భూగోళం.. జలజాలం

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా వద్ద మధ్యధరా సముద్రంలో నైలు నది కలుస్తుంది.
-అమెరికాలోని ఇటాస్కా సరస్సు వద్ద జన్మించిన మిసిసిపి నది మిస్సోరి నదిని సెయింట్ టూయిస్ వద్ద కలుస్తుంది. ఈ రెండు కలిసి న్యూ అర్లియన్స్ వద్ద గల్ఫ్ సింధుశాఖలోకి ప్రవహిస్తాయి.
-ఉత్తర అమెరికాలోని గ్రేట్ స్లేవ్ సరస్సు వద్ద పుట్టిన మెకంజీ నది కెనడా గుండా ప్రవహించి ఆర్కిటిక్ మహాసముద్రంలో మెకంజీ అగాథం వద్ద కలుస్తుంది.
-టిబెట్‌లో జన్మించిన మెకాంగ్ నది చైనా, థాయ్‌లాండ్, లావోస్‌ల గుండా ప్రవహించి దక్షిణ చైనా సముద్రంలో కలుస్తుంది.
-ఆస్ట్రేలియన్ ఆల్ఫ్స్ పర్వతాల్లో పుట్టిన డార్లింగ్ నది ఎన్కౌంటర్ బే వద్ద హిందూ మహాసముద్రంలో కలుస్తుంది.
-హిమాలయాల్లో జన్మించిన సింధు అరేబియా సముద్రంలో, గంగ, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
-సముద్రాల్లో కలిసే నదులు శిలలగుండా ప్రవహించినప్పుడు అవి శైథిల్య క్రియ వల్ల అనేక లవణాలను గ్రహించి సముద్రంలోకి చేరడంతో లవణాలు ఏర్పడతాయి.
-1000 గ్రాముల నీటిలో 35 గ్రాములు ఉప్పు ఉన్నట్లయితే దానిని సామాన్య లవణీయత అంటారు.
-సముద్రంలో కలిసిన మంచినీరు-దాని పరిమాణం, ఆవిరైన నీరు-దాని పరిమాణాలపై సముద్రపు నీటి లవణీయత ఆధారపడి ఉంటుంది.
-సముద్రం పై భాగంలోని నీరు లోతుగా ఉన్న నీటికన్నా ఎక్కువ లవణీయత (ఉప్పదనం)ను కలిగి ఉంటుంది.
-సముద్రం అడుగులో జీవించే చేపలను డెమర్సల్ చేపలు అంటారు.
-ఉత్తర సముద్రం అత్యధికంగా, న్యూఫౌండ్లాండ్, పశ్చిమ యూరప్, జపాన్, ఉత్తర అమెరికా పసిఫిక్ తీరాలు అధికంగా చేపల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి.
-దక్షిణార్ధగోళంలో 50 డిగ్రీల అక్షాంశానికి దిగువన ఎక్కువగా తిమింగళాలు ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో నార్వే తీరంలో తిమింగళాలు ఉంటాయి.
-తిమింగళాల నూనెను ప్రధానంగా సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
-గ్రీన్లాండ్, న్యూఫౌండ్లాండ్ లాబ్రడార్ తీరాల్లో సీల్లు ఎక్కువగా ఉంటాయి.
-విస్తీర్ణంలో అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రం. రెండోది అట్లాంటిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం దాని సరిహద్దు సముద్రాలతో కలిపి మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో మూడో వంతు ఉంటుంది. దీని విస్తీర్ణం 182 మిలియన్ చ.కి.మీ. ఈ సముద్రం సగటు లోతు 4000 కి.మీ.
-పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పైన్స్ దగ్గర ఆమ్ దీవికి సమీపంలో మేరియానా ట్రెంచ్ అనే అగాథం ఉంది. ఈ అగాథం ప్రపంచంలోనే అత్యధిక లోతైనది. దీని లోతు 5940 ఫాథమ్లు.
-లిబియాలోని అల్ అజీజియా ప్రపంచంలోనే అత్యంత ఉష్ణ ప్రాంతం.
-సహారా ఎడారి నుంచి మధ్యదరా సముద్రంపైకి సిరాకో అనే ఉష్ణ పవనాలు వీస్తాయి. ఈ సిరాకోలను లిబియాలో గిబ్లి అని అంటారు.
-వెస్టిండీస్ దీవులు కరేబియన్ సముద్రంలో ఏర్పడ్డాయి. క్యూబా, జమైకా, హైతి, బహమాస్ ఈ దీవుల్లోని ముఖ్యమైన దేశాలు.
-టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం ఆఫ్రికా ఖండంలోనే అతి ఎత్తయినది. ఈ దేశ కొత్త రాజధాని డొడొమా.
-కాఫీ జన్మస్థానం ఇథియోపియా. అయితే బ్రెజిల్‌ను కాఫీ పాట్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఇథియోపియా దేశం నుంచి 1990లో ఎరిత్రియా విడిపోయింది.
-విక్టోరియా జలపాతం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ జలపాతం జాంబేజీ నదిపై ఉంది. ఈ నది జాంబియా, జింబాబ్వే దేశాల మధ్య సరిహద్దుగా ఉంది.
-జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల మధ్య లింపోపో నది ఉంది. ఈ నది మకరరేఖను రెండుసార్లు దాటుతుంది.
-నైజీరియాను పామాయిల్ దేశం అని పిలుస్తారు.
-ప్రపంచంలోనే రెండు రేఖలు పోయే దేశం బ్రెజిల్. ఈ దేశం గుండా భూమధ్య, మకర రేఖలు వెళ్తున్నాయి. ఈ దేశంలోని కాఫీ తోటలను ఫాజెండాస్ అని పిలుస్తారు. ఈ దేశంలోని శాంత్రోస్ ప్రాంతం కాఫీ పంటకు ప్రసిద్ధిచెందింది.
-దక్షిణ చైనా, దక్షిణ జపాన్, ఆగ్నేయ ఆస్ట్రేలియా, నటాల్ తీరప్రాంతాలు (దక్షిణాఫ్రికా), దక్షిణ బ్రెజిల్, ఆగ్నేయ అమెరికా ప్రాంతాల్లో సమశీతోష్ణ సతత హరిత అరణ్యాలు పెరుగుతాయి.
-కోనిఫెర్రస్ అడవుల్లో పెరిగే వృక్షాల్లో పైన్, స్ప్రూస్, హెమ్లాక్, మధ్యదరా ప్రాంతంలో సైప్రస్, సిడార్ ప్రధానమైనవి. సిడార్ వృక్షాల కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి దీన్ని పేపర్, అగ్గిపెట్టెల తయారీలో, సింథటిక్, ఫైబర్ ఇండస్ట్రీ ప్యాకింగ్ బాక్సుల తయారీలో ఉపయోగిస్తారు.
-భారత్, బంగ్లాదేశ్ దేశాలు ప్రపంచ జనుము ఉత్పత్తిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.
-కంగారు జంతువుల వల్ల ఆస్ట్రేలియాకు సజీవ శిలాజ భూమి అని పేరు వచ్చింది.
-ఉత్తర అమెరికా ఖండం కింద మెక్సికో సింధుశాఖ ఏర్పడింది.
-ఆస్ట్రేలియా ఖండంలోని నైరుతి ప్రాంతం యూకలిప్టస్ చెట్లకు చాలా ప్రసిద్ధి.
-సైబీరియాలోని బైకాల్ సరస్సు ప్రపంచంలోకెల్లా లోతైన మంచినీటి సరస్సు.
-సిగ్నల్-హిల్ (కాలిఫోర్నియా) పెట్రోలియం క్షేత్రం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది.
-ఇటలీలో ఉత్పత్తవుతున్న కరారా పాలరాయిని విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు.
-టైగా మండలం 550-700 ఉత్తర అక్షాంశాల మధ్య వ్యాపించి ఉంది. ఈ మండలంలో సతతహరిత, శృంగాకారపు అడవులు పెరుగుతాయి.
-కెనడాలోని క్విబెక్ ప్రాంతంలోని ఆర్విడా వద్ద ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమ ఉంది. కెనడా ప్రపంచంలో అత్యధిక న్యూస్ప్రింటును ఉత్పత్తి చేస్తుంది.
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం