కులాన్ని హిందూమత ఉక్కు కవచంగా వర్ణించిన సామాజికవేత్త ?
1) సంప్రదాయ భారతీయ సమాజ మూల స్తంభాల్లో కులవ్యవస్థ ప్రధానమైంది. వేదకాలం నాటి చాతుర్వర్ణ వ్యవస్థే కులవ్యవస్థకు మూలం. కాగా, దీనికి మూలమైన వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలుగా పేర్కొనబడిన వేదం ఏది?
1) యజుర్వేదం 2) ఆధర్వణ వేదం
3) ఋగ్వేదం 4) సామవేదం
2) భగవద్గీతలోను నాలుగు వర్ణాల ప్రస్తావన ఉంది. వర్ణం అంటే రం గు. శరీరఛాయను బట్టి వర్ణాలను గుర్తించారు. బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల రంగుల వరుస క్రమం గుర్తించండి.
1) ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు
2) తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు
3) పసుపు, తెలుపు, ఎరుపు, నలుపు
4) తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు
3) చాతుర్వర్ణ వ్యవస్థలోని మూడు వర్ణాలను ద్విజులుగా గుర్తించారు. వీరికి ఉపనయనం ఉంటుంది. దీంతో యజ్ఞోపవీతం ధరిస్తారు. కాగా, ఆ మూడు వర్ణాలేవి?
1) బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 2) బ్రాహ్మణ, వైశ్య, శూద్ర 3) క్షత్రియ, వైశ్య, శూద్ర 4) బ్రాహ్మణ, వైశ్య, శూద్ర
4) దీక్ష తీసుకొనేటప్పుడు బ్రాహ్మణులు గాయత్రీ మంత్రం, క్షత్రియు లు త్రిష్టుబ్ మంత్రం, వైశ్యులు జగతీ మంత్రం పఠించాలి అని ఐతరేయ బ్రాహ్మణం చెబుతుంది. దీని ప్రకారం ఆయా వర్ణాలు ఏయే కాలాల్లో దీక్ష తీసుకొవాలని పేర్కొన్నది గుర్తించండి.
1) బ్రాహ్మణులు (వసంత ఋతువు), క్షత్రియులు
(వేసవికాలం), వైశ్యులు (శిశిర ఋతువు)
2) క్షత్రియులు (వసంత ఋతువు), బ్రాహ్మణులు
(వసంత ఋతువు), వైశ్యులు (శిశిర ఋతువు)
3) వైశ్యులు (వేసవికాలం), బ్రాహ్మణులు
(శిశిర ఋతువు), క్షత్రియులు (వసంత ఋతువు)
4) బ్రాహ్మణులు (వేసవికాలం), వైశ్యులు (వసంత
ఋతువు), క్షత్రియులు (శిశిర ఋతువు)
5) భారతీయ హిందూ సమాజంలో కులవ్యవస్థ మతంపై ఆధారపడింది. మతంలోని ఆచారాలు పాటించడం కులవ్యవస్థ ద్వారా జరుగుతుంది. హిందూ సంస్కృతిలోని అలవాట్లు, ఆచారాలు, కట్టుబాట్లు కులవ్యవస్థలో ప్రతిబింబిస్తాయి. అంతర్వివాహం, సంప్రదాయ వృత్తులు, జాతుల క్రమశ్రేణి, ఆహార పానీయాల్లో సంబంధాలు, ఉమ్మడి సంస్కృతి అనేవి కులవ్యవస్థ లక్షణాలు. అయితే కులం (Caste) అనే పదం ఏ భాష నుంచి పుట్టినది?
1) గ్రీకు 2) పోర్చుగీసు 3) రోమన్ 4) అరబిక్
6) కులాలు అన్నీ సంప్రదాయ వృత్తులను అనుసరిస్తూ, స్థానికమైన హోదాతో పాటు అంతర్ వివాహాలు కలిగిన సమూహాలుగా చేరి ఉన్నాయి. కుల ప్రాతిపదికగా వ్యక్తులు, సమూహాలు వివిధ కులాలకు చెంది ఇప్పటికి గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ కులవ్యవస్థ కన్పిస్తుంది. కాగా, కులం అంటే..?
1) వారసత్వం 2) ఆచారాలు, కట్టుబాట్లు
3) సంస్కృతి 4) ఏదీకాదు
7) కులాల్లో హెచ్చు, తగ్గు కలగడానికి మానవ పరిశ్రమల సమాజ చరిత్ర ముఖ్య సూచిక అని భావించడంతో పాటు ప్రజలు ఆచరించే వృత్తులు కులానికి మూలం అని పేర్కొన్నది?
1) హుక్టర్ 2) నెస్ఫీల్డ్ 3) గిల్బర్ట్ 4) ఘుర్వే
8) భారత్లోని ప్రతిభాషా ప్రాంతం దాదాపు 200 కులాలను కలిగి ఉంది. ఇవి తిరిగి 3000 ఉపకులాలుగా విభజింపబడ్డాయి. అంతర్వివాహాలు కలిగిన యూనిట్లలో ఉదాహరణకు ఉత్తరభారత్లో అహిర్ కులంలో 1700 ఉపకులాలున్నట్లు పేర్కొన్నది ?
1) ఎం.ఎన్ శ్రీనివాస్ 2) గిల్బర్ట్
3) జి.ఎస్ ఘుర్వే 4) నెస్ఫీల్డ్
9) సమష్టి కుటుంబం హిందూవులు రూపొందించిన అతి పెద్ద సామాజిక సమూహం. వ్యక్తి సామాజిక సంబంధాల విధేయత అవధులు దానికి లోబడి ఉంటాయి. హిందూ వ్యవస్థ దాని పునాది రాయిపై నిర్మించడింది అని పేర్కొంది?
1) కె.ఎం ఫణిక్కర్ 2) ఎం.ఎన్ శ్రీనివాస్
3) ఐరావతి కార్వే 4) జి.ఎస్ ఘుర్వే
10) వివిధ కులాల మధ్య గల సంబంధాలు శుచి, అశుచి భావనపై ఆధారపడి ఉంటాయి. ఇది ప్రధానంగా మతపరమైంది. అందుచేత కులవ్యవస్థ ఒక రకంగా మతపరమైంది అని భావించినది?
1) ఎం.ఎన్ శ్రీనివాస్ 2) గిల్బర్ట్
3) కె.ఎం ఫణిక్కర్ 4) నెస్ఫీల్డ్
11) ఆర్యులు, ద్రావిడులు, మంగోలియన్లు మొదలైన జాతుల్లో భేదం కన్పిస్తుంది. ఆయా జాతులను బట్టి వైవిధ్యం ఏర్పడి క్రమంగా కింది కులాలుగా స్థిరపడినట్లు తెలిపే సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినవారు?
1) హెర్బర్ట్ రీస్లే 2) నెస్ఫీల్డ్ 3) గిల్బర్ట్ 4) హూక్టర్
12) కులం మంచిదే. దానిని సంస్కరించాలి. కానీ నిర్మూలించనవసరం లేదు. చికిత్స చేసేటప్పుడు దెబ్బతగిలి చెడిపోయిన వేలుని తొలగించాలే కాని చేతిని నరికివేయరాదు అని వాదించినది?
1) హట్టన్ 2) రీస్లే 3) గిల్బర్ట్ 4) నెస్ఫీల్డ్
13) పంచవర్ష ప్రణాళికలు, వయోజన ఓటుహక్కు, ఉచిత విద్య, సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో అజ్ఞానం తగ్గి మనోబలం పెరగడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా కులాంతర వివాహాల వల్ల పరివర్తనకు కూడా అవకాశం ఉంది. ఇలా కులవ్యవస్థ అంతరించడానికి దోహదకరమైన అంశాలను సూచించినది?
1) ఎం.ఎన్ శ్రీనివాస్, జి.ఎన్ ఘుర్వే 2) గిల్బర్ట్
3) కారల్మార్క్స్, రీస్లే 4) హట్టన్
14) కులాన్ని హిందూమత ఉక్కు కవచంగా వర్ణించిన సామాజిక వేత్త ?
1) వి.కె ఆర్. వి రావు 2) పి.ఎన్ ప్రభు
3) ఎ.ఆర్ దేశాయ్ 4) ఐరావతీ కార్వే
15) కిందివాటిలో ప్రస్తుతం జాతీయీకరణ చేయబడి కొనసాగుతున్న కుల ప్రాతిపదిన స్థాపించిన బ్యాంకులు ఏవి?
1) విజయాబ్యాంకు, హెచ్డీఎఫ్సీబ్యాంకు
2) భారతీయ స్టేట్బ్యాంక్, ఆంధ్రబ్యాంకు
3) ఇండియన్ ఓవర్సిస్బ్యాంకు, కెనరాబ్యాంకు
4) ఏవీకాదు
16) సాంఘిక సంస్కర్తల కృషి ఫలితంగా అస్పృశ్యత నివారణ చట్టం రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఏ నిబంధన ప్రకారం అంటరానితనం నేరంగా పరిగణిస్తారు?
1) 15 2) 17 3) 27 4) 39
17) పూర్వం కులతత్వం నగరాలకే పరిమితమై ఉండేది. స్థానిక స్వపరిపాలన సంస్కరణల ఫలితంగా గ్రామాల్లో ఎన్నికలు ప్రవేశపెట్టడంతో కులతత్వం పెరిగింది. కాగా స్థానిక స్వపరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ?
1) లార్డ్ మేయో 2) వారెన్హెస్టింగ్స్
3) లార్డ్ మింటో 4) లార్డ్ రిప్పన్
18) కిందివాటిని జతపర్చండి.
1) మన సిద్ధాంతం ఎ) హట్టన్
2) సాంస్కృతిక సిద్ధాంతం బి) శరత్చంద్రరాయ్
3) పరిణామ సిద్ధాంతం సి) ఇబ్బేస్టన్
4) వృత్తిపర సిద్ధాంతం డి) నెస్ఫీల్డ్
1) 1- ఎ , 2-బి, 3-సి,4-డి 2) 1- డి, 2-సి, 3-బి,4-ఎ
3) 1-సి, 2-డి, 3-సి,4-ఎ 4) 1-బి, 2-డి, 3-సి,4-ఎ
19) బ్రిటిష్ పాలనా కాలంలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి దేశంలోని మహారాష్ట్రలో ఛత్రపతి సాహు, జ్యోతి బాఫూలే, మద్రాసులో అన్నామలై రాజా, పానగల్ రాజా, బొబ్బిలి రాజా నాయకత్వం వహించారు. అయితే కేరళలో శ్రీనారాయణ ధర్మపరిపాలన ఉద్యమం నడిపినది ఎవరు?
1) నారాయణగురు 2) పెరియార్
3) రామస్వామి నాయకర్ 4) పైవన్నీ
20) కులాంతర, మతాంతర వివాహాలకు చట్టబద్ధత కల్పించిన చట్టం ?
1) ద హిందూ విడో యాక్ట్ -1976
2) ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ -1872
3) 1,2 4) ఏదీకాదు
జవాబులు
1-3, 2-4, 3-1, 4-1, 5-2, 6-1, 7-2, 8-3, 9-1, 10-1, 11-1, 12-1, 13-1, 14-3, 15-3, 16-2, 17-4, 18-1, 19-1, 20-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు