పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

# 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నిర్వహణ
# ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాలు
పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత శిక్షణ ఇవ్వాలని ఇంటర్ విద్య అధికారులు నిర్ణయించారు. గురువారం ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియగానే.. ఒకట్రెండు రోజుల్లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 20 కాలేజీలను ఇందుకోసం ఎంపికచేశారు. ఒక్కో కాలేజీల్లో 100 మంది చొప్పున మొత్తంగా 2వేల మందికి నిపుణుల చేత తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతున్న, చదివిన విద్యార్థులను ఎంపికచేసి ఉచిత శిక్షణ అందిస్తారు. ఈ ఉచిత శిక్షణను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. అందుకు ప్రిన్సిపాళ్లు, ఇంటర్, నోడల్ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఆయా శిక్షణా కేంద్రాల్లో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు, మాడల్ ప్రశ్నపత్రాల అభ్యాసం, సిలబస్ బోధన అందిస్తారు. పోలీసు ఉద్యోగాలతో పాటు సీఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, పలు యూనిఫాం ఉద్యోగాలకు ఈ ఉచిత శిక్షణ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
- Tags
- competitive exams
- TSLPRB
Latest Updates
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు