సాత్పురా పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది?
1. భారత్‌లో విస్తీర్ణ పరంగా రాష్ట్రాల అవరోహణ క్రమం?
ఎ) రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర
బి) రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
సి) రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్
డి) రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
2. భారతదేశంలో కర్కటరేఖ వెళ్లే నగరాలు ?
ఎ) అహ్మదాబాద్, గాంధీనగర్, వైకుంఠపూర్, దుర్గాపూర్
బి) గాంధీనగర్, భోపాల్, రాంచీ, అగర్తలా
సి) గాంధీనగర్, దుర్గాపూర్, రాయపూర్, ఐజ్వాల్
డి) గాంధీనగర్, వైకుంఠపూర్, దుర్గాపూర్, ఐజ్వాల్
3. భారతదేశంలో అంతర్జాతీయ భూసరిహద్దు కలిగిన దేశాల అవరోహణ క్రమం
ఎ) చైనా, మయన్మార్, భూటన్, బంగ్లాదేశ్
బి) చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్
సి) బంగ్లాదేశ్, చైనా, పాకిస్థాన్, నేపాల్
డి) బంగ్లాదేశ్, పాకిస్థాన్, చైనా, నేపాల్
4. ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు?
ఎ) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జారండ్
బి) మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, గోవా, ఆంధ్రప్రదేశ్
సి) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
డి) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్
5. సరికానిది గుర్తించండి.
ఎ) భారత్-అఫ్గానిస్థాన్-డ్యూరాండ్ రేఖ
బి) భారత్-పాకిస్థాన్-LOC రేఖ
సి) భారత్-చైనా-LAC రేఖ
డి) భారత్-బంగ్లాదేశ్-మెక్ మోహన్ రేఖ
6. కింది స్టేట్మెంట్లలో సరైనది గుర్తించండి.
ఎ. భారత్‌లో అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం – మధ్యప్రదేశ్
బి. భారత్‌కి 12 నాటికల్ మైల్స్ ప్రాదేశిక జలాల పరిధి ఉంది
సి. భారత్‌లో ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు సిక్కిం, త్రిపుర
డి. భారత్‌లో తూర్పుతీరంలో ఎక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్
ఎ) ఎ, బి, డి బి) బి, సి, డి
సి) ఎ, బి, సి డి) ఎ, సి, డి
7. భారతదేశం గురించి సరికానిది గుర్తించండి.
ఎ) దేశ విస్తీర్ణం – 32,87,263 చ. కి.మీ
బి) భారత్ అక్షాంశాలపరంగా 8041-37061 ఉత్తర అక్షాంశాలు మధ్య ఉంది
సి) భారత్ రేఖాంశాలపరంగా 68071-97025 పశ్చిమరేఖాంశాలు మధ్య ఉంది
డి) భారత్ ఉత్తర-దక్షిణ కొనల మధ్య 3,214 కి.మీ దూరం ఉంది
8. జతపరచండి.
1. బౌద్ధ సాహిత్యం ఎ. భారత ఖండం
2. పురాణాలు బి. ఇండియా
3. గ్రీకులు సి. హిందూస్థాన్
4. పర్షియన్లు డి. జంబూద్వీపం
ఎ) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
9. స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి.
ఎ. భారతదేశానికి ఉత్తర చివర కొన – కిలిక్ధావన్ పాజ్
బి. భారత్‌లో 821/20 తూర్పురేఖాంశం ఎనిమిది రాష్ట్రాల నుంచి పయనిస్తుంది
సి. నేపాల్‌కు భారత్‌లో 5 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది
డి. భారత్‌లో ఎక్కువ తీరరేఖ కలిగిన నగరం – చెన్నై
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 3
10. సరికానిది గుర్తించండి.
ఎ) మూడు వైపులా మూడు దేశాలతో సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రం – సిక్కిం
బి) భారత్‌లో పాకిస్థాన్‌తో ఎక్కువ సరిహద్దు ఉన్న రాష్ట్రం – రాజస్థాన్
సి) భారత్‌లో ఎక్కువ తీరరేఖ ఉన్న రెండవ రాష్ట్రం – తమిళనాడు
డి) భారత్‌లో ఎక్కువ రాష్ట్రాల సరిహద్దు కలిగిన రాష్ట్రం – ఉత్తరప్రదేశ్
11. భారత్‌లో రాష్ట్రాల ఏర్పాటు వరుసక్రమం?
ఎ) ఛత్తీస్‌గఢ్, జారండ్, ఉత్తరాఖండ్, తెలంగాణ
బి) ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జారండ్, తెలంగాణ
సి) జారండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ
డి) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జారాండ్, తెలంగాణ
12. హిమాలయాల గురించి సరికానిది గుర్తించండి.
ఎ) హిమాద్రిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి
బి) హిమాద్రిలో ప్రసిద్ధ కనుమలు ఉన్నాయి
సి) హిమాద్రిలో ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి
డి) హిమాద్రిలో ప్రముఖ లోయలు ఉన్నాయి
13. జతపరచండి.
1. బాఘల్‌ఖండ్ పీఠభూమి ఎ. రాగి
2. హజీరాబాగ్ పీఠభూమి బి. ఇనుము
3. కోడెర్మా పీఠభూమి సి. మైకా
4. బస్తర్ పీఠభూమి డి. వజ్రాలు
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
14. ఏ నదుల మధ్య ఆరావళి పర్వతాలు జల విభాజక క్షేత్రంగా ఉన్నాయి?
ఎ) గంగానది- సింధూనది
బి) సట్లెజ్- బియాస్
సి) బెట్వా- కెన్ డి) చంబల్- యమున
15. వేసవి విడిది కేంద్రాల్లో సరైన జతను గుర్తించండి.
1. జమ్ముకశ్మీర్ ఎ. ధర్మశాల
2. హిమాచల్‌ప్రదేశ్ బి. డార్జిలింగ్
3. ఉత్తరాఖండ్ సి. గుల్మార్గ్
4. పశ్చిమ బెంగాల్ డి. రాణిఖేట్
ఎ) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
డి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
16. లోయల గురించి సరైన జతను గుర్తించండి.
1. హిమాచల్‌ప్రదేశ్ ఎ. పుష్కర్ లోయ
2. ఉత్తరాఖండ్ బి. పుష్ప్ లోయ
3. సిక్కిం సి. కాంగ్రా లోయ
4. రాజస్థాన్ డి. చుంబి లోయ
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
17. పంజాబ్ – హర్యానా మైదానాల్లో సరికానిది గుర్తించండి.
ఎ. చిస్త్ = బియాస్ – సట్లెజ్
బి. బరీద్ = బియాస్ – రావి
సి. రీచనా = రావి – చీనాబ్
డి. ఛాజ్ = చీనాబ్ – సట్లెజ్
18. సరైనవి గుర్తించండి.
ఎ. ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం – గౌరీ శంకర్
బి. సాత్పురా పర్వతాల్లో ఎత్తయిన శిఖరం – దూప్ఘర్
సి. పశ్చిమకనుమల్లో ఎత్తయిన శిఖరం – అనైముడి
డి. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం – దొడబెట్ట
ఎ) ఎ, బి, సి బి) బి, సి, డి
సి) ఎ, సి, డి డి) ఎ, బి, డి
19. సరైనవి గుర్తించండి.
1. వెల్లింగ్టన్ దీవి – నౌకా కేంద్రంగా, పర్యాట కేంద్రంగా అభివృద్ధి చెందినది
2. ఆలియాబెట్ దీవి – నర్మద-తపతి నది ముఖద్వారం వద్ద ఉంది
3. వైడ్, నోరా దీవులు – కథియావార్ ప్రాంతంలోని దీవులు
4. క్రోకోడైల్, కచ్చటిపుదీవులు – కచ్ ప్రాంతంలోని దీవులు
ఎ) 1, 2 బి) 3, 4 సి) 2, 3 డి) 1, 4
20. మైదానం గురించి సరికానిది గుర్తించండి.
ఎ) భూమధ్య రేఖ శీతోష్ణ స్థితిని, తలపించే మిలేరియన్ శీతోష్ణస్థితి కలిగిన మైదానం -టెరాలు
బి) ఎక్కువ సారవంతమైన మైదానం – ఖాదర్
సి) నదులకు దగ్గరగా ఏర్పడిన మైదానం – భంగర్
డి) చవుడు, లవణీయ స్పటికాలు కలిగిన మైదానం – రే/కల్లార్
21. స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి.
ఎ. గుజరాత్ మైదానం – ఆటు-పోటులకు ప్రసిద్ధి
బి. కర్ణాటక మైదానం – కయ్యలకు ప్రసిద్ధి
సి. కేరళ మైదానం – మోనోజైట్ నిక్షేపాలు ఉన్నాయి
డి. ఒడిశా మైదానం – మహానది డెల్టా ఉంది
ఎ) ఎ, బి, సి బి) బి, సి, డి
సి) ఎ, బి, డి డి) ఎ, సి, డి
22. కొండల గురించి సరికానిది గుర్తించండి.
ఎ) మహారాష్ట్ర-సాత్మల కొండలు
బి) కర్ణాటక-బ్రహ్మగిరి కొండలు
సి) తమిళనాడు-జవ్వాది కొండలు
డి) కేరళ-గోండుమలై కొండలు
23. అండమాన్ నికోబార్ దీవుల గురించి సరైన జతను గుర్తించండి.
1. ఉత్తర అండమాన్
ఎ. పిగ్మోలయన్ పాయింట్
2. దక్షిణ అండమాన్ బి. పోర్ట్ బ్లెయిర్
3. మధ్య అండమాన్
సి. నార్కొండం అగ్నిపర్వతం
4. గ్రేట్ నికోబార్ డి. బారెన్ అగ్నిపర్వతం
ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
24. శిఖరాల గురించి సరికానిది గుర్తించండి.
ఎ. కాంచన గంగా – సిక్కిం
బి. కామెట్ – ఉత్తరాఖండ్
సి. చో-ఓయు – చైనా
డి. అన్నపూర్ణ – నేపాల్
25. హిమాలయ పర్వతాల గురించి సరైన జతను గుర్తించండి.
1. హిమాద్రి ఎ. హిమాలయ- హిమాలయాలు
2. హిమాచల్ బి. టెథిస్ హిమాలయాలు
3. శివాలిక్ సి. బహిరిగిరి హిమాలయాలు
4. ట్రాన్స్హిమాలయ డి.పర్వతపాద హిమాలయాలు
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
సి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
26. లక్షదీవుల గురించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి.
1. లక్షదీవులు ప్రవాళ బిత్తికల వల్ల ఏర్పడ్డాయి
2. లక్షదీవులు ఎర్నాకులం హైకోర్టు పరిధిలోకి వస్తాయి
3. లక్షదీవుల్లో పెద్ద దీవి – అమీన్ దీవి
4. లక్షదీవుల్లో అత్యంత ఉత్తరాన ఉన్న దీవి – చెర్బానియన్ దీవి
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
27. స్టేట్మెంట్లను పరిశీలించి సరైనవి గుర్తించండి.
1. భారత్‌లో అతిప్రాచీన ముడత పర్వతాలు – ఆరావళి పర్వతాలు
2. భారత్‌లో పశ్చిమ కనుములను ‘ఎవర్గ్రీన్ ఫారెస్ట్’ అంటారు
3. భారత్‌లో తూర్పు కనుములను చార్నోఖైట్, ఖోండాలైట్ వంటి శిలలు వల్ల ఏర్పడ్డాయి
4. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం – అనైముడి
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
28. పూర్వాంచల్ పర్వతాలు/తూర్పు హిమాలయాల గురించి సరికానిది గుర్తించండి.
ఎ) అరుణాచల్‌ప్రదేశ్- పాట్కాయ్బమ్ కొండలు
బి) మిజోరం- లుషాయి కొండలు
సి) అస్సాం – మికిర్ కొండలు
డి) మేఘాలయ – చురియా కొండలు
29. స్టేట్మెంట్లను పరిశీలించి సరైనది గుర్తించండి.
1. భారత్‌లో ఎత్తయిన కనుమ – ఖార్డుంగ్లా
2. భారత్‌లోకి యాంగ్-యాప్ కనుమ నుంచి బ్రహ్మపుత్ర నది ప్రవేశిస్తుంది
3. భారత్‌లోకి షిప్కి లా కనుమ నుంచి సట్లెజ్ నది ప్రవేశిస్తుంది
4. భారత్‌కి-చైనాకి వర్తక వ్యాపారం జలప్ లా కనుమ నుంచి ఎక్కువగా జరుగుతుంది
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
30. సరికానిది గుర్తించండి.
ఎ. సుర్మా లోయ – తేయాకు ప్రసిద్ధి
బి. పూగా లోయ – భూగర్భ ఉష్ణశక్తి పరిశోధన కేంద్రం ఉంది
సి. చుంబి లోయ -పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి
డి. కులు లోయ – పువ్వులకు ప్రసిద్ధి
31. స్టేట్మెంట్లలో సరైనది గుర్తించండి.
1. ద్వీపకల్ప పీఠభూమి భారత్‌లో అతిపురాతన, అతిపెద్ద నైసర్గిక స్వరూపం
2. ద్వీపకల్ప పీఠభూమి ఈశాన్య భాగంలో రాజమహల్ కొండలు ఉన్నాయి
3. బాఘల్ ఖండ్ పీఠభూమి ‘వజ్రాల గనులు’కు ప్రసిద్ధి
4. కొడెర్మా పీఠభూమి ‘రాగి’ గనులకు ప్రసిద్ధి
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
32. కారకోరం పర్వతశ్రేణి గురించి సరికానిది గుర్తించండి.
ఎ) కారకోరంను కృష్ణగిరి పర్వతాలు అంటారు
బి) ఈ పర్వత శ్రేణి ‘ఆసియా ఖండానికి వెన్నెముక’ అంటారు
సి) ఈ పర్వత శ్రేణిలో సియాచిన్ హిమానీ నదం ఉంది
డి) ఈ పర్వత శ్రేణిలో ఎత్తయిన శిఖరం – హిడెన్ శిఖరం
33. సరైనది గుర్తించండి
ప్రతిపాదన (ఏ) – భారతదేశ పశ్చిమ తీర మైదానాల్లో డెల్టా ఏర్పడటం కనిపించదు
కారణం (ఆర్) – భారతదేశ పశ్చిమ తీర మైదానాలు తూర్పుతీర మైదానాలు కంటే ఎక్కువ విస్తృతమైనవి
ఎ) (ఏ), (ఆర్) రెండూ నిజం, (ఆర్), (ఏ)కు సరైన వివరణ
బి) (ఏ), (ఆర్) రెండూ నిజం, (ఆర్), (ఏ)కు సరైన వివరణ కాదు
సి) (ఏ) నిజం కానీ, (ఆర్) తప్పు
డి) (ఏ) తప్పు కానీ, (ఆర్) నిజం
జవాబులు
1. సి 2. డి 3. సి 4. ఎ 5. డి 6. సి 7. సి 8. బి 9. బి 10. సి 11. బి 12. ఎ 13. సి 14. డి 15. బి
16. సి 17. డి 18. బి 19. ఎ 20. సి 21. ఎ 22. డి 23. బి 24. సి 25. సి 26. డి 27. ఎ 28. డి 29. ఎ 30. డి
31. ఎ 32. డి 33. సి
మస్తాన్ బాబు,
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు