Women And Law | భవిష్యత్తు తరాలకు జన్మనిచ్చే ‘ఆమె’కు రక్షణగా..
మహిళల రక్షణ హక్కులు
- ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు మహిళలు ఇంటా, బయటా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నారు. మాటలతో వేధించడం, బాధించడం తక్కువ చేసి మాట్లాడటం, ఏమీ చేయలేరని ఎగతాళి చేయడం, శారీరకంగా, మానసికంగా హింసించడం వంటివి వీరు ఎదుర్కొంటున్నారు.
- వీటిని అరికట్టడానికి ఆయా ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయి. అయినప్పటికి వాటిపై చాలామందికి అవగాహన లేదు.
- తమ రక్షణకు సంబంధించి చట్టాలపై బాలికలు, మహిళలు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే తమను తాము అన్ని హింసల నుంచి వేధింపుల నుంచి రక్షించుకోవడానికి వీలవుతుంది.
పిల్లలు, మహిళల సంక్షేమం కోసం చేసిన చట్టాలు
1. బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006
2. అక్రమ రవాణా నిషేధ (1956) చట్టం సవరణ 2006
3. వరకట్న నిషేధ చట్టం – 1961
4. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO Act) 2012
5. బాల నేరస్థుల న్యాయ చట్టం 2015 (జువైనల్ జస్టిస్ యాక్ట్ – JJA- 2015)
6. బాల కార్మికుల (నిషేధం, క్రమబద్ధ్దీకరణ) సవరణ చట్టం 2016 - ఐక్యరాజ్య సమితి 1989 రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై 191 దేశాలు సంతకాలు చేశాయి. వీటిలో మన దేశం కూడా ఒకటి.
బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006 - వివాహ సమయంలో వరుడి కనీస వయస్సు 21, వధువు వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి
- వీరిరువురి వయస్సులో ఏ ఒక్కరి వయస్సైనా పేర్కొన్నదాని కంటే తక్కువగా ఉంటే దాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారు.
- ఒకవేళ 21 ఏళ్లు నిండిన వ్యక్తి బాల్య వివాహం చేసుకుంటే తనకు 2 ఏళ్ల జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు
- బాల్యవివాహం రద్దయిన తర్వాత ఈ బాలికకు తిరిగి వివాహం అయ్యేవరకు
పురుషుడు మనోవర్తి చెల్లించాలి. ఒకవేళ ఈ వ్యక్తి మైనర్ అయితే అతని తల్లిదండ్రులు చెల్లించాలి. - ఈ చట్టం ప్రకారం ఇలాంటి వివాహాన్ని ప్రోత్సహించినవారు కూడా నేరస్థులే అవుతారు.
- ఈ బాల్యవివాహం సమయంలో ఇచ్చిన కానుకలను వివాహం రద్దయిన తర్వాత తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం -2012 (POCSO Act) - ఈ చట్టం పిల్లలను లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల చిత్రాల వంటి వాటి నుంచి రక్షిస్తుంది. ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి వేగవంతంగా శిక్షలు అమలు చేస్తుంది.
- ఈ చట్టం బాలల సంపూర్ణ శారీరక మానసిక ఉద్వేగ సామాజిక వికాసం కోసం అమలు చేయబడుతుంది.
ఈ చట్టం నిరోధించే అంశాలు
1. బాలలను ఎలాంటి అసాంఘిక లైంగిక కృత్యంలో పాల్గొనకుండా చేయటం.
2. బాలలతో వేశ్య వృత్తి (లేదా) ఇతర లైంగిక దోపిడీలు, అశ్లీల చిత్రాల ప్రదర్శనలో ఉపయోగించడాన్ని నిరోధించడం
అక్రమ రవాణా నిరోధక చట్టం (1956), సవరణ 2006 - బాలికలను, యువతులను ఉద్యోగం (లేదా) పని ఇప్పిస్తామని సినిమాలో చేరుస్తామని వేరే పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి వేరేవారికి అమ్మేస్తారు.
- బలవంతంగా వ్యభిచారం చేయించడం, చెప్పినట్టు చేయకుంటే కొట్టి హింసించి బలవంతంగా చేయిస్తారు.
- ఈ విధంగా బాలలను, మహిళలను ఆశచూపించి ఒక స్థలం నుంచి వేశ్యగృహానికి తీసుకెళ్లడం, ఆమె ఇష్టపడి వచ్చినా తీసుకెళ్లడం నేరం అవుతుంది.
- అలాగే వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడాన్ని నిర్బంధించడం, లేక ప్రోత్సహించడం నేరమవుతుంది.
అక్రమ రవాణా రూపాలు
లైంగిక దాడి
1. బలవంతపు వ్యభిచారం
2. సాంఘిక, మతపరమైన వ్యభిచారం
3. పర్యాటకరంగంలో లైంగిక దోపిడీ
4. అసభ్యత, అశ్లీల రచనలు – చిత్రాలు చూపించడం చట్టవ్యతిరేక కార్యకలాపాలు
1. అక్రమరవాణాకు గురైనవారిచే భిక్షాటన చేయించి డబ్బు సంపాదించడం, దానికోసం వారిని హింసించడం, బాధించడం, కొన్ని సమయాల్లో అవయవాలు తొలగించి, వికలాంగులుగా మార్చి భిక్షాటన చేయించడం
2. మానవ అవయవాలను తీసి విక్రయించి వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించడం
3. అక్రమ రవాణా చేయబడిన వారితో మత్తుమందులు అమ్మించి లాభాలు గడించడం
కార్మికులు
1. వెట్టిచాకిరి – కూలీ ఇవ్వకుండా పనిచేయించుకొని ఇబ్బందులకు గురిచేయడం. సరైన పోషకాహారం, బట్టలు ఇవ్వకపోవడం, వారిని కనీసం మనుషులుగా చూడకపోవడం
2. ఇళ్లలో పని – బట్టలు ఉతకడం, ఇళ్లు తుడవడం, పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం. ఇతరుల ఇళ్లల్లో కూడా పనిచేయించడం.
3. వ్యవసాయ కూలీ – వ్యవసాయ పనులకు తీసుకెళ్లి ఎక్కువ పనిచేయించి శారీరకశ్రమకు గురిచేసి వారి శ్రమను దోచుకోవడం
4. నిర్మాణ కూలీ – భవన నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు మొదలైనవాటిలో పనిచేయించుకొని అతితక్కువ, నామమాత్ర డబ్బులు ఇవ్వడం లేదా తక్కువ నాణ్యత గల భోజనం ఇచ్చి పనిచేయించుకోవడం.
హక్కుల్లో కొన్ని ప్రధానమైనవి
- హక్కుల్లో కొన్ని ప్రధానమైనవి
1. లింగభేదం లేకుండా 18 ఏళ్లలోపు వ్యక్తులందరూ బాలలే
2. ప్రభుత్వపరంగా బాలలహక్కులకు భద్రత కలిగించడం
3. జీవించే హక్కు
4. సాధ్యమైనంత వరకు బాలలు తల్లిదండ్రులతో కలిసి ఉండటం
5. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం, సమాచార సాధనాలైన రేడియో, వార్తా పత్రికలు, పుస్తకాలు, టీవీ ద్వారా ప్రపంచంలోని విషయాలపై అవగాహన పెంచుకొనే హక్కు
6. బాధాకరమైన, దౌర్జన్యకరమైన, హానికరమైన సంఘటనలు జరగకుండా రక్షణ పొందే హక్కు.
7. బాలలకు ఏదైనా శారీరక దౌర్భల్యం వుంటే వారు సంపూర్ణమైన జీవితం గడపడానికి, అభివృద్ధిలోకి రావడానికి ప్రత్యేక విద్య ప్రత్యేకమైన సంరక్షణ పొందే హక్కు
8. బాలలు సంపూర్ణ ఆరోగ్యం, వైద్యసౌకర్యం పొందే హక్కు
9. బాలల మాతృభాషను ఉపయోగించే హక్కు, వారి సహజ సంప్రదాయాన్ని, మతాన్ని పాటించే హక్కు
10. కొంత సమయం ఆటలాడుకునే హక్కు
11. బాలల విద్యకు, ఆరోగ్యానికి హాని కలిగించే పనిచేయకుండా ఉండటం
12. హానికరమైన మందులను ఉపయోగించడం, తయారుచేయడం, కొనడం చేయకుండా రక్షణ పొందడం
13. బాలలను బాధించినా, నిర్లక్ష్యం చేసినా లేక సరిగా చూడకున్నా సహాయం పొందే హక్కు
బాల్య వివాహాల దుష్ఫలితాలు - చిన్న వయస్సులో గర్భవతులు కావడం
- ఆడపిల్లల అక్రమ రవాణాలకు, అమ్మకానికి అవకాశం ఏర్పడటం
- ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టడం
- అధికసంఖ్యలో గర్భవిచ్ఛిత్తి, నెలల నిండకముందే ప్రసవం జరగడం, ఫలితంగా మాతృమరణాల,
శిశుమరణాల సంఖ్య పెరగడం - వైకల్యంతో కూడిన శిశు జననాలు లేదా మృత శిశువులు జన్మించడం
- మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తడం
- చదువుకు ఆటంకం
- కుటుంబ పోషణకు బాల కార్మికులుగా మారటం
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు