General Studies | ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతం ఉన్నాయి?

జూలై 4వ తేదీ తరువాయి
50. పైత్యరసం విధి కానిది?
1) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మార్చడం
2) ఆహారాన్ని ఆమ్ల స్థితిలోకి మార్చడం
3) కొవ్వుల ఎమల్సీకరణ
4) ప్యూరిఫికేషన్ నుంచి కాపాడటం
51. సంపూర్ణాంతర పరావర్తనం చెందే సందర్భం?
1) కాంతి గాజు నుంచి వజ్రంలోకి ప్రవేశించినపుడు
2) కాంతి వజ్రం నుంచి వజ్రంలోకి ప్రవేశించినపుడు
3) కాంతి గాలి నుంచి నీటిలోకి ప్రవేశించినపుడు
4) కాంతి నీటి నుంచి గాజులోకి ప్రవేశించినపుడు
52. శాశ్వత అయస్కాంతాల తయారీలో ఉపయోగించేది?
1. ఫెర్రో అయస్కాంత పదార్థం
2) డయా అయస్కాంత పదార్థం
3) యాంటీ-ఫెర్రో అయస్కాంత పదార్థం
4) పైవన్నీ
53. ఆడవారి గొంతు మగవారి గొంతు కంటే కీచుగా ఉండటానికి కారణం?
1. అధిక పౌనఃపున్యం
2) అధిక కంపన పరిమితి
3) అల్ప పౌనపున్యం
4) బలమైన స్వరపేటిక
54. డెసిబుల్ దేనికి ప్రమాణం?
1. విద్యుత్ ప్రవాహం 2) కాంతి తీవ్రత
3) ఉష్ణ శక్తి 4) ధ్వని తీవ్రత
55. రాకెట్ కింది సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1. శక్తినిత్యత్వ నియమం
2) బెర్నౌలీ సిద్ధాంతం
3) అవగాడ్రో సిద్ధాంతం
4) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
56. నీటి శాశ్వత కాఠిన్యత కింది పద్ధతుల్లో తొలగిస్తారు?
1) చాకలి సోడా కలుపుట వల్ల
2) అయాన్ వినిమయ పద్ధతి
3) పెర్మ్యూటేటివ్ పద్ధతి
4) పైవన్నీ
57. వాటర్‌గ్యాస్ అనేది కింది వాటిలో దేని వాయు మిశ్రమం?
1) కార్బన్, నైట్రోజన్
2) కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్
3) కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్
4) కార్బన్ డై ఆక్సైడ్ – నెట్రోజన్
58. కొవ్వులు, నూనెలు ఆక్సీకరణం చెందితే కలిగే మార్పు?
1) అవి చెడిపోవును, సువాసన ఇచ్చును
2) మేలైన రుచి కలిగినవిగా మారును
3) అవి చెడిపోవును, వాటి రుచి, వాసన మారును
4) ప్రభావితం కావు
59, కింది వాటిలో కార్బన్ మోతాదు అవరోహణ క్రమంలో అమర్చండి?
ఎ) పోత ఇనుము బి) చేత ఇనుము
సి) ఉక్కు
1) ఎ, బి, సి 2) బి, ఎ, సి
3) సి, బి, ఎ 4) ఎ, సి, బి
60. మంటలను ఆర్పివేయడానికి నీరు మంచిది. కారణం?
ఎ) నీటి విశిష్టోష్ణం ఎక్కువ
బి) మండుతున్న పదార్థాల చుట్టూ నీటి ఆవిరి ఆవరించి వాటి గాలి సరఫరాను నిలిపివేయును
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) రెండూకాదు
61. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తిని ఏమంటారు?
1) రిలయబిలిటీ 2) గతిశక్తి
3) సామర్థ్యం 4) సహజశక్తి
62. విపత్తు తీవ్రతను తగ్గించే వ్యూహం
1) ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయడం
2) సామర్థ్య నిర్మాణం చేయడం
3) పునరావాస కార్యకలాపాలు చేపట్టడం
4) పైవన్నీ
63. ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
1) 2005 సెప్టెంబర్ 27
2) 2006 సెప్టెంబర్ 27
3) 2008 సెప్టెంబర్ 28
4) 2010 జనవరి 26
64. కిందివాటిలో ఏవి రికవరీ చర్యలు?
ఎ) పునరావాసం బి) పునర్నిర్మాణం
సి) వెతుకుట డి) రక్షించుట
ఇ) సహాయక చర్యలు
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, డి, ఇ 4) ఎ, బి, సి, డి, ఇ
65. SLAR .. అంటే?
1) Side Looking Airborn Radar
2) Side Looking Aerial Radar
3) Side Living Airborn Radar
4) Sonar Looking Airborn Radar
66. భూ కంపాలు, అగ్నిపర్వతాలు దీనితో సహసంబంధాన్ని కలిగి ఉంటాయి?
1) ముడుత, భ్రంశం చెందిన ప్రాంతం
2) అగాధ సముద్ర మైదానం
3) వీరభూమి ప్రాంతం
4) సముద్ర తీర ప్రాంతం
67. సునామీ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?
1) చైనీస్ 2) జపనీస్
3) హిందీ 4) ఫెంచి
68. ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతం ఉన్నాయి?
1) 30 శాతం 2) 35 శాతం
3) 40 శాతం 4) 45 శాతం
69. భూ కంపాల వల్ల పరిణామంలో సమ్మిళితమైంది?
1) కదలిక, నేల పగుళ్లు
2) భూపాతాలు, హిమ ప్రవాహాలు
3) నేల ధ్రువీకరణ 4) పైవన్నీ
70. ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల సంబంధిత అన్ని వ్యవహారాలను చూసే మంత్రిత్వశాఖ?
1) గృహమంత్రిత్వశాఖ
2) వ్యవసాయ మంత్రిత్వశాఖ
3) గ్రామీణ మంత్రిత్వ శాఖ
4) ఆర్థిక మంత్రిత్వ శాఖ
71. తెలంగాణ భౌగోళిక అంశాల గురించి సరైన వాక్యం?
1) తెలంగాణ దేశ భూ విస్తీర్ణంలో 3.41శాతం విస్తరించి ఉంది
2) తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి
3) విస్తీర్ణం దృష్ట్యా పెద్ద జిల్లా నల్లగొండ, చిన్న జిల్లా హైదరాబాద్
4) పైవన్నీ
72. గోండ్వానా శిలలు ఎక్కువగా ఉన్న జిల్లాలు?
1) నిర్మల్, మంచిర్యాల
2) జగిత్యాల, పెద్దపల్లి
3) జయశంకర్ భూపాలపల్లి, ములుగు
4) పైవన్నీ
73. తెలంగాణలోని శీతోష్ణస్థితుల గురించి సరైన వాక్యం కానిది?
1) సగటు ఉష్ణోగ్రత 42 డిగ్రీలు
2) చలికాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీలు
3) అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఆదిలాబాద్
4) అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేది పెద్దపల్లి
74. ముదురు వర్ణం కలిగి అధిక వర్షపాతం, తేమ, అధిక ఉష్ణోగ్రత కలిగి ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే మృత్తికలు
1) లాటరైట్ మృత్తికలు
2) ఎర్రరేగడి నేలలు
3) నల్లరేగడి మృత్తికలు
4) ఒండ్రు మృత్తికలు
75. మంజీరా నది ప్రవహించే రాష్ర్టాలు?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) కర్ణాటక 4) పైవన్నీ
76. జలాశయాలను కొత్తగా మార్చిన పేర్లతో జతపరచండి?
1) అన్నవరం బ్యారేజ్ ఎ) సరస్వతి
2) మేడిగడ్డ బ్యారేజ్ బి) లక్ష్మి
3) నంది మేడారం సి) నంది
4) అనంతగరి డి) అన్నపూర్ణ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
77. తెలంగాణలోని ఎత్తిపోతల పథకాల గురించి సరికానిది గుర్తించండి?
1) రాష్ట్ర వ్యాప్తంగా 640 ఎత్తిపోతల పథకాలు కలవు
2) అత్యధిక ఎత్తిపోతల పథకాలు ఖమ్మం జిల్లాలో కలవు
3) అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో కలవు
4) భద్రాద్రి కొత్తగూడెంలో దాదాపు 112 ఎత్తిపోతల పథకాలు కలవు
78. ప్రస్తుతం తెలంగాణలోని జీవజాతులను జతపరచండి?
1) మొక్కల జాతుల సంఖ్య ఎ) 2939
2) పక్షి జాతుల సంఖ్య బి) 365
3) క్షీరద జాతుల సంఖ్య సి) 103
4) సరీసృప జాతులు డి) 28
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
79. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ గురించి సరైన వాక్యం?
1) ఇది నల్లగొండ జిల్లాలోని దామరచెర్ల గ్రామంలో ఉంది
2) దీనికి శంకుస్థాపన చేసిన సంవత్సరం 2015
3) దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4000 మెగావాట్లు 4) పైవన్నీ
80. తెలంగాణలోని రహదారుల గురించి సరికాని వాక్యం?
1) తెలంగాణలో 3910 కి.మీ. విస్తీర్ణంలో జాతీయ రహదారులు ఉన్నాయి.
2) తెలంగాణలోని జాతీయ రహదారుల సంఖ్య 25
3) అత్యధిక జాతీయ రహదారులున్న జిల్లా నల్లగొండ
4) జాతీయ రహదారులు లేని జిల్లా సూర్యాపేట
81. డూన్లు ఏయే శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) హిమాద్రి, ట్రాన్స్ హిమాలయ మండలం
2) హిమాద్రి, హిమాచల్
3) హిమాచల్, శివాలిక్ 4) ఏదీకాదు
82. ఈశాన్య రుతుపవనాల మూలంగా తమిళనాడులో వర్షం సంభవించడానికి సహకరించే కొండలు?
1) బలగిరి అంగన్ 2) జవీది
3) షెవరాయ్ 4) జింజి
83. భారత్‌లో అధికంగా తుఫాన్లు సంభవించే ప్రాంతం?
1) హిమాలయ పర్వత ప్రాంతం
2) బంగాళాఖాత తీర ప్రాంతం
3) అరేబియా సముద్ర తీర ప్రాంతం
4) కన్యాకుమారి అగ్ర ప్రాంతం
84. నైరుతి రుతుపవనాల మూలంగా వర్షాలు సంభవించని ప్రాంతాల్లో లేనిది?
1) రాజస్థాన్ 2) తమిళనాడు
3) లడఖ్ 4) మహారాష్ట్ర
85. బందీపూర్ జాతీయ పార్కు ఎక్కడ కలదు?
1) రాజస్థాన్ 2) సిక్కిం
3) అస్సాం 4) కర్ణాటక
86. లక్కను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) ఛత్తీస్‌గఢ్
3) జార్ఖండ్ 4) కర్ణాటక
87. తెలుగు గంగ నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరం నీటి సమస్య తీరుతుంది?
1) హైదరాబాద్ 2) బెంగళూరు
3) చెన్నై 4) కొచ్చిన్
88. హిమాలయ నదుల లక్షణం కానిది?
1) వీటి ప్రవాహ మార్గాలు సూటిగా ఉంటాయి
2) ఇవి తమ లోయలను తరుచూ మారుస్తుంటాయి
3) ఇవి యవ్వన దశలో ఉంటాయి
4) జలరాశి పరిమాణం తక్కువ
89. భారత్ ప్రస్తుత అణువిద్యుత్ సామర్థ్యం?
1) 5400 MW 2) 4780 MW
3) 7830 MW 4) 6700MW
90. కింది వాటిలో సరికానిది?
1) కాక్రపార – గుజరాత్
2) కైగా- కర్ణాటక
3) నరోరా – పంజాబ్
4) కూడంకుళం-తమిళనాడు
91. ప్రపంచంలో అత్యధికంగా వేరుశనగ పండించే దేశం
1) ఇండియా 2) సూడాన్
3) బ్రెజిల్ 4) చైనా
92. 10 మిలియన్లు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను ఎలా పిలుస్తారు? 1) మెట్రో నగరాలు
2) మెగా నగరాలు
3) గ్రేటర్ మెట్రో నగరాలు
4) కాస్మోపాలిటన్ నగరాలు
93. కింది ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లో బంగే తెగ ప్రజలు జీవిస్తున్నారు?
1) అండమాన్, నికోబార్ ద్వీపాలు
2) దాద్రా, నగర్ హవేలీ
3) డామన్, డయ్యూ 4) లక్షద్వీప్
94. పొడవు పరంగా అధిక జాతీయ రహదారులు కలిగి ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్
95. రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు?
1) భద్రానది 2) బ్రాహ్మణినది
3) దామోదర్నది 4) భీమానది
96. హెచ్బీజే పైపులైను ఏ రాష్ర్టాల గుండా వెళుతుంది?
1) మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
2) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్
3) మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్
4) ఉత్తరప్రదేశ్, అసోం, గుజరాత్
97. భారత్‌లో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘పన్నా’ ఏ నదీలోయలో కలదు?
1) కేన్ 2) బెట్వా
3) చంబల్ 4) సోన్
98. 1919లో ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కర్ణాటకలోని భద్రావతి వద్ద
2) బెంగాల్‌లోని బర్నపూర్ వద్ద
3) తమిళనాడులోని సేలం వద్ద
4) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖతీరం వద్ద
99, మాస్రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఎక్కడ పనిచేస్తుంది?
1) ముంబై 2) కోల్‌కతా
3) ఢిల్లీ 4) చెన్నై
100. భారతదేశం తూర్పు తీరాల్లో సహజ సిద్ధమైన ఓడరేవు ఏది?
1) కోల్‌కతా 2) విశాఖపట్నం
3) కాకినాడ 4) మద్రాస్
సమాధానాలు
50-1 51-1 52-1 53-1 54-4
55-4 56-4 57-3 58-3 59-4
60-3 61-3 62-4 63-2 64-4
65-1 66-1 67-2 68-1 69-4
70-2 71-4 72-4 73-3 74-1
75-4 76-1 77-3 78-1 79-4
80-2 81-2 82-3 83-2 84-4
85-4 86-3 87-3 88-4 89-2
90-3 91-4 92-1 93-1 94-2
95-2 96-3 97-1 98-2 99-1
100-2
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
-
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
-
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
-
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
-
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
-
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
-
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Latest Updates
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
IELTS Exam | Language Tests for Overseas Education
Group 2,3 Special | వెట్టి చాకిరీ నిర్మూలనకు తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ?
Job updates | Job Updates 2023
Scholarships | Scholarships for 2023
Current Affairs | ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు?
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు