భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం ఏది?
ప్రాచీన కాలంలో మతం-సమాజం
- ప్రాచీన కాలపు వర్ణ చిత్రాలు, మృతులను పూడ్చిపెట్టిన సమాధులు, వారు జంతువుల వేషాలు ధరించి, ముఖాలకు ముసుగులు ధరించి, సామూహిక నృత్యాలు చేస్తూ ఆరాధించే పద్ధతులు నాటి సమాజపు మతాచారాలను తెలియజేస్తాయి.
- వేట, సేకరణపై ఆధారపడిన సమాజంలో మరణం తరువాత జీవనం ఉందని విశ్వసించి, మృతులతో పాటు వారికి ప్రియమైన, వాడిన వస్తువులను పూడ్చిపెట్టేవారు.
- 12వ శతాబ్దపు తమిళ ‘పెరియ పురాణం’ శ్రీకాళహస్తి ప్రాంతంలోని వేట-సేకరణ, సమాజం జీవన శైలి, మత విశ్వాసాలు తెలియజేస్తుంది. భక్త కన్నప్ప కథ ఈ పురాణం లోనిదే. కన్నప్ప పూజారిగా వ్యవహరిస్తూ మాంసం, తేనె, పూలు, పండ్లు మహాశివునికి సమర్పించేవారు.
- నల్లమల అరణ్య ప్రాంతంలోని చెంచు జాతి వారు గారెల మైసమ్మ లేదా గంగమ్మకు ప్రీతికరమైన ఆహారం సమర్పించి, నృత్యం ద్వారా ఆరాధిస్తారు.
- వీరు శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం నరసింహ స్వామి తమ జాతి ఆడబిడ్డల్ని పరిణయమాడారని, వారిని తమ అల్లుళ్ళుగా భావిస్తారు.
- పశుపోషక దశలో, వ్యవసాయ ఆరంభ దశలో నేలతల్లిని లేదా అమ్మతల్లిని పశువులు, పంటలు సమృద్ధిగా పండాలని, చిన్నచిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాల్లో పూజించేవారు.
- దక్కన్ ప్రాంతంలో మంటను వెలిగించిన పశుపోషకులు తమ ఆచారాలు పాటించిన ఆనవాళ్ళు ‘బూడిద దిబ్బల’ రూపంలో వెలుగు చూశాయి.
- నేటికీ మన సమాజంలో హోలి, దీపావళి, సంక్రాంతి పర్వదినాల్లో మంటలు వెలిగించే ఆచారాలు కొనసాగుతున్నాయి.
- పశుపోషకులను మహారాష్ట్రలో ధంగర్, కర్ణాటకలో కురుబ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కురుమ, గొల్ల, యాదవులుగా పిలుస్తారు.
- కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్త్రీ దేవతలైన రేణుకా మాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ వంటి దేవతలను పూజిస్తారు.
- పూర్వకాలం నుంచి రావి, వేప, జమ్మి, మర్రి, తులసి చెట్లను పూజించే ఆచారం ఉన్నట్లు పురావస్తు ఆధారాలున్నాయి.
- వ్యవసాయ సమాజం ఏనుగులు, పులులు, పాములు, కోతులను పూజించే ఆచారాలు ఉన్నాయి.
హరప్ప సంస్కృతిలో వెలుగు చూసిన వృత్తి కళాకారులు, వర్తకులు, పరిపాలకులు, అధికార గణం నివసించిన ఆధారాలు బయటపడ్డాయి. - హరప్ప శిథిలాల్లో స్నాన వాటికలు, ధాన్యాగారాలు, ప్రజా భవనాలు, మురుగు నీటి కాలువలు, సంపన్న, సాధారణ ప్రజల నివాస గృహాలు బయటపడ్డాయి.
- అమ్మతల్లిని, శివున్ని పోలిన పురుష దేవతలను, రావి చెట్టును పూజించిన ఆనవాళ్ళున్నాయి.
- వేదాలు నాలుగు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటిలో రుగ్వేదం అతిప్రాచీనమైంది. వీటిని ప్రపంచ శాంతి, సంక్షేమం కోసం దేవతలను కీర్తించే మంత్రాలుగా రుషులు సంకలనం చేశారు.
- వేద కాలంలో అగ్ని, ఇంద్రుడు, సోమలత (ప్రత్యేక పానీయం చేయడానికి ఉపయోగించే మొక్క) మంత్రాలను పఠిస్తూ కీర్తించేవారు.
- రుగ్వేదంలో పశువులకోసం, సంతానం కోసం, అశ్వాల కోసం చేసిన ప్రార్థనలు ఉన్నాయి.
వేదకాలపు ప్రజలు తెగలుగా నివసిస్తుండేవారు. తెగ పురోహితుడిగా బ్రాహ్మణులుండేవారు. తెగల మధ్య గోవుల కోసం, నీటి కోసం, పచ్చికబయిళ్ల కోసం యుద్ధాలు జరిగేవి. గుర్రాలను రథాలకు కట్టి యుద్ధాల్లో పాల్గొనేవారు. - తెగలు గంగా యమున ప్రాంతాల్లో స్థిరపడి వరి, గోధుమ పంటలు పండించేవారు. తెగలు నాయకుల ఆధ్వర్యంలో జనపదాలుగా ఏర్పడి వీరే రాజులుగా రూపాంతరం చెందారు.
- యజుర్వేదం, అధర్వణ వేదం అధిక ధన వ్యయంతో కూడిన క్రతువులు, జంతు బలులు, అగ్ని బలుల గురించి తెలియజేస్తున్నాయి.
- వేదకాలపు సమాజంలో బ్రాహ్మణులు యజ్ఞాలు, వేదమంత్రాలతో కూడిన క్రతువులు చేయగా, క్షత్రియులు రాజ్యాన్ని, ప్రజలను రక్షించేవారిగా, వైశ్యులు పశుపోషకులుగా, భూమి సాగు చేసేవారిగా, బ్రాహ్మణులకు బహుమతులు, కానుకలు, క్షత్రియులకు కప్పం, శిస్తు కట్టేవారు.
- చివరి వేద కాలం నాటికి నాల్గో వర్ణంగా శూద్రులు, వ్యవసాయం, ఇతర వృత్తులు చేపట్టేవారు. స్త్రీ, పురుషుల మధ్య పని విభజన జరిగింది.
- చనిపోయిన వారిని సమాధి చేసి, పైన పెద్ద పెద్ద బండరాళ్లను వృత్తాకారంలో పెట్టి మధ్యలో నిటారుగా ఉన్న బండరాయిని నిలిపి నిర్మించిన వాటిని రాక్షస గుళ్లు అంటారు.
- మృతులను ఒకరికంటే ఎక్కువమందిని సమాధి చేయడమేగాక, నలుపు, ఎరుపు రంగులు గల కుండలను, పనిముట్లు, ఇనుముతో చేసిన ఆయుధాలు, బంగారు ఆభరణాలు పూడ్చిన ఆధారాలు వెలుగు చూశాయి.
- బృహత్ శిలాయుగంలో మృతుల సమాధులపై గుండ్రని బండరాళ్లు, శిలలతో చిన్న గదిలాగా నిర్మించిన సమాధులు, మెన్హిర్ (పొడవైన రాళ్లు) నిలిపిన సమాధులు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బయటపడ్డాయి.
- ఈ కాలపు సమాధుల్లో చనిపోయినవారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు, మట్టి పెట్టెలు (సర్కోఫగి), చితిభస్మపు కుండలు కొన్ని సమాధుల్లో కనుగొన్నారు.
- జనపదాల కాలం నాటికి మిశ్రమ సంస్కృతి ఏర్పడి, వేదకర్మలు, అగ్నికార్యం చేయడం, సూర్యుడు, నదులు, అమ్మతల్లి, కోతి, ఏనుగు, చెట్లు, సర్పాలను పూజించడం ప్రారంభమైంది.
మరణం తర్వాత ఏం జరుగుతుందో ‘కఠోపనిషత్’నందు నచికేతుడి ప్రశ్నకు యమధర్మరాజు ‘ఆత్మ’ ఒక్కటే శాశ్వతమైనదని అత్మతత్తం గురించి వివరిస్తాడు. - ఆశ్రమాలలో ధ్యానం చేస్తూ , ప్రశ్నలకు సమాధానాల అన్వేషణలో వాద సంవాదాలతో భావాలు పంచుకుంటూ నివసించే వాళ్లను రుషులు లేదా మునులు అంటారు. వీరి ఆలోచనలు, అభిప్రాయాలే ‘ఉపనిషత్’లుగా పిలుస్తున్నారు. యాజ్ఞవల్క్యుడు, ఉద్దాలక, అరుణి ప్రసిద్ధిచెందిన రుషులు.
- రుషులు వినాశనం లేని, చావులేని, దుఃఖం లేని దానికి ‘ఆత్మ’ లేక బ్రహ్మం అని పిలిచారు. ఆత్మను లేదా బ్రహ్మం అర్థం చేసుకోవడానికి తపస్సు చేసి అమరత్వం పొందగలమని బోధించారు.
- సత్యాన్వేషణలో సంచరిస్తూ స్థిరనివాసం లేని బిక్షువులుగా తిరిగే వాళ్ళు పరివ్రాజకులు. వీరిలో వర్థమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజితకేశ కంబలి ముఖ్యులు.
పుట్టుక-చావు చక్రబంధం విమోచన కోసం పన్నెండున్నర సంవత్సరాలు ధ్యానం-తపస్సు చేసి కోరికలు జయించినవాడు అయినందున మహావీరుడిని జినుడుగా పిలుస్తున్నారు. - ఇతరులకు దుఃఖాన్ని కలిగించకూడదని, చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని, సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేయాలని ఫలితంగా పాపవిముక్తులు కాగలరని బోధించాడు. ఇతని బోధనలను ‘ద్వాదశ అంగాలు’గా సంకలనం చేశారు.
- బుద్ధుడు ఆరు సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు
- దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు అదుపులో ఉంచుకోవాలి, నియమిత సమతులత జీవితం గడపాలని, ఎవరిని బాధించకూడదని, అమితమైన ప్రాయశ్చిత్తాలు, సంతోషాలకు బదులుగా మధ్యేమార్గం అవలంబించాలని బోధించాడు. ఇతని బోధనలను ‘త్రిపీటకాలు’ పేరుతో సంకలనం చేశారు. అవి సుత్తపీటక, అభిదమ్మ పీటిక, వినయ పీటిక.
ప్రాక్టీస్ బిట్స్
1. వేట, ఆహార సేకరణ ఆధారిత సమాజాలు మత విశ్వాసాలు తెలుసుకోవడానికి ఉపకరించని ఆనవాళ్లు?
1) నాటి కాలపు వర్ణ చిత్రాలు
2) మృతులను పూడ్చిపెట్టిన సమాధులు
3) లభ్యమైన పురావస్తువులు
4) మత గ్రంథాలు
2. కింది వాటిలో ‘పెరియ పురాణం’ కు సంబంధం లేని అంశాలు
1) భక్త కన్నప్ప కథ
2) మాంసం, తేనె, పూలు, పండ్లు శివునికి పెట్టేవారు
3) 12వ శతాబ్ధానికి చెందిన తమిళ సాహిత్యం
4) చెంచుల మైసమ్మ ఆరాధన
3. చెంచులు తమ అల్లుళ్లుగా భావించిన దేవుళ్లు?
ఎ) శ్రీశైలం మల్లికార్జున స్వామి
బి) తిరుమల వేంకటేశ్వర స్వామి
సి) శ్రీకాళహస్తీశ్వరుడు
డి) అహోబిలం శ్రీనరసింహ స్వామి
1) ఎ, బి 2) ఎ, డి
3) ఎ, బి, డి 4) ఎ
4. తొలి వ్యవసాయాధార, పశుపోషక సమాజాలు దేవతలను ఏ రూపాల్లో ఆరాధించేవారు ?
ఎ) అమ్మతల్లి లేదా నేలతల్లి
బి) రాతి ప్రతిమలు
సి) చెట్ల రూపాలు
డి) విగ్రహ రూపాలు
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) డి 4) సి, డి
5. పశుపోషకులను ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారు?
ఎ) కర్ణాటక-కురుబ
బి) తమిళనాడు-వెల్లలు
సి) తెలంగాణ-గొల్ల
డి) బిహార్-జాటుల
1) ఎ, సి 2) బి, సి, డి
3) ఎ, సి 4) బి, డి
6. పశుపోషక సమాజాలు పూజించే పురుష దేవుళ్లు
1) బీరన్న-మల్లన్న
2) మల్లన్న-కొమురన్న
3) బీరన్న-అయిలన్న
4) ఓదెన్న-మల్లన్న
7. రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ స్త్రీ దేవతలను ఏ రాష్ర్టాల్లో పూజిస్తారు?
1) తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ, మహారాష్ట్ర
3) తెలంగాణ, ఒడిశా
4) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్
8. పూర్వకాలం నుంచి మన సమాజంలో ఏ చెట్లను పూజించే ఆచారం కొనసాగుతోంది?
1) రావి, వేప, టేకు, మద్ది
2) రావి, వేప, జమ్మి, మర్రి, తులసి
3) జమ్మి, తులసి, పాల
4) మర్రి, వేప, కొడిశ
9. వ్యవసాయ సమాజం వాళ్ళు పూజించే జంతువులు
1) ఆవులు, పులులు
2) ఏనుగులు, ఎద్దులు, పాములు
3) ఏనుగులు, పులులు, పాములు, కోతులు
4) సింహాలు, ఆవులు, ఎద్దులు
10. సింధూలోయ నాగరికతలో బయటపడ్డ నిర్మాణాలు?
1) స్నాన వాటికలు 2) ప్రజాభవనాలు
3) ధాన్యాగారాలు 4) దేవాలయాలు
11. సింధూనగరికత ప్రజలు పవిత్రంగా భావించిన వాటిలో లేనివి?
1) అమ్మతల్లి
2) శివున్ని పోలిన పురుష దేవుడు
3) చెట్లు, జంతువులు
4) అగ్ని-ఇంద్రుడు
12. భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం?
1) వేదాలు 2) ఉపనిషత్తులు
3) రామాయణం 4) మహాభారతం
13. వేదాలు ఎన్ని? అవి ఏవి?
1) 4, రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం
2) 4, యజుర్వేదం, సామవేదం, గాంధర్వవేదం, ఆయుర్వేదం
3) 3, ఆయుర్వేదం, సామవేదం, నాగవేదం
4) 4, అధర్వణవేదం, దైవ వేదం, సామవేదం, అష్టాంగవేదం
14. అతి ప్రాచీనమైన వేదం పేరేమిటి?
1) రుగ్వేదం 2) అయుర్వేదం
3) అధర్వణ వేదం 4) నాగవేదం
15. వేదాలు కీర్తించిన దేవతలు ఎవరు?
1) అగ్ని, ఇంద్రుడు, సోమలత
2) శివుడు, విష్ణువు, భృగువు
3) రాముడు, కృష్ణుడు, దుర్గామాత
4) విష్ణువు, ఇంద్రుడు
16. వేద మంత్రాలు ఏ సందర్భంలో పఠించేవారు?
1) వివాహాలు జరిపే క్రతువుల్లో
2) రాజ్య పట్టాభిషేకం క్రతువుల్లో
3) యజ్ఞయాగాది క్రతువుల్లో
4) జనన, మరణ క్రతువుల్లో
17. రుగ్వేదంలోని ప్రార్థనల్లో కింది వాటిలో సంబంధం లేని అంశం?
1) అశ్వాల కోసం 2) సంతానం కోసం
3) పశువుల కోసం 4) రాజ్యాల కోసం
18. యజుర్వేదం, అధర్వణవేదం శ్లోకాల్లో వివరించినవి?
1) క్రతువులు 2) జంతువులు
3) అగ్నిబలులు 4) నరబలులు
19. వేదకాలపు తెగలలో యుద్ధాలకు కారణం కాని అంశం?
1) ఆవుల కోసం 2) నీటి కోసం
3) సంపద కోసం
4) పచ్చిక బయిళ్ల కోసం
20. వేదకాలపు సమాజంలో కింది విషయాలను పరిగణించండి
ఎ) ప్రజలు చిన్న చిన్న జన సముదాయాలుగా/తెగలుగా నివసించేవారు
బి) తెగకు నాయకుడుగా పురోహితులు/బ్రాహ్మణులు ఉండేవారు
సి) గోవులకోసం పచ్చికబయిళ్ల కోసం, నీటి కోసం యుద్ధాలు చేసేవారు
డి) వీరు వాయవ్య భాగంలోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో, యమునా నది మధ్య నివసించే వారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, డి
21. మలివేద కాలానికి సంబంధించి కింది విషయాలను పరిగణించండి
ఎ) గంగా, యమున నదీతీర ప్రాంతంలో స్థిరపడి వరి, గోధుమ పండించారు
బి) జనపదాలు ఏర్పడి, తెగనాయకులు రాజులుగా మారారు
సి) వృత్తుల ఆధారంగా వర్ణాలు ఏర్పడ్డాయి
డి) చండాలురు అనే వర్ణం ఏర్పడింది
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
సమాధానాలు
1) 4 2) 4 3) 2 4) 2 5) 3 6) 1 7) 1 8) 2 9) 3 10) 4 11) 4 12) 1 13) 1 14) 1 15) 1 16) 3 17) 4 18) 4 19) 3 20) 3 21) 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు