీస్ 2) డల్హౌసీ
3) వారన్ హేస్టింగ్స్ 4) బెంటింక్
3. న్యాయస్థానాల నుంచి అప్పీళ్లను విచారించడానికి కలకత్తాలో సదర్-దివాని-అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ను ఏర్పాటు చేసినవారు?
1) వెల్లస్లీ 2) వారన్ హేస్టింగ్స్
3) డల్హౌసీ 4) బెంటింక్
4. కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ. కారన్ వాలీస్ ఇచ్చిన అంశాలను బట్టి పార్లమెంట్ 1793లో చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టింది
బి. కారన్ వాలీస్ టిప్పుసుల్తాన్తో నాల్గో మైసూర్ యుద్ధం చేశాడు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
5. కలకత్తాలో (1800) ఫోర్ట్ విలియమ్ కళాశాలను స్థాపించినవారు?
1) డల్హౌసీ 2) హేస్టింగ్స్
3) వెల్లస్లీ 4) బెంటింక్
6. 1798లో భారతదేశ గవర్నర్ జనరల్గా విలియం పిట్ ఎవరిని నియమించాడు?
1) హేస్టింగ్స్ 2) డల్హౌసి
3) వెల్లస్లీ 4) బెంటింక్
7. భారతదేశంలో రాజ్యాల వెంట రాజ్యాలు, విజయాల వెంట విజయాలు, రాబడుల వెంట రాబడులు సాధిస్తున్నానని, వారు జాలి చూపమని ఆదేశించేవరకు ఆపనని 1800లో ఉత్తరం రాసినవారు?
1) బెంటింక్ 2) డల్హౌసీ
3) వెల్లస్లీ 4) కారన్వాలీస్
8. 1813లో గవర్నర్ జనరల్గా నియమితులైనవారు?
1) హేస్టింగ్స్ 2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ 4) కర్జన్
9. కింది వాటిని జతపర్చండి.
ఎ. వారన్ హేస్టింగ్స్ 1. 1813-23
బి. కారన్ వాలీస్ 2. 1798-1805
సి. వెల్లస్లీ 3. 1786-93
డి. హేస్టింగ్స్ 4. 1772-85
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
10. నాలుగో మైసూర్ యుద్ధం (1799లో) కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు?
1) బెంటింగ్ 2) వెల్లస్లీ
3) కారన్వాలీస్ 4) డల్హౌసీ
11. 1818లో వెలువడిన బెంగాలీ వారపత్రిక సమాచార దర్పన్ సంపాదకుడు ఎవరు?
1) జేసీ మార్షమన్ 2) బీడీ మార్షమన్
3) ఏసీ మార్షమన్ 4) ఆర్డీ మార్షమన్
12. కింది వారిలో మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు?
1) డల్హౌసీ 2) కర్జన్
3) విలియం బెంటింక్ 4) రిప్పన్
13. విలియం బెంటింక్ కలకత్తాలో ఏ కళాశాలను స్థాపించాడు?
1) వెటర్నరీ కళాశాల 2) వైద్య కళాశాల
3) వ్యవసాయ కళాశాల 4) ఆంగ్ల కళాశాల
14. సతీసహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు?
1) విలియం బెంటింక్ 2) డల్హౌసీ
3) వెల్లస్లీ 4) రిప్పన్
15. సతీసహగమన నిషేధ చట్టం దేశంలో ఆంగ్లేయ ప్రభుత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం అని పేర్కొన్న బ్రిటిష్ చరిత్రకారుడు?
1) స్లీమెన్ 2) విలియం పిట్
3) థామ్సన్ 4) మెట్కాఫ్
16. థగ్గులు అనే దారిదోపిడీ దొంగలు వేసవికాలంలో దోపిడీకి ముందు ఏ దేవతను మొక్కి వెళ్లేవారు?
1) మహంకాళి దేవత 2) కాళికాదేవి
3) పోచమ్మ 4) ఏదీకాదు
17. థగ్గులను అణచడానికి విలియం బెంటింక్ ఎవరిని నియమించాడు?
1) మెట్కాఫ్ 2) విలియం స్లీమెన్
3) థామ్సన్ 4) ఎవరూకాదు
18. కింది వాటిని జతపర్చండి.
ఎ. విలియం బెంటింక్
1. న్యాయసంస్కరణలు
బి. సర్ విలియం స్లీమెన్ 2. 1828-35
సి. చార్లెస్ మెట్కాఫ్ 3. న్యాయసభ్యుడు
డి. లార్డ్ మెకాలే 4. థగ్గులు
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-3, బి-4, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
19. విలియం బెంటింక్ పాలనాకాలం శాంతికి, సంస్కరణలకు నిలయం అని ఎవరన్నారు?
1) విలియం పిట్ 2) ఆర్సీ దత్
3) స్లీమెన్ 4) థామ్సన్
20. కింది వారిలో జార్జి రామ్సే కుమారుడు ఎవరు (1812లో జన్మించాడు)?
1) డల్హౌసీ 2) బెంటింక్ 3) కర్జన్ 4) రిప్పన్
21. భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్లలో పిన్నవయస్సుడు?
1) డల్హౌసీ 2) బెంటింక్
3) హేస్టింగ్స్ 4) వారన్ హేస్టింగ్స్
22. రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేసి సంస్థానాలను ఆక్రమించిన పాలకుడు?
1) బెంటింక్ 2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ 4) డల్హౌసీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు