General Science Chemistry | నదీ తీరాల వెంబడి చెట్ల పెంపకం ముఖ్య ఉద్దేశం?
రసాయనశాస్త్రం
1. కింది వాటిలో సరైన వివరణను గుర్తించండి.
ఎ. ఓజోన్ పొర తరుగుదలకు CFCలు కారణం
బి. నీటి ఆవిరి, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, CFC, నైట్రస్ ఆక్సైడ్లు గ్రీన్హౌస్ వాయువులు
సి. శుద్ధ నీటి BOD విలువ 100ppm
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) బి, సి
2. వాతావరణాన్ని కలుషితం చేసే వాయువులు ఏవి?
1) కార్బన్ ఆక్సైడ్లు 2) నైట్రోజన్ ఆక్సైడ్
3) సల్ఫర్ ఆక్సైడ్లు 4) అన్నీ
3. వరదల తర్వాత మొక్కల పెరుగుదల మీద సముద్ర జలం చూపే హానికరమైన ప్రభావం?
1) నీటి నిల్వకు దారితీయడం
2) నీటిలో ఉప్పు పరిమాణం ఎక్కువై నీరు విషపూరితం కావడం
3) నీటిని పీల్చుకోకుండా మొక్క వేళ్లను నిరోధించడం
4) మృత్తికలను మరింత ఆమ్లం చేయడం
4. భూగోళ తాపానికి (గ్రీన్ హౌస్ ఎఫెక్ట్) కారణమైన వాయువులు?
ఎ. నీటి ఆవిరి బి. కార్బన్ డై ఆక్సైడ్
సి. మీథేన్ డి. ఓజోన్
ఇ. నైట్రస్ ఆక్సైడ్
1) బి 2) బి, డి, ఇ
3) ఎ, బి, సి 4) అన్నీ
5. మల్చింగ్ అంటే ఏమిటి?
1) చెత్త, ఆకులను నీరు మడులపై
పరిచి చిన్న మొక్కలను ఎండవేడి నుంచి కాపాడటం
2) పాడి పశువుల్లో హార్మోన్లు వినియోగించి అధిక పాల దిగుబడి పొందడం
3) తడి మట్టిని పైకి తిరగతోడటం
4) పచ్చిరొట్ట ఎరువును చేయడం
6. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
1) క్లోరో ఫ్లోరో కార్బన్లు
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) నైట్రస్ ఆక్సైడ్
7. వాతావరణంలో మానవ కార్యకలాపాల వల్ల కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ కార్యకలాపాల్లో ముఖ్యమైన వాటిని గుర్తించండి.
ఎ. శిలాజ ఇంధనాల దహనం
బి. వ్యవసాయం
సి. చెట్ల నరికివేత డి. హరితహారం
1) ఎ, బి, డి 2) ఎ, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి
8. థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి గాలిలోకి విడుదలయ్యే కలుషితాలు?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) లెడ్ 4) 1, 2
9. ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధానమైన ఆక్సైడ్లు ఏవి?
ఎ. కార్బన్ ఆక్సైడ్లు
బి. సల్ఫర్ ఆక్సైడ్లు
సి. నైట్రోజన్ ఆక్సైడ్లు
1) బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) పైవన్నీ
10. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్నిపర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగ క్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
11. హరిత గృహ ప్రభావానికి కారణమైన ప్రధాన వికిరణాలు?
1) IR 2) UV
3) X 4) గామా
12. బ్లాక్ హోల్స్ అంటే?
1) అంతరిక్ష వస్తువుల్లో ఏర్పడే రంధ్రాలు
2) సూర్యుడి మీద ఉండే ప్రకాశవంతమైన మచ్చలు
3) అధిక సాంద్రతకు చెందిన పతనమవుతున్న వస్తువు
4) అల్ప సాంద్రతకు చెందిన పతనమవుతున్న వస్తువు
13. వాయు కాలుష్యంలో ఉండే ఏ లోహం పట్టణాల్లో మానసిక రుగ్మతలకు కారణం?
1) రాగి 2) పాదరసం
3) సీసం 4) వెండి
14. కలరా, జాండీస్ మొదలైన వ్యాధులు ఏ కాలుష్యం వల్ల కలుగుతాయి?
1) గాలి 2) నీరు
3) నేల 4) ధ్వని
15. నిశ్చితం (ఎ): వాతావరణంలో ధూళి కణాలు పెరిగితే వాతావరణ ఉష్ణోగ్రత తగ్గుతుంది
కారణం (ఆర్): వాతావరణంలోని ధూళి కణాలు సూర్యకాంతి కిరణాలను చెదరగొడతాయి
1) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైంది కానీ ఆర్ సరైంది కాదు
4) ఎ సరైంది కాదు కానీ ఆర్ సరైంది
16. ఓజోన్ పొర ఏ కిరణాలను శోషించుకుంటుంది?
1) పరారుణ కిరణాలు
2) ఆల్ఫా కిరణాలు
3) అతినీలలోహిత కిరణాలు
4) ఏదీ కాదు
17. వాతావరణంలో ఉండే ఒక వాయువు హరిత గృహ ప్రభావాన్ని కలుగజేస్తుంది. కానీ ఇది స్ట్రాటోస్ఫియర్‌లో ఒక పొరగా ఉండి హానికారక అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా కాపాడుతుంది. ఆ వాయువు ఏది?
1) ఆక్సిజన్ 2) ఓజోన్
3) నైట్రోజన్ 4) క్లోరిన్
18. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే?
1) వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్ వల్ల సౌరశక్తిని గ్రహించడం
2) వాతావరణపరమైన ఆక్సిజన్ వల్ల సౌరశక్తిని గ్రహించడం
3) ఉష్ణమండల ప్రాంతాల్లోని ఇళ్లలో కాలుష్యం
4) పైవేవీ కావు
19. ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేసేది?
1) క్లోరో ఫ్లోరో కార్బన్లు
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) ఏదీ కాదు
20. హరిత గృహ ప్రభావం కారణంగా కలిగే దుష్ప్రభావం కానిది ఏది?
1) మంచు కరిగి అకాల వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు మునగడం
2) భూ ఉపరితల వాతావరణ ఉష్ణోగ్రత పెరగడం
3) పంటల నష్టం 4) చర్మ క్యాన్సర్
21. ఆమ్ల వర్షాల వల్ల ఏం జరుగుతుంది?
1) చలువరాతితో నిర్మించిన కట్టడాలు దెబ్బతింటాయి
2) భూమి తగ్గుతుంది
3) చర్మ వ్యాధులు, కంటి శుక్లాలు వస్తాయి
4) అన్నీ
22. కింద పేర్కొన్న మానవ చర్యల్లో దీర్ఘకాలం ప్రకృతి సమతుల్యాన్ని గందరగోళపరిచేది ఏది?
1) అడవులను నరకడం
2) భూమిని మళ్లీ మళ్లీ దున్నడం
3) సస్యభ్రమణం
4) రసాయన ఎరువులను నిరంతరం వినియోగించడం
23. వరి పొలాల నుంచి విడుదలయ్యే మార్ష్ వాయువుగా పిలువబడే హరిత గృహ వాయువు ఏది?
1) మీథేన్ 2) భ్యూటేన్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) సల్ఫర్ డై ఆక్సైడ్
24. కాలేయ వ్యాధులు దేని వల్ల వస్తాయి?
1) క్లోరిన్ పెస్టిసైడ్స్
2) ఐసోసైనేట్లు
3) కార్బన్ టెట్రాక్లోరైడ్
4) ఏదీ కాదు
25. కింది వాటిని జతపరచండి.
ఎ. సల్ఫర్ డై ఆక్సైడ్ 1. కెటలైటిక్ కన్వర్టర్స్
బి. రోడియం 2. గ్లోబల్ వార్మింగ్
సి. ఓజోన్ క్షీణత 3. ఆమ్ల వర్షాలు
డి. కార్బన్ డై ఆక్సైడ్ 4. మాంట్రియల్ ప్రొటోకాల్
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
26. నేల కోతను అదుపు చేయడం కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ సాయిల్స్ కన్జర్వేషన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) ఢిల్లీ
3) పుణె 4) కోల్‌కతా
27. మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
1) నైట్రస్ ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ డై ఆక్సైడ్
4) నైట్రోజన్ డై ఆక్సైడ్
28. కాంతి రసాయన పొగమంచుకు కారణమైన పదార్థాలేవి?
1) నైట్రస్ ఆక్సైడ్ 2) పొగ
3) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
4) పైవన్నీ
29. స్థిరమైన కర్బన, క్లోరిన్ అణువుల విచ్ఛిత్తి వల్ల ఏం ఏర్పడుతున్నాయి?
1) సల్ఫర్ డై ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) క్లోరో ఫ్లోరో కార్బన్లు
4) క్లోరిన్‌లు
30. స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్య కారక వాయులేవి?
1) సల్ఫర్ డై ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) కార్బన్ మోనాక్సైడ్ 4) పైవన్నీ
31. కృత్రిమ వర్షపాత ప్రయోగం ఉద్దేశం ఏమిటి?
1) వర్షాన్ని కురిపిస్తుంది
2) రోదసిలో మొక్కల పెరుగుదల
3) వర్షపాతం పెంపు
4) వర్ష దిశను మార్చడం
32. వాతావరణంలో అనుమతించ దగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి?
1) 10 పీపీఎం 2) 7 పీపీఎం
3) 50 పీపీఎం 4) 100 పీపీఎం
33. కాంతి కాలుష్యం అంటే?
1) రాత్రి వేళలో పెద్దపెద్ద నగరాలను ఆవహించి ఉండే కాంతి పుంజం
2) ఫ్రియాన్ల వల్ల కలుషితమైన కాంతి
3) అడవులు మండటం వల్ల వెలువడే కాంతి
4) వాహనాల లైట్ల వల్ల వెలువడే కాంతి
34. కింది వాటిలో గాలిని కలుషితం చేయనిది?
1) ఫ్లై యాష్ 2) ఫ్రియాన్
3) హైడ్రోజన్ సల్ఫైడ్ 4) ఫ్లోరైడ్
35. ఒక్కొక్కసారి మొక్కలను నాటినప్పుడు కొన్ని ముదురు ఆకులను కత్తిరిస్తారు ఎందుకు?
1) ఆహారం తయారీ త్వరగా జరుగుతుంది
2) కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది
3) త్వరగా పెరుగుతుంది
4) బాష్పోత్సేకాన్ని తగ్గించడం కోసం
36. అంటార్కిటికాలో ఓజోన్ క్షీణతకు కారణమైన పదార్థం?
1) ఎక్రోలిన్ 2) PAN
3) కార్బన్ మోనాక్సైడ్,
కార్బన్ డై ఆక్సైడ్
4) క్లోరిన్ నైట్రేట్
37. కార్బన్ మోనాక్సైడ్ విడుదలకు ప్రధాన కారణం?
1) పరిశ్రమలు 2) వాహనాలు
3) అడవులు 4) అగ్రి పర్వతాలు
38. నదీ తీరాల వెంబడి చెట్ల పెంపకం ముఖ్య ఉద్దేశం?
1) అధిక వర్షపాతాన్ని అరికట్టడం
2) నీరు భూమిలోకి ఇంకి వృథా కాకుండా ఉండటానికి
3) పూడికను నిరోధించడం
4) కాలుష్య నివారణకు
39. రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
1) స్ట్రోటో ఆవరణం 2) మీసో ఆవరణం
3) ట్రోపో ఆవరణం 4) థర్మో ఆవరణం
40. ఓజోన్ పొర ఏ ఆవరణం కింద ఉంటుంది?
1) స్ట్రాటోస్ఫియర్ 2) ఐనోస్ఫియర్
3) ట్రోపోస్ఫియర్ 4) ఏదీ కాదు
41. LPG లాంటి ఇంధన వాయువులు గాలిలో మండి విడుదల చేపే హరిత గృహ వాయువులు?
ఎ. కార్బన్ మోనాక్సైడ్
బి. కార్బన్ డై ఆక్సైడ్
సి. నీటి ఆవిరి
1) బి 2) బి, సి
3) ఎ, బి 4) పైవన్నీ
42. ఏ క్రియాశీల అణువులు ఓజోన్ను వచ్ఛిన్నం చేయడంలో అధిక చర్యాశీలతను కలిగి ఉన్నాయి?
1) ఫ్లోరిన్ 2) క్లోరిన్
3) అయోడిన్ 4) ఆర్గాన్
43. వాతావరణం పై పొరల్లో ఓజోన్ క్షీణతకు కారణమైన వాయువులు ఏవి?
1) పుల్లరిన్లు 2) ఫ్రియాన్లు
3) పాలిహాలోజన్లు 4) ఫెర్రోసీన్
44. మెర్క్యురీ, సీసం వంటి లోహాలు, వాటి ఆక్సైడ్ల వల్ల ఏ వ్యాధులు వస్తాయి?
1) నరాల వ్యాధులు
2) గుండె సంబంధిత వ్యాధులు
3) చర్మానికి సంబంధిచిన వ్యాధులు
4) ఏదీ కాదు
45. వాహనాల నుంచి వెలువడే 2.5 మైక్రాన్ల పరిమాణంలో ఉండే కణ స్వభావ పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి అత్యంత సునాయాసంగా ప్రవేశిస్తాయి. వీటి వల్ల కలిగే వ్యాధులేవి?
1) శ్వాస సంబంధిత వ్యాధులు
2) గుండె జబ్బులు
3) పక్షవాతం 4) పైవన్నీ
సమాధానాలు
1.1 2.4 3. 3 4.4
5.1 6.1 7.3 8.4
9.1 10.3 11.1 12.3
13.3 14.2 15.1 16.3
17.2 18.1 19.1 20.4
21.1 22.3 23.1 24.3
25.1 26.2 27.1 28.4
29.3 30.4 31.1 32.2
33.1 34.4 35.4 36.4
37.2 38.3 39.4 40.1
41.2 42.2 43.2 44.1
45.4
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు