అడవులు
-ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు.
-అడవులను ఇంగ్లిష్లో ఫారెస్ట్ (Forest) అంటారు. ఫారెస్ట్ అనేది లాటిన్ భాషాపదం అయిన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం.
-అడవులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఫారెస్టరీ అంటారు.
-1927లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాన్ని చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో నూతన అటవీ విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి.
-తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రిపోర్ట్ 2015-16 ప్రకారం రాష్ట్ర అటవీ విస్తీర్ణం 27,292 చ.కి.మీ. 2018-19 నివేదిక ప్రకారం ఇది 27,857 చ.కి.మీ.కు పెరిగింది.
-రాష్ట్ర విస్తీర్ణంలో మొత్తం అటవీ విస్తీర్ణ శాతం 24.35 శాతం
-దేశంలో అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ 12వ స్థానంలో ఉంది.
అటవీ విధాన లక్ష్యం
-గ్రామీణ పేదరిక నిర్మూలనకు అడవులను ఆయుధంగా చేసుకోవడం (కలప సేకరణ, పండ్లు, పూలు, తేనె, గింజలు మొదలైనవి సేకరించి మార్కెట్లో విక్రయించడం)