భక్తి-సూఫీ ఉద్యమాలు
భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో దాని ప్రాముఖ్యతను సంతరించుకొని తర్వాత పెరుగుతూ వచ్చింది. ఆయా మతాల్లో మూఢనమ్మకాలు, దురాచారాలు, మత సంస్కరణలకు కారణం అయ్యాయని సంస్కరణవాదుల అభిప్రాయం.
భక్తి అంటే ఏమిటీ?
భక్తి అంటే ఒక నిర్దిష్ట దైవాన్ని ప్రేమించే మార్గం. భగవంతున్ని లేదా దేవతను ప్రేమించడం, సేవ చేయడం ద్వారా ప్రతి దానిలో కూడా దైవాన్ని చూస్తారు.
భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు
విశ్వమానవ సోదర భావం
సమాజంలో అందరూ సమానం
హిందూ మతం మోక్షసాధనకు కర్మ, జ్ఞానం, భక్తిని మార్గాలుగా చెబుతుంది.
భక్తి రకాలు
మధ్య యుగంలో భక్తి ఉద్యమం రెండుగా చీలినది.
1. నిర్గుణ భక్తి
2. సగుణ భక్తి
నిర్గుణ భక్తి- భగవంతున్ని నిరాకారంగా పూజించుట.
ఉదా: కబీర్, గురునానక్
సగుణ భక్తి-భగవంతున్ని ఆకారం లో పూజించుట, తీర్థయాత్రలు చేయుట.
భక్తి ఉద్యమ నేపథ్యం
- భక్తి ఉద్యమాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు.
- రామానుజాచార్యుల నాయకత్వం లో హిందూమతంలో శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చింది.
- కర్ణాటక – బసవేశ్వరుడు
- మహారాష్ట్ర- తుకారాం, సమర్థ రామదాసు, నామ్‌దేవ్
- ఉత్తర భారత్- రామానంద, మీరాబాయి,
- సూరదాసు, రవిదాసు, కబీర్
- బెంగాల్- చైతన్యుడు
- పంజాబ్- గురునానక్
- అస్సాం-శంకరదేవుడు ఉద్యమ ప్రచారం.
- ఆళ్వార్లు, నయనార్లలో అన్ని కులాల వారు ఉన్నారు. వీరు తమిళనాడులో ఉద్యమాన్ని ప్రచారం చేశారు.
ప్రధాన లక్షణాలు
- భగవంతుడు ఒక్కడే.
- మోక్షాన్ని సాధించే మార్గాల్లో భక్తి ప్రముఖమైనది.
- భక్తి అంటే తనకు తాను దేవునికి సమర్పించుకోవడం.
- మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెప్పడం.
- కులం, తెగ, వర్గం వంటి వ్యత్యాసాలను తిరస్కరించడం.
- స్థానిక భాషల్లో భక్తి భావనలను ప్రచారం చేయడం.
ఆది శంకరాచార్యులు
- కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు (8వ శతాబ్దం).
- 5 సంవత్సరాల వయస్సులో సన్యాసం స్వీకరించారు.
- అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
- దేశానికి నాలుగు వైపుల శక్తి పీఠాలను ఏర్పాటు చేశారు.
తూర్పు- పూరి
పడమర- ద్వారక
ఉత్తరం- బద్రినాథ్
దక్షిణం- శృంగేరి
గ్రంథాలు
- వివేక చూడామణి
- సౌందర్యలహరి
- శివానందలహరి
- ఆత్మబోధలు
- శంకరాచార్యులు 32వ సంవత్సరంలో నిర్యాణం పొందారు.
- భారత సనాతన ధర్మంలో గొప్పమత సంస్కర్తగా భావిస్తారు.
- ‘జీవాత్మ, పరమాత్మ ఒకటే అదే పరమ సత్యం
మధ్వాచార్యులు
- క్రీ.శ 13వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రం పశ్చిమ తీరంలో జన్మించారు (కెనరా తీరం)
- ‘ద్వైత’ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు.
- ‘ద్వైతం’ అంటే రెండు అని అర్థం. దీని ప్రకారం బ్రహ్మ, ఆత్మ రెండు వేర్వేరు అంశాలు.
- మోక్ష మార్గానికి ప్రధాన ఆధారం- భక్తి
- ద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమకాదు, వాస్తవం.
- బ్రహ్మ, ఆత్మ, వస్తువులకు ప్రకృతితో అస్తిత్వం కలదు.
రామానుజాచార్యులు
- ఇతను తత్వవేత్త, సంఘ సంస్కర్త.
- తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో క్రీ.శ 1017 లో జన్మించారు.
- వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక పునాదులను అందించారు.
- ‘విశిష్టాద్వైతం’ను బోధించారు.
- సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చని ప్రతి ఒక్కరికి బోధించారు.
- ‘శ్రీ భాష్యం’ పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించారు.
- జీవాత్మ, పరమాత్మతో కలిసిన దానికి విశిష్ట స్థానం ఉంటుందని తెలియజేశారు.
సంత్ రవిదాస్
- ఇతను ‘బెనారస్’ లో జీవించారు. చెప్పులు కుట్టుకొని బతికేవారు.
- నిరాడంబర జీవితాన్ని గడిపారు.
- అందరూ కూడా భగవంతునికి తమను సంపూర్ణంగా సమర్పించుకోవాలని బోధించారు.
- హరిలో అందరూ అందరిలోనూ హరి’ అనేది వీరి బోధనల సారాంశం.
మీరాబాయి
- బాల్యం నుంచి ఈమె శ్రీకృష్ణుని భక్తురాలు.
- వివాహం తర్వాత కూడా శ్రీకృష్ణ భక్తిని కొనసాగిస్తూ గాయకురాలిగా పేరుపొందారు.
- రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ చాలా సాధారణమైన జీవితాన్ని గడిపారు.
- సమాజంలో అన్ని వర్గాల్లో కృష్ణతత్వ భక్తిని ప్రచారం చేశారు.
- మీరాబాయి పాడే భజనలు వినడానికి అన్ని మతాల సాధువులు రాజస్థాన్‌లోని ‘చిత్తోడ్’ ప్రాంతాన్ని సందర్శించేవారు.
- ఈమె గురువు సంత్రామ్దాస్ (మహర్ కులస్తులు)
- శతాబ్దాలుగా మీరాబాయి భజనలు చిరస్థాయిగా నిలిచాయి.
- ఈమె 16వ శతాబ్దానికి చెందినవారు. మేవార్ కుటుంబానికి కోడలు.
- మీరాబాయి కీర్తనలు రాజస్థాన్, గుజరాత్లో బాగా ప్రాచుర్యం పొందాయి.
కబీర్
- ఉత్తర భారత్‌లో ప్రముఖ భక్తి ఉద్యమకారులు.
- ‘నూర్’… అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో కబీర్ పెరిగారు.
- బాల్యం నుంచి ఇతనికి దైవభక్తి ఎక్కువ.
- యవ్వనప్రాయం వచ్చాక ‘రామానంద’ శిష్యునిగా చేరి..ఎక్కువ కాలం ‘బనారస్’లో గడిపారు.
- అన్ని మతాలు, వర్గాలు, కులాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేశారు.
- దేవుని ముందు అందరూ సమానమే అని బోధించారు.
- హిందూ, ముస్లిం సమైక్యత కోసం ప్రయత్నించిన మొదటి సాధువు కబీర్.
- ఇతని రచనలు సాఖీలు, గీతాలు దోహాలు.
వల్లభాచార్య
- దక్షిణ భారత్‌లో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత ఇతనిది.
- వల్లభాచార్య తెలుగు ప్రాంతానికి చెందినవారు.
- క్రీ.శ 15వ శతాబ్దానికి చెందినవారు.
- తత్వశాస్త్రంలో అపార జ్ఞానం, ప్రతిభా పాండిత్యం వంటి నైపుణ్యాలతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారు.
- ఇతని ఆలోచన ‘శుద్ధ అద్వైతం’
- ఈ సాంప్రదాయం ప్రకారం దేవుడు ఒక్కడే.
- ఇతని బోధనలను ‘పుష్టి మార్గం’ లేదా ‘ భగవదానుగ్రహ’ మార్గంగా చెబుతారు.
- ఇతనికి శ్రీకృష్ణునిపై అపారభక్తి, అద్వితీయ ప్రేమ కలదు.
- బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు.
నోట్: బ్రహ్మసూత్రాలు అనేది సంసృత గ్రంథం. వీటిని ‘వ్యాసుడు’ లేదా ‘బాదరాయణుడు’ రచించారు.
బ్రహ్మసూత్రాలను ‘వేదాంత సూత్రం’ అని కూడా అంటారు.
బసవేశ్వరుడు
- కర్ణాటకకు చెందిన ఇతను రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త, సామాజిక వేత్త.
- ‘వీరశైవ’ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు.
- ఇతని రచనలను ‘వచనాలు’ అంటారు.
- పుట్టుక లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా బసవేశ్వరుడు ప్రజలందరికి బోధించాడు.
- ఇతని సూక్తి- మానవులంతా సమానమే. కులం లేదా ఉపకులం లేదు.
అనుచరులు - అల్లమ ప్రభువు
- అక్క మహాదేవి
- బసవేశ్వరుడు తన దేహాన్ని దేవునికి అర్పిస్తున్న ఆలయంగా భావించారు.
రామానందుడు
- ఉత్తర భారత్‌లో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత.
- అలహాబాద్ లేదా ప్రయాగలో జననం.
- విద్యాభ్యాసం కాశీ, ప్రయాగలో జరిగింది.
- రామానుజాచార్యుల విశిష్టాద్వైతం పట్ల ఇతనికి విశ్వాసం ఎక్కువ. రామానుజాచార్యుల బోధనలను ప్రచారంలోకి తెచ్చాడు.
- సమాజం విభజించి ఉండటాన్ని రామనందుడు వ్యతిరేకించారు.
- ఇతని బోధనలు హిందీలో కలవు.
చైతన్య మహాప్రభు
- ఇతని మరొక పేరు శ్రీగౌరంగ. బెంగాల్‌కు చెందిన సాధువు. సంస్కర్త.
- భారత్‌లో దక్షిణ, పశ్చిమ ప్రాంతాలైన పండరీపురం, సోమ్‌నాథ్, ద్వారకను సందర్శించి తన బోధనలను ప్రచారం చేశారు.
- ఉత్తర దిక్కున బృందావన్, మధుర, ఇతర తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శించి పూరిలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
- దేవుడు ఒక్కడే అని, అతను శ్రీకృష్ణుడు లేదా హరి మాత్రమేనని విశ్వసించాడు.
- ప్రేమ, భక్తి, గానం, నృత్యం ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చని ప్రబోధించారు.
- అంతరంగిక వికాసం, ఆత్మపరిశీలనకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చని నమ్మాడు.
- రామ, హరే కృష్ణ’ మంత్రాన్ని ప్రాచుర్యం చేశారు.
ప్రాక్టీస్ బిట్స్
1. శంకరాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం?
1) విశిష్టాద్వైతం 2) అద్వైతం
3) ద్వైత సిద్ధాంతం 4) శుద్ధాత్వైతం
2. భక్తి ఉద్యమానికి నిజమైన స్థ్ధాపకులు ఎవరు?
1) మధ్వాచార్యులు 2) వల్లభాచార్యుడు
3) బసవేశ్వరుడు 4) రామానుజాచార్యుడు
3. ఎవరి శిష్యులను ‘స్మార్దులు’ అంటారు?
1) రామానంద 2) మీరాబాయి
3) శంకరాచార్యులు 4) శంకరదాసు
5. గురునానక్ ఎవరి సమకాలికులు?
1) అక్బర్ 2) జహంగీర్
3) ఫిరోజ్‌షా తుగ్లక్ 4) సికిందర్ లోడీ
6. శ్రీభాష్యం, గీతా భాష్యం రచనలు చేసింది ఎవరు?
1) మీరాబాయి 2) నింబార్కాచార్యులు
3) రామానుజాచార్యులు
4) సూరదాసు
7. దోహాలు ఎవరి బోధనలుగా పిలుస్తారు?
1) దాదుదయాళ్
2) మొయినుద్దీన్ చిస్తీ
3) నూరుద్దీన్ 4) కబీర్
8. కబీర్ మరణానంతరం ఆయన పార్ధివదేహంపై ఉన్న పూలను హిందువులు, ముస్లింలు ఎక్కడ పూడ్చారు?
1) వారణాసి, మగర్
2) ఢిల్లీ, రాయ్‌ఘడ్
3) ద్వారక, లాహోర్
4) పెరంబూర్, అజ్మీర్
9. ‘సూఫీ’ అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది?
1) అరబిక్ 2) ఉర్దూ
3) సంస్కృతం 4) హిందీ
10. రామచరిత మానస్ అనే కావ్యాన్ని హిందీలో రచించినది?
1) చైతన్యుడు 2) కబీర్
3) తులసీదాసు 4) రామదాసు
సమాధానాలు
1-2, 2-4, 3-3, 4-4, 5-4, 6-3, 7-4, 8-1, 9-1, 10-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు