భారతదేశ చరిత్ర, తెలంగాణ ఉద్యమం – రాష్ట్రావిర్భావం
ఎస్ఐ పరీక్షా సిలబస్‌లో జనరల్ స్టడీస్ విభాగంలో భారతదేశ చరిత్రను ఒక అంశంగా చేర్చారు. ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ చరిత్రతోపాటు స్వాతంత్య్రోద్యమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు భారత దేశ చరిత్రను చదివేటప్పుడు రాజ్యాలు, రాజులు, వారి బిరుదులు, యుద్ధాల గురించే కాకుండా ఆయా కాలాల్లో దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవన్న అంశాలను ప్రధానంగా అధ్యయనం చేయాలి. భారత స్వాతంత్య్రోద్యమంపై సమగ్ర పట్టు సాధించటం అవసరం.
తెలంగాణ ఉద్యమం.. రాష్ట్రావిర్భావం
8 గ్రూప్-2 సిలబస్‌లో 4వ పేపర్లో చేర్చిన తెలంగాణ ఉద్యమం-రాష్ట్రావిర్భావం అంశాన్ని ఎస్ఐ పరీక్ష ప్రిలిమ్స్ జీఎస్ పేపర్లో పార్ట్-బీలో ఆరో అంశంగా, మెయిన్స్ పేపర్-2లో ఏడో అంశంగా చేర్చారు.
తెలంగాణ భావన (1948-1970)
# హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక లక్షణాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ ప్రజలు, కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాలు, భాషలు, మాండలికాలు, జాతరలు, పండుగల గురించి చదవాలి.
# హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన, ఆర్థిక, రెవెన్యూ, కరెన్సీ, న్యాయ, విద్యారంగాల్లో సాలార్జంగ్ చేపట్టిన సంస్కరణలను అధ్యయనం చేయాలి.
# ముల్కీ-నాన్‌ముల్కీ అంశాలను అధ్యయనం చేయా లి. 1919 నిజాం ఫర్మానా, నిర్వచనం, నిజాంలీగ్, 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం, మిలిటరీ పాలన, ముల్కీ నిబంధనల ఉల్లంఘన-అనంతర పర్యవసానాలను చదవాలి.
1956- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం
# పెద్ద మనుషుల ఒప్పందం-దాని ప్రధానాంశాలు, సిఫారసులు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు, విధులు, పనితీరు, తెలంగాణ రక్షణలు, ఉల్లంఘనలు, కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు వలసలు, దాని పర్యవ సానాలు, 1970 తర్వాత వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్, విద్య, వైద్యం-ఆరోగ్యం, ఉద్యోగాలు మొదలైన రంగాల్లో తెలంగాణ అభివృద్ధి. తెలంగాణలో వివిధ రంగాల్లో సంభవించిన పరిణామాలు మొదలైనవి చదవాలి.
# ఉద్యోగాలు, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన: తెలంగాణ పోరాట మూలాలు, కొత్తగూడెం ఇతర ప్రాంతాల్లో నిరసనలు, 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర, మొదలైన అంశాలను చదవాలి. తెలంగాణ ఉద్యమంలో చోటుచేసుకున్న పరిణామాలు, నాయకుల పాత్ర, కేంద్రం ప్రకటించిన పథకాల గురించి చదవాలి.
సమీకరణ దశ
# ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం- దాని పర్యవసానాలు, ఆరు సూత్రాల పథకం (1973)లోని అంశాలు, ఆర్టికల్ 371-డి, రాష్ట్రపతి ఉత్తర్వులు, జైభారత్ రెడ్డి కమిటీ (1975 ఆఫీసర్స్) నివేదిక, జీఓ 610- ఉల్లంఘనలు, తెలంగాణ ఉద్యోగుల ప్రతిస్పందన, వినతులు మొదలైన అంశాలు.
# ప్రాంతీయ పార్టీల పుట్టుక-ప్రభావం, తెలుగుజాతి భావన పేరుతో తెలంగాణ అస్థిత్వాన్ని అణచివేసే కుట్రలు, ఆధిపత్య సంస్కృతి, దాని ప్రభావాలు, కార్పొరేట్ విద్య మొదలైనవి చదవాలి.
రాష్ట్రావిర్భావం దిశగా (1991-2014)
# తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం, మేధావుల స్పందనలు, పౌర సంఘాల ఆవిర్భావం, తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం.
# 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, రాజకీయ పునరేకీకరణ, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహారదీక్ష, రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
బి. మధుసూదన్
సీనియర్ ఫ్యాకల్టీ
హైదరాబాద్
జీకే, కరంట్ అఫైర్స్
అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేసే ప్రధాన అంశం జీకే, కరంట్ అఫైర్స్. గత పరీక్షల్లో జీకే, కరంట్ అఫైర్స్ నుంచి 30-40 ప్రశ్నలు నేరుగా వచ్చేవి. కానీ మారుతున్న పరీక్షా సరళిలో కరంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. ఎస్ఐ సిలబస్ (2016)లో జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన సంఘటనలుగా కరంట్ అఫైర్స్ కనిపిస్తోంది.
అంతర్జాతీయ సంఘటనలు
ఈ విభాగంలో ప్రధానంగా ముఖ్యదేశాల రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్, అధ్యక్షుడు/ప్రధాని, ముఖ్యపట్టణాల వంటి అంశాలపై ప్రశ్నలు నేరుగా వస్తాయి. ఇటీవల వివిధ దేశాలతో భారత్ దౌత్య సంబంధాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
జాతీయ సంఘటనలు
ఇటీవల జాతీయ స్థాయి సంఘటనలు-సమావేశాలు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న మార్పులు, వాటిపై కేంద్ర ప్రభావం వంటి అంశాలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా 2014, మే 26న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన మార్పులపై అభ్యర్థి దృష్టిసారించాలి.
తెలంగాణ అంశాలు
తెలంగాణ ఉద్యమ (తొలి, మలి) సంఘటనలు, తెలంగాణ ప్రాంతా విశిష్టత, రాష్ట్ర చిహ్నాలు-గేయం, గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించే అంశాలపై అభ్యర్థికి అవగాహన తప్పనిసరి.
దృష్టి సారించాల్సిన ఇతర అంశాలు
కేంద్ర- రాష్ట్ర పథకాలు, ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, క్రీడలు, ఆపరేషన్లు, అత్యున్నత అంశాలు-వ్యక్తులు, ముఖ్యవ్యక్తుల మరణాలు, నియామకాలు, మంత్రివర్గం, వార్తల్లో వ్యక్తులపై ప్రశ్నలు నేరుగా వస్తాయి.
నందగోపాల్ రాయల
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
గోల్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్
జనరల్ సైన్స్
జనరల్ సైన్స్, సెన్స్ అండ్ టెక్నాలజీపై ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలుంటాయి. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి చెందిన అన్ని రకాల పరీక్షల్లో ఈ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎస్ఐ పరీక్షల్లో కూడా దీనికి అధిక ప్రాధాన్యం ఉంది. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 25-40 వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
# మొదటగా జీవశాశాస్త్రాన్ని పరిశీలిస్తే జీవశాస్త్రంలో మానవ శరీర ధర్మశాస్త్రం, వ్యాధిశాస్త్రం (సూక్ష్మజీవులు), జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం, కణశాస్త్రం, జన్యుశాస్త్రం, జీవ పరిణామం, ఆవరణ శాస్త్రం, జీవ వైవిధ్యం, జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు మొదలైన టాపిక్స్ ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే ఒక పాఠంలో ఏఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు అనే కోణంలో ఆలోచించి సాధన చేయాలి. మానవ శరీర ధర్మశాస్త్రంలో ఆస్థిపంజర, కండరవ్యవస్థ, జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అంతఃస్రావకవ్యవస్థ, నాడీవ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు అనే అంశాలు ఉంటాయి.
# సూక్ష్మజీవులు-వ్యాధిశాస్త్రం అనే అంశాల నుంచి తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. మనం – మనచుట్టూ పరిసరాల పరిశుభ్రత – వ్యాధులు అనే అంశాన్ని ఆధారం చేసుకొని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
# జీవశాస్త్రంలో మరో ముఖ్యమైన చాప్టర్ వృక్షప్రపంచం. ఇందులో వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కిరణజన్య సంయోగ క్రియ, భాష్పోత్సేకం, విసరణ, ద్రవాభిసరణ, బిందుస్రావం, నిపానం, వృద్ధి నియంత్రకాలు, మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత వంటి అంశాలుంటాయి. బాహ్యస్వరూప శాస్త్రంలో వేరు కాండం, పత్రం, పుష్పం, ఫలం మొదలైన అంశాలు ఉంటాయి. మనం-మన పరిసరాలు, జీవులపై పరిసరాల ప్రభావం, కాలుష్యం, జీవ వైవిధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ విభాగం నుంచి ప్రశ్నలు పరిధి తక్కువగా ఉన్నా ప్రాధాన్యత గల అంశం.
# జనరల్ సైన్స్‌లో మరొక ముఖ్యమైన విభాగం భౌతికశాస్త్రంలో ముఖ్యాంశాలైన కాంతి, ధ్వని, కొలతలు-ప్రమాణాలు, యాంత్రికశాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం, ఆధునిక భౌతికశాస్త్రం ఉన్నాయి. ఇందులో ధ్వని, కాంతి, కొలతలు-ప్రమాణాలు అనే అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాంతి పాఠ్యాంశం నుంచి ఎక్కువగా కాంతి ధర్మాలు, దర్పణాలు, కటకాలు వంటివాటిపై 5 ప్రశ్నలుంటున్నాయి.
# పౌనఃపున్యం ఆధారంగా ధ్వనులు-రకాలు, ధ్వని లక్షణాలు, అయస్కాంతత్వం, విద్యుత్ వంటి అంశాలు క్షుణ్ణంగా చదవాలి.
# ఇక రసాయనశాస్త్రం అంశానికొస్తే ముఖ్యమైన అంశాలు పరమాణు నిర్మాణం, రసాయనశాస్త్రం – సంయోజన బంధాలు, మూలకాల వర్గీకరణ, వాయుస్థితి, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, పరిశ్రమలు, వ్యవసాయ సంబంధ రసాయనశాస్త్రం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఈ పాఠ్యాంశాలను నిత్యజీవితంలో రసాయనాలు, లోహాలు వాటి ఉపయోగాలు, పారిశ్రామిక ఉపయోగాలు అనే కోణంలో అభ్యసించాలి. రసాయనశాస్త్రంలో సమీకరణాలు, ప్రయోగాలు వంటి ప్రశ్నలను అడగటానికి అవకాశం లేదు. కావున ఏం చదవాలో, ఏం చదవకూడదో తెలియాలి.
# సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా అణుశక్తి, అంతరిక్ష విజ్ఞానం, క్షిపణులు, కంప్యూటర్, సమాచార సాంకేతిక రంగం, నానోటెక్నాలజీ, ఇంధన వనరులు, కాలుష్యం మొదలైన అంశాలుంటాయి. ప్రస్తుత కాలంలో వీటి ప్రాధాన్యం పెరిగింది. వీటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి.
వేణుగోపాల రావు
సీనియర్ ఫ్యాకల్టీ
గోల్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్
పాలిటీ
ఎస్ఐ పరీక్షకు సంబంధించి పాలిటీ విభాగంలో గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే 25 – 30 ప్రశ్నలు వచ్చాయి. ప్రస్తుతం కేవలం రెండునెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ సమయంలో గరిష్ఠంగా లబ్ధిపొందడానికి ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. విభాగాల వారీగా పరిశీలిస్తే…
రాజ్యాంగం పరిణామక్రమం
దీనిలో భారత రాజ్యాంగాభివృద్ధికి దోహదం చేసిన బ్రిటీష్ కాలం నాటి చట్టాలు అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1793, 1813, 1833, 1853 చార్టర్ చట్టాలు, 1861, 1892 భారతీయ మండలాల చట్టాలు, 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం, 1919 మాంటెంగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వాతంత్య్ర చట్టం మొదలైనవి. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
రాజ్యాంగం చరిత్ర రచన- ముఖ్య లక్షణాలు
దీనిలో ప్రధానంగా రాజ్యాంగ పరిషత్తు ఆవిర్భావం, రాజ్యాంగ పరిషత్తు సమావేశాలు – సంబంధించిన తేదీలు, రాజ్యాంగ పరిషత్తు, కమిటీలు – చైర్మన్లు, తీర్మానాలు, రాజ్యాంగ ఆధారాలు అంటే రాజ్యాంగ వేత్తలు రాజ్యాంగ రూపకల్పనలో ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకొన్న అంశాలు. వీటిలో ముఖ్యంగా వాస్తవాధారిత ప్రశ్నలు నేరుగా వచ్చే అవకాశం ఉంది.
ప్రాథమిక హక్కులు,ప్రాథమిక విధులు: దీనిలో ప్రధానంగా ప్రాథమిక హక్కులు, ఆదేశసూత్రాలకు సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్, భాగాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రముఖుల వ్యాఖ్యానాలపై దృష్టి సారించాలి.
కేంద్ర ప్రభుత్వం: కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అటార్ని జనరల్-అర్హతలు, పదకోశాలు, అధికారాలు, జీతభత్యాలు, విధులు వంటి అంశాలపై ప్రశ్నలు నేరుగా వచ్చే అవకాశం ఉంది.
శాసనవ్యవస్థలు: దీనిలో లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, మండలి మొదలైనవి. ఎన్నికవ్వడానికి కావల్సిన అర్హతలు, వారి పదవీకాలం, ఆధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రవేశపెట్టే బిల్లులు, సమావేశ కాలాలు, పార్లమెంటరీ కమిటీలు, తీర్మానాలు, పదజాలం వంటి అంశాలు ముఖ్యమైనవి.
భారత న్యాయవ్యవస్థ: సుప్రీంకోర్టు, హైకోర్టుల నిర్మాణం, నియామకాలు, అధికార విధులు, తాజా పరిణామాలు అంటే లోక్‌పాల్, లోకాయుక్త, జనలోక్‌పాల్, గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ న్యాయ నియామాకాల సంఘం రద్దుచేసి తిరిగి కొలీజియం వ్యవస్థను తీసుకురావడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.
భారత సమాఖ్య వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు: ఇందులో కేంద్ర, రాష్ట్ర సంబంధాల కోసం నియమించిన కమిటీలు, వాటి సిఫారసులు పరీక్షల కోణంలో ముఖ్యమైనవి.
స్వపరిపాలన సంస్థలు: దీనిలో 73, 74 రాజ్యాంగ సవరణలపై అవగాహన తప్పనిసరి.
రాజ్యాంగ సంస్థలు
అటార్ని జనరల్, కాగ్, ఎన్నికల సంఘం, అడ్వకేట్ జనరల్, యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, ఎస్టీ కమిషన్, ఆర్థిక సంఘం ఇలా వీటికి సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంది.
సమకాలీన అంశాలు
ప్రతి సమకాలీన రాజకీయ పరిణామం రాజ్యాంగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి సమకాలీన అంశాలపై అభ్యర్థులు దృష్టి సారించాలి.
చింతల రాకేష్ భవానీ
అసిస్టెంట్ ప్రొఫెసర్,
అడ్వైజర్, గోల్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?