యూరప్ చిన్నదే.. అభివృద్ధిలో మాత్రం పెద్దది
ప్రస్తుతం రెండు దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న ఖండం. అభివృద్ధిలో ముందంజలో ఉంటూ మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలకు కారణమైన ఖండం . మొట్టమొదటి పారిశ్రామిక విప్లవం జరిగిన ప్రాంతం . అభివృద్ధిలో ప్రథమస్థానం ఈ ఖండానిదే.. ఎన్నో విశిష్టతలతో ముందుకు దూసుకుపోతున్న యూరప్ గురించి వివరంగా తెలుసుకుందాం..
- 1770లో మొట్టమొదట పారిశ్రామిక విప్లవానికి నాంది పలికి అభివృద్ధి చెందిన ఖండం
- ఖండాల్లో 2వ చిన్న ఖండం
- యూరప్‌ను ఎడారులు లేని ఖండంగా పిలుస్తారు.
- యూరప్‌లో పొడవైన నది ఓల్గానది
- ప్రపంచంలోనే అతి పెద్ద భూ అంతర్భాగ జలనది – యూరప్‌లోని ఓల్గానది (రష్యా)
- ఆల్ప్స్ పర్వతాల్లో ప్రవహించే రెండు నదులు – రైన్, సెయిన్
- స్కాండినేవియా దేశాలుగా పిలిచేవి-బ్రిటన్, నార్వే, స్వీడన్
- యూరప్ ఖండంలో ఉన్న అతిపెద్ద సరస్సు- కాస్పియన్ సముద్రం
- నల్ల సముద్రానికి చుట్టూ ఉన్న దేశాలు – టర్కీ, బల్గేరియా, రుమేనియా, మాల్టోవా, ఉక్రెయిన్, రష్యా
- బాల్టిక్ సముద్రానికి చుట్టూ ఉన్న దేశాలు – నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, జర్మనీ, రష్యా
- ఐబీరియన్ దేశాలు – పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ
- బాల్కన్ ద్వీప కల్పం – గ్రీస్
- యూరోప్ జబ్బు మనిషి -టర్కీ
- హంగరీ మైదాన ప్రాంతం ఉన్న రెండు పర్వాతాలు – ఆల్ప్స్, కార్పతియన్
నైసర్గిక స్వరూపం
పర్వతాలు
- యూరప్‌లో అతిపెద్ద పర్వతాలు – ఆల్ప్స్ పర్వతాలు
- వీటితోపాటు ఫైరనీస్, కాకసస్, యూరల్ పర్వతాలు ఉన్నాయి. ఆల్ప్స్
- ఆల్ప్స్ పర్వతాలు సంవత్సరం పొడవునా మంచుతో కప్పి ఉంటాయి.
- ఆల్ప్స్ పర్వతాల గుండా సెయిన్, రైన్ నదులు ప్రవహిస్తాయి.
- ఆల్ప్స్ పర్వతాల్లో జన్మించిన నది – రైన్
- హంగెరీ మైదాన ప్రాంతంలోని పర్వతాలు – ఆల్ప్స్ పర్వతాలతోపాటు కార్పతియన్
- ఆల్ప్స్ పర్వతాలు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మధ్య విస్తరించి ఉన్నాయి.
- ఫైరనీస్ పర్వతాలు ఫ్రాన్స్, స్పెయిన్‌ల మధ్య విస్తరించి ఉన్నాయి.
- కాకస్ పర్వతాలు నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య విస్తరించి ఉన్నాయి.
- యూరల్ పర్వతాలు యూరప్ తూర్పు సరిహద్దుగా కలవు. ఇవి ఆసియా యూరోప్‌ను వేరుచేస్తాయి.
పీఠభూములు
- యూరప్, అసియా ఖండాల మధ్య పీఠభూములలో వ్యత్యాసం ఉంది.
- అసియాలో పీఠభూములు విస్తారంగా విస్తరించి ఉన్నాయి.
- ఖండంలో పీఠభూములు చాలా తక్కువ భూభాగంలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో మాత్రమే
- విస్తరించి ఉన్నాయి. కానీ యూరప్ పీఠభూమి ప్రాంతంలో భారతదేశం అంత వెచ్చదనం ఉండదు.
మైదానాలు
- యూరప్ ఖండంలో పోలండ్, ఉక్రెయిన్, రష్యా, బెలోరష్యా దేశాల్లో విశాలమైన మైదానాలు విస్తరించి ఉన్నాయి.
- యూరప్ ఖండంలోని సమతలమైన నైసర్గిక స్వరూపాన్ని మైదానం అంటారు.
- యూరప్ ఖండంలో మైదానాలతోపాటు పర్వతాలు, పీఠభూములు మంచుతో కప్పి ఉంటాయి.
- యూరప్‌లోని మైదానాల్లో ఉన్న మంచు వేసవిలో కరిగి జల ప్రవాహాలుగా కాలువలుగా ప్రవహిస్తూ నదులు ఏర్పడతాయి.
- మైదానాల్లో మంచు కరిగి ఏర్పడిన నదులు నైఫర్, ఓల్గా
- ఓల్గా నది రైన్నది వలే కాకుండా యూరప్‌లోని అన్ని పట్టణాలతో ఖండాంతర్గత వ్యాపారానికి తోడ్పడినది.
గల్ఫ్, అఖాతం
- ఉత్తర యూరప్ ప్రాంతంలో భూభాగంలోకి బాల్టిక్ సముద్రం చొచ్చుకు వచ్చింది. దీనిని గల్ఫ్ అంటారు.
- సముద్రపు అలల తాకిడి వల్ల అర్ద చంద్రకారంలో తీర ప్రాంతం కోతకు గురైతే దాన్ని అఖాతం అంటారు.
- గల్ఫ్స్, అఖాతాలు తుఫానుల తాకిడి నుంచి తీర ప్రాంతాలను సంరక్షిస్తాయి. దీనికి కారణం గల్ఫ్స్/
- అఖాతాల వల్ల సముద్రం లోతు పెరగడం.
- గల్ఫ్ ముఖద్వారం ఇరుకుగా, సన్నగా ఉంటుంది.
- అఖాతం ముఖ ద్వారం చాలా వెడల్పుగా ఉంటుంది.
- గల్ఫ్స్ నౌకల రాకపోకలకు, నిలుపుదలకు తోడ్పడుతాయి.
- యూరప్ ఖండంలో జల రవాణా అభివృద్ధి చెందడానికి తోడ్పడ్డాయి.
- యూరప్‌లో ప్రాచీనకాలం నుంచి అభివృద్ధి చెందింది నావికాబలం
ద్వీపకల్పం – ద్వీపం
ద్వీపకల్పం
- ఏదైనా ఒక ప్రదేశానికి మూడు వైపులా జలం, ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు.
ఉదా: నార్వే, స్వీడన్: సౌదీ అరేబియా ద్వీపకల్ప దేశాలు - ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్: ఐబేరియన్ ద్వీపకల్ప దేశాలు
గ్రీస్: బాల్కన్ ద్వీపకల్పం
ద్వీపం - ఏదైనా ఒక ప్రదేశానికి నాలుగు వైపులా జలం ఉంటే దాన్ని ద్వీపం అంటారు.
ఉదా: ఐర్లాండ్, ఐస్లాండ్, సిసిలీ: స్కాండినేవియా ద్వీపాలు - స్కాండినేవియా ద్వీపదేశాలు: ఐర్లాండ్, ఐస్లాండ్, ఇంగ్లండ్
నోట్: ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం -గ్రీన్లాండ్
శీతోష్ణస్థితి
- యూరప్, ఆసియా ఖండాల మధ్య శీతోష్ణస్థితిలో వ్యత్యాసం ఉంటుంది.
- ఆసియాలోని భారత్‌లో ఉన్నంత వెచ్చదనం యూరప్‌లో ఉండదు.
- యూరప్‌లో అన్ని రుతువుల్లోనూ చల్లగా ఉంటుంది.
1. భూమధ్య రేఖ నుంచి దూరం
2. అట్లాంటిక్ మహా సముద్ర ప్రభావం
3. కవోష్ణ పవనాలు/ప్రవాహాలు
4. పశ్చిమ పవనాలు
5. మధ్యధరా సముద్ర శీతోష్ణస్థితి
1. భూమధ్య రేఖ నుంచి దూరం
భూమధ్య రేఖ వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి.
భూమధ్య రేఖ నుంచి ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
భూమధ్య రేఖకు ఉత్తరాన యూరప్ ఖండం ఉంది.
భూమధ్య రేఖ నుంచి ఉత్తరాన యూరప్ 8800 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2. అట్లాంటిక్ సముద్ర ప్రభావం
యూరప్ ఖండంపై అట్లాంటిక్ సముద్రం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
అట్లాంటిక్ సముద్రానికి దగ్గరగా ఉన్న యూరప్ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
నోట్: అట్లాంటిక్ సముద్ర తీర దేశాలు- ఐస్లాండ్, బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, నార్వే, హాలెండ్.
అట్లాంటిక్ సముద్ర ప్రభావం యూరప్‌లోని లోపలి ప్రాంతాల కంటే పశ్చిమ యూరప్ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది.
శీతాకాలం
ఈ కాలంలో తూర్పు యూరప్ ప్రాంతాలు అతి శీతలంగా, అదే సమయంలో పశ్చిమ యూరప్ ప్రాంతాలు శీతలంగా ఉంటాయి.
వేసవి కాలం
ఈ కాలంలో తూర్పు యూరప్ ప్రాంతాలయిన పోలెండ్, రష్యా ప్రాంతాల్లో చల్లగానూ అదే సమయంలో పశ్చిమ యూరప్ తీరప్రాంతాలైన బ్రిటన్, ఫ్రాన్స్‌లో వెచ్చగా ఉంటుంది
3. కవోష్ణ పవనాలు/ప్రవాహాలు
భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ వెచ్చని పవనాలు వీస్తాయి. వీటినే వెచ్చని సముద్ర ప్రవాహాలు అంటారు. వీటినే కవోష్ణ పవనాలు అని కూడా పిలుస్తారు.
నోట్: భారతదేశ ప్రజలు చిరుజల్లుల కోసం ఎదురు చూస్తుంటారు. పశ్చిమ యూరప్ ప్రజలు ఎండ (వేడి) కోసం ఎదురు చూస్తారు.
భూమధ్య రేఖ నుంచి వెచ్చని పవనాలు మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణిస్తూ యూరప్ నైరుతి నుంచి అట్లాంటిక్ సముద్రం మీదుగా పయనించి ఉత్తర అమెరికా తూర్పుతీరాన్ని చేరుకొని అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. తద్వారా చిరు జల్లులు ఏర్పడతాయి.
ఉత్తర అమెరికాలో ఈ వెచ్చని పవనాలను అమెరికన్ ‘గల్ఫ్స్ట్రీమ్స్’ అంటారు. ఈ వెచ్చని పవనాలు అమెరికా నుంచి వెనుతిరిగి అట్లాంటిక్ సముద్రం మీదుగా పయనిస్తూ యూరప్ పశ్చిమ తీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ పవనాలను పశ్చిమ యూరప్‌లో ‘ఉత్తర అట్లాంటిక్ డ్రిప్’ అని పిలుస్తారు.
ఈవెచ్చని పవనాలు పశ్చిమ దిక్కు మీదుగా యూరప్‌లో ప్రవేశించి శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి. వీటినే పశ్చిమ పవనాలు లేదా ప్రతివ్యాపార పవనాలు అని పిలుస్తారు.
డాగర్ బాంక్స్
పశ్చిమ యూరప్ తీర ప్రాంతంలోని చేపల నివాసప్రాంతాన్ని డాగర్ బాంక్స్ అంటారు.
ఉదా: బ్రిటన్, లండన్
బ్రిటన్ ప్రజల ప్రధాన ఆహార పదార్థం- చేప
ప్రపంచంలో అతిపెద్ద డాగర్ బాంక్ లండన్‌లో ఉంది.
మధ్యధరా శీతోష్ణస్థితి
యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దుగా మధ్యధరా (శీతోష్ణస్థితి) సముద్రం ఉంది.
మధ్యధరా సముద్రంలో ఉన్న శీతోష్ణస్థితిని మధ్యధరా శీతోష్ణస్థితి అంటారు.
మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతంలో రెండు రుతువులు ఉన్నాయి.
1. శీతాకాలం: చిరుజల్లులు ఏర్పడతాయి.
2. వేసవికాలం: తేమతో కూడిన పొడి వాతావరణం ఉటుంది.
ఈ శీతోష్ణస్థితి ప్రాంతంలోని పంటలు ఆలివ్, బత్తాయి, ద్రాక్ష, అంజీర పండ్లు
మధ్యధరా సముద్రంలో ఉన్న దేశాలు
1. గ్రీస్ 2. సిసిలీ 3. సార్డీనియా 4. ఏథెన్స్ 5. స్పార్టా
నోట్: భూమిపై శేష భాగంగా మిగిలింది- మధ్యధరా సముద్రం
వ్యవసాయం
యూరప్ ఖండంలో ఉత్తర, మధ్య ప్రాంతాలు వ్యవసాయానికి అనువైనవి కావు.
యూరప్‌లో వ్యవసాయంపై ఆధారపడిన శాతం
నార్వే-3% బ్రిటన్-30%
జర్మనీ- 40%
నోట్: భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడినవారు- 55 శాతం
ఉత్తర యూరప్‌లో సంవత్సరానికి ఒక పంట పండుతుంది.
దక్షిణ యూరప్‌లో సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి.
ఉత్తర యూరప్‌లో ప్రధానపంట- గోధుమ
దక్షిణ యూరప్ పండ్ల తోటలకు ప్రసిద్ధి
యూరప్ ఖండం ప్రధాన పంట- గోధుమ
జర్మనీ, పోలండ్, ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాల్లో గోధుమ పుష్కలంగా పండిస్తారు.
పోలండ్, రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో బీట్ దుంపల నుంచి పంచదార తయారు చేస్తారు.
యూరప్‌లోని ఫ్రాన్స్ ద్రాక్ష పంటకు ప్రసిద్ధి.
ప్రపంచంలో అత్యధికంగా ద్రాక్ష సారాయి తయారు చేసే దేశం- ఫ్రాన్స్
అదేవిధంగా యూరప్ ఖండంలో ఓట్స్, బార్లీ, ద్రాక్ష, బీట్ దుంపలు పండుతాయి.
హాలండ్
హాలండ్‌లో భూమి కొరత ఎక్కువగా ఉంటుంది.
పూర్వం నిండి ఉన్న సముద్ర జలాలను వెనుకకు మరల్చి చుట్టూ చుట్టూ గోడలు నిర్మించేవారు వీటిని డైక్స్ అంటారు.
హాలండ్ ప్రజలు చేసే వ్యవసాయ పద్ధతిని పోల్డర్ వ్యవసాయం అంటారు.
సముద్ర మార్గాల అన్వేషణ
యూరోపియన్లకు ప్రపంచ దేశాలతో వర్తక వ్యాపారాలకు రెండు మార్గాలు ఉన్నాయి.
1. భూమార్గం 2. జలమార్గం
తూర్పు, మధ్య ప్రాంతాలైన ఆప్ఘనిస్థాన్, ఇరాన్ ప్రాంతాలతో భూమార్గం ఉంది.
అరేబియా, ఎర్రసముద్రం ద్వారా జలమార్గం ఉంది.
మధ్యధరా సముద్రంపై అరబ్బులు, ఇటలీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
1492 వ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ పశ్చిమ ఇండీస్ దీవులను కనుగొన్నాడు.
1498 లో వాస్కోడిగామా కేరళలోని కాలికట్ ప్రాంతం నుంచి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.
నోట్: జర్మనీ, బ్రిటన్ దేశాల్లో అత్యధికంగా పెద్ద బొగ్గు క్షేత్రాలు ఉన్నాయి.
సరిహద్దులు
ఉత్తరం – ఆర్కిటిక్ సముద్రం
దక్షిణం – కాస్పియన్, మధ్యధరా సముద్రం
పశ్చిమం – అట్లాంటిక్ మహా సముద్రం
తూర్పు – యూరల్ పర్వతాలు
నదులు
సెయిన్ – ఇంగ్లిష్ చానల్
రైన్ – ఉత్తర సముద్రం
ఓల్టర్ – బాల్టిక్ సముద్రం
మిస్ట్యులం – బాల్టిక్ సముద్రం
వీనా – బాల్టిక్ సముద్రం
పో నది – ఎడ్రియాటిక్ సముద్రం
డాన్యూబ్ – నల్ల సముద్రం
నైఫర్ – నల్ల సముద్రం
డాన్ – అజోవ్ లేదా అజియన్
ఓల్గా – కాస్పియన్ సముద్రం
డాన్యూబ్ నది ప్రవహించే ఏడు దేశాలు
ఆస్ట్రియా
జర్మనీ
హంగరీ
రుమేనియా
బల్గేరియా
సెర్బియా
స్లోవేకియా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు