ఖనిజాలే ఖజానా..
ఖనిజాలు అంటే భూపటంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రసాయన మూలకాలతో సహజసిద్ధంగా ఏర్పడిన ఘనస్థితిలోని అకర్బనిక సమ్మేళనాలే ఖనిజాలు. భౌతిక, రసాయన ధర్మాల ఆధారంగా అగ్రికొలా శాస్త్రజ్ఞుడు ఖనిజాలను విభజించాడు.
1.లోహ ఖనిజాలు :
ఇనుపధాతువు, మాంగనీసు, బాక్సైట్, రాగి, సీసం, జింక్, క్రోమైట్, బంగారం, వెండి, టంగ్స్టన్.
2. అలోహ ఖనిజాలు :
అబ్రకం (మైకా), సున్నపురాయి, జిప్సం, బైరైటీస్, ఆస్బెస్టాస్ (రాతినార), గ్రాఫైట్, కయనైట్, మాగ్నటైట్, సిల్లిమనైట్, డోలమైట్, వజ్రాలు, ఉప్పు.
3.ఇంధన ఖనిజాలు :
నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు.
4.అణుశక్తి ఖనిజాలు :
యురేనియం, థోరియం, మోనజైట్.
-దేశంలో ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం- చోటానాగపూర్ పీఠభూమి.
-దేశంలో ఖనిజ నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతం- గంగా, సింధు మైదానం.
-అత్యధిక ఖనిజ నిల్వలున్న ప్రాంతాలు- ఒడిశా (9.6%), ఆంధ్రప్రదేశ్ (9%), రాజస్థాన్ (8%).
1)ఇనుము :
ఇనుప ఖనిజం సాధారణంగా ఆక్సిజన్ మూలకంలో సమ్మేళనంగా లభిస్తుంది. ఇనుము రకాలు..
1. మాగ్నటైట్ (Fe3O4)- 72 శాతం (ఇనుప ధాతువు).
2. హెమటైట్ (Fe2O3)- 70 శాతం (ఇనుప ధాతువు).
3. లియనైట్ (Fe2O3H2O)- 60 శాతం (ఇనుప ధాతువు).
4. సిడరైట్ (Fec3O)- 50 శాతం (ఇనుప ధాతువు).
-భూపటలంలో 4.6 శాతం ఈ ఖనిజం కలిగి ఉంది.
-ప్రపంచంలో చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండియా, రష్యాల్లో అధికంగా ఉత్పత్తి అవుతుంది.
-భారత్‌లో ఇనుము నిల్వలు- 25 శాతం.
-భారత్‌లో అత్యధిక ఉత్పత్తి రాష్ర్టాలు- ఒడిశా, కర్ణాటక.
-ఉక్కుయంత్రాలు, పరికరాలు, ఆయుధాలు, రవాణాకు ఉపయోగం.
-96 శాతం ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవా, కర్ణాటక నుంచి ఉత్పత్తి.
-ప్రపంచంలో దిగుమతిలో జపాన్, కొరియా. కాగా ఎగుమతిలో భారత్ 5వ స్థానం
విస్తరణ :
ఒడిశా – బూదమ్పూర్ గని, బారాజతుల గని (కియోంజర్), గురుమహిసాని గని (మయూర్భంజ్)
-జార్ఖండ్ – గువా, నాన్ముడి గనులు (సింగ్భమ్)
-ఛత్తీస్‌గఢ్ – బైలదిల్లా కొండలు (హెమటైట్ ఇనుము)
-కర్ణాటక – కుద్రేముఖ్, కెమ్మంగుడి (బాబా బుడెన్ కొండలు)
-గోవా – గోవాగని (ఉత్తర గోవా)
-తమిళనాడు – సేలం, తిరుచిరాపల్లి
-తెలంగాణ – బయ్యారం (ఖమ్మం)
-ఆంధ్రప్రదేశ్- అనంతపురం (ఓబుళాపురం), కృష్ణ, కడప
-ఇనుప ఖనిజం అధికంగా గోవా ఓడరేవు (మర్మగోవా) నుంచి ఎగుమతి చేస్తుండగా, భారత్ నుంచి ఎక్కువగా జపాన్‌కు విశాఖ ఓడరేవు ద్వారా ఎగుమతి చేస్తున్నారు.
2)మాంగనీసు :
ఇది ఇనుము- ఉక్కు, విద్యుత్ పరిశ్రమల్లో ముడి సరుకుగా ఉపయోగం.
-ప్రపంచ ఉత్పత్తిలో అధికంగా రష్యా (మొదటిస్థానం), భారత్ (రెండోస్థానం).
-దేశంలో మొదటిస్థానంలో ఒడిశా (25 శాతం), ఆ తర్వాత కర్ణాకట రెండోస్థానం.
విస్తరణ :
ఒడిశా – సుందర్‌గర్, కలహండి, కోరాపుట్
-కర్ణాటక – చిత్రదుర్గా, తుముకూరు, బెల్గాం, చిక్ మంగళూరు
-మధ్యప్రదేశ్ – చింద్వారా, జబల్పూర్, జబువా
-మహారాష్ట్ర – రత్నగిరి, నాగ్‌పూర్
-ఆంధ్రప్రదేశ్ – శ్రీకాకుళం, విజయనగరం
3)బాక్సైట్ :
దీని నుంచి అల్యూమినియం ఉత్పత్తి అవుతుంది. ఇది దృఢమైంది, తేలికైనది కావడంతో విమాన పరిశ్రమకు ముఖలోపం ఆటోమొబైల్స్, ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు.
-ప్రపంచంలో అధికంగా ఆస్ట్రేలియా, గినియా, బ్రెజిల్, భారత్ (నాలుగో స్థానం)లో లభ్యం.
-దేశంలో అధికంగా మొదటిస్థానంలో ఒడిశా (35 శాతం), రెండోస్థానంలో గుజరాత్
విస్తరణ :
ఒడిశా – కోరాపుట్, కలహండి
-గుజరాత్ – గల్ఫ్ ఆఫ్ కచ్
-మధ్యప్రదేశ్ – అమర్కంటక్, మైకాల్ పర్వత శ్రేణులు
-ఛత్తీస్‌గఢ్ – కటి, బిలాస్పూర్
-ఆంధ్రప్రదేశ్ – విశాఖ, ఉభయ గోదావరి
-జార్ఖండ్ – రాంచి
-భారత్ నుంచి ఇటలీ, ఇంగ్లండ్ దేశాలకు ఎగుమతి
4)రాగి (కాపర్) :
ఇది ఎలక్ట్రికల్ పరిశ్రమ, ఇత్తడి, నాణేలు, పాత్రల తయారీలో ఉపయోగిస్తారు. ఇది చాల్కో పైరైట్, చాల్కోసైట్గా దొరుకుతుంది.
విస్తరణ:
దేశంలో మొదటిస్థానంలో మధ్యప్రదేశ్ (54 శాతం), రెండోస్థానం రాజస్థాన్.
-మధ్యప్రదేశ్ – మాలన్ఖండ్ బెల్ట్, బాల్గషు, చింద్వారా
-రాజస్థాన్ – ఖేత్రి గని (దేశంలో అతి పురాతన సింధు ప్రజల కాలం నుంచి), దెబారి, ఆల్వార్
-జార్ఖండ్ – హజారీబాగ్, రాంచి, సింగ్భమ్
-తెలంగాణ – మైలారం (ఖమ్మం)
-ఆంధ్రప్రదేశ్ – అగ్నిగుండాల (గుంటూరు), గరిమనపెంట (నెల్లూరు), గని కాలువ (కర్నూలు), పులివెందుల, బ్రాహ్మణపల్లి (కడప)
5)క్రోమైట్ :
లోహశుద్ధి, రిఫ్రాక్టరీ రసాయన పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
-దేశంలో 95 శాతం నిల్వలు ఉండగా, ఉత్పత్తిలో ఒడిశా ప్రథమస్థానంలో ఉంది.
విస్తరణ :
ఒడిశా – కటక్, కియోంజర్ జిల్లాలోని అతి ముఖ్యమైన గని సుకిండా.
-కర్ణాటక – హసన్ (మైసూరు)
6)బంగారం:
దేశంలో ఉత్పత్తిలో మొదటిస్థానం కర్ణాటక.
-కర్ణాటక – కోలార్ (ప్రపంచంలోనే లోతైన గని), హట్టి (మైసూరు)
-ఆంధ్రప్రదేశ్ – రామగిరి గని (అనంతపురం)
-తమిళనాడు – నీలగిరులు
-కేరళ – కోజికోడ్
7)వెండి :
దేశంలో ఉత్పత్తిలో మొదటిస్థానం రాజస్థాన్.
విస్తరణ :
రాజస్థాన్ – ఉదయ్‌పూర్
-కర్ణాటక – కోలార్, చిత్రదుర్గ
-ఆంధ్రప్రదేశ్ – కడప, గుంటూరు, కర్నూలు
8)వజ్రాలు :
దేశంలో ఉత్పత్తిలో మొదటిస్థానం మధ్యప్రదేశ్.
విస్తరణ :
మధ్యప్రదేశ్ – పన్నా, సాత్నా, చత్తార్పూర్
-ఆంధ్రప్రదేశ్ – వజ్రకరూర్ (అనంతపురం)
-మహారాష్ట్ర – భండారా
9)మైకా :
విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉపయోగిస్తారు.
-ప్రపంచంలోనే ఉత్పత్తిలో మొదటిస్థానం భారత్ (80 శాతం)
-దేశంలో ఉత్పత్తిలో మొదటిస్థానం – జార్ఖండ్
విస్తరణ :
జార్ఖండ్ – చోటానాగ్పూర్, కొడెర్మా
-బీహార్- గయ
-ఆంధ్రప్రదేశ్ – గూడూరు (నెల్లూరు)
-రాజస్థాన్ – అజ్మీర్
-అమెరికా, జపాన్ దేశాలకు ఎగుమతి
10)ఆస్బెస్టాస్ :
పైపులు, పెంకులు, పలకల వంటి సిమెంటు రేకుల తయారీకి ఉపయోగం
-దేశంలోనే అధిక ఉత్పత్తిలో మొదటిస్థానం రాజస్థాన్ (94 శాతం).
విస్తరణ :
రాజస్థాన్ – అజ్మీర్, బిల్వారా, ఉదయ్‌పూర్, ఆళ్వారు
-తెలంగాణ – మహబూబ్‌నగర్
-ఆంధ్రప్రదేశ్ – కడప
11)బైరైటీస్ :
రంగులు, కాగితం, వస్ర్తాలు, తోళ్ల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
-దేశంలోనే ఉత్పత్తిలో మొదటిస్థానం ఆంధ్రప్రదేశ్.
విస్తరణ :
ఆంధ్రప్రదేశ్ – మంగపేట (కడప) వద్ద ప్రపంచంలోనే నాణ్యమైనది లభ్యం. అనంతపురం, కర్నూలు
-తెలంగాణ – ఖమ్మం
-రాజస్థాన్ – ఆళ్వార్
12)జిప్సం :
సిమెంటు, ఎరువుల పరిశ్రమలో ఉపయోగిస్తారు.
-దేశంలోనే ఉత్పత్తిలో మొదటిస్థానం రాజస్థాన్ (99 శాతం)
విస్తరణ :
రాజస్థాన్ – బికనీర్, గంగానగర్, భరత్పూర్, జైసల్మీర్, జోధ్‌పూర్
-జమ్ముకశ్మీర్ – కొంత వరకు లభ్యం
13)డోలమైట్ :
మెటలర్జికల్, రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
-దేశంలో ఉత్పత్తిలో మొదటిస్థానం ఒడిశా.
విస్తరణ :
ఒడిశా – సుందర్‌గర్, సంభాల్పూర్
-ఛత్తీస్‌గఢ్ – బిలాస్పూర్
14)సున్నపురాయి :
సిమెంటు, ఇనుము- ఉక్కు, పంచదార, ఎరువుల పరిశ్రమలో ఉపయోగిస్తారు.
-దేశంలో ఉత్పత్తిలో మొదటిస్థానం ఆంధ్రప్రదేశ్
విస్తరణ :
ఆంధ్రప్రదేశ్ – కర్నూలు, కడప, గుంటూరు
-తెలంగాణ – నల్లగొండ
-రాజస్థాన్ – అజ్మీర్, జోధ్‌పూర్, పాలి, బుండి
-మధ్యప్రదేశ్ – జబల్పూర్, రేవా, సాల్నా
-గుజరాత్ – కచ్, సూరత్
-ఛత్తీస్‌గఢ్ – బిలాస్పూర్, రాయ్‌పూర్
15)యురేనియం (యెల్లోకేక్) :
అణువిద్యుత్ ఉత్పాదనకు ఉపయోగిస్తారు. పిచ్‌బ్లెండ్ యురేనియం నుంచి లభిస్తుంది.
-ప్రపంచంలో ఉత్పత్తిలో కజకిస్థాన్ (33 శాతం), కెనడా (18 శాతం), ఆస్ట్రేలియా (11 శాతం), ఇండియా (0.7 శాతం) ఉండగా, నిల్వల్లో ఆస్ట్రేలియా, కజకిస్థాన్, కెనడాలు ఉండగా, భారత్ 14వ స్థానంలో ఉంది.
-దేశంలో ఉత్పత్తిలో మొదటిస్థానం జార్ఖండ్
విస్తరణ :
జార్ఖండ్ – జాదుగఢ్ (సింగ్భమ్), హజారీబాగ్
-బీహార్ -గయ
-ఉత్తరప్రదేశ్ – షహరాన్‌పూర్
-తెలంగాణ – పెద్దఅడిశర్లపల్లి (నల్లగొండ)
-ఆంధ్రప్రదేశ్ – తుమ్మలపల్లి (కడప), శంకరంపేట (నెల్లూరు)
16)థోరియం :
ఇది థోరియం, యురేనియం, సిరియం, లిథోనియంల సమ్మేళనం.
-ప్రపంచంలో ఉత్పత్తిలో మొదటిస్థానం భారత్ (16 శాతం)
విస్తరణ :
కేరళ – కేరళ తీరంలోని ఇసుకలో (పాల్ఘాట్, క్విలాన్)
-ఆంధ్రప్రదేశ్ – విశాఖ బీచ్ ఇసుకలో లభ్యం
-జార్ఖండ్ – హజారీబాగ్
-తమిళనాడు – మధురై
-రాజస్థాన్ – బిలాస్పూర్
17)బొగ్గు :
ఇది ఒక హైడ్రోకార్బన్. అవక్షేపశిలల్లో లభ్యం.
-ప్రపంచంలో ఉత్పత్తిలో చైనా, అమెరికా, భారత్.
-ప్రపంచ నిల్వల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్ (10 శాతం)
-దేశంలో ఉత్పత్తిలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ
-దేశంలో లభ్యమయ్యే బొగ్గు 2 రకాలు
1. గోండ్వానా రకం :
ఉత్తమ నాణ్యత, ఉత్పత్తి జార్ఖండ్.
-259 మిలియన్ ఏండ్లకు పూర్వం ఏర్పడింది.
-దేశంలో దామోదర్‌లోయ ప్రాంతంలో ఈ నిల్వలు అధికం.
-నిల్వలు – జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ
2. టెర్షియరీ రకం :
ఇది ఏర్పడింది దాదాపు 30 మిలియన్ ఏండ్ల కిందట. తక్కువ నాణ్యత కలిగినది.
-ఈ నిల్వలు తమిళనాడులో అధికం, అలాగే రాజస్థాన్, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్‌లో లభ్యం.
-ఉత్పత్తిలో తమిళనాడు, గుజరాత్.
-బొగ్గులోని కాపర్ శాతం ఆధారంగా బొగ్గు 4 రకాలు.
1. ఆంత్రసైట్ :
దీనిలో కార్బన్ 85-90 శాతం. దహనశీలత ఎక్కువగల ఉత్తమమైనది. ఇది జమ్ముకశ్మీర్‌లో లభ్యం.
2. బిట్యుమినస్ : దీనిలో కార్బన్ 40-80 శాతం. దేశంలో అధికంగా లభించే రకం. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబంగాలో లభ్యం.
3. లిగ్నైట్ : దీనిలో కార్బన్ 40-50శాతం. తమిళనాడులో 90 శాతం లభ్యం.
4. పిట్ : దీనిలో అతితక్కువ కార్బన్ 40 శాతం. కర్రబొగ్గులా ఉంటుంది. జమ్ముకశ్మీర్‌లోని జీలం నది ప్రాంతంలో లభ్యం.
విస్తరణ : గోండ్వానా రకం
1. జార్ఖండ్ – ఝరియా (దీన్ని దేశంలోనే ఉత్తమమైన లోహ బొగ్గుగని అని పిలుస్తారు).
2. పశ్చిమబంగా – రాణిగంజ్ (దేశంలోనే అతి పురాతనమైనది).
3. ఒడిశా – తాల్చేర్ గని ( రాణిగంజ్ తర్వాత ఎక్కువ ఉత్పత్తి గని).
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు