Indian History | 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం?
జూన్ 24 తరువాయి
90. కింది అంశాలను సరిగా జత చేయండి.
రాజ్యాంగ లక్షణం గ్రహించిన దేశం
1. ప్రాథమిక హక్కులు ఎ. అమెరికా రాజ్యాంగం
2. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం బి. బ్రిటన్ రాజ్యాంగం
3. అత్యవసర అధికారాలు సి. జర్మనీ రాజ్యాంగం
4. ఆదేశిక సూత్రాలు డి. ఐర్లాండ్ రాజ్యాంగం
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
91. కింది వాటిలో సరికాని వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
1. దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనీబీసెంట్ 1917 లో మాంటెగ్ చేమ్స్ఫర్డ్లకు వినతి పత్రాన్ని సమర్పించింది
2. ప్రొవిన్షియల్ శాసన సభ కలిగిన ట్రావెన్కోర్ సంస్థానం మొదటిసారి 1920లో కొన్ని అర్హతలు కలిగిన మహిళకు మాత్రమే ఓటు హక్కు కల్పించింది
3. 1921లో మద్రాస్, బొంబాయి అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు ఓటుహక్కు కల్పించాయి
4. స్వాతంత్య్రం వచ్చాకే దేశం సార్వత్రిక ఓటు హక్కును కల్పించింది
ఎ. 1 బి. 1, 2
సి. 3 డి. 1, 2, 4
92. ఎన్నికల్లో ఓటు వేయబోయే వ్యక్తి ఏ వేలుకు ఇంకు చుక్క పెడతారు?
ఎ. కుడి చేయి మధ్య వేలుకు
బి. ఎడమ చేయి చూపుడు వేలుకు
సి. కుడి చేయి చూపుడు వేలుకు
డి. ఎడమ చేయి మధ్య వేలుకు
93. పంచాయతీరాజ్ ఏ జాబితాకు చెందినది?
ఎ. రాష్ట్ర జాబితా బి. కేంద్ర జాబితా
సి. ఉమ్మడి జాబితా డి. అవశేష జాబితా
94. కింది వాటిలో లిఖిత రాజ్యాంగం లేని దేశం/దేశాలను గుర్తించండి.
1. కెనడా 2. అమెరికా
3. డెన్మార్క్ 4. ఇజ్రాయెల్
ఎ. 1, 2 బి. 2, 3
సి. 3 డి. 1, 4
95. కింది వాటిలో రాజ్యాంగానికి సంబంధించి సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?
1. భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినంగా 2015, నవంబర్ 19న ప్రకటించింది
2. రాజ్యాంగ ముసాయిదాను 1949, నవంబర్ 26న ఆమోదించారు
3. భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది
4. రాజ్యాంగ దినాన్ని ‘సంవిధాన్ దివస్’ లేదా ‘జాతీయ న్యాయ దినం’ అని కూడా అంటారు
ఎ. 2, 3 బి. 1, 4
సి. 3 డి. 1, 2, 3, 4
96. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. 19వ శతాబ్దం ఆరంభంలో సతీసహగమనం, బాల్యవివాహాలు, మతపరమైన కర్మకాండలు, బలులు వంటి అనేక మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతుండేవి. వీటికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేసిన ఉద్యమాలనే సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు అంటారు
2. దేశంలో మొదటగా సాంఘిక, మత సంస్కరణోద్యమాలు బెంగాల్లో ప్రారంభమయ్యాయి
3. భారతీయ సంస్కృతి అధ్యయనం కోసం 1784లో సర్ విలియమ్ జోన్స్ కలకత్తాలో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను ఏర్పాటు చేశాడు.
ఎ. 1 బి. 1, 2 సి. 1, 2, 3 డి. 3
97. ప్రతిపాదన ఎ: భారత్‌లో పాశ్చాత్య విద్యా విధానానికి ఆద్యునిగా రామ్మోహన్ రాయ్‌ని పిలుస్తారు
కారణం ఆర్: లార్డ్ మెకాలే భారతదేశంలో పాశ్చాత్య విద్యావిధానం ప్రవేశపెట్టడానికి రాజా రామ్మోహన్ రాయ్ ప్రోద్బలమే కారణం
ఎ. ఎ, ఆర్ సరైనవే, ఆర్ ఎ కు సరైన వివరణ
బి. ఎ, ఆర్ సరైనవే కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి. ఎ సరైనది, ఆర్ తప్పు
డి. ఎ తప్పు, ఆర్ సరైనది
98. సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. బ్రిటిష్‌వారు విభజించు పాలించు పద్ధతిని అనుసరించి దేశాన్ని హస్తగతం చేసుకోగలిగారు
బి. భారత్‌లో మత సాంఘిక రంగాల్లో జరిగిన సంస్కరణోద్యమాలకే పునరుజ్జీవనోద్యమం అని పేరు
సి. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమమే భారతీయుల్లో జాతీయ వాదానికి పునాది వేసింది
డి. రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు
99. వ్యక్తులు వారికి సంబంధించిన అంశాలను జత చేయండి.
1. రాజా రామ్మోహన్ రాయ్ ఎ. తత్వబోధిని సభ
2. దేవేంద్రనాథ్ ఠాగూర్ బి. ఆత్మీయ సభ
3. కేశవచంద్రసేన్ సి. ది హిందూ ఫ్యామిలీ ఫండ్
4. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ డి. సంఘత్ సభ
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
100. కింది వాటిని పరిశీలించి సరైన వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
1. ఆర్య సమాజం ముఖ్య ఉద్దేశం వేద సంస్కృతి రక్షణ. దయానంద సరస్వతి రచించిన సత్యార్ధ ప్రకాశిక గ్రంథం ఆర్య సమాజానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథంగా గుర్తింపబడింది
2. భారతదేశంలో ‘స్వరాజ్య’ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన సంస్థగా ఆర్య సమాజం చరిత్రలోకి ఎక్కింది
3. హరిజన్ అనే పదం మహాత్మా గాంధీ కంటే ముందు దయానంద సరస్వతే ఉపయోగించాడన్నది జగద్విదితం
ఎ. 1 బి. 1, 2,3 సి. 2 డి. 1, 2
101. వ్యక్తులు వారికి సంబంధించిన అంశాలను సరిగా జతపరచండి.
1. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎ. వితంతు వివాహ సంఘం
2. సయ్యద్ అహ్మద్ బి. భారత జాతీయ సామాజిక సమావేశం
3. డి.కె.కార్వే సి. బ్రహ్మధర్మ ప్రచారం
4. గోవింద రనడే డి. వహాబీ ఉద్యమం
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
102. 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది?
ఎ. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం
బి. భారత సైనికుల పట్ల వివక్ష
సి. జీతాలు సరిగా చెల్లించకపోవడం
డి. ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను ఉపయోగించాలని సిపాయిలను ఒత్తిడి చేయడం
103. భారత సిపాయిల అసంతృప్తికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైన వాటిని గుర్తించండి.
1. భారతీయ సైనికులు యుద్ధాల్లో బ్రిటిష్ తరఫున పోరాడుతున్నప్పటికీ వారి జీతభత్యాలు, పదోన్నతులు బ్రిటిష్ సైనికులతో పోల్చితే ఎంతో తక్కువగా ఉండేవి. భారతీయ సైనికులను సిపాయిలను, యూరోపియన్ సైనికులను సోల్జర్స్ అని అనేవారు
2. హిందూ సిపాయిలు సముద్రయాన వ్యతిరేకతకు విరుద్ధంగా లార్డ్ కానింగ్ ‘సాధారణ సేవ నియుక్త చట్టం-1856’(జనరల్ సర్వీసెస్ అనలిస్ట్మెంట్ యాక్ట్) ను ప్రవేశపెట్టి విదేశాలతో పాటు ఎక్కడైనా సిపాయిలు యుద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాడు
3. 1857 తిరుగుబాటుకు ముందు సైన్యంలో భారత సైనికుల కంటే బ్రిటిష్ సైనికులే అధికంగా ఉండేవారు
ఎ. 1 బి. 2 సి. 1, 2 డి. 3
104. సిపాయిల తిరుగుబాటుపై వెలువడిన గ్రంథాలు వాటి రచయితలను సరిగా జత చేయండి.
1. కాజెస్ ఆఫ్ ది ఇండియన్ మ్యూటినీ ఎ. ఎస్.బి.చౌదరి
2. సివిల్ రెబలియన్ ఇన్ ఇండియన్ మ్యూటినీస్ బి.సయ్యద్ అహ్మద్ ఖాన్
3. ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, 1857 సి. టీఆర్ హోమ్స్
4. హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ మ్యూటినీ డి. వి.డి. సావర్కర్
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
105. 1857, జూలై 17న హైదరాబాద్‌లో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రోహిల్లాల నేత?
ఎ. తుర్రేబాజ్ ఖాన్
బి. దివాన్ సాలార్ జంగ్
సి. నిజాం అఫ్జలుద్దౌలా
డి. మౌల్వీ అల్లాఉద్దీన్
106. వెనుకబడిన తరగతులకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?
1. కాకా కాలేల్కర్ కమిషన్ (1955) ప్రకారం భారత్‌లో మొత్తం 2,399 ఇతర వెనుకబడిన కులాలు ఉన్నాయి
2. మండల్ కమిషన్ (1980) ప్రకారం దేశంలో ఇతర వెనుకబడిన కులాల ప్రజలు (హిందూయేతరులతో కలిపి) 52 శాతం ఉన్నారు. అలాగే దేశంలో వెనుకబడిన కులాలు, కమ్యూనిటీల సంఖ్య 3,743గా కమిషన్ పేర్కొంది
3. అయితే 2006లో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ నివేదిక ప్రకారం ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితా (కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయించి) అనుసరించి ఓబీసీల సంఖ్య 5,013కు పెరిగింది
ఎ. 1 బి. 2 సి. 3 డి. 1, 2, 3
107. అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలు, వాటిని నిర్వహించినవారిని జత చేయండి.
1. దీనబంధు ఎ. బీఆర్ అంబేద్కర్
2. దర్పణ్ బి. ముకుందరావు పాటిల్
3. దీనమిత్ర సి. బాలశాస్త్రి జంబేకర్
4. మూక్ నాయక్ డి. జ్యోతిబా ఫులె
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
108. కింది వాటిలో సరికాని వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
1. మహర్లు మహారాష్ట్రలో వివక్షకు గురైన కులం. వీరి హక్కుల కోసం 1894లో ఇదే కులానికి చెందిన మాజీ సైనికోద్యోగి గోపాల్ బాబా వాగ్లేకర్ మహర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు
2. వాగ్లేకర్ తర్వాత మహర్ ఉద్యమానికి డా.బీఆర్ అంబేద్కర్ సారథ్యం వహించారు
3. మహర్ కులంలో మొదటి గ్రాడ్యుయేట్ అయిన అంబేద్కర్ ‘ఆధునిక మనువు’, ‘భారత రాజ్యాంగ పితామహుడు’గా పేరు పొందాడు
ఎ. 1, 2, 3 బి. 1, 2
సి. 2, 3 డి. 3
109. కింది ఉద్యమాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యలను గుర్తించండి.
1. జస్టిస్ ఉద్యమం: ఇది ఒక మధ్య తరగతి కుల ఉద్యమం. రాజకీయాల్లో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం దీని లక్ష్యం. ఈ ఉద్యమం జస్టిస్ పార్టీ స్థాపనకు దారి తీసింది
2. ఆత్మగౌరవ ఉద్యమం: తమిళనాడుకు పరిమితమైన తీవ్ర బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని పెరియార్ రామస్వామి నాయకర్ ప్రారంభించారు
3. ఎఝవ (అరువిపురం) ఉద్యమం: ఇది కేరళలో బ్రాహ్మణ, వైదిక ఆచారాలను సమర్థిస్తూ బ్రాహ్మణ వ్యతిరేకులను నిలువరించడానికి సాగిన ఉద్యమం
ఎ. 1 బి. 2 సి. 3 డి. 1, 2
110. తిరుగుబాట్లు, అవి జరిగిన కాలాలను సరిగా జత చేయండి.
1. భిల్లుల తిరుగుబాటు ఎ. 1831-32
2. అహోమ్ తిరుగుబాటు బి. 1829-32
3. ఖాసీ తిరుగుబాటు సి. 1828
4. కోల్ తిరుగుబాటు డి. 1817-19
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
111. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నాయకులు, వారి ప్రాంతాలను జత చేయండి.
1. వీరపాండ్య కట్టబొమ్మన ఎ. తిరున్వేలి (తమిళనాడు)
2. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బి. రూపనగుడి (ఏపీ)
3. కిట్టూరి చెన్నమ్మ సి. కిత్తూరు (కర్ణాటక)
4. వేలుతంపి డి. ట్రావెన్కోర్ (కేరళ)
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
112. ఎవరి జయంతి రోజున 2000, నవంబర్ 15న 28వ రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది?
ఎ. అల్లూరి సీతారామరాజు
బి. బిర్సా ముండా
సి. సుభాష్ చంద్రబోస్
డి. రామ్‌విలాస్ పాశ్వాన్
113. గోవధ నిషేధానికి పాటుపడిన సిక్కు ఉద్యమం ఏది?
ఎ. కుకా ఉద్యమం
బి. నిరంకారి ఉద్యమం
సి. నామ్ధారి ఉద్యమం
డి. సింగ్ సభ ఉద్యమం
114. గవర్నర్లు, వారి కాలంలో జరిగిన యుద్ధాలను సరిగా జత చేయండి.
1. వాన్ సెట్టార్డ్ ఎ. మూడో ఆంగ్లో- మైసూర్ యుద్ధం
2. వెరల్ట్స్ బి. మొదటి ఆంగ్లో- మరాఠా యుద్ధం
3. వారన్ హేస్టింగ్స్ సి. మొదటి ఆంగ్లో- మైసూర్ యుద్ధం
4. కారన్వాలిస్ డి. బక్సార్ యుద్ధం
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సమాధానాలు
90. సి 91. సి 92. బి 93. ఎ
94. డి 95. డి 96. సి 97. ఎ
98. డి 99. డి 100. బి 101. ఎ
102. డి 103. సి 104. డి 105. ఎ
106. డి 107. బి 108. ఎ 109. సి
110. బి 111. సి 112. బి 113. ఎ
114. బి
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్,
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు