దేశంలో జీవావరణ రక్షిత ప్రదేశాలు
నీలగిరి బయోస్పియర్:
దీన్ని 1986, సెప్టెంబర్ 1న జీవావరణ పరిరక్షణ ప్రదేశంగా ప్రకంటించారు. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లోని వయనాడ్, నాగర్హోల్, బందీపూర్, మడుమలై, నిలాంబర్, సైలెంట్ వ్యాలీ, సిరువాణీ హిల్స్ ప్రాంతాల్లో 5,520 చ.కి.మీ. విస్తరించింది.
నందాదేవి బయోస్పియర్:
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కొంతభాగం, పితోరాగఢ్, భాగేశ్వర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. 5860.69 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న దీన్ని 1988, జనవరి 18న జీవారణ రక్షిత ప్రదేశంగా ప్రకటించారు.
నోక్రెక్:
ఇది 820 చ.కి.మీ. విస్తరించి ఉంది. మేఘాలయలోని గారో హిల్స్ పరిధిలో ఉంది. దీన్ని 1988, సెప్టెంబర్ 1న బయోస్పియర్‌గా ప్రకటించారు.
గ్రేట్ నికోబార్:
అండమాన్ నికోబార్ దీవుల్లోని దక్షిణ ప్రాంతాల్లో 885 చ.కి.మీ. విస్తరించి ఉన్న దీన్ని 1989, జనవరి 6న జీవావరణ రక్షిత కేంద్రంగా ప్రకటించారు.
గల్ఫ్ ఆఫ్ మన్నార్:
దీన్ని 1989, ఫిబ్రవరి 18న జీవావరణ కేంద్రంగా ప్రకటించారు. భారత్, శ్రీలంక దేశాల మధ్య ఉన్న భారత భూభాగంలో 10,500 చ.కి.మీ. విస్తరించి ఉంది.
మనాస్:
అసోంలోని బంగాయ్గావ్, బర్పేటా, నల్బారీ, కంప్రూప్ జిల్లాల్లో పూర్తిగా, కాఖ్రజార్ జిల్లాలోని కొంత భాగంలో విస్తరించి ఉంది. 2837 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న దీన్ని 1989, మార్చి 14న బయోస్పియర్‌గా గుర్తించారు.
సుందర్బన్స్ బయోస్పియర్:
పశ్చిమబెంగాల్లోని గంగ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ డెల్టా ప్రాంతంలో 9630 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దీన్ని జీవావరణ ప్రదేశంగా 1989, మార్చి 29న గుర్తించారు.
సిమ్లిపాల్ జీవావరణ కేంద్రం:
ఇది ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో 4374 చ.కి.మీ. విస్తరించి ఉంది. 1994, జూలై 21న బయోస్పియర్ రిజర్వ్‌గా ప్రకటించారు.
దిబ్రూ-సైఖోవా:
అసోంలోని డిబ్రూగర్, టిన్సుకియా జిల్లాల్లో విస్తరించి ఉంది. 765 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ వన్యప్రాణి కేంద్రాన్ని 1997, జూన్ 28న రక్షిత ప్రదేశంగా గుర్తించారు.
దెహంగ్-దిబాంగ్ బయోస్పియర్:
ఇది 5111.50 చ.కి.మీ. మేర అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్, దిబాంగ్ లోయలో విస్తరించి ఉంది. దీన్ని 1998, సెప్టెంబర్ 2న బయోస్పియర్‌గా గుర్తించారు.
పచ్మర్హి (Pachmarhi):
1999, మార్చి 3న బయోస్పియర్‌గా గుర్తించారు. ఈ జీవావరణ రక్షిత ప్రదేశం మధ్యప్రదేశ్‌లోని బెటుల్, హోషంగాబాద్, ఛింద్వారా జిల్లాల్లో 4926 చ.కి.మీ. విస్తరించి ఉంది.
కాంచనగంగా బయోస్పియర్ :
దీన్ని 2000, ఫిబ్రవరి 7న రక్షిత ప్రదేశంగా గుర్తించారు. సిక్కిం, కాంచనగంగ పర్వతాల్లోని కొంతభాగంలో 4926 చ.కి.మీ. విస్తరించి ఉంది.
అగస్థ్యమలై:
కేరళలోని నెయ్యార్, పెప్పార, షెందుర్నీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లోని ప్రాంతాల్లో 1828 చ.కి.మీ. విస్తరించి ఉంది. నీలగిరి థార్ వంటి ప్రత్యేక జాతులకు నిలయంగా ఉన్న దీన్ని 2001, నవంబర్ 12న బయోస్పియర్‌గా ప్రకటించారు.
అచానకమర్-అమర్‌కంఠక్ బయోస్పియర్:
ఇది మధ్యప్రదేశ్‌లోని అనుపూర్, దిన్డోరి జిల్లాల్లో, చత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్జిల్లాలో కొంతమేర విస్తరించి ఉంది. మొత్తం 3835.51 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న దీన్ని 2005, మార్చి 30న జీవావరణ పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించారు.
కచ్:
ఇది గుజరాత్‌లోని కచ్, రాజ్‌కోట్, సురేంద్రనగర్, పటాన్ జిల్లాల్లో 12,454 చ.కి.మీ. విస్తరించి ఉంది. భారతీయ అటవీ గాడిద వంటి అరుదైన జీవులతో కూడిన ఈ ప్రాంతాన్ని 2008, జనవరి 29న బయోస్పియర్‌గా ప్రకటించారు.
శీతల ఎడారి:
హిమాచల్ ప్రదేశ్‌లోని చంద్రతల్, సర్చూ, కిబ్బెర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో విస్తరించి ఉంది. మంచు చిరుత వంటి జీవులు కనిపించే ఈ ప్రదేశాన్ని 2009, ఆగస్టు 28న జీవావరణ పరిరక్షణ ప్రాంతంగా గుర్తించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు