భారతదేశంలో అంధీస్ పవనాలు వీచే రాష్ట్రం ?
భారతదేశ శీతోష్ణస్థితి (జాగ్రఫీ)
1. జతపరచండి
1. ఈశాన్య రుతుపవన కాలం ఎ. మార్చి నుంచి జూన్ మధ్య వరకు
2. వేసవి కాలం బి. జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
3. నైరుతి రుతుపవన కాలం సి. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు
4. శీతాకాలం డి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి 4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2. కింది వాటిలో సరైనది గుర్తించండి
ఎ. భారతదేశంలో వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత వల్ల కురిసే వర్షాలు సంవహన వర్షపాతం
బి. వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో వీచే పొడి, వేడి గాలులను ‘లూ’ అంటారు
సి. ఈ కాలంలోని వేడి గాలులను పంజాబ్‌లో నార్వెస్టర్స్ అంటారు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
3. భారతదేశంలో రుతుపవనాలు రావడానికి అతి ముఖ్యమైన కారణం?
1) ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య ఉష్ణోగ్రతా వైవిధ్యం
2) భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నందు వల్ల
3) భారతదేశం, హిందూ మహాసముద్రం మధ్య ఉష్ణోగ్రతా వైవిధ్యం
4) వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతల మధ్య బేధం
4. ఈ మధ్య భారతదేశంలో అత్యధిక వార్షిక వర్షపాతం ఎక్కడ నమోదు అయ్యింది?
1) నామ్చీ, సిక్కిం
2) మాసిన్రాం, మేఘాలయ
3) చంబా, హిమాచల్ ప్రదేశ్
4) చిరపుంజి, పశ్చిమబెంగాల్
5. జతపరచండి
1. 100-200 సెం.మీ. వర్షపాతం ఎ. అజ్మీర్
2. 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం బి. భోపాల్
3. 50-100 సెం.మీ. వర్షపాతం సి. మంగుళూరు
4. 50 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం డి. బురద్వాస్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
6. భారతదేశంలో రుతుపవన వాతావరణానికి కారణాలు ఏమిటి?
ఎ) ప్రదేశం
బి) ఉష్ణోగ్రతా బేధాలు
సి) ఊర్ధ వాయు ప్రసరణం
డి) అంతర-ఉష్ణ ప్రాంతాల సమ్మేళనం
1) ఎ 2) బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
7. నైరుతి రుతుపవనాలు మొట్టమొదట ప్రవేశించే ప్రాంతం
1) మలబార్ తీరం 2) కొంకన్ తీరం
3) కోరమండల్ తీరం 4) సర్కార్ తీరం
8. జతపరచండి
1. అత్యధిక వర్షపాత ప్రాంతం ఎ. పశ్చిమ రాజస్థాన్‌లో
2. అధిక వర్షపాత ప్రాంతం బి. దక్కన్ పీఠభూమి లోపలి భాగం
3. అల్ప వర్షపాత ప్రాంతం సి. అండమాన్ నికోబార్ దీవులు
4. అత్యల్ప వర్షపాత ప్రాంతం డి. పశ్చిమ కనుమలు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
9. నైరుతి రుతుపవనాల సమయంలో వర్షం పొందని ప్రాంతం ఏది?
1) జైపూర్ 2) తంజావూర్
3) జబల్పూర్ 4) కొచ్చిన్
10. కిందివాటిలో సరికానిది గుర్తించండి
1) భారతదేశంలో అత్యల్పంగా వర్షపాతం పొందే ప్రాంతం ‘లేహ్’ ప్రాంతం
2) భారతదేశంలో అత్యధికంగా వేడిగా ఉండే ప్రాంతం అజీజియా
3) భారతదేశంలో శీతాకాలంలో అత్యధికంగా శీతలంగా ఉండే ప్రాంతం ద్రాస్ సెక్టార్
4) భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం పొందే ప్రాంతం మాసిన్రాం
11. కింది వాటిలో సరైనదానిని గుర్తించండి
ఎ. ఈశాన్య రుతుపవన కాలంలో తమిళనాడు వర్షపాతం పొందటానికి కారణం అయ్యే పర్వతాలు ఫళని కొండలు
బి. నైరుతి రుతుపవనాలు శాఖలైన బంగాళఖాత శాఖ అరేబియా శాఖ రెండూ పంజాబ్‌లోని లుథియానా వద్ద కలుసుకుంటాయి
సి. నైరుతి రుతుపవనాలు జూన్ 5 వరకు కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశిస్తాయి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
12. జతపరచండి
1. హేమంత రుతువు ఎ. మే-జూన్
2. గ్రీష్మ రుతువు బి. సెప్టెంబర్-అక్టోబర్
3. శిశిర రుతువు సి. నవంబర్-డిసెంబర్
4. శరత్ రుతువు డి. జనవరి-ఫిబ్రవరి
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
13. భారతదేశంలో ఎక్కువగా తుఫానులకు గురయ్యే రేవు పట్టణం
1) కాకినాడ 2) విశాఖపట్టణం
3) పారదీప్ 4) కాండ్లా
14. శీతాకాలంలో భారతదేశంలో వచ్చే వర్షాలకు కారణం
1) చక్రవాతాలు 2) పశ్చిమ విక్షోచాలు
3) సంవహనమాలు
4) కుంభవృష్టి వర్షాలు
15. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎల్ నినో అనేది ఒక శీతల ప్రవాహం
2) ఎల్‌నినో వల్ల భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి
3) ఎల్‌నినో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది
4) భారతదేశ సగటు వర్షపాతం 117 సెం.మీ
16. కింది వాటిలో సరికానిది ఏది?
1) లానినో అనేది ఒక శీతల ప్రవాహం
2) ఇది హిందూ మహాసముద్రంలో దక్షిణార్ధ గోళంలో ఏర్పడుతుంది
3) లానినో వల్ల భారతదేశంలో వరదలు సంభవిస్తాయి
4) శీతాకాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి
17. మేఘాలయాలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రాం ఏ కొండల్లో ఉంది?
1) నాగా కొండలు 2) మిష్మి కొండలు
3) ఖాసీ కొండలు 4) సాత్పూరా కొండలు
18. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి
ఎ. భారతదేశంలో జూలై 15 నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా
బి. ఈశాన్య రుతుపవన కాలంలో ఎక్కువగా తుఫాన్లకు గురయే
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవేవీకాదు
19. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి
ఎ. ఈశాన్య రుతుపవన కాలంలో అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వల్ల తూర్పు తీరం వర్షాన్ని పొందుతుంది
బి. ఎల్‌నినో అనేది పెరూ తీరప్రాంతంలో ఏర్పడే ఉష్ణ సముద్ర ప్రవాహం
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవేవీ కాదు
20. జతపరచండి
1. చెరీ బ్లోసమ్స్ ఎ. అసోం
2. కాలభైసాఖీలు బి. కర్నాటక
3. అంధీలు సి. పశ్చిమబెంగాల్
4. టీషవర్స్ డి. ఉత్తరప్రదేశ్
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
21. దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది?
1) 3 2) 4 3) 5 4) 6
22. కింది వివరణలను చదవండి
ఎ. శీతాకాలంలో పశ్చిమ ఆటంకాల వల్ల ఉత్తర భారతదేశానికి వర్షపాతం చేకూరుతుంది
బి. ఈశాన్య రుతుపవనాలు తమిళనాడుకు వర్షపాతాన్నిస్తాయి
సి. భారతదేశానికి ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం లభిస్తుంది
వీటిలో సరైన వివరణలు ఏవి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
23. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి
ఎ. థార్న్ థైట్ భారతదేశాన్ని 5 శీతోష్ణస్థితి మండలాలుగా వర్గీకరించారు
బి. థార్న్ థైట్ జల సంతులన ఆధారంగా శీతోష్ణస్థితిని వర్గీకరించారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకాదు
24. ప్రతిపాదన (ఎ) : భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక వర్షపాతం ఈశాన్య ప్రాంతంలోని ఖాసీం నమోదు అయ్యింది.
కారణం (ఆర్) : ఈశాన్య ప్రాంతం అత్యధికం హిమాలయ మండలం
సరైనదానిని గుర్తించండి
1) (ఎ), (ఆర్)సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవే
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్)నిజం
25. ప్రతిపాదన (ఎ) : శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో చిరు జల్లుల వల్ల గోధుమ పంట దెబ్బతింటుంది.
కారణం (ఆర్) : శీతాకాలంలో మధ్యధర సముద్రంలో ఏర్పడే పశ్చిమ పవనాల వల్ల ఉత్తర భారతదేశంలో వర్షాలు కురుస్తాయి.
సరైనదాన్ని గుర్తించండి?
1) (ఎ), ఆర్ సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవే (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్) నిజం
26. కింది వాటిలో సరికాని జత ?
1) అతి ఆర్థ మండలం – గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరం
2) తేమ ఉప ఆర్ద మండలం- పశ్చిమ కనుమలు
3) శుష్క ఉప ఆర మండలం- పశ్చిమ మ.ప్ర & పశ్చిమ ఉత్తరప్రదేశ్
4) ఉప శుష్క ఆర మండలం- ద్వీపకల్ప అంతర్భాగంలో ఎక్కువ భాగం
27. భారత ప్రభుత్వ వాతావరణ శాఖప్రకారం నవంబరులోని రుతు పవనాలను ఏ విధంగా పిలుస్తారు?
1) మారుతున్న నైరుతి రుతు పవనాలు
2) స్థిరమైన నైరుతి రుతుపవనాలు
3) పురోగాత్మక నైరుతి రుతు పవనాలు
4) తిరోగమన నైరుతి రుతు పవనాలు
28. వేసవికాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు?
1) తగ్గుతాయి 2) పెరుగుతాయి
3) మార్పు ఉండదు 4) పెరిగి, తగ్గుతాయి
29. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఉష్ణప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీలు ఉ.అ. – 20 డిగ్రీలు ద. అక్షాంశాల మధ్య రుతుపవనాలు ఏర్పడతాయి
2) జెట్ ప్రవాహాలు నేల నుంచి 12,000 మీ. ఎత్తులో వేగంగా వీచే గాలులు
3) జెట్ ప్రవాహాలు గంటకి వేసవిలో 110. కి.మీ. శీతాకాలంలో 184 కి.మీ. వేగంతో వీస్తాయి
4) నైరుతి రుతుపవనాల వల్ల మన దేశంలో 60 శాతం వర్షపాతం కురుస్తుంది
30. నైరుతి రుతుపవనాలు వల్ల భారతదేశంలో వర్షపాతం పొందని ప్రాంతాలు?
ఎ. తమిళనాడు
బి. దక్షిణ కోస్తా ప్రాంతం
సి. వాయవ్య రాజస్థాన్
డి. జమ్ముకశ్మీర్‌లోని లఢఖ్ ప్రాంతం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
31. ప్రతిపాదన (ఎ) : వేసవి కాలంలో గంగా- సింధూ మైదాన ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది
కారణం (ఆర్): వేసవి కాలంలో భారతదేశంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతాయి
1) (ఎ), ఆర్ సరైనవే. (ఆర్) (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవే. (ఆర్) (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
32. ఉత్తరప్రదేశ్‌లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు?
1) నార్వెస్టర్లు 2) మ్యాంగో షవర్స్
3) అంధీస్ 4) టోర్నడో
33. భారతదేశంలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఏర్పడే రుతుపవనాలు
1) ఈశాన్య రుతుపవనాలు
2) వాయువ్య రుతుపవనాలు
3) నైరుతి రుతుపవనాలు
4) ఆగ్నేయ రుతుపవనాలు
34. భారతదేశంలో నైరుతి రుతుపవన కాలం ఎప్పుడు వస్తుంది?
1) మార్చి-జూన్ మధ్య
2) జూన్ మధ్య నుంచి సెప్టెంబరు వరకు
3) అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు
4) మే నుంచి అక్టోబరు వరకు
35. భారతదేశ శీతోష్ణస్థితి మౌలికంగా ఎలా చెప్పవచ్చు?
1) ఆయన రేఖా శీతోష్ణస్థితి
2) ఉప ఆయన ఉష్ణమండల శీతోష్ణస్థితి
3) ఉష్ణమండలి రుతుపవన శీతోష్ణస్థితి
4) సమశీతల శీతోష్ణస్థితి
జవాబులు
1.3 2.1 3.3 4.2 5.1 6.4 7.1 8.2 9.2 10.2 11.3 12.2 13.3 14.2 15.1 16.2 17.3 18.3 19.2 20.4 21.2 22.1 23.3 24.3
25.4 26.3 27.4 28.1 29.4 30.4 31.1 32.3 33.3 34.2 35.3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు