పాలనా వ్యవస్థ-పాలనాధికారులు
1.సుభా (రాష్ర్టాలు): తరఫ్దార్ (గవర్నర్‌తో సమానం)
2. సర్కార్ (జిల్లాలు): ఫౌజ్దార్ (కలెక్టర్ హోదా)
3. పరగణా (మండలాలు): తహసీల్దార్ (మండల్ రెవెన్యూ ఆఫీసర్-ఎమ్మార్వో)
4. గ్రామం (చివరి పాలనా విభాగం): ఆయగార్లు ఉన్నారు.
(గ్రామ పాలనాధికారులు) వీరిని పన్నిద్దరు ఆయగార్లు అంటారు. అంటే 12 మంది ఉండేవారని తెలస్తుంది. వారు
1. పటేల్: గ్రామాల్లో శాంతి, భద్రతల అధికారి
2. చౌదరి: వర్తకుల పెద్ద (వ్యాపార లావాదేవీలు)
3. పొతేదార్: నాణెల మారకందారు (నేటి బ్యాంకింగ్ వ్యవస్థ)
4. దేశ్‌పాండే: గణకుడు (అకౌంటెంట్)
5. సహాని: బార్బర్
6. పారిత్: వాషర్ మెన్
7. పూజారి: పురోహితుడు (ఆధ్యాత్మిక పూజలు మొదలైనవి)
8. సుతార్: వడ్రంగి (వ్యవసాయరంగ పరికరాలు చేసే వ్యక్తి)
9. కుంబార్: కమ్మరి (వ్యవసాయ రంగ పరికరాలు)
10. జోషి: జ్యోతిష్కుడు
11. వేశావర: మస్కూరి (గ్రామ రిపోర్టర్)
12. కులకర్ణి: గ్రామ, ఆదాయ, వ్యయాలు
సైనిక వ్యవస్థ
-గిరి దుర్గాలు: గోల్కొండ, భువనగిరి, దేవరకొండ మొదలైనవి. ఇవి కాకుండా ఇతర 84 స్థల, వన, జల దుర్గా లు కూడా ఉన్నాయి. సైనికరంగంలో గిరి దుర్గాలు ప్రముఖపాత్ర నిర్వహించేవి.
-కేంద్ర సైన్యం: చక్రవర్తిఆధ్వర్యంలో పనిచేస్తుంది. మీర్ జుమ్లా సర్వసైన్యాధ్యక్షుడు. అక్కన్న (వరంగల్ వాస్తవ్యుడు) కుతుబ్‌షాహీల కాలంలో సైన్యాధ్యక్షుడుగా సేవలు అందించాడు.
-జాగీర్దారీ సైన్యం: ఇది ఢిల్లీసుల్తాన్ల కాలంలో ఇక్తా పద్ధతి వంటిది. జాగీర్దారీలు సొంత సైన్యం పోషించుకొని, వారికి జీతభత్యాలు ఇచ్చి, అవసరమైనప్పుడు రాజుకు సైనిక సహాయం చేసే సైన్యం. ఈ సైన్య పోషణ కోసం పన్నులు వసూలు చేయడానికి కొన్ని గ్రామాలు జాగీర్దార్‌కు ఇచ్చేవారు.
ఆర్థిక వ్యవస్థ- వ్యవసాయరంగం
1.హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్)
2.ఇబ్రహీంసాగర్
3.బుద్వేలు మొదలైనవి. చెరువులను, కాలువలను, బావులను తవ్వించి నీటిపారుదల వసతులు కల్పించారు. కాకతీయులను ఆదర్శంగా తీసుకొని వారి వలె వ్యవసాయరంగం రైతుల అభివృద్ధికి తోడ్పడ్డారు.
-నీటి వనరుల మరమ్మతు చేయడానికి, ఆయకట్టు భూములకు నీరు పెట్టడానికి వడ్డెరలను నియమించారు. నీటి పారుదల వ్యవస్థపై వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఎక్కువ భూములు సాగులోకి వచ్చాయి. రైతులు ముఖ్యంగా వరి, జొన్న, రాగి, పెసర, వేరు శనగ మొదలైన పప్పుదినుసులు పండించారు. పోర్చుగీసు వారు పొగాకును ప్రవేశపెట్టారు.
కుతుబ్‌షాహీల కాలంలో వచ్చిన యూరోపియన్లు
1.డచ్చి: పులికాట్, మచిలీపట్నంలో వ్యాపార స్థావరాలు
2.బ్రిటీష్ (1611): మచిలీపట్నంలో వ్యాపార స్థావరం.
3.ఫ్రెంచి (1669): మచిలీపట్నం, కాకినాడ
4.పోర్చుగీసు (1670): మచిలీపట్నంలో వ్యాపార స్థావరాలు నెలకొల్పారు.
-1605-08లో మహ్మద్ కులీకుతుబ్‌షా డచ్చి వారికి అనుమతి ఇచ్చాడు.
-1611-12లో బ్రిటీష్ వారికి వ్యాపార అనుమతి ఇచ్చాడు. గ్లోబు అనే నౌక ద్వారా బ్రిటీషు అధికారి అయిన హిప్పన్ వచ్చాడు.
-వజ్ర పరిశ్రమ (గోల్కొండ): గోల్కొండను రెండో ఈజిప్టు అని ఫ్రెంచి యాత్రికులు పేర్కొన్నారు. దేవనాట్, ట్రావెర్నియర్ యాత్రికులు ఏడుసార్లు సందర్శించారు. గోల్కొండకు గొప్ప వజ్రాల పరిశ్రమగా ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది.
1. కోహినూర్
2. జాకబ్
3. రూబిల వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలు గోల్కొండ రాజ్యంలోనే బయల్పడ్డాయి.
కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల గనులు
1.కొల్లూరు (కృష్ణాజిల్లా)
2. పల్నాడు (గుంటూరు): కోహినూర్ వజ్రం లభించిన ప్రాంతం.
3.పరిటాల (కృష్ణా)
4.వజ్ర కరూర్ (రామళ్లకోట)
-ఇనుప గనులు: గోల్కొండ రాజ్యంలో మేలిరకం ఇను ము, ఉక్కు తయారయ్యేది. వీటిలో కత్తులు, బాకులు, యుద్ధ పరికరాలు తయారు చేసి డమాస్కస్‌కు ఎగుమతి చేసేవారు.
-నిర్మల్, ఇందులూర్లో గొప్పపరిశ్రమలు వెలిశాయి.
ఇతర పరిశ్రమ కేంద్రాలు
1. ఓరుగల్లు: వస్త్ర పరిశ్రమ
(గతంలో తివాచీల పరిశ్రమకు ప్రసిద్ధి)
2. నాగులపంచ (ఖమ్మం జిల్లా): నీలి రంగు
3. నిర్మల్: కత్తుల పరిశ్రమ
4. నౌకా నిర్మాణ పరిశ్రమ: నర్సాపురం