హైదరాబాద్ హైదరాబాదీలదే
నిజాం సబ్జెక్ట్ లీగ్
# 1934లో ఏర్పడిన ‘నిజాం సబ్జెక్ట్ లీగ్’లో హిందూ ముస్లిం, పార్సీలు ప్రధాన పాత్ర పోషించారు. ఈ లీగ్ ప్రధాన సంచలనమైన నినాదం ‘హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాదీస్’ (హైదరాబాద్ హైదరాబాదీయులదే)
# ముల్కీల (స్థానికుల) హక్కుల కోసం ఈ సంస్థ ఉద్యమం చేసింది.
#1939 వరకు చాలా చురుగ్గా పనిచేసింది.
# ఈ సంస్థకు నవాబ్ సర్ నిజామత్‌జంగ్ అధ్యక్షుడిగా పనిచేశారు.
ముల్కీ లీగ్
# నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థ 1935 నాటికి ముల్కీ లీగ్‌గా రూపాంతరం చెందింది.
#దక్కన్ సంస్కృతి, భాష పరిరక్షణ కోసం ముల్కీలీగ్ కృషి చేసింది.
# ముల్కీ లీగ్ ఉద్యమం నిజాంపట్ల విధేయత చూపింది.
# నాన్ ముల్కీలు తాము ఎక్కువ చదువుకొన్నవాళ్లమని, ఉద్యోగాలకు తామే అర్హులమని భావించేవారు. అదేస్థాయిలో ఉద్యోగాలు పొందారు. దీంతో స్థానిక యువకులు, విద్యాధికుల్లో అసంతృప్తి పెల్లుబికింది. దీని ఫలితంగానే ముల్కీ లీగ్ ఏర్పడింది.
#సర్ నిజామత్ జంగ్ రాజకీయ వ్యవహారాల శాఖ (నిజాం మంత్రిమండలి) నిర్వహించారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ (ప్రముఖ ఇంజినీర్), అబుల్ హసన్ సయ్యద్ అలీ (న్యాయవాది), మీర్ అక్బర్ అలీఖాన్, బహదూర్ యార్ జంగ్, మందుముల నర్సింగరావు, మాడపాటి హన్మంతరావు, బూర్గుల రామకృష్ణా రావు, రాజా బహదూర్ వెంకటరామారెడ్డి, కాశీనాథరావువైద్య, వామనరాయ్ చంద్రనాయక్ మొదలైనవారు సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించి, దాని కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
పీపుల్ కన్వెన్షన్ స్థాపన
# ముల్కీ లీగ్‌లో 1937లో చీలిక రావడంతో కొంతమంది బయటికి వచ్చి పీపుల్స్ కన్వెన్షన్‌ను స్థాపించారు. దీనికి కొనసాగింపుగా ఏర్పడిందే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ (1938లో)
రాజకీయ సంస్కరణల కోసం నిజాం కృషి
#బ్రిటిష్ ఇండియాలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణల (1935లో) ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. సంస్థాన పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేసి రాజకీయ సంస్కరణల ప్రతిపాదనలు చేయాల్సిందిగా బహదూర్ అరవముదు అయ్యంగార్ను చైర్మన్‌గా నియమిస్తూ ఒక కమిటీని ఏర్పాటుచేశాడు నిజాం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ముల్కీలకు అన్యాయం జరుగుతున్నదని, నాన్ముల్కీలే ఎక్కువ శాతంలో ఉద్యోగాలు పొందుతున్నారని స్థానిక విద్యావంతులు, ముల్కీ ఉద్యమకారులు కమిటీకి విన్నవించుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కోరారు.
# అరవముదు అయ్యంగార్ కమిటీ వివిధ సంస్కరణల్ని సూచిస్తూ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ముల్కీ నిబంధనల్ని మరింత కఠినం చేస్తూ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల నియామకంలో పక్షపాతం, పైరవీలు ఉండరాదు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక యంత్రాంగం నియమించబడాలి. ప్రతి డిపార్ట్మెంటుకు ఒక ఎంప్లాయ్మెంట్బోర్డు ఉండాలని కమిటీ సూచించింది.
‘ముల్కీ’ ఉల్లంఘన (1948-52)
# పోలీస్ చర్య (ఆపరేషన్ పోలో) తర్వాత హైదరాబాద్ రాష్ట్ర పాలనా బాధ్యతలు మేజర్ జనరల్ జయంతో నాథ్ దరికి అప్పగించారు. (1948 సెప్టెంబర్ 19న)
# మిలిటరీ ప్రభుత్వంలో ముల్కీ రూల్స్ సరిగా అమలు కాలేదు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్న వారిని మదరాసు, బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సెస్ ప్రాంతాల నుంచి రప్పించి వారికి ఉన్నతోద్యోగాలు కల్పించారు. మిలిటరీ ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక విధానాలను అనుసరించి అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. (ఉదా. వందలాది మంది పోలీసులు, పోలీస్ సూపరింటెండెంట్లు, 100 మంది తహసీల్దార్లు, 16 మంది కలెక్టర్లు, డీజీపీ, ఇంజినీర్‌ఇన్‌చీఫ్ మొదలైనవారు). ముస్లిం జడ్జిలను బలవంతంగా రిటైర్మెంట్ అయ్యేటట్లు చూడటం, రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయడం లాంటి ముస్లిం వ్యతిరేక విధానాల్ని అనుసరించింది నాటి ప్రభుత్వం.
#ఈ విధంగా సివిల్ సర్వీసెస్‌లోని ముస్లింలను తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది. ఈ విషయం హ్రూకు తెలిసిన వెంటనే 1950 డిసెంబర్ 23న అయ్యంగార్ (ప్రభుత్వ కార్యదర్శి)కి లేఖ రాస్తూ ముస్లిం సివిల్ సర్వెంట్లపట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతకరమైనదని, అర్హతలు నైపుణ్యం ఉన్న ముస్లింలను బయటికి పంపడం వెనుక మతతత్వంతో కూడిన ఉద్దేశం దాగి ఉందని, దీన్ని విడనాడాలని పేర్కొన్నాడు.
హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్
# 1919లో His Exalted Highness నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన ముల్కీ ఫర్మానాను జె.ఎన్.దరి నేతృత్వంలోని మిలిటరీ ప్రభుత్వం కొంత సవరించి, హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్‌ను (1 నవంబర్ 1949) నిజాం ఫర్మానాను జారీ చేయించింది. దీనిలో జతచేసిన (ఎన్) ప్రకారం ముల్కీ (స్థానికుడు) కాని వ్యక్తిని నిజాం అనుమతి లేకుండా ఉద్యోగంలో నియమించకూడదు. కొత్త రెగ్యులేషన్ ప్రకారం ముల్కీకి (స్థానికునికి) ఉండాల్సిన అర్హతల్ని ఆర్టికల్ 39కి జతపర్చిన ‘ఎన్’లో 1 (ఏ, బీ, సీ, డీ) పేరాలో పేర్కొన్నారు.
ఒకటో నిబంధన: జన్మతః హైదరాబాదీయుడై ఉండటం (లేదా) హైదరాబాద్ నివాసియై ఉండటం (అంటే ముల్కీకి అర్హత) లేదా వ్యక్తి తాను జన్మించే నాటికే అతని తండ్రి 15 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ పూర్తి చేసి ఉండటం. (లేదా) స్త్రీ, ముల్కీకి భార్య అయి ఉండటం.
రెండో నిబంధన: ఒక వ్యక్తిని హైదరాబాదీయుడు (స్థానికుడు)గా పరిగణించాలంటే ఆ వ్యక్తి జన్మించేనాటికి అతని
తండ్రి ముల్కీయై ఉండాలి.
మూడో నిబంధన: ముల్కీ కావాలంటే ఆ వ్యక్తి 15 సంవత్సరాలు హైదరాబాద్ రాష్ట్రంలో స్థిర నివాసం ఉండి తాను తన పూర్వపు ప్రాంతానికి తిరిగి వెళ్లనని నిర్దేశిత దరఖాస్తు సమర్పించాలి.
నాలుగో నిబంధన: స్త్రీ – ఒక నాన్ముల్కీకి భార్య అయితే ముల్కీగా పరిగణించే అంశం – వివరణ
ఐదో నిబంధన: ముల్కీని పెండ్లి చేసుకోవడం ద్వారా వచ్చే ముల్కీ హక్కుల వివరణ
ఆరో నిబంధన: ముల్కీ ధ్రువీకరణ పత్రం ఇచ్చే విషయమై వివరణ
ఏడో నిబంధన: ముల్కీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొనే విషయాలు, తప్పుడు వివరాలు ఇస్తే ముల్కీ రద్దు – వివరణలు
ఎనిమిదో నిబంధన: ముల్కీ దరఖాస్తు తిరస్కరణ – వివరాలు
తొమ్మిదో నిబంధన: పోలీస్ శాఖ నియామకాల్లో తప్పుడు వివరాలు సమర్పిస్తే ముల్కీ రద్దు, ముల్కీ ప్రవర్తన సరిగ్గా లేకున్నా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రభుత్వోద్యోగి పాల్గొన్నా ముల్కీ రద్దవుతుంది.
#1939లో సంస్కరణలు ప్రవేశపెడుతున్న సందర్భంలో అదేవిధంగా 1945లో మరొకసారి ముల్కీ రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తామని నిజాం ప్రకటించినప్పటికీ అవి సంపూర్ణంగా అమలు కాలేదు. 1946-48 మధ్య నిజాం ప్రభుత్వం, 1949 సెప్టెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు గల దరి ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు నాన్‌ముల్కీలను మిలిటరీ, ఎక్సైజ్ శాఖల్లోని ఉద్యోగాల్లో నియమించి ముల్కీ రూల్స్‌ను ఉల్లంఘించింది.
వెల్లోడి ప్రభుత్వం
# 1949 ముల్కీ రెగ్యులేషన్‌లోని 1 (ఏ, సీ) నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగ నియామకాల సందర్భంలో తప్పనిసరిగా పాటించనవసరం లేదని హైదరాబాద్ పౌర ప్రభుత్వం పేర్కొంది. వెల్లోడి హయాంలో ముల్కీ రూల్స్ ఉల్లఘించబడ్డాయి. న్యాయంగా, చట్టపరంగా ముల్కీలకు (స్థానికులకు) చెందాల్సిన ఉద్యోగాల్లో నాన్‌ముల్కీలను (స్థానికేతరులను) నియమించారు.
ముల్కీ ఉద్యమం (1952)
# మిలిటరీ, సివిల్ పాలనా కాలంలో ఉపాధి, ఉద్యోగ రంగాల్లో జరిగిన పరిణామాలు, ముస్లింలను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఉర్దూభాష ప్రాధాన్యాన్ని తగ్గించి, తెలుగు, ఇంగ్లిష్‌లకు ప్రాధాన్యం పెంచడం మొదలైన అంశాలు తెలంగాణ ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. దొంగతనంగా ముల్కీ (స్థానిక) సర్టిఫికెట్లు సంపాదించి ఉద్యోగాలు కొల్లగొట్టారు.
వరంగల్‌లో మొదలు
# వరంగల్‌లో పార్థసారథి (డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్) జూన్, జూలై 1952న మూకుమ్మడిగా చాలామంది ఉపాధ్యాయుల్ని బదిలీ చేయడం, బదిలీ అయిన కొందరు ఉపాధ్యాయుల స్థానంలో నాన్‌ముల్కీలను నియమించినట్లు ప్రచారం జరగడం (గమనిక: పార్థసారథి తాను ముల్కీనని, హైదరాబాద్ వాసినని చెప్పుకొనేవారు. కానీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు అతన్ని నాన్ముల్కీగా పరిగణించేవారు).
హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ సంస్థానానికి
స్త్రీలు పురుషులు స్త్రీలు పురుషులు
1911 1931 1911 1931 1911 1931 1911 1931
రాజ్పుఠానా 2217 1093 4200 1576 4659 2568 9612 4040
ఉత్తరప్రదేశ్ 2151 2499 4578 3496 2772 2728 6627 2558
పంజాబ్ 811 672 2756 2210 1146 970 3424 2220
మార్వార్, అజ్మీర్ 426 389 670 211 2510 923 4186 602
సయ్యద్ అబిద్ హసన్ పుస్తకం
# ముల్కీ లీగ్ ఉద్యమనేత అబిద్ హసన్. తన పుస్తకం ‘WITHER HYDERABAD’లో రాజ్ పుఠానా, మార్వార్ల నుంచి వచ్చినవారు వడ్డీ వ్యాపారం, వాణిజ్య రంగాల్లో, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అని పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశానికి చెందిన గైర్ ముల్కీలు పాలనా వ్యవహారాల్లో ఇతరుల్ని పాలుపంచుకొనివ్వకుండా, తామే పాలిస్తున్నామనే ఆధిపత్యభావంతో ఉండేవారని పేర్కొన్నారు.
#ప్రభుత్వ లెక్కల ప్రకారం (1911-1931) హైదరాబాద్ సంస్థానంలోని వివిధ ప్రాంతాలకు, హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాల (ముఖ్యంగా ఉత్తర భారతదేశం) నుంచి వలస వచ్చిన వారి సంఖ్యను ఈ పట్టిక ద్వారా గమనించవచ్చు.
# ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక, పొరుగున ఉన్న మదరాసీయులు (ఆంధ్ర ప్రాంతం వారు కూడా), బొంబాయి, బీరార్ మొదలైన ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ముల్కీలు వలసవచ్చి సంస్థానంలో స్థిరపడ్డారు.
# బ్రిటిష్‌వారిని, నాన్ముల్కీల్ని (స్థానికేతరులు) తన ప్రత్యర్థులుగా ముల్కీ లీగ్ భావించింది. బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలని, రాజ్యాంగబద్దమైన పరిపాలన కావాలని, నాన్‌ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించి ఆయా స్థానాల్లో ముల్కీల్ని నియమించాలని ముల్కీ లీగ్ డిమాండ్ చేసింది.
# నిజాం సర్వ స్వతంత్రుడిగా రాజ్యపాలన చేయాలని ముల్కీ లీగ్ డిమాండ్ చేసింది. బ్రిటిష్ వారి సలహాల్ని నిజాం పాటించకూడదని లీగ్ కోరింది. సంస్థానంలో నిరుద్యోగ సమస్య, ఉత్తర భారతదేశ నాన్‌ముల్కీల ఆధిపత్య ధోరణితో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. దక్కని జాతీయతను లీగ్ ప్రచారం చేసింది.
#స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే సమాజ న్యాయం కోసం పోరాడింది ముల్కీ లీగ్.
# ఈ ఉద్యమం హైదరాబాద్ ప్రజల్ని ఆకట్టుకుంది. ఉద్యమ డిమాండ్లను నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గుర్తించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు