Indian History – Groups Special | విభజించి.. పాలించి.. విడగొట్టి
భారతదేశ జాతీయోద్యమం – దేశ విభజన, స్వాతంత్య్రం – 1939 -47
- 1939లో 2వ ప్రపంచయుద్ధం మొదలైనప్పుడు దేశంలోని పలు రాష్ర్టాలు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి.
- భారతీయులకు స్వయం పరిపాలన సిద్ధాంతాన్ని అధికారం కొంత మేరకైనా ఇవ్వాలని ఆంగ్లేయ ప్రభుత్వం అంగీకరించింది.
- 1935లో బ్రిటిష్ పార్లమెంట్ భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రాష్ర్టాల్లో ఎన్నికలు నిర్వహించి వీటిలో గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
- అయితే ఓటు వేసే అధికారాన్ని జనాభాలో చాలా కొద్దిమందికే ఇచ్చారు. రాష్ట్ర శాసన సభలకు 12%, కేంద్ర సభకు 1% మందికే ఓటు హక్కు లభించింది.
- బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ర్టాల్లో 1937లో ఎన్నికలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
- 11 రాష్ర్టాలకు 8 రాష్ర్టాల్లో కాంగ్రెస్ ‘ప్రధాన మంత్రులు’ ఎన్నికయ్యారు.
- వీళ్లు బ్రిటిష్ గవర్నర్ పర్యవేక్షణలో పనిచేశారు.
- కాంగ్రెస్ నాయకుల ముందు గల ఒక పెద్ద సమస్య జర్మనీ, జపాన్, ఇటలీ, ఇతర దేశాల కూటమికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు చేస్తున్న యుద్ధానికి సహాయపడాలా?
- కాంగ్రెస్ ప్రభుత్వాలను కనీసం సంప్రదించకుండానే బ్రిటన్ యుద్ధంలో భారతదేశం పాలుపంచుకుంటుందని నిర్ణయం
తీసుకుంది. - యుద్ధంలో సహాయపడటానికి, పడకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఈ సమస్యలతో కాంగ్రెస్ సతమతమైపోయింది.
- అనేక మంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్ని, ముస్సోలినీని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు.
- ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలన్న కృత నిశ్చయంతో వాళ్లు ఉన్నారు.
- భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం (కనీసం మాట అయినా) ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవడంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది.
- బ్రిటిష్ వారు దీన్ని గుర్తించారు. కానీ తాము నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం వాళ్లకు చాలా కష్టంగా అనిపించింది.
- యుద్ధ సమయంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఉండేది.
- సాధ్యమైనంత కాలం తమ సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలని కన్జర్వేటివ్‌లు ప్రయత్నించారు.
- కన్జర్వేటివ్‌లతో పోలిస్తే భారతీయులు స్వాతంత్య్రం పొందడానికి లేబర్ పార్టీ ఎక్కువ సుముఖంగా ఉంది.
- బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వటానికి బ్రిటిష్ వాళ్లు సంసిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోరింది.
- అంతేకాకుండా కేంద్రంలో కూడా జాతీయ ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పరచాలని కాంగ్రెస్ కోరింది.
- భారతదేశంలో అనేక ఇతర సమూహాల ప్రయోజనాలను కాపాడాలి కాబట్టి బ్రిటన్ దీనికి అభ్యంతరం పెట్టింది.
- కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించటం లేదని (ఉదాహరణకు ముస్లింలకు) బ్రిటన్ భావం.
- అనేక మంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపైన ఉన్నదని బ్రిటన్ భావించింది.
- బ్రిటన్ మొండిపట్టుతో విసిగిపోయిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది.
- 1937లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939 అక్టోబర్‌లో రాజీనామా చేశాయి.
- యుద్ధంలో గెలవటంపై దృష్టి కేంద్రీకరించటానికి వీలుగా శాంతిభద్రతలను కాపాడటానికి ప్రభుత్వం యుద్ధ సమయంలో ప్రత్యేక అధికారాలను పొందింది.
- ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరినైనా వెంటనే జైలుకి పంపించి, కోర్టుకి వెళ్లకుండా కావలసినంత కాలం బందీగా ఉండవచ్చు.
- వాక్ స్వాతంత్య్రాన్ని కూడా పరిమితం చేశారు.
- యుద్ధం ముగిసిన తర్వాత పాలకులు స్వాతంత్య్రం ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావడానికి 1940, 1941 సంవత్సరాల్లో కాంగ్రెస్ అనేక సత్యగ్రహాలను చేపట్టింది.
- పెద్ద ప్రజా ఉద్యమం ఏదీ ఆ కాలంలో చేపట్టలేదు.
దేశ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు?
- నిరాశతో తమ పాలనపై తిరగబడుతున్న భారతీయులతో ఎలా వ్యవహరించాలో బ్రిటన్‌కు తెలియలేదు.
- ప్రజలపై కాంగ్రెస్‌కు ఉన్న పట్టు బలహీనపడేలా చేసి దాన్ని దండించటానికి గల మార్గాల కోసం చూశారు.
- ‘విభజించి పాలించు’ అనే సిద్ధాంతాన్ని వాళ్లు పూర్తిస్థాయిలో అమలు చేశారు.
- ఈ దిశగా బ్రిటిష్ ప్రభుత్వం ముస్లింలీగ్ ప్రణాళికలకు మద్దతు ఇచ్చి, ప్రోత్సహించి కాంగ్రెస్‌కు ఇచ్చే ప్రాముఖ్యతను
తగ్గించసాగింది. - ఈ కాలంలోనే ముస్లింలీగ్, ఎం.ఎ జిన్నా వంటి నాయకులు ప్రజారాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.
- 1945లో యుద్ధం సమయంలో రాయల్ నౌకాదళాన్ని ఇరవాడి దాటి వెళ్లింది
- భారతదేశంలో రెండవ ప్రపంచయుద్ధ సమయంలో ఏనుగులు సరుకులను ఎత్తిన విమానాల రకం – సి 46.
ముస్లింలీగ్
- ఏర్పడిన సంవత్సరం -1906
- ఏర్పడిన ప్రదేశం – ఢాకా
- ఏర్పాటు చేసిన వారు – ముస్లిం భూస్వాములు, నవాబులు
- ఇది బెంగాల్ విభజనను సమర్ధించింది
- ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరుకుంది
- తమ తమ బృందాలకు కొన్ని ప్రయోజనాలను సమకూర్చటం ద్వారా రాజకీయ నాయకులు అనుచర వర్గాన్ని ఏర్పరచుకునేలా ఇది ప్రేరేపించింది.
- ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీకి 1930 వరకు పెద్దగా ప్రజల మద్దతు లేదు.
- అన్ని సభల్లోనూ ముస్లింలు మాత్రమే ఓటు వేసే ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేయాలని బ్రిటన్ను అది కోరసాగింది.
- చాలా ప్రాంతాల్లో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి హిందువులే ఎన్నికవుతారని ప్రభుత్వంలో ముస్లింల ప్రయోజనాలను కాపాడటం కష్టమవుతుందని వాదించారు.
- ఈ వాదనను కాంగ్రెస్ కూడా అంగీకరించటంలో 1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు.
హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్
- హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) ప్రజలను సమీకరించటానికి చురుకుగా
పనిచేశాయి. - కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.
- భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్లు కలిగించారు.
- ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు.
- తమ సభ్యుల్లో లౌకిక అవగాహన పెంచటానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది.
- ముస్లిం ప్రజల్లో భద్రతాభావాన్ని పెంచి, ముస్లింలీగ్, హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యక్రమాలు, సందేశాల ద్వారా వాళ్లలో కలుగుతున్న తప్పుడు అభిప్రాయాలను తొలగించటానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించింది.
- హిందువులు, ముస్లింలు రెండు దేశాల ప్రజలు కాదని భారతదేశంలో సమగ్ర భాగమని కాంగ్రెస్ వాదించేది.
- అయితే హిందువుల ఆధిపత్యం గురించి ముస్లింలీగ్‌కి ఉన్న భయాలను బ్రిటన్ ఆసక్తిగా వింటూ ముస్లింలకు భద్రత కల్పించటానికి సూచనలు చేయసాగింది.
పాకిస్థాన్ తీర్మానం
- “సారే జహాసే అచ్ఛా హిందుస్థాన్ హమారా” అనే కవిత రాసిన వారు – “మహ్మద్ ఇక్బాల్ (ఉర్దూకవి)”
- మహ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లింలీగ్‌కు అధ్యక్షోపన్యాసం చేస్తూ “వాయవ్య ముస్లిం రాష్ట్ర” ఆవశ్యకత గురించి మాట్లాడారు.
- హిందువుల ఆధిపత్యం పట్ల ముస్లింలీగ్ రెచ్చగొట్టిన భయాలను తొలగించటంలో కాంగ్రెస్ వైఫల్యం చెందటం వల్ల, బ్రిటిష్ పాలకులు ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని అవలంబించటం వల్ల రాజకీయ వాతావరణం మారిపోయింది.
- 1940 మార్చి 23న ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లింలీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
- అస్పష్టంగా ఉన్న ఈ తీర్మానం దేశ విభజనను కానీ, పాకిస్థాన్‌ను కానీ పేర్కొనలేదు.
- ఆ తర్వాత సంవత్సరంలో దీన్ని పాకిస్థాన్ తీర్మానంగా చెప్పడం మొదలు పెట్టారు.
- చర్చలు, సంప్రదింపులు మొదలయ్యి ఆగిపోవటంతో కొత్త దేశంగా పాకిస్థాన్ ఏర్పడటానికి మద్దతు పొందసాగింది.
- ముస్లింలీగ్ నాయకుడైన ఎం.ఎ జిన్నా డిమాండ్లను ఒప్పుకోవటం కాంగ్రెస్‌కు కూడా కష్టమవుతుంది.
- 1940 – 1946 మధ్య ప్రత్యేక దేశం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి ముస్లిం ప్రజలను ముస్లింలీగ్ ఒప్పించగలిగింది.
- హిందూ జమీందార్లు, వడ్డీ వ్యాపారస్థులు తమను దోచుకోని పరిస్థితి గురించి రైతులు కలలుకన్నారు.
- వ్యాపారస్థులు, ఉద్యోగార్థులు హిందువుల నుంచి పోటీ ఉండదని ఆశించారు.
- మరింత మత స్వాతంత్య్రం ఉంటుంది, తమకు కావలసిన విధంగా ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ముస్లిం సంపన్నుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.
- 1942 – 1945 మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్న సమయంలో ప్రజల మధ్య తన ఆదరణను పెంచుకోవడానికి ముస్లింలీగ్ ఈ కాలాన్ని సద్వినియోగపరచుకుంది.
- బ్రిటిష్‌వాళ్లు భారతదేశం వదిలి వెళ్లేలా ఎవరు చేస్తారు?
- 1941 నాటికి జపాన్ ఆసియాలోకి విస్తరించసాగింది.
- భారతదేశ భూభాగాలకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ఏర్పడింది.
- జపాన్‌కు వ్యతిరేక యుద్ధంలో భారతీయులు కూడా పాల్గొనేలా బ్రిటన్
చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. - 1942లో “సర్ స్టాఫర్డ్ క్రిప్స్”ని భారతదేశం పంపించి గాంధీజీతో, కాంగ్రెస్‌తో రాజీ కుదుర్చుకోవలసిందిగా ఒత్తిడిని పెంచింది.
- వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యునిగా భారతీయుడిని ముం దుగా నియమించాలని కాంగ్రెస్ పట్ట్టు బట్టడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి.
- ఈలోగా 2వ ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది.
- నాజీ సైన్యం సోవియట్ యూనియన్‌పై దండెత్తడంతో అది ఆందోళన చెందింది.
- ప్రపంచస్థాయిలో ప్రమాదాన్ని గుర్తించి, ఈ యుద్ధాన్ని అది ప్రజల యుద్ధంగా పేర్కొంది.
- ఇందుకు విరుద్ధంగా గాంధీజీ వంటి వాళ్లు బ్రిటన్ భారతదేశాన్ని విడిచి వెళ్లిపోతే అది సొంతంగా జపాన్ను ఎదుర్కో గలదని భావించారు.
- అమెరికా, యూరపుల్లో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి.
- ఐరోపా, వలస పాలకులు త్వరలోనే ఓడిపోతారని అనుకోసాగారు.
- జపాన్ ఆసియా దేశం, అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కొనగలిగింది.
- తాము కూడా బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు అనుకోసాగారు.
- ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వాళ్లన్న భ్రమ బద్దలయింది.
ఇంకా ఉంది..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు