వనాల పరిరక్షణ.. వన్యప్రాణుల సంరక్షణ
- జాగ్రఫీ 21 డిసెంబర్ 2022 తరువాయి..
అడవి పంది, కణితి, దుప్పి, కొండగొర్రె జంతువులు చిట్టడవుల్లో ప్రధానంగా కనిపిస్తాయి. కాగా గోదావరికి ఉత్తర దిశగా పర్వత అరణ్య ప్రదేశాల్లో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎనుబోతు అనే జంతువు కనిపిస్తుంది. మంచిర్యాల, ములుగు, నిర్మల్, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో పెద్దపులులు, చిరుత పులులు దర్శనమిస్తాయి.
తెలంగాణలో అటవీ ఆధారిత ప్రధాన పరిశ్రమలు
1. సిర్పూర్ పేపర్ మిల్లు -కాగజ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా
2. భద్రాచలం పేపర్ మిల్లు -సారపాక, ఖమ్మం జిల్లా
3. నోవాపామ్ ఇండియా -పటాన్చెరు, హైదరాబాద్
4. రేయాన్ పరిశ్రమ -కమలాపురం, కరీంనగర్
5. బొమ్మల పరిశ్రమ నిర్మల్ జిల్లాలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి
6. బీడీ పరిశ్రమ (కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కుటీర పరిశ్రమగా అభివృద్ధి.. తెలంగాణ అటవీ ఆధారిత పరిశ్రమల్లో బీడీ పరిశ్రమ అధికంగా ఉంది.
తెలంగాణ గిరిజన అటవీ ఉత్పత్తి శుద్ధి కేంద్రాలు
1. సోయా ప్రాసెసింగ్ యూనిట్ -ఉట్నూర్, ఆదిలాబాద్
2. పసుపు తయారీ కేంద్రం – ఏటూరునాగారం, ములుగు
3. జిగురు శుద్ధి కేంద్రం -ములుగు
4. సబ్బుల తయారీ కేంద్రం -నిర్మల్
5. చింతపండు ప్రాసెసింగ్, షాంపూ తయారీ కేంద్రం -కొండనాగుల, నాగర్‌కర్నూలు
6. తేనె శుద్ధి కేంద్రం -కామారెడ్డి
వన్యప్రాణి సంరక్షణ (Wildlife Protection)
- వన్యప్రాణులను రెండు విధాలుగా సంరక్షిస్తారు.
1. ఆవాసాంతర రక్షణ
2. ఆవాసేతర రక్షణ
- ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవులను అదే సహజ పరిసరాలలో సంరక్షించడాన్ని ఆవాసాంతర రక్షణ అంటారు. ఈ రక్షణ మూడు రకాలుగా ఉంటుంది. అవి..
ఎ) వన్య మృగ సంరక్షణ కేంద్రాలు
బి) జాతీయ పార్కులు
సి) జీవావరణ కేంద్రాలు
ఎ). వన్య మృగ సంరక్షణ కేంద్రాలు
- వన్య మృగ సంరక్షణ చట్టాన్ని 1972లో చేశారు. దీనిని 2006లో సవరించారు. ఈ చట్టం ప్రకారం వన్య మృగ సంరక్షణ కేంద్రాలను గుర్తిస్తారు. ఈ కేంద్రాలకు సరిహద్దులు ఉండవు. ఈ కేంద్రాల్లో అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవ జాతులను సంరక్షిస్తారు. భారతదేశంలో మొదటగా తమిళనాడులోని వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని 1895లో గుర్తించారు.భారతదేశంలో చివరగా ఏర్పాటు చేసిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 4. అవి..
1. మేఘమలై (తమిళనాడు)
2. తీర్థంగల్ (తమిళనాడు)
3. సక్కర కాైట్టె (తమిళనాడు)
4. ఖోైగ్జెన్ గంభా చింగ్ (మణిపూర్)
అటవీ విస్తీర్ణం
- భారతదేశ అటవీ విస్తీర్ణం 7,01,673 చ.కి.మీ. (21.34%) ఉండగా తెలంగాణ అటవీ విస్తీర్ణం 26,969 చ.కి.మీ. ఉంది.
- జాతీయ అటవీ విధానం- 1952 ప్రకారం అడవుల శాతం కింది విధంగా ఉండాలి
దేశవ్యాప్తంగా 33 శాతం
పర్వతాలు, పీఠభూములు 60 శాతం
మైదానాలు 20 శాతం
జాతీయ అటవీ విధానం-1988 ప్రకారం..
దేశవ్యాప్తంగా 33 శాతం
పర్వతాలు, పీఠభూములు 66 శాతం
మైదానాలు 20 శాతం
- పై నాలుగింటిని 2016లో ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా గుజరాత్‌లోని కచ్ ఎడారి ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 9 ఉన్నాయి.
మొసళ్ల సంరక్షణ కేంద్రాలు
- ఆదిలాబాద్ జిల్లాలోని లంజమడుగు, సంగారెడ్డి జిల్లాలోని మంజీర (మూగర్ మొసళ్లు), నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద మొసళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బి) జాతీయ పార్కులు
- జాతీయ పార్కుల సరిహద్దులను పార్లమెంటు నిర్ణయిస్తుంది. దీంతో జంతువుల ఆవాసాలు కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు. పర్యాటకానికి అనుమతి ఉంటుంది. కానీ వేట, కలప సేకరణ నిషేధం. దేశంలో మొట్టమొదటి జాతీయ పార్కును ఉత్తరాఖండ్‌లో 1935లో హేలి పార్కును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని జిమ్ కార్బెట్ జాతీయ పార్కుగా పిలుస్తున్నారు. దేశంలో చివరగా పశ్చిమ బంగాలో 2016లో జల్ధపార పార్కును గుర్తించారు. తెలంగాణలో జాతీయ పార్కులు మూడు ఉన్నాయి.
- కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కును హైదరాబాద్‌లో 1998లో స్థాపించారు. దీని విస్తీర్ణం 1.42 చ.కి.మీ. ఉండగా 600 రకాల మొక్కలు పెరుగుతున్నాయి. 140 రకాల పక్షి జాతులున్నాయి.
- మృగవని జాతీయ పార్కును రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో 1994లో స్థాపించారు. దీని విస్తీర్ణం 3.60 చ.కి.మీ. ఉండగా 600 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. కుందేలు, అడవి పిల్లి, రక్త పింజర, అడవిపంది, పైథాన్ వంటి జంతువులున్నాయి.
- రంగారెడ్డి జిల్లాలో 1975లో మహావీర్ హరిణ వనస్థలి పార్కును 14.59 చ.కి.మీ. లలో ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ముఖ్యంగా జింకను సంరక్షిస్తున్నారు. ఇది తెలంగాణలో అతిపెద్ద జాతీయ పార్కు కావడం విశేషం.
తెలంగాణలోని టైగర్ రిజర్వ్‌లు
ప్రాజెక్ట్ టైగర్
- 1973 ఏప్రిల్ 1న ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్‌లు 49 ఉన్నాయి. దేశంలో కర్ణాటక రాష్ట్రంలోని బందీపూర్లో మొట్టమొదటి టైగర్ రిజర్వ్‌ను 1973, ఏప్రిల్ 1న ఏర్పాటు చేయించారు. చివరగా 2016, మార్చి నెలలో అసోంలో ఓరంగ్ అనే టైగర్ రిజర్వ్‌ను స్థాపించారు.
- పులుల మనుగడ, వ్యాప్తిని నిర్ధారించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం రెండు పులుల రక్షణ కేంద్రాలను కలిగి ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమలకొండ ప్రాంతాల్లో ఉండడంతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో మొత్తం 2,611 చ.కి.మీ. లు విస్తరించి ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ మొత్తం 2,015 చ.కి.మీ. విస్తీర్ణంలో మహారాష్ట్రలోని ఆడిబా అంధేరి టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాలను కలిగి ఉంది. కవ్వాల్ మిగతా రెండు రిజర్వ్‌ల మధ్య పులులు వలస వెళ్లడాన్ని మనం గమనించవచ్చు. 2018లో నిర్వహించిన ఆలిండియా పులుల అంచనా ప్రకారం అమ్రాబాద్‌లో 16, కవ్వాల్‌లో 10 పులులు ఉన్నట్లు తేలింది.
- భారత ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ చొరవ కింద మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యావరణ-పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేశారు. నల్లమల కొండలు, తూర్పు కనుమలను చుట్టుముట్టే ఈ సర్క్యూట్ నదులు, జలపాతాలు, దేవాలయాలు, సహజ గుహలను పర్యవేక్షిస్తుంది. శ్రీశైలం దేవాలయం మొత్తం ప్యాకేజీని ప్రోత్సహిస్తుంది. స్థానిక సంఘాల ప్రమేయంతో మన్ననూర్, ఫర్హాబాద్, మల్లెలతీర్థం, దోమలపెంటలలో పర్యావరణ పర్యాటక ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌లో జమ చేస్తారు. వన్యప్రాణులు, ముఖ్యంగా పులుల అభివృద్ధి, సంరక్షణ కోసం వినియోగిస్తారు.
జాతీయ పులుల సంరక్షణ సంస్థ 2014
- పులుల జనాభాను తొలిసారిగా 2006లో లెక్కించారు. అప్పటి నుంచి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తున్నారు. భారతదేశంలో మొత్తం 2,226 పులులు ఉండగా అత్యధికంగా కర్ణాటకలో 406 పులులు ఉన్నాయి. తెలంగాణలో 26, ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలో 16, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 10 పులులు ఉన్నాయి.
ఎక్స్-సిటు పరిరక్షణ
- అంతరించిపోతున్న జాతుల సంతానోత్పత్తి, సహజ ఆవాసాల్లో వాటి పునరావాసాన్ని సులభతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్-సిటు కన్జర్వేషన్ పద్ధతులను అవలంబించింది. ఈ ప్రయోజనం కోసం రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌లో రెండు జంతు ప్రదర్శనశాలలను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
- కృష్ణజింక (యాంటిలోప్ సెర్వికా), సంభార్ జింక (రూసా యూనికలర్), చౌసింగ్ జింక (టెట్రాసెరస్ క్వాడీ కార్సిస్), మచ్చల జింకలు (ఏక్సిస్ ఏక్సిస్) వంటి జింకలను సంరక్షించేందుకు ప్రభుత్వం నాలుగు ప్రదేశాలలో జింకల పార్కులను కూడా ఏర్పాటు చేసింది. అదనంగా రాష్ట్రంలో రెండు ప్రైవేటు జింకల పార్కులు ఉన్నాయి.
ఆవాసేతర రక్షణ
- ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవులను వాటి సహజసిద్ధ పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించబడటాన్ని ఆవాసేతర రక్షణ అంటారు. బొటానికల్ గార్డెన్లు, జూలాజికల్ పార్కులు ఏర్పాటు చేయడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణలో నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాద్‌లో (1963), వన విజ్ఞాన కేంద్రం వరంగల్‌లో (1985) నెలకొని ఉన్నాయి.
బయోసాట్
- వన్యప్రాణుల అభయారణ్యాలలో పరిరక్షణ చర్యలను అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ తెలంగాణను రూ.25.36 కోట్లతో ఏర్పాటు చేసింది. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ ప్రాజెక్టుకు సంబంధించిన బయోసాట్ ఖాతాలో జమ అయ్యాయి. అసలు మొత్తానికి వచ్చే వడ్డీని అభయారణ్యాలు, పులుల రిజర్వ్ రక్షణ, నిర్వహణ కోసం వినియోగిస్తారు.
బయోడైవర్సిటీ నిర్వహణ కమిటీలు
- టీఎస్‌బీబీ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, 2002లోని సెక్షన్ 41 ప్రకారం రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను (బీఎంసీలు) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 540 మండలాల పరిధిలో 13,426 బీఎంసీలు ఉన్నాయి.
బీఎంసీల ప్రధాన విధులు..
1. జీవ వైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించడం
2. జీవ వైవిధ్యం డాక్యుమెంటేషన్
3. ఆవాసాల పరిరక్షణ
4. భూ జాతులు, జానపద రకాలు, సాగులు, పెంపుడు జంతువులు, జంతువుల జాతులు, సూక్ష్మజీవుల పరిరక్షణ
5. ప్రజల జీవ వైవిధ్యం తయారీని సులభతరం చేయడం నమోదు చేయడం
ప్రాక్టీస్ బిట్స్
12. మహావీర్ హరిణి వనస్థలి పార్కులో సంరక్షిస్తున్న ముఖ్య జంతువు ఏది?
1. పులి 2. చిరుత
3. అడవిదున్న 4. జింక
13. రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు ఎక్కడ కలదు?
1. మంచిర్యాల 2. సిద్దిపేట
3. హనుమకొండ 4. హైదరాబాద్
14. దేశంలో మొదటగా సామాజిక అడవుల చట్టం తెచ్చిన సంవత్సరం?
1. 1952 2. 1962 3. 1978 4. 1987
15. జాతీయ పులుల సంరక్షణ సంస్థ-2014 ప్రకారం తెలంగాణలో గల పులుల సంఖ్య?
1. 14 2. 18 3. 22 4. 26
16. జాతీయ పులుల సంరక్షణ సంస్థ-2014 ప్రకారం దేశంలో ఎక్కువ పులులు ఉన్న రాష్ట్రం?
1. మహారాష్ట్ర 2. మధ్యప్రదేశ్
3. కర్ణాటక 4. తెలంగాణ
17. అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ప్రకటించింది?
1. 2010 2. 2011
3. 2012 4. 2015
18. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గల ప్రదేశం?
1. భోపాల్ 2. ఫరీదాబాద్
3. డెహ్రాడూన్ 4. ఏదీ కాదు
-జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు