General Studies | పానగల్లు చెరువును నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరు?
1. రాష్ర్టాల్లో ఎగువసభకు గల పేరు?
ఎ) శాసన సభ బి) శాసనమండలి
సి) విధాన సభ డి) శాసన పరిషత్
2. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య?
ఎ) 115 బి) 117
సి) 119 డి) 121
3. శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశమవుతుంది?
ఎ) ఒకసారి బి) రెండుసార్లు
సి) మూడుసార్లు డి) నాలుగుసార్లు
4. శాసనసభ కాలపరిమితికి సంబంధించి సరైనది గుర్తించండి.
1. రాష్ట్ర శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు
2. శాసనసభ కాలపరిమితి కంటే ముందే గవర్నర్ రద్దు చేయవచ్చు
3. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాలపరిమితి ఒక సంవత్సరం పార్లమెంటు పెంచవచ్చు
ఎ) 1, 2, 3 బి) 1, 3
సి) 1, 2 డి) 2, 3
5. శాసనమండలి సభ్యుడిని ఏ విధంగా వ్యవహరిస్తారు?
ఎ) ఎమ్మెల్యే బి) ఎమ్మెల్సీ
సి) ఎంపీటీసీ డి) ఎంపీ
6. తెలంగాణలో ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో సగటున ఓటర్ల సంఖ్య?
ఎ) 1.3 లక్షలు బి) 1.5 లక్షలు
సి) 1.7 లక్షలు డి) 2 లక్షలు
7. శాసనసభ సభ్యుడు పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు?
ఎ) 21 సంవత్సరాలు
బి) 25 సంవత్సరాలు
సి) 30 సంవత్సరాలు
డి) 35 సంవత్సరాలు
8. సంకీర్ణ ప్రభుత్వం అంటే?
ఎ) శాసనసభలో పూర్తి మెజారిటీ సాధించిన పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
బి) రెండుమూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం
సి) సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వం
డి) దేశంలో తక్కువ మతాలకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వం
9. శాసన సభ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు?
ఎ) స్పీకర్ బి) ముఖ్యమంత్రి
సి) గవర్నర్
డి) శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి
10. తెలంగాణ శాసనసభలో షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించిన సభ్యుల సంఖ్య?
ఎ) 19 బి) 17
సి) 12 డి) 9
11. తెలంగాణలో ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఎవరు ఆమోదించాలి?
ఎ) శాసనసభ
బి) శాసనసభ, శాసనమండలి
సి) శాసనసభ, శాసనమండలి, గవర్నర్
డి) శాసనసభ, శాసనమండలి, గవర్నర్, రాష్ట్రపతి
12. తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లు కలిగిన వర్గాలు?
ఎ) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకబడిన వర్గాలు
బి) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలు
సి) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్లు
డి) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్లు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలు
13. రాష్ట్ర గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
ఎ) ముఖ్యమంత్రి బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్రపతి డి) పార్లమెంటు
14. శాసనమండలిలో ఎన్నుకోబడే సభ్యుల వాటా?
ఎ) 3/6 బి) 4/6
సి) 5/6 డి) 1/6
15. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ కాలంలో శాసనమండలి జరుగలేదు?
ఎ) 1983-2003 బి) 1985-2005
సి) 1985-2007 డి) 1987-2007
16. కింది ఏ పదవికి పోటీ చేయడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి?
ఎ) సర్పంచ్
బి) మున్సిపల్ కౌన్సిలర్
సి) ఎమ్మెల్యే డి) ఎమ్మెల్సీ
17. తెలంగాణ శాసనమండలిలో సభ్యుల సంఖ్య?
ఎ) 40 బి) 50
సి) 60 డి) 70
18. శాసనమండలికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి.
1. శాసనసభ సభ్యులు 1/3వ వంతు మందిని ఎన్నుకొంటారు
2. స్థానిక సంస్థల ప్రతినిధులు 1/4వ వంతు మందిని ఎన్నుకొంటారు
3. పట్టభద్రులు 1/12వ వంతు మందిని ఎన్నుకొంటారు
4. గవర్నర్ 1/6వ వంతు మందిని ఎన్నుకొంటారు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 2, 3, 4
19. తెలంగాణ శాసనమండలికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
1. శాసనసభ్యుల ద్వారా ఎన్నికయ్యేవారు ఎ. 14 మంది
2. ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికయ్యేవారు బి. ఆరుగురు
3. గవర్నర్ నామినేట్ చేసేవారు సి. ముగ్గురు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి
బి) 1-బి, 2-సి, 3-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి
డి) 1-ఎ, 2-సి, 3-బి
20. నగర పంచాయతీలో ఉండే జనాభా పరిమాణం?
ఎ) 10,000 – 20,000
బి) 20,000 – 40,000
సి) 20,000 – 30,000
డి) 20,000 – 50,000
21. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస జనాభా?
ఎ) 2 లక్షలకు పైన
బి) 3 లక్షలకు పైన
సి) 4 లక్షలకు పైన
డి) 5 లక్షలకు పైన
22. పురపాలక సంఘాల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు?
ఎ) 19 సంవత్సరాలు
బి) 20 సంవత్సరాలు
సి) 21 సంవత్సరాలు
డి) 25 సంవత్సరాలు
23. పురపాలక సంఘంలోని వార్డులకు ప్రాతినిధ్యం వహించేది?
ఎ) కౌన్సిలర్ బి) వార్డ్‌మెంబర్
సి) కార్పొరేటర్ డి) చైర్మన్
24. మేయర్ ఏ పరిపాలనా విభాగానికి అధిపతి?
ఎ) పురపాల సంఘం
బి) నగరపాలక కార్పొరేషన్
సి) నగర పంచాయతీ
డి) మండల పరిషత్
25. కింది వాటిలో పురపాలక సంఘం విధించిన పన్ను?
ఎ) నీటి పన్ను
బి) సినిమా టికెట్లపై పన్ను
సి) వీధి దీపాలపై పన్ను
డి) భూమి శిస్తు
26. పురపాలక సంఘాల్లో చెత్తను తొలగించడానికి అనుసరిస్తున్న నూతన విధానం?
ఎ) సబ్ కాంట్రాక్టింగ్ విధానం
బి) సబ్ క్లియరింగ్ విధానం
సి) సబ్ గ్రేడింగ్ విధానం
డి) సబ్ కలెక్టింగ్ విధానం
27. వేములవాడలో స్థానిక ప్రభుత్వం?
ఎ) పురపాలక సంఘం
బి) నగర కార్పొరేషన్
సి) నగర పంచాయతీ
డి) మేజర్ పంచాయతీ
28. వేములవాడలో ఆకాశగంగ అనే మంచినీటి సరఫరా వ్యవస్థ ఏ పథకంలో భాగంగా నిర్మించారు?
ఎ) జీవనధార బి) స్వజలధార
సి) గంగాజలధార డి) కాశీజలధార
29. వేములవాడను నగర పంచాయతీగా మార్చిన సంవత్సరం?
ఎ) 1989 బి) 1996
సి) 2005 డి) 2011
30. భారతదేశ వారసత్వ జంతువు?
ఎ) పులి బి) ఏనుగు
సి) సింహం డి) జింక
31. భారతదేశ జాతీయ వృక్షం?
ఎ) మర్రిచెట్టు బి) రావిచెట్టు
సి) అశోక చెట్టు డి) వేపచెట్టు
32. తెలంగాణ రాష్ట్ర పుష్పం?
ఎ) బంతి బి) గులాబీ
సి) కమలం డి) తంగేడు
33. తెలంగాణ రాష్ట్ర చెట్టు?
ఎ) రావి బి) వేప
సి) జమ్మి డి) మర్రి
34. కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పక్షిని గుర్తించండి?
ఎ) ఇండియన్ రోలర్
బి) నెమలి సి) పావురం
డి) రాబిన్
35. కింది వాటిలో తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో లేని చిహ్నం?
ఎ) చార్మినార్
బి) కాకతీయ కళాతోరణం
సి) అశోకుని నాలుగు సింహాలు
డి) పూర్ణ కుంభం
36. కింది వాటిలో జాతీయ జలచరం?
ఎ) పులస చేప బి) టైగర్ రొయ్య
సి) డాల్ఫిన్ డి) నీటి గుర్రం
37. కింది జతల్లో సరికాని వాటిని గుర్తించండి.
ఎ) జాతీయ పుష్పం – తామర
బి) జాతీయ నది – గంగా
సి) జాతీయ ఫలం – సీతాఫలం
డి) జాతీయ జెండా రూపకర్త – పింగళి వెంకయ్య
38. జాతీయ పతాకం రూపకర్త?
ఎ) రవీంద్రనాథ్ ఠాగూర్
బి) పింగళి వెంకయ్య
సి) మహాత్మా గాంధీ
డి) వల్లభాయ్ పటేల్
39. భారత కాలమానాన్ని నిర్ణయించే రేఖాంశం?
ఎ) 82 1/20 తూర్పు రేఖాంశం
బి) 82 1/20 పడమర రేఖాంశం
సి) 82 1/20 ఉత్తర రేఖాంశం
డి) 82 1/20 దక్షిణ రేఖాంశం
40. చెరువు నిండిన తర్వాత అదనపు నీటిని సురక్షితంగా బయటకు పంపే మార్గాన్ని ఏమంటారు?
ఎ) వరద కాలువ బి) అలుగు
సి) మిగులు తూము డి) మిగులు కాలువ
41. పానగల్లు చెరువు ఏ జిల్లాలో ఉంది?
ఎ) సూర్యాపేట బి) నాగర్‌కర్నూల్
సి) యాదాద్రి డి) నల్లగొండ
42. రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది?
ఎ) ములుగు బి) కరీంనగర్
సి) ఆదిలాబాద్ డి) నల్లగొండ
43. పానగల్లు చెరువును నిర్మించిన కాకతీయ పాలకుడు?
ఎ) రుద్రమదేవి బి) గణపతిదేవుడు
సి) ప్రతాపరుద్రుడు
డి) రుద్రదేవుడు
44. హుస్సేన్ సాగర్‌ను నిర్మించింది?
ఎ) నిజాం రాజులు
బి) హుస్సేన్ షా వలి
సి) కాకతీయ రాజులు
డి) పద్మనాయక రాజులు
45. ఉస్మాన్ సాగర్ చెరువు ఏ నది ఉపనదిపై నిర్మించారు?
ఎ) మంజీరా బి) మూసీ
సి) సీలేరు డి) కృష్ణా
46. కింది నగరాల్లో సరస్సుల నగరంగా పేరుగాంచింది?
ఎ) ఉదయ్‌పూర్ బి) జైపూర్
సి) బికనీర్ డి) జైసల్మేర్
47. కింది వాటిలో ఉదయ్‌పూర్ నగరానికి సంబంధం లేనిది?
ఎ) జగ్‌నివాస్ బి) పిచోలా సరస్సు
సి) మహరాజా ఉదయ్‌సింగ్
డి) సాంబార్ సరస్సు
48. 1362లో పిచోలా సరస్సును నిర్మించింది?
ఎ) బంజారాలు బి) రాజా జైసింగ్
సి) చౌహాన్లె డి) ఖిల్జీలు
జవాబులు
1.బి 2.సి 3.బి 4.ఎ
5.బి 6.సి 7.బి 8.బి
9.ఎ 10.సి 11.సి 12.సి
13.సి 14.సి 15.సి 16.డి
17.ఎ 18.సి 19.డి 20.బి
21.బి 22.సి 23.ఎ 24.బి
25.డి 26.ఎ 27.ఎ 28.బి
29.డి 30.బి 31.ఎ 32.డి
33.సి 34.ఎ 35.డి 36.సి
37.సి 38.బి 39.ఎ 40.బి
41.డి 42.ఎ 43.సి 44.బి
45.బి 46.ఎ 47.ఎ 48.ఎ
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
మీకు తెలుసా?
విజయనగర సామ్రాజ్య పతనం
శ్రీకృష్ణదేవరాయలు 1509-1529 మధ్య పరిపాలించారు. ఈయన వారసులైన అచ్యుత దేవరాయలు, అళియ రామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం పెరిగింది. వీరు బహమనీ సుల్తాన్ల వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకోవడం వల్ల ఆందోళన చెందిన ఐదుగురు బహమనీ సుల్తాన్లు ఏకమై విజయనగరంపై యుద్ధం ప్రకటించారు. బహమనీ సుల్తాన్లు, విజయనగర రాజుల మధ్య 1565లో రాక్షస తంగడి లేదా తళ్లికోట యద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రామరాయలును ఓడించి విజయనగర పట్టణాన్ని దోపిడీ చేసి నాశనం చేశారు.
అమరావతి స్థూపం
గుంటూరులోని అమరావతి స్థూపం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందింది. 1900 సంవత్సరాల క్రితం శాతవాహనుల కాలంలో దీన్ని నిర్మించారు. స్థూప ముఖద్వారం వద్ద నాలుగు సింహాలు ఉన్నాయి. ఎంతో అద్భుతంగా నిర్మించిన శిల్ప కళా తోరణం, అమరావతి స్థూపం నేడు చిన్నాభిన్నమైన రాళ్లతో కూడిన గట్టు. ఈ శిథిలాలు బ్రిటిష్ వారు లండన్‌కు తరలించారు. తరలించలేని వాటిని మద్రాస్ మ్యూజియంలో భ్రదపరిచారు. పిచ్చిపట్టిన నలగిరి ఏనుగును బుద్ధుడు శాంతింపజేసే శిల్పం అమరావతిలో లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు