పాటల రికార్డింగ్ ప్రత్యేక గదుల్లో నిర్వహించడానికి కారణం?
1. సరైన వివరణలు గుర్తించండి?
ఎ. ధ్వని తరంగాలు, అతిధ్వని తరంగాలు అనుధైర్ఘ్య యాంత్రిక తరంగాలు
బి. ధ్వని తరంగాలు అనుధైర్ఘ్య యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ యాంత్రిక తరంగాలు
సి. ధ్వని తరంగాలు అనుధైర్ఘ్య యాంత్రిక తరంగాలు, అతిధ్వని తరంగాలు తిర్యక్ యాంత్రిక తరంగాలు
డి. విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ తరంగాలు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) ఎ
2. జతపరచండి
ఎ. వస్తువు వేగం ధ్వని వేగం కంటే తక్కువ 1. సోనిక్ వేగం
బి. వస్తువు వేగం ధ్వనివేగంతో సమానం 2. సబ్ సోనిక్ వేగం
సి. వస్తువు వేగం ధ్వని వేగం కంటే ఎక్కువ 3. సూపర్ సోనిక్ వేగం
డి. వస్తువు వేగం ధ్వని వేగానికి 5రెట్లు కన్న ఎక్కువ 4. హైపర్ సోనిక్ వేగం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
3. ధ్వని ప్రమాణం?
1) న్యూటన్ 2) జౌల్
3) డెసిబెల్ 4) వాట్
4. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ. సముద్ర అంతర్భాగంలో ఉండే సబ్ మెరైన్ (జలాంతర్గామి) ఉనికి, SONAR వేగం, కదిలే దిశను కనుక్కోవడానికి తోడ్పడే SONAR (Sound Navigation and Ranging) డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది.
బి. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్‌క్రాప్ట్ (విమానాలు) రాకెట్స్, క్షిపణుల ఉనికి తెలుసుకునే రాడారు RADAR (Radio Detection and Ranging) డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది.
1) ఎ సరైంది, బి తప్పు
2) ఎ సరికాదు, బి సరైంది
3) రెండూ సరైనవే
4) రెండూ సరికాదు
5. ధ్వని కిరణాలు దేనికి ఉదాహరణ?
1) అనుదైర్ఘ్య తరంగాలు
2) తిర్యక్ తరంగాలు
3) విద్యుత్ యాంత్రిక తరంగాలు
4) స్థావర తరంగాలు
6. ఖాళీగా ఉన్న గదిలో ధ్వని పలుమార్లు వినబడటానికి కారణం?
1) అనునాదం 2) ప్రతినాదం
3) విస్పందనాలు 4) ప్రతిధ్వని
7. కింది వాటిలో ఏ తరంగాల ప్రసారానికి యానకం అవసరం?
1) రేడియో తరంగాలు
2) ధ్వని తరంగాలు
3) X- కిరణాలు 4) yγ
8. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. ధ్వని తరంగంలోని ఒక నిర్ధిష్ట స్థానం దగ్గర యానకపు సాంద్రత ప్రమాణకాలం లో చేసిన డోలనాల సంఖ్యను ‘పౌనఃపున్యం’ అంటారు
బి. ధ్వని తరంగపు ఆవర్తన కాలం S.I. ప్రమాణం ‘సెకను’.
సి. కీచు స్వరం, బొంగురు స్వరాల మధ్య తేడాను తెలిపేది ‘పిచ్’.
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) సి
9. జతపరచండి
ఎ. ధ్వని కీచుదనం 1. తీవ్రత
బి. శ్రవ్య అవధి 2. డెసిబెల్
సి. కంపన పరిమితి 3. 20 హెర్ట్జ్- 20000 హెర్ట్జ్
డి. ధ్వని శక్తి ప్రమాణం 4. పిచ్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
10. జతపరచండి
ఎ. శ్రవ్య అవధి 1. 20000 Hz ల కన్న అధికం
బి. పర శ్రావ్యములు 2. 20 Hz ల కన్న తక్కువ
సి. అతి ధ్వనులు 3. 20 Hz-20000 Hz ల మధ్య
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-2, బి-1, సి-3
11. సినిమాహాల్లో గోడలు, సీలింగ్‌లను థర్మకోల్, రంపపు పొట్టుతో చేసిన అట్టలతో కప్పి ఉంచడానికి కారణం?
1) అనునాద ప్రభావాన్ని తగ్గించడానికి
2) అనునాద ప్రభావాన్ని పెంచడానికి
3) ప్రతినాద ప్రభావాన్ని తగ్గించడానికి
4) ప్రతినాద ప్రభావాన్ని పెంచడానికి
12. ‘డెసిబెల్’ దేని కొలమానం?
1) ధ్వని తీవ్రత 2) కాంతి తీవ్రత
3) ధ్వని పౌనఃపున్యం 4) ధ్వని ధైర్ఘ్యం
13. ధ్వని తరంగాలు దేని గుండా ప్రయాణించ లేవు?
1) నీరు 2) ఉక్కు
3) శూన్యం 4) గాలి
14. కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ. ధ్వని తీవ్రత ‘కంపన పరిమితి’పై ఆధార పడి ఉంటుంది
బి. ధ్వని స్థాయిత్వం ‘పౌనఃపున్యం’పై ఆధారపడి ఉంటుంది
సి. ధ్వని వేగం ‘యానక స్వభావం’పై ఆధారపడి ఉంటుంది
డి. కంపన కణాల్లో మాత్రమే ధ్వని జనిస్తుంది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
15. ఎ. శబ్ద స్పర్శ 0.1 సెకన్లు ఉంటే దాని స్థిరత అంటాం
బి. 0.1 సెకన్ల కంటే తక్కువ కాలంలో పరావర్తనం చెందిన ప్రతిధ్వని వినలేం
సి. 0.1 సెకన్ల్ల కంటే తక్కువ కాలంలో పరావర్తన ధ్వని వినిపిస్తే దాన్ని ప్రతినాదం అంటారు
పై వాటిలో సరైనవి ఏవి?
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) సి మాత్రమే
16. వయస్సు పెరిగిన కొద్ది మనిషి వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. దీనికి కారణం?
1) తక్కువ పౌనఃపున్యం గల తరంగాలకు కర్ణభేరి స్పందించదు
2) ఎక్కువ పౌనఃపున్యం గల తరంగాలకు కర్ణభేరి స్పందించదు
3) ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలకు కర్ణభేరి స్పందించదు
4) ఎక్కువ కంపన పరిమితి గల తరంగాలకు కర్ణభేరి స్పందించదు
17. కింది వాటిలో సరికానిది?
1) ధ్వని తీవ్రత పౌనఃపున్యంపై ఆధారపడదు
2) ధ్వని స్థాయిత్వం కొలవడానికి ‘టోనోమీటర్’ ఉపయోగిస్తారు
3) ధ్వని స్థాయిత్వాన్ని కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది
4) ధ్వని తీవ్రత ప్రమాణాలు డెసిబెల్స్
18. ధ్వని అలల వల్ల వచ్చే ప్రతిధ్వనికి కారణం?
1) ధ్వని రిప్లేక్షన్
2) ధ్వని రిఫ్రాక్షన్
3) ధ్వని విడిపోవడం
4) ధ్వని దగ్గరగా రావడం
19. కింది వాటిలో అతిధ్వని తరంగాలుగా వేటిని పిలుస్తారు?
1) ధ్వని తరంగాల పౌనఃపున్యం కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలు
2) శూన్యంలో ఉత్పత్తి చేసిన ధ్వని తరంగాలు
3) ధ్వని తరంగాల పౌనఃపున్యం కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలు
4) 20 Hz-20000 Hz పౌనఃపున్యం ఉన్న ధ్వనులు
20. ధ్వని స్థాయి (పిచ్) దేని మీద ఆధారపడి ఉంటుంది?
1) స్వభావం (ఆటిట్యూడ్)
2) తరంగ దైర్ఘ్యం
3) పౌనఃపున్యం
4) గమనం (వెలాసిటి)
21. డాప్లర్ ఫలితం అనువర్తనం కానిది?
1) వాహనాల వేగాన్ని లెక్కించే స్పీడ్ గన్ అనే పరికరం పనిచేయడం
2) తుఫాన్ల ఉనికిని ముందుగా తెలుసుకోవడం
3) సూర్యుడి ఆత్మభ్రమణ దిశ, శని గ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడం
4) శరీరంలోని ఎముకలను పరిశీలించడం
22. గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వని వేగం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) ఏ మార్పు ఉండదు 4) ఏదీకాదు
23. టీవీ ఆన్ చేసినప్పుడు…?
1) మొదట బొమ్మ కనిపిస్తుంది
2) మొదట మాటలు వినిపిస్తాయి
3) బొమ్మ, మాటలు ఒకేసారి వినిపిస్తాయి
4) పెట్టిన ఛానల్‌పై ఆధారపడి బొమ్మ, మాటలు వస్తాయి
24. రైలు కూత పెడుతూ స్టేషన్ నుంచి దూరంగా వెళ్లేటప్పుడు ప్లాట్‌ఫారంపై నిలుచున్న వ్యక్తికి వినబడే కూత పౌనఃపున్యం?
1) కూత వాస్తవ పౌనఃపున్యం కంటే ఎక్కువ
2) కూత వాస్తవ పౌనఃపున్యం కంటే తక్కువ
3) కూత వాస్తవ పౌనఃపున్యానికి సమానం
4) 1, 2
25. ఆడవాళ్ల గొంతు మగవాళ్ల గొంతు కంటే ‘కీచు’గా ఉంటుంది కారణం ఏమిటి?
1) తక్కువ పౌనఃపున్యం
2) తక్కువ తరచుదనం
3) ఎక్కువ పౌనఃపున్యం
4) ఎక్కువ తరచుదనం
26. జతపరచండి?
ఎ. అతిధ్వనులు 1. మానవుడు
బి. పరశ్రావ్యాలు 2. తేనెటీగలు
సి. సాధారణ ధ్వనులు 3. గబ్బిలాలు
డి. అతినీలలోహిత కిరణాలు 4. పాములు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-1, సి-3, డి-2
27. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు?
1) డెసీమీటర్స్ 2) డెసిజౌళ్లు
3) డెసిబెల్ 4) డిసిక్రోమ్స్
28. మనిషి చెవి ఒక సెకన్లో స్పష్టంగా వినగల ధ్వని మాత్రల (Syllables) సంఖ్య గరిష్ఠంగా?
1) 5 2) 10
3) 15 4) 20
29. ధ్వని తీవ్రత ఆధారంగా కింది వాటిని జతపర్చండి
ఎ. గుసగుసలు 1. 60 డెసిబెల్స్
బి. టెలిఫోన్ 2. 20-30 డెసిబెల్స్
సి. జెట్ విమానం 3. 80-90 డెసిబెల్స్
డి. ట్రాఫిక్ 4. 100-200 డెసిబెల్స్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-2, సి-1, డి-3
30. సంగీత స్వరం అభిలక్షణం కానిది ఏది?
1) కీచుదనం 2) తీవ్రత
3) నాణ్యత 4) తరంగదైర్ఘ్యం
31. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ. కుక్కలు 50,000 Hz గబ్బిలాలు లక్ష Hz వరకు ధ్వనిని వింటాయి
బి. డాల్ఫిన్లు లక్ష Hz పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి, గుర్తిస్తాయి
1) పై రెండూ సరైనవే
2) ఎ సరైంది, బి తప్పు
3) రెండూ తప్పు
4) 2 సరైంది, 1తప్పు
32. కింది వాటిలో దేనిలో అత్యధిక ధ్వని వేగం ఉంటుంది?
1) ఉక్కు 2) నీరు
3) గాలి 4) శూన్యం
33. ఒక వ్యక్తి పక్క గదిలోని మాటలను వినడానికి కారణం?
1) ధ్వని పరావర్తనం
2) ధ్వని వివర్తనం
3) ధ్వని వక్రీభవనం
4) అతిధ్వని
34. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. కంపించే వస్తువు సమీపించే కొద్ది ధ్వని పెరగడం. దూరం పెరిగిన
కొద్ది తగ్గడాన్ని డాప్లర్ ఫలితం అంటారు
బి. సముద్రాల లోతును కనుగొనడానికి ‘ప్రతిధ్వనిని’ ఉపయోగిస్తారు
సి. నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ప్రాథమిక రంగులు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
35. కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?
1) ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు
2) ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు
3) యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు
4) పైవన్నీ సరైనవే
36. మనిషి వినే శబ్ధ తరంగాల అవధి KHz ల్లో..?
1) 0.01-10 2) 0.01-20
3) 0.02-20 4) 0.02-200
37. సముద్రాల లోతు తెలుసుకోవడానికి ‘SONAR’ పద్ధతిని ఉపయోగిస్తారు? ‘SONAR’ అంటే?
1) Sound Detection and Ranging
2) Sound Navigation and Ranging
3) Sound Observation and Ranging
4) Sound Observation, Navigation and Ranging
38. కింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి?
ఎ. అతిధ్వనుల పౌనఃపున్యం 20,000 Hz కంటే ఎక్కువగా ఉంటుంది
బి. కుక్కల్లో శృతిగ్రాహ్యత ఎక్కువగా ఉండటం వల్ల అవి అతిధ్వనులను వినగలుగుతాయి
సి. అతిధ్వనులను రాడార్‌లో ఉపయోగిస్తారు
డి. అతిధ్వనుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) డి
39. అనుదైర్ఘ్య తరంగం కింది వాటిని కలిగి ఉంటుంది?
1) శృంగాలు, ద్రోణులు
2) సంపీడన, అస్పందనాలు
3) ప్రస్పందన, అస్పందనాలు
4) ఏదీకాదు
40. పాటల రికార్డింగ్‌ను ప్రత్యేక గదుల్లో నిర్వహించడానికి కారణం?
1) బయటి ధ్వనులు రికార్డు కాకుడదని
2) ఆ గదిలోని ధ్వనుల ప్రతినాదం తగ్గించడానికి
3) పాడే వ్యక్తి ఏకాగ్రత దెబ్బతినకుండ ఉండటానికి
4) 1, 2
సమాధానాలు
1-3, 2-2, 3-3, 4-3, 5-1, 6-2, 7-2, 8-3, 9-2, 10-2, 11-3, 12-1, 13-3, 14-4, 15-3, 16-2, 17-3, 18-1, 19-3, 20-3, 21-4, 22-1, 23-2, 24-2, 25-3, 26-2 , 27-3, 28-2, 29-2, 30-4, 31-1, 32-1, 33-2, 34-3, 35-4, 36-3, 37-2, 38-3, 39-2, 40-4
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు