General Studies | మానవ తప్పిదాలు.. ప్రమాదకర వైపరీత్యాలు
మానవ ఉత్పాదిత వైపరీత్యాలు
Man-Made Disasters | మానవ తప్పిదాల వల్ల కలిగే వైపరీత్యాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఉద్దేశపూర్వకంగా ఒక దేశం కాని ఒక ప్రాంతంపై ఆధిపత్యం కోసం సృష్టించే ప్రమాదాలు మానవ ఉత్పాదిత వైరీత్యాలు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వైపరీత్యాల వల్ల వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో మానవ ఉత్పాదిత వైపరీత్యాలు, వాటి వల్ల సంభవించిన నష్టాల గురించి తెలుసుకుందాం..
అణు ప్రమాదాలు (Nuclear Disasters)
- అణ్వాయుధాలు రెండు రకాలు అవి..
1. అణు బాంబు 2. హైడ్రోజన్ బాంబు. - అణు బాంబు ముఖ్యంగా కేంద్రక విచ్ఛిత్తి లేదా అణు విచ్ఛిత్తి చర్యల ద్వారా పేలుడు శక్తిని విడుదల చేస్తుంది.
- హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనం లేదా అణు సంలీనం ద్వారా పేలుడు శక్తిని విడుదల చేస్తుంది.
హిరోషిమా: 1945 ఆగస్టు 6న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశంలోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు (లిటిల్ బాయ్)ను జారవిడిచింది.
నాగసాకి: 1945 ఆగస్టు 9న జపాన్‌లోని నాగసాకి నగరంపై అమెరికా మరో అణు బాంబు (ఫ్యాట్ మ్యాన్)ను జారవిడిచింది. - మానవులపై అణు ధార్మికత ప్రభావం: లుకేమియా, చర్మ క్యాన్సర్, ప్లాక్టిక్ ఎనిమియా, ఎముక మూలుగ నష్టం, రక్త వ్యవస్థ ఇన్ఫెక్షన్, మహిళల్లో అండాశయం, పురుషుల్లో వృషణాల క్యాన్సర్, కంటి శుక్లాలు, థైరాయిడ్ గ్రంథి సంబంధిత వ్యాధులు, జుట్టురాలడం, వాంతులు, డయేరియా సంభవిస్తాయి.
చెర్నోబిల్ ప్రమాదం - 1986లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యాలోని ఉక్రెయిన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్రమాదం జరిగింది. అణు విద్యుత్ రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించి చెర్నోబిల్ ప్రాంతం సర్వనాశనం అయింది.
ఫుకుషిమా అణు ప్రమాదం - 2011 మార్చి 11న జపాన్‌లో సంభవించిన సునామీ వల్ల ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగు అణు రియాక్టర్లు పేలిపోయాయి. జపాన్‌లో తరచూ అణు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
- పారిశ్రామిక కర్మాగారాల నుంచి విడుదలయ్యే విషపూరిత వాయువుల కారణంగా రసాయనిక దుర్ఘటనలు సంభవించవచ్చు.
- పెద్దపెద్ద కంటైనర్లలో వాయువులను పీడన స్థితిలో రవాణా చేయడం వల్ల లీక్ కావడం వల్ల కాని, దుర్ఘటనలు సంభవించినప్పుడు కాని రసాయన విపత్తులు జరిగి అవి వేగంగా వ్యాపిస్తాయి.
భోపాల్ గ్యాస్ దురంతం - 1984 డిసెంబర్ 3న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ కర్మాగారం నుంచి 45 టన్నుల విషపూరితమైన మీథైల్ ఐసోసైనేట్ గ్యాస్ భోపాల్ నగరమంతా వ్యాపించింది. సుమారు 398 మంది మరణించగా సుమారు 3 లక్షల మంది ప్రజలు గాయపడ్డారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీక్ కావడం వల్ల 12 మంది మరణించారు. అనేక మంది అస్వస్థతకు గురయ్యారు.
జీవ సంబంధ వైపరీత్యాలు (Biological disasters)
- జీవ ఆయుధాలను పేదవాడి న్యూక్లియర్ బాంబుగా పేర్కొంటారు. ఎందుకంటే వీటిని తయారు చేయడం చాలా సులభం, అమర్చడం ఇంకా సులభం. ఇవి ఎలాంటి యాంత్రిక వ్యవస్థ లేకుండానే పనిచేస్తాయి. వీటి వల్ల వేల మంది చనిపోయే అవకాశం ఉంటుంది.
- క్రాప్ డస్టింగ్ ఎరోప్లేన్స్, స్మాల్ పర్ఫ్యూమ్ అటమైజర్స్ వంటివి చాలా సాధారణ జీవాయుధ డెలివరీ వ్యవస్థలు. రసాయనిక, సంప్రదాయక, అణు ఆయుధాల ప్రభావం వెను వెంటనే కనిపిస్తే జీవ ఆయుధాల వల్ల కలిగే ప్రభావం ఆలస్యంగా కొన్ని రోజులు, నెలల తర్వాత తెలిసే అవకాశం ఉంది.
ఆంత్రాక్స్ - ఆంత్రాక్స్ ఒక రకమైన చర్మ రంధ్రాలు, ఊపిరితిత్తులకు వ్యాధులు కలిగించే అరుదైన చర్మ వ్యాధి. దీని వల్ల ఏర్పడిన రంధ్రాలు చాలా సంవత్సరాల వరకు పోవు. ఇది వ్యాధి సంక్రమించిన పశువుల నుంచి మానవులకు సంక్రమిస్తుంది. ప్రస్తుత కాలంలో తీవ్రవాదులు జీవ ఆయుధంగా వాడుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. 2001 అక్టోబర్ 21న వాషింగ్టన్ డీసీలో పోస్ట్ డిపార్ట్మెంట్లో సంభవించిన మరణాలకు ఆంత్రాక్స్ వ్యాధి కారణమని పేర్కొన్నారు.
- UNOకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) జీవ ప్రమాదాల స్థాయిని బట్టి భద్రతల స్థాయిని నాలుగు శ్రేణులుగా విభజించింది.
BSL-1 - జీవుల్లో సహజంగా పెరిగే బాసిల్లస్ సబ్‌టైలిస్, కెనైన్ హెపటైటిస్, ఎస్బెర్షియా కోలి, వెరిసెల్లా (చికెన్ పాక్స్) వంటి బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు మరికొన్ని ఇతరులకు సోకే అవకాశం పెద్దగాలేని బ్యాక్టీరియాలను తొలిశ్రేణిగా గుర్తించారు. వాటి వ్యాప్తి నివారణకు చేతలకు, ముఖానికి తొడుగులు వేసుకోవడం వంటి కనీస భద్రతా చర్యలు తీసుకోవాలి.
BSL-2 - ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు ప్రాణ హాని లేనప్పటికి ఇతర విధాలుగా ప్రమాదకర పరిస్థితిని కలిగించే ఆస్కారం ఉన్న హెపటైటిస్-ఎ, బి, ఇన్‌ఫ్లూయెంజా-ఎ, లైమ్ ఎడిస్, సాల్మోనెల్లా, మంప్స్ (గవద బిల్లలు), అమ్మవారు (మీజిల్స్), గజ్జి, డెంగీ, హెచ్ఐవీ వంటివి గాలి ద్వారా సోకే అవకాశం తక్కువే అయినా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ శ్రేణిలో రోగులను ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షించడం, వారికోసం వినియోగించిన వస్తు సామగ్రిని ఇతరులకు వినియోగించకుండూడా ఉండటం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
BSL-3 - మనిషి ఆరోగ్యంపై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపగల బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వ్యాపించే ఆంత్రాక్స్, వెస్టినైల్ వైరస్, సార్స్ వైరస్, కరోనా వైరస్, హంట వైరస్, టైఫస్ రిఫ్ట్, వ్యాలీ ఫీవర్, రాక్ మౌంటెన్ స్పాట్ ఫీవర్, ఎల్లో ఫీవర్, మలేరియా వంటి వ్యాధులను 3వ శ్రేణిగా గుర్తించారు.
- ఈ వ్యాధుల నివారణ కోసం గాలిలో ఉండే వైరస్లు సోకకుండా కృత్రిమ శ్వాస పరికరాలు ఉపయోగించవలసి రావడం వంటి తీవ్రమైన చర్యలు అవసరమవుతాయి. అయితే ఈ జీవ ప్రమాదాల నివారణకు తగిన చికిత్సా విధానాలు, టీకాలు వంటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి.
BSL-4 - ఏ టీకాకు, చికిత్సకు లొంగని మార్బర్గ్ ఫీవర్ వంటి ఎబోలా, లాసా ఫీవర్, క్రిమియన్ కాంగో హెమరోజిక్ ఫీవర్ వంటి తీవ్రమైన వణుకుడు జ్వరాలను వ్యాప్తి చేసే వైరస్ జబ్బులు ఈ శ్రేణి కిందకు వస్తాయి.
- చికెన్ పాక్స్ జబ్బుకు మూలమైన వెరియోలా వైరస్‌కు టీకాను కొనుగొనే సమయానికి వైరస్ రూపాంతరం చెందింది.
జీవాయుధాలు - స్మాల్ పాక్స్ లేదా అమ్మవారు వ్యాధి, ప్లేగు వ్యాధుల సూక్ష్మజీవులు వంటి జీవాయుధాల వల్ల వైద్యశాస్త్రం ద్వారా శతాబ్దాల తరబడి సాధించిన మొత్తం శూన్యం.
- జైవిక విపత్తుల్లో అణు విస్ఫోటనంలాగా వెంటనే తెలిసేటట్లు లక్షణాలేవి ఉండవు.
- ముందు జాగ్రత్త చర్యగా వ్యాధి సంక్రమించగల పదార్థం నుంచి సాధ్యమైనంత తొందరగా దూరంగా వెళ్లిపోవాలి.
మానవ ప్రేరిత వైపరీత్యాలు
టెర్రరిస్ట్ దాడులు - 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాషింగ్టన్‌లోని పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో వేలమంది ప్రజలు చనిపోయారు.
- 1993లో ముంబైలో జరిగిన తీవ్రవాద దాడుల్లో వందల మంది మరణించారు.
- 2003 ఆగస్టు 25న గేట్ వే ఆఫ్ ఇండియా జవేరిబజార్ దగ్గర జరిగిన దాడుల్లో 45 మంది మరణించారు. 150 మందికి పైగా గాయాలపాలయ్యారు.
- 2017 ఆగస్టులో మయన్మార్ దేశపు రభీనే రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలో సుమారు 400 మంది వరకు చనిపోయారు. చనిపోయిన వారంతా రోహింగ్య ముస్లింలు.
- ఢిల్లీ శివార్లలో డేరా ఉన్మాదులు రైలు బోగీలను తగలబెట్టారు.
- 2017 నవంబర్ 1న న్యూయార్క్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది మృతి చెందారు.
తొక్కిసలాట
అకస్మాత్తుగా ప్రజా సమూహాల రద్దీలో తోపులాట జరగడాన్ని తొక్కిసలాటగా పేర్కొంటారు.
కారణాలు
- తొక్కిసలాట సంఘటనలు సాధారణంగా పలు రకాల సామాజిక, సాంస్కృతిక ప్రదర్శనల సందర్భంగా జరుగుతాయి. తొక్కిసలాట సంఘటనలను అవి జరిగిన తీరు, వాటి ప్రభావం ఆధారంగా పలురకాలుగా వర్గీకరించవచ్చు.
వినోద కార్యక్రమాలు
ఎస్కలేటర్లు, చలించే కాలిబాటలు
ఆహార పంపిణీ
ప్రదర్శనలు
ప్రకృతి విపత్తులు
మతపరమైన ఘటనలు - మతపరమైన వేడుకలు/ఇతర సందర్భాల్లో జరిగే అగ్ని ప్రమాదాలు, ఆటలు
- వాతావరణపరమైన సంఘటనలు
- గత పదేళ్లలో భారతదేశంలో జరిగిన భారీ తొక్కిసలాటలు
- 2011 నవంబర్ 8: గంగానదీ తీరాన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద హర్ కి ప్రారిఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 22 మంది చనిపోయారు.
- 2012 నవంబర్ 19: ఛాత్ ఉత్సవం సందర్భంగా పాట్నాలోని ఒక ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట 20 మంది ప్రాణాలను తీసింది.
- 2013 ఫిబ్రవరి 10: కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు.
- 2015 జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల సందర్భరంగా జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించారు.
- 2022 అక్టోబర్ 14: ఇండోనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 133 మంది మరణించారు.
Previous article
Rashmi Vadlakonda | సక్సెస్ లోడింగ్!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు