వాతవరణంలో ఓజోన్ పొర పాత్ర ఏమిటి ?
వాతావరణంలో ఏయే అనుఘటకాలు ఉంటాయి ?
– నైట్రోజన్-78 శాతం, ఆక్సిజన్-20.94 శాతం, ఆర్గాన్-0.9 శాతం, కార్బన్ డై ఆక్సైడ్-0.033 శాతం, నీటి ఆవిరి-0.2 శాతం, ఇతర అంశాలు-0.1 శాతం
-వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను ఏమంటారు?
– కాలుష్య కారకాలు
-ప్రధానంగా కాలుష్య కారకాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
– రెండు అవి.. 1. ప్రాథమిక కాలుష్య కారకాలు,
2. ద్వితీయ కాలుష్య కారకాలు
-ఇంధనాలు మండించడం ద్వారా, పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు
-ప్రాథమిక కాలుష్య కారకాలు
-ద్వితీయ కాలుష్య కారకాలు ఎలా ఏర్పడతాయి?
– ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోకి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడంతో ఏర్పడే పదార్థాలే ద్వితీయ కాలుష్య కారకాలు
-ప్రాథమిక కాలుష్య కారకాలకు ఉదాహరణ?
SPM-Suspended Particle Matter (SPM, క్లోరిన్, ఫ్లోరైడ్, సీసం, నైట్రోజన్ ఆక్సైడ్లు, CO2 మొదలైనవి.
-ద్వితీయ కాలుష్య కారకాలకు ఉదాహరణ ?
– PAN-Peroxy Acetyl Nitrate, ఫార్మాల్డిహైడ్, ఓజోన్.
-సీఎఫ్‌సీ -క్లోరోఫ్లోరో కార్బన్స్: రిఫ్రిజిరేటర్ల్లు, ఏసీలు, విమానాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి.
– ఓజోన్ పొరలో అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు భూమిపై పడుతున్నాయి. వీటితో మానవులకు చర్మక్యాన్సర్లు వస్తున్నాయి. జీవరాశికి నష్టం కలుగుతుంది.
-SPM (Suspended Particle Matter)/ గాలిలో తేలియాడే రేణువులు ఎక్కడ నుంచి వెలువడుతాయి ?
– విద్యుత్ కేంద్రాలు, బాయిలర్లు, సిమెంట్ కర్మాగారాలు, వాహనాలు, ఇసుక, కంకర తయారీ క్వారీల నుంచి వెలువడుతాయి.
-వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాలు ఏమిటి ?
– సీసం, హైడ్రోకార్బన్లు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఎస్పీఎం.
-ఫ్లోరైడ్ కాలుష్య కారకం ఏ పరిశ్రమ నుంచి వెలువడుతుంది ?
– ఎరువులు, అల్యూమినియం తయారీ పరిశ్రమలు.
-పెట్రోలియం పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య కారకాలు ?
– హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రో కార్బన్లు, సల్ఫర్ డయాక్సైడ్.
-తాజ్‌మహల్ పాలరాయిపై పసుపు చారలు/గార ఏర్పడటానికి కారణం ఏమిటి ?
– ఆగ్రా, దాని చుట్టు పక్కల ఉన్న రబ్బరు తయారీ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, ఇనుము సంబంధిత పరిశ్రమలు, మధుర నూనెశుద్ధి కర్మాగారం నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్ (No2), So2, పొగ, దుమ్ము, మసి లాంటి కాలుష్య కారకాలు గాలిలోని తేమతో చర్య జరిపి ఆమ్ల వర్షాలను కురిపిస్తున్నాయి. ఆమ్ల వర్షాల వల్ల తాజ్‌మహల్ పాలరాయిపై పసుపు చారలు ఏర్పడుతాయి.
-భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ క్రిమీసంహారక మందుల తయారీ కర్మాగారం నుంచి వెలువడిన వాయువు ?
– మిథైల్ ఐసో సైనైడ్ (MIC, డిసెంబర్ 3, 1984)
-నీటిలోని జీవులపై తీవ్ర ప్రభావన్ని చూపే/మరణానికి దారితీసే ప్రక్రియ ఏమిటి ?
– యూట్రాఫికేషన్ (పాస్ఫేట్లు, నైట్రేట్లు, పరిశ్రమల వ్యర్థాలు, మురుగు నీటిలో చేరడంతో శైవలాలు, కలుపు మొక్కలు, బ్యాక్టీరియాలు పెరిగి విస్తరిస్తాయి. ఇవి నీటిలోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకోవడంతో నీటి జీవులకు ఆక్సిజన్ అందక చనిపోతాయి. తద్వారా నీటిలోని పోషకాలు పెరిగి, మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని యూట్రాఫికేషన్ అంటారు.
-3R సూత్రం అమలు చేయడం వల్ల వేటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు ?
– నేల, నీరు, గాలి కాలుష్యం (3R అంటే Reduse (తగ్గించడం), Re use (తిరిగి ఉపయోగించడం), Recycle (మరల వాడుకునేందుకు వీలుగా మార్చడం/పునఃచక్రీయ పద్ధతిలో వాడుకోవడం
-బయో మాగ్రిఫికేషన్ చెందే కాలుష్యకారకాలు/కీటకనాశనులు ?
– DDT, BHC మొదలైనవి. (DDT -Dichloro Diphenyl Trichloro Ethane), BHC-Benza Hexa Chloride)
-పైరాలసిన్ అంటే ఏమిటి ?
– ఆక్సిజన్ లేకుండా/ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో పదార్థాలను మండించడాన్ని పైరాలసిన్ అంటారు. ఇది కాల్చడానికి ఉపయోగించే ఇన్స్పిరేషన్కు ప్రత్యామ్నాయ పద్ధతి. ఈ విధానం తో వెలువడే వాయువులు, ద్రవాలనే ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. వంట చెరుకు, కొబ్బరి, ఆయిల్‌పాం చెత్త, జీడిమామిడి, గింజల పెంకులు, జొన్న చొప్ప, వరిగడ్డి, రంపపు పొట్టు, తారు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ ఆమ్లం, ఎసిటోన్ మొదలైన కర్బన పదార్థాలను, చెత్తను కాల్చడానికి వాడుతారు.
-జైవిక సవరణీకరణ (Bio-Remediation) అంటే ఏమిటి ?
– జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు. లోహాల వంటి అకర్బన పదార్థాలను తక్కువ స్థాయి గల రేడియోధార్మిక పదార్థాల ద్వారా కలిగే కాలుష్యాన్ని తొలగించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారు.
-బయోమాగ్నిఫికేషన్ అంటే ఏమిటి ?
– కొన్ని రసాయన పదార్థాలు (DDT, BHC) ఆహార గొలుసు ద్వారా జీవుల్లోకి చేరి పేరుకుపోవడాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు.
-ఓజోన్ పొర వాతావరణంలోని ఏ ఆవరణంలో ఉంటుంది ?
– స్ట్రాటో ఆవరణం/స్పియర్. ఈ ఆవరణంలో ఎక్కువ మొత్తంలో ఓజోన్ పూరిత వాతావరణం ఉంటుంది. ఇది భూమి ఉపరితలం నుంచి 15-30 కి.మీ. దూరంలో వ్యాపించి ఉంటుంది.
-వాతావరణంలో ఓజోన్ పొర పాత్ర ఏమిటి ?
– వాతావరణంలోని స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్‌పొర సూర్యుని నుంచి వచ్చే ప్రభావవంతమైన, శక్తివంతమైన వికిరణంలో (రేడియేషన్) కొంత భాగాన్ని అంటే అతినీల లోహిత కిరణాలను శోషించుకొంటుంది. తద్వారా అది భూమిపై చేరకుండా కాపాడుతుంది. అతినీలలోహిత కిరణాలు జీవరాశులపై అనేక హానికర ప్రభావాలను కలుగజేస్తాయి. ముఖ్యంగా రకరకాల చర్మ క్యాన్సర్లు, పంటలకు, సముద్ర జీవులకు నష్టం వాటిల్లుతుంది.
-గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి ?
– వాతారవణంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి లాంటి గ్రీన్హౌస్ వాయువులు భూమి ఉపరితలంపై ఉన్న వాతావరణాన్ని వేడెక్కించడాన్ని గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటారు.
-గ్రీన్హౌస్ వాయువుల్లో ప్రధానమైనది ?
– Co2 (కార్బన్ డై ఆక్సైడ్)
-గ్లోబల్ వార్మింగ్‌కు కారణం ఏమిటి ?
– శిలాజ ఇంధనాలు దహనం చేయడం, అడవులను నరకడం, పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలోకి అధికమొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువులు వెలువడుతుండటం ఫలితంగా వాతావరణంలో ఎక్కువ వేడి నిల్వచేయబడుతుంది. తద్వారా భూమి వెచ్చబడటం/గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ భూమిపై వాతావరణ , శీతోష్ణస్థితి మార్పును కలుగజేయడం వల్ల సముద్ర నీటిమట్టం పెరగడం, అధిక వర్షపాతం, వరదలు, కరువు కాటకాలు సంభవిస్తాయి. గ్లోబల్ వార్మింగ్‌ను అధిక మొత్తంలో భూమి, సముద్రాల ఉష్ణోగ్రతలు పెరగడంగా పేర్కొనవచ్చు.
-BOD, CODలను విస్తరించండి ?
– BOD-Biochemical Oxygen Demand, COD-Chemical Oxygen Demand
-కాంటూర్ పద్ధతి వ్యవసాయం అంటే ఏమిటి ?
– ఏటవాలుగా ఉండే నేలల్లో వాలుకు అడ్డంగా పొలం దున్ని వ్యవసాయం చేయడాన్ని కాంటూర్ పద్ధతి అంటారు.
-జీవరసాయన ఆక్సిజన్ అవసరం (BOD) అంటే ఏమిటి ?
– ఒక లీటరు నీటిలో కర్బన పదార్థమంతా బ్యాక్టీరియమ్ ద్వారా ఆక్సీకరణం చెందడం కోసం ఉపయోగించుకొనే ఆక్సిజన్ మొత్తాన్ని BOD అంటారు. BOD అనేది నీటిలో ఉన్న కర్బన పదార్థాన్ని తెలుసుకునే పరిమాణం. అపరిశుద్ధమైన/మురుగు నీటికి BOD విలువ అధికం. మంచినీటికి BOD విలువ తక్కువగా ఉంటుంది.
-బయోగ్యాస్/గోబర్ గ్యాస్ అంటే ?
– పశువుల ద్వారా విడుదలయ్యే వ్యర్థం/పేడ, నివాసగృహాల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థం, పారిశ్రామిక, వ్యవసాయ మురుగులో ఉండే అవాయు బ్యాక్టీరియమ్‌ల చర్యల ద్వారా విచ్ఛిన్నమై విడుదలయ్యే వాయువును బయోగ్యాస్/గోబర్‌గ్యాస్ అంటారు.
-బయోగ్యాస్‌లో ఉండే వాయువులు ఏవి ? ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఏమిటి ?
– మీథెన్-CH4-50-60 శాతం, కార్బన్ డై ఆక్సైడ్- CO2-30-40 శాతం, తక్కువ మోతాదులో H2/H2S/N ఉంటాయి, మిథనోజెనిక్ బ్యాక్టీరియా
-గంగా కార్యాచరణ పథకం, యమునా కార్యాచరణ పథకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
– ఈ పథకం ద్వారా మనదేశంలో ముఖ్యమైన నదులను కాలుష్యం నుంచి కాపాడటం. ఈ ప్రణాళికలో చాలా పెద్దవిగా ఉండే మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్లను నిర్మించాలని పేర్కొన్నారు. వీటి ద్వారా శుద్ధిచేసిన నీటిని నదుల్లోకి విడుదల చేయాలి.
-STPsను విస్తరించండి ?
– Sewage Treatment Plants
-జీవ వ్యవసాయం అంటే ?
– (ఆర్గానిక్ ఫార్మింగ్) జీవ ఎరువులను ఉపయోగించి మృత్తికలో నైట్రోజన్ భాగాన్ని అధికం చేయడం.
-1972 స్టాక్ హోం సదస్సు: యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను, వాటి అమలును నిర్వహించడానికి UNEP ఏర్పాటు చేశారు.
-UNEPని విస్తరించండి ?
– యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్.
-1992లో బ్రెజిల్‌లోని రియోడీజనరీలో జరిగిన సదస్సు ఏమిటి ? – ధరిత్రి సదస్సు
-1997 క్యోటో ప్రోటోకాల్ : గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి పారిశ్రామిక దేశాలు తాము విడుదల చేసే గ్రీన్హౌస్ వాయువులను 1990 స్థాయికన్నా 5.2 శాతానికి తగ్గించాలని తీర్మానం చేశారు.
మాంట్రియల్ ప్రోటోకాల్
-మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ?
– ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానమే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది అంటార్కిటికా పైన కనిపించిన ఓజోన్ రంధ్రాన్ని పరిశీలించి, ఓజోన్ పొరను నాశనం చేసే వాయువులపై నియంత్రించే విధంగా చర్యలు చేపట్టడానికి అవకాశం కలిగించింది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంపై 1987లో 24 దేశాలు సంతకాలు చేశాయి.
-మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ?
– 1989
-మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంపై నేటి వరకు భాగస్వామ్య దేశాలు ఎన్ని ?
– 120 దేశాలు (క్లోరోఫ్లోరో కార్బన్స్, వాటి ఉత్పన్నాల వంటివి ఓజోన్ పొరకు నష్టం కలిగించే పదార్థాల ఉత్పత్తి సరఫరాను నియంత్రించడం
-మాంట్రియల్ ప్రోటోకాల్‌ను సరిచేయడానికి 1992 లో సమావేశం ఎక్కడ జరిగింది ?
– కొపెన్ హెగన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు