‘Ethics’ that value the profession | వృత్తికి విలువతెచ్చే ‘నైతికత’
రాష్ట్ర పోలీసు నియామక చరిత్రలో మొదటిసారిగా సామాజిక, నైతిక విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఎస్ఐ మెయిన్స్ సిలబస్ భవిష్యత్ బంగారు తెలంగాణ సాధనలో పోలీసుల పాత్రను గుర్తించినట్లుంది. సమాజం వేలాది ఏండ్ల కిందట తనకు తాను రూపొందించుకొన్న కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కక్షుతి, జీవన విధానాలు ఒకవైపు సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుండగా, మరోవైపు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీరు స్తూ, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలను అందిస్తున్నా యి. వీటిలో మొదటిది సామాజిక సంక్షేమం, అభివృద్ధి కాగా, రెండోది సామాజిక భద్రత.
సామాజిక భద్రత అంటే శాంతిభవూదతలు. వీటిని పరిరక్షించే యంత్రాంగమే పోలీసు వ్యవస్థ. అందువల్ల పోలీసులపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. సామాజిక ప్రగతిని, వికాసాన్ని అంచనా వేయడానికి సామాజిక సామరస్యత,శాంతియుత వాతావరణాన్ని మొదటి ప్రాతిపదికగా తీసుకొంటారు. ఇలాంటి కీలకమైన అంశం గురించి కాబోయే పోలీ సు అధికారులకు తప్పనిసరిగా శాస్త్రీయ అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో పర్సనాలిటి టెస్ట్ అనే ఒక టాపిక్‌ను సిలబస్‌లో చేర్చారు.
సిలబస్ స్వరూపం : వ్యక్తిత్వ పరీక్ష (Personality Test)
1. నైతికత (Ethics)
2. మహిళలు, బలహీనవర్గాల పట్ల సున్నితత్వం
(Sensitivity to Gender and Weaker Sections)
3. సామాజిక స్పక్షుహ (Social Awereness)
4. భావోద్వేగపరమైన మేథో సామర్థం
(Emotional Intelligence)
నిజానికి వ్యక్తిత్వ పరీక్ష అనేది ఇంటర్వూ రూపంలో ఉం టుంది. అయితే ఎస్ఐ పరీక్షలో ఇంటర్వూ లేనందున మెయిన్స్‌లో ఒక టాపిక్‌గా చేర్చారు. మెయిన్స్‌లో ఈ విభా గం నుంచి 25-30 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ విభాగానికి సంబంధించిన సమాచారం మార్కెట్లో పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఈ సారి ఫైనల్ ర్యాంకింగ్‌ను కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగంపై ఎక్కువ సమయాన్ని కేటాయిం చి సిలబస్‌లో పేర్కొన్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, లోతు గా, పరీక్ష కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఆదర్శవంతమైన మానవ జీవనానికి, మనిషిని సర్వోత్కక్షుష్టమైన, ఉన్నతమైన ఫలితం వైపు నడిపించే సాధనమే నైతికత.మానవ ప్రవర్తనలో మంచి చెడులను నిర్ణయించడాన్నే నైతికత అంటారు. ‘ప్రముఖ తత్వవేత్త రుష్వర్త్ కిడ్డర్ వివరణప్రకారం ఆదర్శవంతమైన మానవశీలాన్ని (Chare cter), ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే నైతికత’.
నైతికత అనే పదం ప్రాచీన గ్రీకు భాషకు చెందింది. ఆంగ్లభాషలో ‘Ethics’అనే పదానికి ఆధారం ‘etos’ అనే గ్రీకు పదం. దీని అర్థం శీలం,ఆచారం లేదా అలవాటు.
ఎథిక్స్ అనే విభాగం తత్వశాస్త్రం (Philosophy)లో అంతర్భాగం. దీనితో పాటు తర్కశాస్త్రం (Logic science), సౌందర్యశాస్త్రం (Aesthetics) వంటివి కూడా తత్వశాస్త్రం లో కీలకమైన విభాగాలు. నీతిశాస్త్రం మనుషుల ఉద్దేశాల్లోనూ, చర్యల్లోనూ మంచి చెడులను అధ్యయ నం చేసినట్లే తర్కశాస్త్రం సత్వాన్వేషణలోని ప్రధాన పరిస్థితులు, సౌందర్యశాస్త్రం సౌందర్య సృష్టి, ప్రశంసను చర్చిస్తాయి.
మనిషి సంఘజీవి. మానవులు లేని సమాజాన్ని ఊహించలేం. మానవులు కుటుంబాలుగా ఏర్పడటం, కుటుంబాలు కలిసి సమాజం ఏర్పడటం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియలు. ప్రతి సమాజం తనదైన సంస్కక్షుతి, సంప్రదాయాలు, నియమాలతో రూపుదిద్దుకొంటుంది. సామాజిక జీవనం,సామాజిక సంబంధాలు సమాజ మనుగడకు తప్పనిసరి. అయితే దీనికి ఆధారం నైతిక విలువలు గల సభ్యులు ఉండాలి. సమాజం రాజ్యం (State) నిర్దేశించిన నియమాల ప్రకారం ధర్మబద్ధంగా జీవించడమే నైతికత.
ఆధునిక సమాజంలో అతి పెద్ద సమస్య నైతిక విలువలు పతనం. సమాజంలో నైతిక విలువలు క్షీణించే కొద్దీ సామాజిక సంఘర్షణ (Social Conflict), సామాజిక అశాంతి (Social Unrest) ప్రమాదకరస్థాయికి చేరుకొంటుంది. అందువల్ల సమాజంలో నైతిక విలువ ప్రాధాన్యం గురించి విస్తక్షుతస్థాయి చర్చ తప్పనిసరి.
భారత పార్లమెంటు ప్రజాస్వామ్య వ్వవస్థలో మంత్రులు, ప్రజావూపతినిధులకు దేశ పరిపాలనా బాధ్యతను కల్పించినప్పటికీ పరిపాలనా భారమంతా పౌరసేవలకు అప్పగించబడుతుంది. అంతిమంగా ప్రభుత్వోద్యోగులే ప్రభుత్వ విధి విధానాలను,శాసనాలను అమలు పరుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతమైన హోదాను కలిగి ఉండి పాలన ప్రక్రియను కొనసాగించడంతోపాటు ప్రభుత్వ విధానాలు అమలు పర్చడం జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు అత్యున్నత నైతిక ప్రమాణాలు, చట్టబద్ధతను పాటించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా నైతిక నియమావళిని రూపొందించకపోయినా వారి విధి నిర్వహణలో కొన్ని నైతికాంశాలను పాటించడం సర్వసాధారణంగా కనబడుతుంది.
1. మౌలిక నిజాయితీ, బాధ్యత, జవాబుదారీతనంతో పాటు కుల, మత, లింగ, సంప్రదాయాల పట్ల వివక్షత లేకుండా అధికారిక విధులు నిర్వర్తించడం.
2. నాయకత్వంతో కూడిన సమర్థవంతమైన విధి నిర్వహణ అభివృద్ధికి పాటుపడడం.
3. సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం సుపరిపాలనా విధానాలను పాటించడం.
2007లో రూపొందించిన పబ్లిక్ సర్వీసెస్ ముసాయిదా బిల్లు (Draft Public Service Bill) ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని నివారించడానికి, వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి ఒక సంస్థను నెలకొల్పాలని ప్రతిపాదించింది. ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధతతో కూడిన కొన్ని నైతిక నియమ నిబంధనలను ప్రతిపాదించింది. అంతేకాకుండా ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది. వీటిలో రాజ్యాంగంపై విశ్వాసపాత్ర, దేశభక్తి, జాతి ఔన్నత్యం (National Pride) విషయస్పష్టత, నిష్పాక్షికత, నిజాయితీ, శ్రద్ధ, సౌజన్యం, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాసేవాతత్పరత విధి నిర్వహణలో సేవా నిరతి, ఆదర్శవంతమైన ప్రవర్తన వంటివి ముఖ్యమైనవి.
ఉద్యోగస్వామ్య వ్యవస్థపై గత కొన్నాళ్లుగా అనేక విమర్శలు వెల్లు పాలనలో అవినీతి, పాలన అసమర్థత, పక్షపాతం, జాప్యం, కుంభకోణాలు వంటివి వీటిలో నిరంతరం చర్చలో ఉన్నాయి. వీటన్నింటికి ప్రధాన కార ణం ఉద్యోగుల్లో నైతిక విలువలు లోపించడమే. అందువల్ల మొదట ఉద్యోగులలో నైతిక ప్రవర్తన గురించి అవగాహన మరింత పెరగాలి.
పోలీసుల్లో నైతికత (Ethics in Police)
పోలీసు యంత్రాంగం ప్రధాన బాధ్యత ప్రజల శాంతి,భద్రతలను కాపాడటం. అందువల్ల నైతిక విలువలు గల పోలీసులు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. పోలీసుల ప్రాథమిక విధులు- చట్టాల అమలు,శాంత్రిభవూదతలను నెలకొల్పడం. పౌరుల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంతో పాటు వారి హక్కులను పరిరక్షించడం. వీటిని సాధించాలంటే మొదటగా పోలీసులు నైతిక విలువలు కలిగి ఉండాలి. సమాజంలోని వ్యక్తులు నైతిక విలువలను ఆచరించేలా అవగాహన కల్పించాలి.
వ్యాపార నైతికత (Business Ethics)
ఒక వ్యాపార సంస్థ నైతిక నియమావళి వ్యవస్థ తన ఉద్యోగుల విధులు, హక్కులు, సంక్షేమ విషయాలే కాకుండా వినియోగదారులు, ఖాతాదారులు, సామాన్య ప్రజలకు కూడా సంబంధించింది. ఈ వ్యాపార నైతిక నియమావళి అనేది సక్రమమైన వాణిజ్య పద్ధతులు, మార్కెట్ వ్యూహా లు, ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను వివరిస్తుంది.
ఐక్యరాజ్య ప్రపంచ ఒప్పందం – 2000 అనేది ప్రపంచ దేశాల్లో అన్ని వ్యాపార సంస్థలు సామాజిక బాధ్యతాయుతమైన, స్థిరమైన విధానాలను రూపొందించడానికి వీలుగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక వ్యూహాత్మక విధానం. ఇందులో సార్వవూతికంగా ఆమోదించబడ్డ 10 కీలకమైన నైతిక విలువలు ఉన్నాయి.
వీటిలో మానవ హక్కులు, పర్యావరణం, అవినీతికి సం బంధించి అన్ని వ్యాపార సంస్థలు పాటించాల్సిన నైతికాంశాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.
మానవ హక్కులకు మద్దతు అంతర్జాతీయంగా ప్రకటించిన మానవ హక్కుల రక్షణ
సామూహిక బేరసారాల హక్కు గుర్తింపు
నిర్బంధిత, బాలకార్మికుల తొలగింపు
ఉపాధి విషయంలో వయస్సు, లింగభేదం, మతం, జాతీయత ప్రాతిపదికన వివక్షత పాటించరాదు
పర్యావరణంపై బాధ్యతాయుతమైన ప్రోత్సాహం
పర్యావరణ అనుకూలమైన సాంకేతిక పద్ధతుల ఆచరణ
వ్యాపారుల దోపిడీలు, అవినీతి అక్రమాలను నిర్మూలించడం
తన ప్రయోజనాలతో పాటు సమాజ సంక్షేమానికి దోహదం చేసే వ్యాపార సంస్థ నిర్ణయాలను ఆ సంస్థ సా మాజిక బాధ్యతగా పేర్కొంటారు. వ్యాపార నీతి సూత్రా లు, సామాజిక బాధ్యతలు పాటిస్తే కంపెనీలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయి. కొన్ని ప్రయోజనాలు తక్షణమే లభిస్తే మరికొన్ని దీర్ఘకాలికంగా లభిస్తాయి. ఇటు వినియోగదారులు, అటు పెట్టుబడిదారులు కూడా నైతిక విలువలను పాటించే కంపెనీలనే ఆదరిస్తారు. మానవ హక్కుల ను ఉల్లంఘించే కంపెనీలు అనేక విమర్శలకు గురికావడమే కాకుండా ఆయా కంపెనీల ప్రతికూల ప్రచారానికి దారితీసి వాటి మార్కెట్ వాటాలు, లాభాలు తగ్గిపోవడానికి కారణమవుతాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక భద్రతతో పాటు అన్ని సౌకర్యాలను అందజేస్తున్న కంపెనీలకు అధిక ఉత్పాదకత కాకుండా ఉద్యోగస్తుల విధేయత కూడా లభిస్తుంది. నైతిక నియమావళి సామాజిక బాధ్యతను నిర్వర్తించడమనేది కేవలం పెద్ద వ్యాపార సంస్థలేగాక ఒక వ్యాపారవేత్త, వర్తకుడు, కాంట్రాక్టర్ అయినా సరే తమ వృత్తుల్లో నైతిక విలువలను పాటించాలి.
వ్యాపార సంస్థలు – నైతిక నియమాలు
బాలకార్మికులను ఉపయోగించకూడదు.
కల్తీ లేని, నాణ్యత కలిగిన సరుకులను సరఫరా చేయాలి
తూకాల్లో తేడాలుండొద్దు.
ఆహార పదార్థాల తయారీలో హానికరమైన రంగులు నిల్వ పదార్థాలు వాడకూడదు.
చట్టవిరుద్ధంగా నిల్వచేసి కృత్రిమ కొరతను సృష్టించవద్దు.
ప్రకృతి వైపరీత్యాలు, ఆపదలు తలెత్తినప్పుడు వ్యాపారులు సరుకుల ధరలను పెంచరాదు. సహేతుక ధరలకే అమ్మాలి.
వస్తువుల అమ్మకాల తర్వాత వాటికి అవసరమయ్యే సేవలను అందించాలి. లోపాలుంటే ఆ వస్తువులను మార్చుకొనే సదుపాయం కల్పించాలి.
ఉత్పత్తుల్లో లోపాలుంటే వాటి అమ్మకాలను నిలిపివేయాలి
వినియోగదారుడికి విజ్ఞానమిచ్చే సరైన వ్యాపార ప్రకటనలే చేయాలి.
పర్యావరణానికి హాని కలుగని రీతిలోనే వస్తూత్పత్తి జరగాలి
న్యాయంగా, క్రమంగా ప్రభుత్వానికి పన్నులు కట్టాలి
ప్రభుత్వ వ్యాపార చట్టాలు విధానాలను పాటించాలి.
రాజకీయ నైతికత
ప్లేటో, అరిస్టాటిల్ వంటి ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఆదర్శరాజ్య భావనను వివరించి రాజకీయాలు, ఆదర్శ రాజ్యస్థాపనకు ఉపకరించాలని అభివూపాయపడ్డారు. రాజకీయవేత్తలు దార్షనికులై చిత్తశుద్ధి కలిగిన నీతిమంతులై ఉండాలన్నది ఈ తత్వవేత్తల అభివూపాయం. మహాత్మాగాంధీ నైతిక విలువలను రాజనీతిశాస్త్రంలో ఉప భాగంగా అధ్యయనం చేయాలని సూచించారు. తాను నమ్మిన అహింస, సత్యాక్షిగహం వంటి నైతిక విలువలను రాజకీయాల్లో పాటించి దేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపి ప్రపంచమంతటా ఆదర్శవూపాయంగా నిలిచాడు.
రాజకీయ నైతికతను ప్రతిబింబించే అంశాలు
వ్యక్తిగత చిత్తశుద్ధి, ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించడం
ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత
సమస్యలను ప్రాధాన్యతాక్షికమం ప్రకారం పరిష్కరించడం సాధ్యంకాని వాగ్దానాలను మానుకోవడం
నిధులు, వనరులను సముచితంగా వినియోగించడం
అభివృద్ధి, సంక్షేమ పథకాలను సత్వరంగా అమలుచేయడం
బాహ్య ప్రభావాలను, పార్టీ అంతర్గత ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం
అవినీతి, పక్షపాతం, అధికార దుర్వినియోగానికి దూరంగా ఉండటం
పేద, అణగారిన, బడుగు, బలహీనవర్గాలపై సానుభూతి, దయాగుణం కలిగి ఉండటం
సమస్యలను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయడం
పార్లమెంటు, శాసనసభ ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ మర్యాదలు, అత్యున్నత ప్రమాణాలను ఆచరించడం
పౌరులు కూడా తమపరంగా కొన్ని రాజకీయ విధులను పాటించాలి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల పట్ల అవగాహన, అప్రమత్తత, అభివృద్ధి పథకాల్లో భాగస్వామ్యం. ఎన్నికల్లో సరైన అభ్యర్థులకే ఓటు వేయడం, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించడం వంటివి కూడా నైతిక విలువల ఆచరణలోకే వస్తాయి.
వైద్య పరమైన నైతికత
దేశంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు వైద్యులకు అపారమైన గౌరవంతో పాటు ఉత్కక్షుష్ణ హోదా ఆపాదించబడింది. ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడితో వైద్యులను సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా కొలుస్తున్నారు.
వైద్య నైతికతను సూచించే ప్రమాణాలు
ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ తమ పూర్తి సామర్థం మేర కు రోగులకు చికిత్స అందించడం
చికిత్స చేసేటప్పుడు రోగికి ఎలాంటి హాని చేయొద్దు
మరణం లేదా గర్భవూసావ చికిత్సలు చేయకూడదు
స్వప్రయోజనం కన్నా రోగికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
అన్నిరంగాల్లో ఉన్నట్లే వైద్యరంగంలో కూడా వ్యాపార కోణం ప్రమాదస్థాయికి చేరుకుంది. వైద్యులకు రోగుల పట్ల సేవాభావం తగ్గిపోయింది. అధిక ఫీజులతో పాటు సాధారణ జబ్బులకు ఖరీదైన వైద్య పరీక్షలను సూచించి రోగుల నుంచి అధిక డబ్బును వసూలు చేయడం సర్వసాధారణం గా మారింది. అందువల్ల వైద్యరంగంలో నైతికతను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది.
సాంకేతిక సామాజిక మాధ్యమాల్లో నైతికత
ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంట్నట్, మొబైల్ ఫోన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు సామాజిక సంబంధాలను బలహీనపరుస్తున్నాయి. సాంకేతికంగా వీటి ఉపయోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సామాజికంగా మాత్రం వీటివల్ల నైతిక విలువలు బలహీనపడుతున్నాయి. మానసిక సంఘర్షణలు, నేరాలు, ఘోరాలు, చివరకు ఆత్మహత్యలు ప్రమాదకరస్థాయికి చేరుకొంటున్నాయి. బయోటెక్నాలజీలో వచ్చిన నూ తన ఆవిష్కరణలు ముఖ్యంగా క్లోనింగ్, జెనెటిక్ ఇంజినీరింగ్, సరోగసి వంటి పద్ధతులు మానవ సమాజ నైతికతను ప్రశ్నించే విధంగా ఉన్నాయి.
పోలీసుల ప్రవర్తనా నియమావళి -1985
కేంద్ర హోంశాఖ 1985లో పోలీసుల ప్రవర్తనా నియమావళిని రూపొందించింది. దేశంలోని ప్రతి పోలీసు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన లక్షణాలు.
1. రాజ్యాంగంపై విశ్వాసపావూత, పౌరహక్కులపై గౌరవం.
2. విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండటం.
3. భయం, పక్షపాతం,ఈర్ష, ద్వేషాలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా, ధైర్యంగా చట్టాలను అమలు చేయాలి.
4. చట్టాల ఆవశ్యకత ఉచితానుచితాలు ప్రశ్నించకుండా వాటిని అమలు చేయాలి.
5. బలవూపయోగం అవసరమైనప్పుడు విచక్షణాపూర్వకంగానే చేయాలి. అయితే నచ్చచెప్పడం, సలహాసంవూపదింపులు, హెచ్చరికలు విఫలమైతే పరిస్థితులను బట్టి బలప్రయోగం చేయాలి.
6. చట్ట పరిమితులకు లోబడి మాత్రమే నేరస్థులను శిక్షించాలి.
7. నేర పరిష్కారానికి బదులు నేరాన్ని నిరోధించడానికి ప్రయత్నించాలి.
8. విధి నిర్వహణలో తాము కూడా సమాజంలో సభ్యులమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
9. ధనిక, పేద తారతమ్యాలు చూపకుండా స్త్రీలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల పట్ల సానుభూతితో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
10. ఉన్నతమైన నీతి,నిజాయితీ ప్రమాణాలను పాటి స్తూ తమ వ్యక్తిగత జీవితంపై నిందపడకుండా జాగ్రత్త పడాలి.
11. సమాజంలోని ప్రజల విశ్వాసం గౌరవం, మన్ననలు పొందాలి.
ప్రతిభకు పరీక్ష
1. ‘బాబర్నామా’ గ్రంథాన్ని ఏ భాషలో రచించారు?
1) పారా మంగోలిక్ 2) చాగతాయ్ తుర్కిక్
3) హిజాజి అరబిక్ 4) బహరాని అరబిక్
2. ఢిల్లీ సుల్తానుల్లో శాశ్వత సైనిక బలగాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టిన సుల్తాను ఎవరు?
1) అల్లావుద్దీన్ ఖిల్జీ 2) మహ్మద్ తుగ్లక్
3) ఇల్టుట్మిష్ 4) బాల్బన్
3. భారత్‌లో మొదటిసారిగా పూర్తి అరబిక్ నాణేంను ప్రవేశపెట్టిన సుల్తాను ?
1) మహ్మద్ ఘోరీ 2) కుతుబుద్దిన్ ఐబక్
3) ఇల్టుట్మిష్ 4) రజియా సుల్తానా
4. సేన వంశ రాజుల్లో ఎవరు కులీన పాలనను అమలు చేశారు ?
1) హేమంత్ సేన 2) భల్లాల సేన
3) విజయ్ సేన 4) లక్ష్మణ సేన
5. బెంగాల్లో మొదటిసారిగా బుద్ధిస్ట్ రాజుగా పేరు పొందింది ?
1) గోపాల 2) హేమంత సేన
3) దేవపాల 4) ధర్మపాల
6. గుజరాత్లో సోలంకీ రాజ్య రాజధాని ఏది ?
1) వేరవల్ 2) అన్హిల్వాడ
3) భరూచ్ 4) విష్ణగర్
7. చార్యపదాస్ను రచించినది ఎవరు?
1) యోగాచారి 2) మహాసిద్ధ
3) శక్యప 4) చార్యాపురుష
8. కిందివాటిలో ఏ రెండు జాతీయ పార్కులు టైగర్ రిజర్వ్‌లుగా ఎన్టీసీఏ ప్రకటించింది.
1) కుద్రేముఖ్, రాజాజీ 2) రాటపాని, సునబెద
3) గురుఘాసిదాస్, రాజాజీ 4) రాజాజీ, సునబెద
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు