అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానం
ద్రవ్యం రకాలు / వర్గీకరణ
ద్రవ్యం
– అర్థశాస్త్రం ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వస్తువులను కొన్నప్పుడు చెల్లించడానికి, ఇతర రకాల వ్యాపారాలు, బాకీలు తీర్చడానికి అందరూ అంగీకరించేదే ద్రవ్యం’’ – రాబర్ట్ సన్
– సర్వాంగీకారం కలిగినదే ద్రవ్యం – సెలిగ్మెన్
ద్రవ్యం – రకాలు / వర్గీకరణ (Types of Money)
– ద్రవ్యాన్ని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు
– ద్రవ్యాన్ని ముద్రించడంలో వినియోగించే పదార్థాన్ని బట్టి ద్రవ్యాన్ని లోహద్రవ్యం, కాగితపు ద్రవ్యం అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
లోహ ద్రవ్యం (Metal Currency)
-లోహంతో తయారు చేసే ద్రవ్యాన్ని లోహ ద్రవ్యం అంటారు. దీన్ని వస్తు ద్రవ్యం అని కూడా అంటారు.
-సాధారణంగా నాణేల తయారీకి బంగారం, వెండి, రాగి, నికెల్, స్టీల్ మొదలైన లోహాలను ఉపయోగిస్తారు.
ఈ లోహ ద్రవ్యం మూడు రకాలు
ప్రామాణిక ద్రవ్యం (Standard Money)
– ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానంగా ఉంటే ఆ ద్రవ్యాన్ని ప్రామాణిక ద్రవ్యం/ పూర్తి ప్రామాణిక ద్రవ్యం / పూర్తి ఆకారం ఉన్న ద్రవ్యం అంటారు.
– 1835-93 మధ్య మన దేశంలో ఈ ప్రామాణిక ద్రవ్యం వెండి నాణేల రూపంలో చలామణిలో ఉండేవి.
చిల్లర ద్రవ్యం (Token Money)
-ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత విలువ కన్న బహిర్గత విలువ ఎక్కువగా ఉంటే దాన్ని చిల్లర ద్రవ్యం, తక్కువ ప్రామాణిక ద్రవ్యం/ప్రతీక ద్రవ్యం/ టోకెన్ మని అంటారు.
-ఈ నాణేల తయారీకి అల్యూమినియం నికెల్ వంటి లోహాలు వాడతారు.
ఉదా: 1, 2, 5, 10 రూపాయల నాణేలు
ప్రాతినిధ్యపు ద్రవ్యం (Representative Money)
– ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత విలువ కన్నా బహిర్గత విలువ తక్కువగా ఉంటే దాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అని అనుబంధ ద్రవ్యం (Afiliate Money) అని కూడా అంటారు.
కాగితపు ద్రవ్యం (Paper Money) :
-కాగితంపై ముద్రించిన ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అంటారు.
– అన్ని రకాల కరెన్సీ నోట్లు కాగితపు ద్రవ్యం కిందకు వస్తాయి.
– ఉదా: రూ. 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లను కాగితపు ద్రవ్యం అంటారు.
– ఈ కాగితపు ద్రవ్యాన్ని మొదట చైనీయులు క్రీ.శ. 7వ శతాబ్దంలో ఉపయోగించారు. భారతదేశంలో 19వ శతాబ్దంలో 1806లో ఉపయోగించారు.
-ఈ కాగితపు ద్రవ్యాన్ని మళ్లీ 3 రకాలుగా వర్గీకరించారు.
ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం (Representative Paper Money)
-నూటికి నూరుశాతం లోహాన్ని నిల్వగా ఉంచి, ద్రవ్యాన్ని జారీ చేస్తే దానిని ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం అంటారు.
-ఈ రకమైన ద్రవ్యం బంగారం, వెండి రిజర్వుల్లో ఉంటుంది.
ఉదా: మనదేశంలో జారీ చేసిన బంగారం, బులియన్ సర్టిఫికేట్లు.
పరివర్తనీయ కాగితపు ద్రవ్యం
-జారీ చేసిన కాగితపు ద్రవ్యాన్ని, బంగారం లేదా వెండిలోకి మార్చుకోవడానికి వీలుంటే ఆ ద్రవ్యాన్ని పరివర్తనీయ ‘కాగితపు ద్రవ్యం’ అంటారు.
– భారతదేశంలో 19వ శతాబ్దంలో స్వర్ణ ప్రమాణంలో ఈ సౌకర్యం ఉండేది.
అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం (In Convertible Paper Money)
– జారీ చేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం, వెండి లోహంలోకి మార్చుకునే వీలు లేకపోతే ఆ ద్రవ్యాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.
-ఆమోద యోగ్యతను బట్టి / చట్టబద్ధతను బట్టి ద్రవ్యాన్ని 2 రకాలుగా విభజించారు.
ఎ) చట్టబద్ధ ద్రవ్యం (Legal Tender Money)
-ద్రవ్య అధికారులు (ఆర్బీఐ, భారత ప్రభుత్వం) జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అంటారు.
– చట్టబద్ధ ద్రవ్యం తిరిగి 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
1. పరిమిత చట్టబద్ధ ద్రవ్యం (Limted legel Tender Money)
– ఒక పరిమితి వరకు మాత్రమే వినిమయ మాద్యంగా అంగీకరించే ద్రవ్యాన్ని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు.
-ఇలాంటి పరిమితిని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
ఉదా: 5, 10, 20, 25 పైసల నాణేలను 25 రూ.ల వరకు మాత్రమే అంగీకరించిన వీటిని అనుషంగిక నాణేలు అంటారు.
2. అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం : (Un Limted legel Tender Money)
l ఎలాంటి పరిమితి లేకుండా ఎంత మొత్తాన్నైనా వినిమయ మాద్యంగా అంగీకరించే ద్రవ్యాన్ని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. ఈ ద్రవ్యాన్ని ప్రతి ఒక్కరు ఎంత మొత్తాన్నైనా అంగీకరించాలి.
ఉదా: భారతదేశంలో అన్ని రకాల కరెన్సీ నోట్లు, 50 పైసలకు మించి ఉన్న నాణేలు.
బి) చట్టబద్ధత కాని ద్రవ్యం (Non Legal Currency): ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఇష్టాన్ని బట్టి ఆమెదించే ద్రవ్యాన్ని ‘చట్టబద్ధత కాని ద్రవ్యం’ అంటారు.
– దీనినే ఐచ్ఛిక ద్రవ్యం (Optional Money) అని కూడా అంటారు. ఉదా: చెక్కులు, బాండ్లు
-ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యాన్ని 2 రకాలుగా విభజించవచ్చు.
1) సామాన్య ద్రవ్యం (Ordinary Money): ప్రజల వద్ద గల నాణేలు కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లను ‘సామాన్య ద్రవ్యం’ అంటారు.
– దీనినే సంకుచిత ద్రవ్యం (Narrow Money) అనికూడా అంటారు. దీనికి 100 శాతం ద్రవ్యత్వం ఉంటుంది.
2) సమీప ద్రవ్యం (Near Money) ఎటువంటి కాలయాపన లేకుండా వెంటనే వినిమయ మాద్యంలోకి మార్చగలిగే విత్త సంబంధమైన ఆస్తులను సమీప ద్రవ్యం అంటారు. దీనినే ‘కృత్రిమ ద్రవ్యం’ అని కూడా అంటారు.
-సామాన్య ద్రవ్యంతో పోల్చినపుడు తక్కువ ద్రవ్యత్వం కలిగి ఉంటుంది. అవసరమైనపుడు తక్కువ ఖర్చుతో ద్రవ్యంగా మార్చుకో వచ్చును.
ఉదా: బాండ్లు, షేర్లు, డిబెంచర్లు, ట్రెజరీ బిల్లులు, ప్రామిసరీ నోట్లు మొదలైనవి.
ప్రాక్టీస్ బిట్లు
1. లోహం అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానంగా ఉంటే ఆ ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) పూర్తి ప్రామాణిక ద్రవ్యం
బి) పూర్తి ఆకారం ఉన్న ద్రవ్యం
సి) ప్రామాణిక ద్రవ్యం డి) పైవన్నీ
2. లోహం అంతర్గత విలువ కంటే బహిర్గత విలువ ఎక్కువగా ఉంటే ఆ ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) తక్కువ ప్రామాణిక ద్రవ్యం
బి) టోకెన్ మనీ సి) చిల్లర ద్రవ్యం
డి) పైవన్నీ
3. లోహం అంతర్గత విలువ కంటే బహిర్గత విలువ తక్కువగా ఉంటే ఆ ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) ప్రాతినిధ్యపు ద్రవ్యం
బి) అనుబంధ ద్రవ్యం
సి) ఎ, బి డి) పైవేవీకావు
4. భారతదేశంలో కాగితం ద్రవ్యాన్ని ఏ శతాబ్దం లో ఉపయోగించారు?
ఎ) 18వ శతాబ్దం బి) 19వ శతాబ్దం
సి) 20 వ శతాబ్దం డి) 16వ శతాబ్దం
5. ప్రపంచంలో మొట్టమొదట కాగితపు ద్రవ్యాన్ని ఉపయోగించిన దేశస్థులు?
ఎ) భారతీయులు బి) ఈజిప్షియన్లు
సి) చైనీయులు డి) జర్మన్లు
6. లోహ ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
7. లోహాన్ని నిల్వ ఉంచి జారీ చేసే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ)ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం
బి) పరివర్తనీయ కాగితపు ద్రవ్యం
సి) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం
డి) పైవన్నీ
8. జారీచేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం వెండి రూపంలోకి మార్చడానికి వీలుండే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ)ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం
బి) పరివర్తనీయ కాగితపు ద్రవ్యం
సి) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం
డి) పైవన్నీ
9. జారీ చేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం, వెండి రూపంలోకి మార్చడానికి వీలు లేని ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) పరివర్తనీయ కాగితపు ద్రవ్యం
బి) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం
సి)ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం డి) పైవన్నీ
10. ద్రవ్య అధికారులు (ఆర్బీఐ) జారీ చేసే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) చట్టబద్ధ ద్రవ్యం
బి) పరిమిత చట్టబద్ధ ద్రవ్యం
సి) చట్టబద్ధత కానిద్రవ్యం
డి) అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం
11. చట్టబద్ధత కాని ద్రవ్యానికి మరొక పేరు ఏమిటి?
ఎ) ఐచ్ఛిక ద్రవ్యం
బి) ప్రాతినిధ్య ద్రవ్యం
సి) అనుబంధ ద్రవ్యం డి) పైవన్నీ
12. ప్రజల వద్ద నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్దగల డిమాండ్ డిపాజిట్లను ఏ ద్రవ్యంగా పేర్కొంటారు.
ఎ) సమీప ద్రవ్యం బి) ద్రవ్యత్వం
సి) సామాన్య ద్రవ్యం డి) పైవన్నీ
13. ఎటువంటి కాలయాపన లేకుండా వినిమయ మాద్యంగా మార్చగలిగే విత్త సంబంధమైన ఆస్తులను ఏ ద్రవ్యంగా పేర్కొంటారు.
ఎ) సామాన్య ద్రవ్యం బి) సమీప ద్రవ్యం
సి) ప్రాతినిధ్య ద్రవ్యం
డి) సంకుచిత ద్రవ్యం
14. సామాన్య ద్రవ్యానికి మరొక పేరు
ఎ) సమీప ద్రవ్యం
బి) ప్రాతినిధ్య ద్రవ్యం
సి) సంకుచిత ద్రవ్యం
డి) అనుబంధ ద్రవ్యం
15. సమీప ద్రవ్యానికి ఉదాహరణ
ఎ) బాండ్లు, షేర్లు బి) ప్రాతినిధ్య ద్రవ్యం
సి) సంకుచిత ద్రవ్యం
డి) అనుబంధ ద్రవ్యం
16. చిల్లర ద్రవ్యానికి మరొక పేరు?
ఎ) ప్రామాణిక ద్రవ్యం బి) ప్రతీక ద్రవ్యం
సి) సంకుచిత ద్రవ్యం డి) చట్టబద్ధ ద్రవ్యం
17. చట్టబద్ధత కాని ద్రవ్యానికి ఉదాహరణ
ఎ) చెక్కులు బి) బాండ్లు
సి) ఎ, బి డి) ట్రెజరీ బిల్లులు
18. ఆమోద యోగ్యతను బట్టి ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
19. సమీప ద్రవ్యానికి మరొక పేరు?
ఎ) కృత్రిమ ద్రవ్యం బి) సంకుచిత ద్రవ్యం
సి) ప్రాతినిధ్య ద్రవ్యం డి) ఐచ్ఛిక ద్రవ్యం
20. ప్రాతినిధ్యపు ద్రవ్యానికి మరొక పేరు ఏమిటి?
ఎ) సంకుచిత ద్రవ్యం
బి) అనుబంధ ద్రవ్యం
సి) కృత్రిమ ద్రవ్యం డి) పైవన్నీ
21. భారతదేశంలో ప్రామాణిక ద్రవ్యం ఏ సంవత్సరాల మధ్య చలామణిలో ఉండేది?
ఎ) 1825-95 బి) 1833-93
సి) 1835-93 డి) 1833-95
22. అవసరమైనప్పుడు తక్కువ ఖర్చుతో మార్చుకునే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) సామాన్య ద్రవ్యం బి) సమీప ద్రవ్యం
సి) ప్రాతినిధ్య ద్రవ్యం డి) కృత్రిమ ద్రవ్యం
23. సంపూర్ణ ద్రవ్యత్వం గల ద్రవ్యం ఏది?
ఎ) సంకుచిత ద్రవ్యం
బి) అనుబంధ ద్రవ్యం
సి) సామాన్య ద్రవ్యం డి) సమీప ద్రవ్యం
24. పరివర్తనీయ కాగితపు ద్రవ్యం భారతదేశంలో ఏ శతాబ్దంలో చలామణిలో ఉండేది?
ఎ) 16వ శతాబ్దం బి) 17వ శతాబ్దం
సి) 18వ శతాబ్దం డి) 19వ శతాబ్దం
25. ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జవాబులు
1-డి 2-డి 3-సి 4-బి 5-సి 6-బి 7-ఎ 8-బి 9-బి 10-ఎ 11-ఎ 12-సి 13-బి 14-సి 15-డి 16-బి 17-సి 18-ఎ 19-ఎ 20-బి
21-సి 22-బి 23-సి 24-డి 25-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవీ పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
- Tags
- economics
- money
- value of Money
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు